Jump to content

బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే...


koushik_k

Recommended Posts

 16 మందిని బలితీసుకున్న పడవ ప్రమాదంలో ప్రభుత్వం వైఫల్యం ఉందన్న వైసీపీ విమర్శల్లో నిజం లేదా?.. కావాలనే రాద్దాంతం చేస్తోందా?.. అనుమతి లేకుండా బోటును రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ నడిపించింది అనడానికి నిరూపించే సాక్ష్యం ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.
 
విజయవాడలో జరిగిన ప్రమాదానికి కారణమైన బోటు నిర్వాహకులతో ఏపీ టూరిజం సంస్థ అధికారుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఆదివారం ఉదయం రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థ దుర్ఘాఘాట్ నుంచి బోటు నడిపేందుకు ప్రయత్నించింది. అక్కడే టూరిజం సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ బోటు ఉంచడానికి అనుమతిలేదని, జట్టీ దగ్గర కూడా నిలపడానికి వీళ్లేదని టూరిజం అధికారి ఖరాకండీగా చెబుతూన్న సాక్ష్యం ఇది. అసలు ముందు పర్యాటకులనే తీసుకువెళ్లడానికి జీఎం నుంచి అనుమతి తెచ్చుకోవాలని చెప్పారు. ప్రయాణికులను వెంటనే దించేయాలని చెబుతున్న బోటు ప్రతినిధులు, టూరిజం అధికారితో వాదనకు దిగారు.
 
అయినా పర్మిషన్ లేకుండా టూరిస్టులను ఎందుకు ఎక్కించుకున్నారని రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులను నిలదీసినా సమాధానం చెప్పలేదు. చేసేదేమీ లేక అక్కడి నుంచి రివర్ బోటింగ్‌కు చెందిన సంస్థ డ్రైవర్ పడవను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ కాసేపటికే ప్రమాదం జరిగింది. భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమం దగ్గరకు అదే బోటులో పరిమితికి మించి పర్యాటకులను తీసుకువెళ్లింది. వారి జీవితాలతో ఆటలాడుకుంది. రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థకు చెందిన పెద్ద బోట్లకు తాము అనుమతి ఇవ్వలేదని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. దుర్గాఘాట్‌లో అడ్డుకున్నప్పటికీ దొంగచాటుగా బోటు నడిపారని ఆమె చెప్పారు.
 
ప్రభుత్వ అధికారులు ముందే హెచ్చరించినా రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ధనార్జన కోసం పర్యాటకుల ప్రాణాల ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమన్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. పర్యాటకులను తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, టూరిస్టులను ఎక్కించుకోవద్దని ముందే హెచ్చరించినా లెక్కచేయకపోవడంతోనే ప్రమాదం జరిగింది. అధికారుల మాట నిర్వాహకులు వినుంటే ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు పోయేవి కావు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...