Jump to content

నీటి కేటాయింపులు తగ్గించండి


koushik_k

Recommended Posts

  • ఏపీకి కృష్ణా నీటి కేటాయింపులు తగ్గించండి
  • బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ అఫిడవిట్‌
  • నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న వాదనలు
  • పంట పొలాల్లో ఏపీ రాజధానిని నిర్మిస్తున్నారు
  • అక్కడ భవిష్యత్తులో తగ్గనున్న నీటి అవసరాలు
  • గోదావరి నుంచి కృష్ణాకు నీటి మళ్లింపు
  • కృష్ణా బేసిన్‌ నుంచి పెన్నాకు తరలింపు
  • ఏపీ కోటాలో 357 టీఎంసీలు కోత కోయండి
  • అఫిడవిట్‌లో తెలంగాణ సర్కారు వాదనలు
  • రాజధాని తాగునీటికి 110 టీఎంసీలు కావాలి
  • పరిశ్రమలు, ప్రాజెక్టులు, నావిగేషన్‌కూ అవసరం
  • మాకు 1059 టీఎంసీలు కావాలి: ఏపీ డిమాండ్‌
పంట పొలాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మిస్తున్నారు. దాంతో, కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు తగ్గుతాయి. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు భారీగా నీటిని మళ్లిస్తున్నారు. కృష్ణా బేసిన్‌ నుంచి పెన్నా బేసిన్‌కు పెద్ద ఎత్తున నీటిని తరలిస్తున్నారు. ఆ మేరకు ఏపీకి కృష్ణా నీటి వాటాలో కోత పెట్టండి.
..బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ వాదన.
 
రాజధాని నీటి అవసరాలకు 110 టీఎంసీలు కావాలి! నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, పరిశ్రమలకూ నీళ్లు కావాలి. నావిగేషన్‌కు కొత్తగా 14 టీఎంసీలు కావాలి. మాకు ఇప్పటికే ఉన్న 512 టీఎంసీలకు అదనంగా మరో 547 టీఎంసీలు కేటాయించండి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు 1059 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించండి.
..ట్రైబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాదన.
 
హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నీటి కేటాయింపులపై తెలుగు రాష్ట్రాల వాదనలు పదునెక్కుతున్నాయి. తమకు ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను పెంచాలని ఇప్పటి వరకూ వాదించిన రాష్ట్రాలు.. పొరుగు రాష్ట్రానికి కేటాయింపులు తగ్గించాలని కోరుతున్నాయి. కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ఉన్న 512 టీఎంసీల నీటి కోటాలో 357 టీఎంసీలు కోత విధించాలని, ఏపీ వాటాను 155 టీఎంసీలకే పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల వాటాపై బుధవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోని ట్రైబ్యునల్‌లో ప్రత్యేక వాదనలు జరగనున్నాయి. ఇరు రాష్ర్టాలు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్లపై వాదనలు, ప్రతివాదనలు, క్రాస్‌ ఎగ్జామినేషన్లు వాడి వేడిగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఏపీ న్యాయవాదిని తెలంగాణ న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. కృష్ణా నదిలోని మొత్తం 2130 టీఎంసీల నికర జలాన్ని గతంలో ట్రైబ్యునల్‌ మూడు రాష్ర్టాలకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
 
ఇందులో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు కే టాయించారు. మిగిలిన 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఏపీ కోటాలో జనాభా ప్రాతిపదికన 299 టీఎంసీలను తెలంగాణ రాష్ర్టానికి, 512 టీఎంసీలను ఏపీకి కేటాయించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలోనే ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, దానిని సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను కోరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 4 రాష్ర్టాలతో కలిపి నీటి కేటాయింపులపై పునఃసమీక్షించాలని తెలంగాణ, ఏపీలు కోరాయి. ఇందుకు ట్రైబ్యునల్‌ అంగీకరించలేదు. దాంతో ప్రస్తుతం ట్రైబ్యునల్‌లో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి పంపకాలపైనే వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు మూడుసార్లు ట్రైబ్యునల్‌ సమావేశాలు జరిగాయి. ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆయా రాష్ర్టాల అవసరాలు, డిమాండ్లకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. ఈసారి వాదనలు కొంత సీరియ్‌సగా జరిగే అవకాశం ఉంది. ఇందుకు వీలుగా, ఐఐటీ ప్రొఫెసర్ల వంటి నిపుణులను కూడా సమావేశాలకు తీసుకెళ్లాలని ఇరు రాష్ట్రాలూ నిర్ణయించాయి.
 
తెలంగాణ వాదన ఇదీ!
ఏపీకి కేటాయించిన నీటిలో భారీగా కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. అందుకు ఆధారంగా అవసరమైన సమాచారాన్ని కూడా పొందుపరిచింది. ముఖ్యంగా ఏపీ నిర్మిస్తున్న రాజధాని కారణంగా భవిష్యత్తులో సాగునీటికి డిమాండ్‌ భారీగా పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. రాజధాని నిర్మాణంతో ఆయకట్టు ప్రాంతంలో సాగు ఉండదని, దాంతో 16.82 టీఎంసీల నీటి అవసరం భవిష్యత్తులో ఉండదని పేర్కొంది. అలాగే, కృష్ణా డెల్టా కోసం కేటాయించిన 152 టీఎంసీల నీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఇప్పటికే పట్టిసీమ నుంచి 114.37 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నారని గుర్తు చేసింది. భవిష్యత్తులో పోలవరం కుడి కాల్వ ద్వారా 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తీసుకు రానున్నారని, ఈ మేరకు కృష్ణా కేటాయింపుల్లో ఏపీ వాటాను తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా డెల్టాకు 17.55 టీఎంసీల కేటాయింపులు సరిపోతాయని పేర్కొంది. అలాగే, గుంటూరు చానెల్‌ పరిధిలోని ఆయకట్టులో సుమారు 7,908 ఎకరాలు కొత్త రాజధాని పరిధిలోకి వస్తాయని, దానికి ప్రస్తుతం ఉన్న 2.27 టీఎంసీలకు బదులుగా 1.48 టీఎంసీలను కేటాయిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. సాగర్‌ లెప్ట్‌ కెనాల్‌ పరిధిలోని 3,05,675 ఎకరాల ఆయక ట్టు కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుందని, దీనికి కూడా నీటి అవసరం ఉండదని అఫిడవిట్‌లో పేర్కొంది. సాగర్‌ రైట్‌ కెనాల్‌ పరిధిలోని 2,67,126 ఎకరాల ఆయకట్టు కూడా సీఆర్డీఏ కారణంగా దెబ్బతినబోతోందని, ఈ కెనాల్‌కు ప్రస్తుతం ఉన్న 140 టీఎంసీలకు బదులుగా 48.80 టీఎంసీలనే కేటాయించాలని విన్నవించింది. తుంగభద్రలో లెవల్‌ కెనాల్‌కు కేటాయించిన 29.50 టీఎంసీలకు బదులుగా 25.32 టీఎంసీలు సరిపోతుందని, హై లెవల్‌ కెనాల్‌కు 32.50 టీఎంసీల స్థానంలో 13.6 టీఎంసీలు చాలని పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి ఆవిరి కింద ఏపీకి 22 టీఎంసీలను కేటాయించారని, దానిని తెలంగాణ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. కొత్తగా చేపట్టే ఏపీ రాజధాని తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు చాలని అంచనా వేసింది.
 
ఏపీ వాదన ఇదీ!
కృష్ణా డెల్టాలో తమ నీటి అవసరాలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా నీటి కేటాయింపులను పెంచాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే కేటాయించిన 512 టీఎంసీలకు అదనంగా మరో 547 టీఎంసీలను ఇవ్వాలని, మొత్తంగా కృష్ణా బేసిన్లో 1059 టీఎంసీలను కేటాయించాలని ఆ రాష్ట్రం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు ప్రతిపాదనలను ట్రైబ్యునల్‌కు సమర్పించింది. అందులో తమ కొత్త నీటి అవసరాలను పేర్కొంది.
 
watercount.jpg
Link to comment
Share on other sites

3 minutes ago, koushik_k said:

Telangana government siggu saram vadilesi ap meda padindi.. Mundu Maharashtra Karnataka meda fight chesi proper share tecchukonunda brotherly state AP meda padi crying. 

Great job congress . Malo maku baga pettaru. 

Rivalry would best suit!

 

Link to comment
Share on other sites

4 hours ago, MVS said:

Koushik_k hero acting nuvve chesi villian acting nuvve chesi bale ranjimpachestunavu :roflmao:

 

4 hours ago, KING007 said:

:roflmao::roflmao::roflmao:

Sakala kala vallabhudu....

Sj-surya-in-spyder-movie.png

Tittukonte manam manam tittukovali. Bayata vallu droham chesthe gattiga reply ivvaliga. Responsible db opposition party nenu unlike Jagga, 

Link to comment
Share on other sites

28 minutes ago, koushik_k said:

 

Sj-surya-in-spyder-movie.png

Tittukonte manam manam tittukovali. Bayata vallu droham chesthe gattiga reply ivvaliga. Responsible db opposition party nenu unlike Jagga, 

oppisiotn lo unnadi me mass leader KCR kada, nuvvu KCR ki  against ga matladavu kada.....   ee double role ento.. ??? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...