Jump to content

Boat Drowned In Krishna River Near Sangamam


mahesh1987

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
ఇష్టారాజ్యంగా ‘ప్రైవేట్‌ బోటింగ్‌’
13-11-2017 02:45:29
 
636461379313795750.jpg
  •  ఏపీటీడీసీ పాయింట్లు కబ్జా
  •  కళ్లుండీ చూడలేని కబోదుల్లా అధికారులు!
(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కేంద్రంగా పర్యాటక కార్యకలాపాలను విస్తృతం చేయటానికి ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ)ని ఆహ్వానిస్తున్న ప్రభుత్వ ఉద్దేశ్యానికి పర్యాటకశాఖ అధికారులు కొత్త నిర్వచనాలను ఇస్తున్నారు. ప్రైవేటు సంస్థల సేవలో తరిస్తూ ప్రభుత్వ రంగ పర్యాటకాభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌ తప్పితే మరొక ప్రత్యామ్నాయం లేదు. కానీ, పీపీపీని అవకాశంగా తీసుకున్న పర్యాటకశాఖ అధికారులు తమశాఖ నేతృత్వంలోని సొంత బోటింగ్‌ యూనిట్‌ ను ఒక పథకం ప్రకారం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. గోవా తరహా వాటర్‌ స్పోర్ట్స్‌ అందించటానికి ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌, సింపుల్‌ ఇండియా, అమరావతి బోటింగ్‌ క్లబ్‌, సెయిలింగ్‌ వంటి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించడం జరిగింది. అయితే కృష్ణానదిలో ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌కు డ్యామేజీ కలగకుండా ప్రభుత్వం కొన్ని పద్దతులను సూచించటం జరిగింది. ఏపీటీడీసీ బోటింగ్‌ జెట్టీలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకోవటానికి వీలు లేదు. ప్రైవేటు సంస్థలు ప్రత్యేకంగా ఒక పాయింట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ బోటింగ్‌ జెట్టీలుగా వాడుకోవాలి. అలాగే హరిత బెర్మ్‌ పార్క్‌ నుంచి భవానీ ఐల్యాండ్‌కు ఈ సంస్థలు పర్యాటకులను తీసుకెళ్లకూడదు. కేవలం కృష్ణానదిలో విహారానికే పరిమితం కావాలి. కానీ, దీనికి భిన్నంగా పరిస్థితి నడుస్తోంది. భవానీ ఐల్యాండ్‌ టవర్‌ అలాగే ప్రకాశం బ్యారేజీ చివరన మోటెల్‌ దగ్గర ఉన్న ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌లను చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ అనే సంస్థ కబ్జా చేసేసింది. ఏపీటీడీసీని నిర్దాక్షిణ్యంగా గెంటి వేయటం వల్ల చేసేదేమీ లేక వేరే పాయింట్లను చూసుకోవాల్సి వచ్చింది. కృష్ణవేణి మోటెల్‌కు కొంతదూరంలో ఎలాంటి జెట్టీ లేకుండానే ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌ నిర్వహిస్తోంది. నదిలోకి చెక్కలతో ఒక వంతెన తయారు చేసుకుని బోట్లలోకి పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. ఈ చెక్క వంతెన తాళ్లు తెగినా, కూలినా పర్యాటకులు నీటిలో పడిపోవటం ఖాయం. ఇంత ప్రమాదకరంగా ఉన్నచోట ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌ను ఆదరించే బదులు ప్రైవేటు బోట్లను ఆశ్రయించటం మేలని పర్యాటకులు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఏపీటీడీసీ ఆదాయం పడిపోయింది. ప్రైవేటు సంస్థలు అనధికారికంగా భవానీ ఐల్యాండ్‌కు బోట్లు నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ విషయం పర్యాటకశాఖలోని డివిజనల్‌ అధికారి నుంచి ఎండీ వరకూ తెలుసు. పైగా తమ దృష్టికి తీసుకువచ్చిన సిబ్బందిని వీరు మందలిస్తుంటారు.
 
ప్రైవేట్‌ సెక్యూరిటీతో అమ్మ భక్తులపై దౌర్జన్యం!
సింపుల్‌ ఇండియా సంస్థ ఇదే కేంద్రంగా ఏపీటీడీసీకి పోటీగా బోటింగ్‌ నడుపుతోంది. ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ను దర్జాగా ఉపయోగించుకుంటున్నా.. అధికారులు పల్లెత్తు మాట అనరు. దుర్గా ఘాట్‌ దగ్గర అమరావతి బోటింగ్‌ క్లబ్‌ అనే సంస్థ సొంత పాయింట్‌ ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఐల్యాండ్‌కు బోటింగ్‌ నడుపుతోంది అధికారులు ఈ సంస్థపై ఎనలేని ప్రేమను చూపుతున్నారు.
 
 
కృష్ణానదిలో బోటు ప్రమాదం తర్వాత అసలక్కడేం జరుగుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి! దీనికి ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఫొటోలే వాస్తవాలను కళ్లకు కడతాయి! పర్యాటకశాఖకు చెందిన బోటింగ్‌ జెట్టీని ఓ ప్రైవేటు సంస్థ కబ్జా చేసింది! జెట్టీని కోల్పోయి ఒక చెక్క వంతెన ఏర్పాటు చేసుకుని ఏపీటీడీసీ బోటింగ్‌ నడుపుకుంటోంది! ‘అత్త సొమ్ము అల్లుడి దానం’ అంటే ఇదే! పర్యాటక ఆస్థులను ప్రైవేటు కబ్జా చేసినా అధికారులు చోద్యం చూస్తున్నారు! అందినంత ముడుపులు స్వీకరించి కిమ్మనటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి! మరి, ఉన్నతాధికారులు వీటికి ఏం సమాధానం చెబుతారు? ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
 
 
అధికారుల తీరుతో ప్రభుత్వానికి అప్రతిష్ఠ
ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌ పరిధిలో పాత బోట్లే ఉన్నాయి. కొత్త వాటిని కొనుగోలు చేయటానికి బోర్డు మీటింగ్‌లలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయరు. నష్టాలలో ఉన్న సంస్థ కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారని సరిపెట్టుకోవటానికి వీలు లేదు. లక్షలాది రూపాయల లాభంలో ఉన్న బోటింగ్‌ యూనిట్‌ను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకువచ్చేలా పర్యాటకశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఒకటి తలిస్తే పర్యాటకశాఖ అధికారులు మాత్రం సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Link to comment
Share on other sites

అధికారులే యమకింకరులు!
13-11-2017 02:37:05
 
636461374273868091.jpg
ప్రమాదానికి కారణమైన బోటు రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌ సంస్థది.. ఇది నలుగురు ఏపీటీడీసీ అధికారులది
 
  • బినామీ పేర్లతో సంస్థను నడుపుతున్న వైనం
  • 6 నెలల క్రితమే ఏపీటీడీసీ నుంచి అనుమతి
  • నిబంధనలు తుంగలో తొక్కి చెలరేగిన సంస్థ
  • అనుమతి లేని రూట్లలోనూ బోట్లు
  • ఫిర్యాదులు రావడంతో నెల క్రితం బోట్లు నిలిపివేత
  • ఒక మంత్రి జోక్యంతో తిరిగి ప్రారంభం
  • మరోసారి పర్యాటక శాఖ కార్యదర్శికి ఫిర్యాదు
  • రివర్‌ బోటింగ్‌ సంస్థ వాటాదారే విచారణాధికారి
  • విజిలెన్స్‌ హెచ్చరికలూ పట్టించుకోని ఏపీటీడీసీ
అమరావతి/విజయవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిలో పర్యాటక బోట్లకు ఇటీవలి కాలంలో డిమాండ్‌ పెరిగింది. ప్రైవేటు సంస్థలు బోటింగ్‌కు అనుమతి తీసుకుని లక్షలు వెనకేసుకుంటున్నాయి. దీంతో పర్యాటక శాఖలోని కొందరు అధికారులూ రంగంలోకి దిగారు. బినామీ పేర్లతో బోటింగ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. అంతా తమ చేతిలోనే ఉండటంతో నిబంధనలను నదిలో పాతరేశారు. ఇష్టారాజ్యంగా బోట్లను తిప్పడం ప్రారంభించారు. చివరికి నిండు ప్రాణాలను బలిదీసుకున్నారు. ఆదివారం కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు ఎవరిదో కాదు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు బినామీ పేర్లతో నడుపుతున్న ‘రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థదే. గతంలో భవానీ ఐల్యాండ్‌లో మొత్తం నాలుగు సంస్థలు బోటింగ్‌ నిర్వహించేవి. అందులో ఏపీటీడీసీకి చెందిన ఓ సంస్థతోపాటు మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ఇటీవల ఈ సంస్థలకు మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో ఏపీటీడీసీకి చెందిన నలుగురు ఉద్యోగులు ‘రివర్‌ బోటింగ్‌ అడ్వెంచర్స్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.
 
అధికారం వారి చేతుల్లోనే ఉంది. కాబట్టి.. సంస్థకి వెంటనే అనుమతులు వచ్చేశాయి. ఆరు నెలల క్రితం ఏపీటీడీసీ అధికారులు, ఆ సంస్థతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. సంస్థ యాజమాన్యం, పర్యవేక్షించే అధికారులు ఒక్కరే కావడంతో రివర్‌ బోట్‌ సంస్థ బోట్లకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఈ సంస్థకు బోటింగ్‌ పాయింట్‌ను కూడా ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ పక్కనే కేటాయించారు. పర్యాటకులను ఈ బోట్ల వైపు ఆకర్షించేందుకే అధికారులు ఈ విధంగా చేశారు. రివర్‌ బోటింగ్‌ సంస్థ తీరుపై ఏపీటీడీసీ ఉద్యోగులు ఇటీవల ఆందోళన చేపట్టారు. కానీ ఈ సంస్థ తమపై అధికారులదేనని తెలియడంతో వారు వెనక్కి తగ్గారు. దీంతో రివర్‌ బోటింగ్‌ సంస్థ మరింత చెలరేగిపోయింది. ఏపీటీడీసీకి ఇచ్చిన రూట్‌ మ్యాప్‌ను కూడా పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా అనుమతి లేని రూట్లలోనూ బోట్లను నడపడం ప్రారంభించింది. దీనిపై పదే పదే ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు నెల రోజుల క్రితం 15 రోజులపాటు ఈ సంస్థ బోట్లను నిలిపివేశారు.
 
ఈ సంస్థలో ఏపీటీడీసీ సిబ్బంది ఉన్నారని తెలియడంతో వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే ఓ మంత్రి ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి రివర్‌ బోటింగ్‌ సంస్థకు అనుమతి పునరుద్ధరించాలని ఆదేశించడంతో మళ్లీ ఈ సంస్థ బోట్లు తిరగడం ప్రారంభించాయి. రివర్‌ బోటింగ్‌ సంస్థ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఏపీటీడీసీలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి అండదండలే కారణం. ఈ సంస్థలో ఆయనకు కూడా వాటా ఉంది. ఏపీటీడీసీలో ఆయన చెప్పిందే వేదం. దీంతో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ఫిర్యాదు చేసేందుకు ఏపీటీడీసీ స్థానిక సిబ్బంది వెనకాడేవారు. ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదు చేసినా, ఈ సంస్థ ప్రతినిధులు మేనేజ్‌ చేసేవారు. నెల రోజుల క్రితం రివర్‌ బోటింగ్‌ సంస్థపై ఓ వ్యక్తి పర్యాటక శాఖ సెక్రటరీ, ఏపీటీడీసీ ఎండీకి ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా రివర్‌ బోటింగ్‌ సంస్థలో వాటాలున్న వ్యక్తినే నియమించారు. దీంతో ఆయన ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించి, మాపైనే ఫిర్యాదు చేస్తావేంటంటూ బెదిరింపులకు దిగారు.
 
మూడు వారాల క్రితం ప్రైవే టు బోటింగ్‌ సంస్థలను విజిలెన్స్‌ అధికారుల బృందం తనిఖీ చేసింది. కొన్ని సంస్థలు అనుమతులు లేకుండా బోట్లను నడుపుతుండటంతో నిర్వాహకులను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు పున్నమి ఘాట్‌ నుంచి పవిత్ర సంగమం వరకు ఉన్న ప్రాంతం బోట్లు తిరగడానికి అనుకూలం కాదని వారు ఏపీటీడీసీ అధికారులకు నివేదించారని సమాచారం. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కలుస్తుండటంతో ఇసుక మేటలు వేస్తాయని, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుందని, ఇటు బోట్లను తిప్పకపోవడమే మంచిదని పేర్కొన్నట్లు సమాచారం. 
బీమాపైనా అనుమానాలు
నదుల్లో బోటింగ్‌ నిర్వహించే ప్రైవేటు సంస్థలు తప్పనిసరిగా బోట్లలో ప్రయాణించే వారికి ఇన్సూరెన్స్‌ చేయించాల్సి ఉంది. ప్రతి ప్రయాణికుడిపైనా రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ చేయాల్సి ఉంది. రివర్‌ బోటింగ్‌ సంస్థ ప్రయాణికులకు ఇన్సూరెన్స్‌ చేసిందా.. లేదా.. అన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థ యాజమాన్యం ఇన్సూరెన్స్‌ చేసి ఉంటే మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం లభించే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

అచ్చోసిన నిర్లక్ష్యం..
13-11-2017 02:42:50
 
636461377727264719.jpg
  • ఒడ్డునే ఇవ్వాల్సిన లైఫ్‌ జాకెట్లు... అడిగినా, పడవలో ఉన్నా ఇవ్వలేదు
  • బోటులో ప్లాస్టిక్‌ కుర్చీలే గతి
  • ‘ట్రయల్స్‌’ లేకుండా నేరుగా నీటిలోకి
  • అనధికార బోటు... అడుగడుగునా నిర్లక్ష్యం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నదులు, జలాశయాలు, సముద్రం... నీటిపై విహారమంటే, పర్యాటకులకు లైఫ్‌ జాకెట్‌ ఇవ్వాల్సిందే. పర్యాటక శాఖకు చెందిన బోట్లలో ఈ నిబంధనను నిక్కచ్చిగా పాటిస్తారు. ఒడ్డుపై లైఫ్‌ జాకెట్‌ వేసుకున్నాకే... పడవలోకి అనుమతిస్తారు. కానీ... ఆదివారం ప్రమాదానికి గురైన బోటింగ్‌ సిబ్బంది దీనిని పట్టించుకోలేదు. అత్యంత దారుణమేమిటంటే, పర్యాటకులు అడిగినా, పడవలో పాతిక లైఫ్‌ జాకెట్లు ఉన్నా వాటిని బయటికి తీయలేదు. ‘మరేం ఫర్లేదు. దగ్గరే’ అని చెప్పారు. తమ వద్ద 25 లైఫ్‌ జాకెట్లే ఉండటం, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే గొడవ చేస్తారనే అనుమానంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అలాకాకుండా... కనీసం మహిళలు, ఈతరాని వారికి లైఫ్‌ జాకెట్లు ఇచ్చినా ఇంత ప్రాణనష్టం జరిగేది కాదు. ఇక... ఆ పడవలో స్థిరంగా (ఫిక్స్‌డ్‌) ఉండే కుర్చీలు కూడా లేవు. ప్లాస్టిక్‌ కుర్చీలు వేసేశారు. మేట వేసిన మట్టిని పడవ ఢీకొట్టగానే ఆ కుదుపులకు కుర్చీలన్నీ ఒకవైపునకు కదిలిపోయాయి. వాటిపైన ఉన్న వారు కిందపడ్డారు. పడవ అదుపు తప్పడానికి ఇది కూడా కారణమని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

17 మందిని బలితీసుకున్న కృష్ణానది బోటు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫిలిప్పైన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. విజయవాడలో నిన్న జరిగిన ఘోరప్రమాదంపై ట్విటర్లో స్పందించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘కృష్ణానదిలో బోటు తిరగబడిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులకు సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి...’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

37 minutes ago, koushik_k said:

17 మందిని బలితీసుకున్న కృష్ణానది బోటు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫిలిప్పైన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. విజయవాడలో నిన్న జరిగిన ఘోరప్రమాదంపై ట్విటర్లో స్పందించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘కృష్ణానదిలో బోటు తిరగబడిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులకు సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి...’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

Eedu state ki dabbulu ivalsinavi ivadu kani ittanti tweet lu matram estadu 

Link to comment
Share on other sites

7 minutes ago, Saichandra said:

tg lo tdp power lo ledu anukunta,trs power lo undi kudirite vallu chesevi kuda veyyandi 

ala kadu bro . cbn power lo unte netthikekkudi ayanaki focus cheyaru party meda ala dobbutha unta ekkuva . definitely veyatanki try chestha trs meda kuda.. unfortunately he has public support so media ni musesadu expose avvatledu issues akkada peddaga. 

Link to comment
Share on other sites

3 minutes ago, koushik_k said:

ala kadu bro . cbn power lo unte netthikekkudi ayanaki focus cheyaru party meda ala dobbutha unta ekkuva . definitely veyatanki try chestha trs meda kuda.. unfortunately he has public support so media ni musesadu expose avvatledu issues akkada peddaga. 

Mi posts anni cbn chustunnaru anamata ayite

Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

vadu focus chesthe chala peekochu e issue meda. abn already chepthune undi oka minister support tho vellu nadiparu ani

enti peekedhi.. road midha evadanna vuchha posthe daniki kuda CBN dhe badyata antadu.. appudu mii lanti Jaffas poonakam vastundhi kaasepu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...