Jump to content

ఇక మూత్రం సేకరణకు బ్యాంకులు...కేంద్రమంత్రి సంచలన సూచన


KING007

Recommended Posts

ఇక మూత్రం సేకరణకు బ్యాంకులు...కేంద్రమంత్రి సంచలన సూచన
14-11-2017 07:35:56
 
636462417612917623.jpg
నాగ్‌పూర్ : గోమూత్రమే కాదు మనుషుల మూత్రాన్ని కూడా సేకరించేందుకు ఇక మూత్రం బ్యాంకులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన సూచన చేశారు. రైతులు పొలాల్లో వేసే యూరియాను ఉత్పత్తి చేసేందుకు వీలుగా తాలూకా స్థాయిలో మూత్ర సేకరణకు మూత్ర బ్యాంకులు ఏర్పాటు చేయాలని గడ్కరీ కోరారు. మనుషుల మూత్రంలో నత్రజని ఉంటుందని, దీంతో యూరియాను ఉత్పత్తి చేయవచ్చని మంత్రి వెల్లడించారు. యూరియా దిగుమతిని తగ్గించేందుకు వీలుగా మన స్వదేశీ శాస్త్రవేత్తలతో దీనిపై పరిశోధన ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. మూత్రంతో యూరియా ఉత్పత్తి చేసే ప్రక్రియను నిజం చేసేందుకు నాగ్ పూర్ సమీపంలోని ధాపివాడ గరామంలో ఓ ల్యాబ్ ను ప్రారంభించామని మంత్రి వివరించారు. నీరి సంస్థ డైరెక్టరు తపన్ చక్రవర్తి నేతృత్వంలో పది లీటర్ల డబ్బాల్లో రైతుల నుంచి మూత్రాన్ని సేకరిస్తున్నట్లు మంత్రి గడ్కరీ చెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...