Jump to content

ఏమిటీ అడ్డుకట్టలు? పోలవరం ప్రాజెక్టులో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం ....


KING007

Recommended Posts

ఏమిటీ అడ్డుకట్టలు? 
పోలవరం ప్రాజెక్టులో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం 
సాయంపై రోజుకో తీరంటూ అంతర్గతంగా అసంతృప్తి 
ఈనాడు - హైదరాబాద్‌ 
11ap-main1a.jpg
పోలవరం విషయంలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసహనంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 2014 తర్వాత ఖర్చు చేసే నిధులన్నీ పూర్తి స్థాయిలో భరిస్తామని కేంద్రం గతంలో ప్రకటించినా చేతల విషయంలో ఆ భరోసా లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు భరిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. 2015 తర్వాత పోలవరం పనులు వేగమందుకున్నా నిధులు అందించే విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోందనే భావన కనిపిస్తోంది. తాజాగా ప్రధానడ్యాంకు ఎగువన కాఫర్‌డ్యాం విడిగా నిర్మించాలా? లేదా అంతర్భాగంగానా? అనే విషయం తేల్చడానికి కేంద్ర జలవనరుల శాఖ కొత్త కమిటీని నియమించింది. ఇప్పటికే ఆకృతుల ఖరారుకు కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో వారు నియమించిన కమిటీ పనిచేస్తోంది. వారికి పోలవరంపై అవగాహన ఉంది. ఆ కమిటీని ఈ విషయంపై అడిగితే సరిపోయేదని, వారిని కాదని కొత్త నిర్ణయం ప్రకటించడంలో కేంద్రం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు. పైగా దిల్లీలో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి గడ్కరీ ‘కేవలం పనుల వరకు బిల్లులు చెల్లిస్తామని.. పునరావాసం, భూసేకరణకు సంబంధించి ఆర్థిక మంత్రితో మాట్లాడాలి’ అని పేర్కొనడమూ ప్రస్తావనకు వస్తోంది.

అసంతృప్తి ఎందుకంటే.. 
* పోలవరంలో నిర్మాణ పనులు- పునరావాసం, భూసేకరణే కీలకం. 2010-11 ప్రకారం రూ.16,010 కోట్లు అంచనా వేశారు. 2014 ఏప్రిల్‌1 నాటికి ఈ అంచనాలు రూ.58,319 కోట్లకు చేరాయి. ఇందులో పునరావాసం ఖర్చే రూ.33 వేల కోట్లు. 
* 2013లో కేంద్రం భూసేకరణ చట్టం మార్చినందునే ఈ వ్యయం భారీగా పెరిగింది. 2014లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉండగా ఆ మొత్తం ఇస్తామని మంత్రిమండలి పేర్కొంది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్న సందర్భంలో పోలవరం ఖర్చు కేంద్రానిదే అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. తర్వాత నాబార్డు ద్వారా కేంద్రమే పోలవరానికి రుణమిప్పించేందుకు సిద్ధమైంది. అది ఆమోదించేందుకు కేంద్ర మంత్రిమండలి సిద్ధం చేసిన నోట్‌లో రూ.23వేల కోట్లు పోలవరానికి కేటాయింపులుగా పేర్కొన్నారు. 
* నాబార్డు రుణఒప్పందం విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మెమో జారీ చేసింది. అందులో 2014 ఏప్రిల్‌1 నాటికి నీటిపారుదల కింద చేసే ఖర్చుకు మాత్రమే కట్టుబడి ఉన్నామని పేర్కొంది. విద్యుత్కేంద్రానికయ్యే నిధులు ఇవ్వబోమని చెప్పినందున.. నీటిపారుదల ఖర్చు ఇస్తామని పేర్కొన్నందున పునరావాసం, భూసేకరణ ఖర్చు అందులోనే కలిసి ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సూత్రీకరించారు. 
* ఆ మెమోలోనే 2010-11 అంచనాల ప్రకారం పోలవరానికి ఇక రూ.5810.72 కోట్లు మాత్రమే తాము ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అందులో రూ.2981.54 కోట్లు విడుదల చేస్తున్నామని, మరో రూ.2829.18 కోట్లు ఇస్తామని వివరించింది. అందులోనే 2014 ఏప్రిల్‌1 నాటికి పోలవరంపై నీటిపారుదల పనులకయ్యే ఖర్చుకు మాత్రమే కేంద్రానికి బాధ్యత ఉందని పేర్కొంది. తాజా అంచనాలు ఆమోదించే వరకే ఈ రూ.2829.18 కోట్ల చెల్లింపు వర్తిస్తుందని, ఆ తర్వాత తాజా అంచనాలు ఆమోదం పొందాక ఎంత ఖర్చు చేస్తే అంత చెల్లిస్తారని అధికారులు భావిస్తూ వచ్చారు. 
* పాత అంచనాల ప్రకారం భూసేకరణ, పునరావాసానికి రూ.మూడు వేల కోట్లే కేటాయింపులు ఉన్నందున ఆ మొత్తం తాము ఇచ్చేసినట్లేనని, పనులకు మాత్రమే బిల్లులు ఇస్తామని మళ్లీ చెబుతున్నారు. 2014 అంచనాలు ఆమోదించాక పునరావాసం, భూసేకరణకు చేసిన ఖర్చు ఇస్తారా? లేదా? అన్నది తెలియక రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒకవైపు పోలవరంపై 2014 తర్వాత వంద శాతం ఖర్చు భరిస్తామంటూనే పునరావాసంపై ఆర్థిక మంత్రితో మాట్లాడాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. 
* ఆగస్టులో పోలవరంలో జరిగిన ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో 2014 ఏప్రిల్‌1 నాటి అంచనాలు కాక తాజా అంచనాలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ తేడాలో కొంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మిగిలిన మొత్తం కేంద్రం విడుదల చేస్తుందనే ప్రతిపాదన కేంద్ర అధికారులు ప్రస్తావించగా రాష్ట్ర అధికారులు ఖండించారు. ఈ అంశం అథారిటీ పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. ఒకవైపు 2014 అంచనాల ప్రకారం నిధులు ఇస్తామంటూ మళ్లీ తాజా అంచనాలు ఎందుకు సిద్ధం చేయమన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • Replies 77
  • Created
  • Last Reply
54 minutes ago, KING007 said:
2013లో కేంద్రం భూసేకరణ చట్టం మార్చినందునే ఈ వ్యయం భారీగా పెరిగింది. 2014లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉండగా ఆ మొత్తం ఇస్తామని మంత్రిమండలి పేర్కొంది. 

 

పోలవరం ప్రాజెక్టు భూ సేకరణలోనూ కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఒకప్పుడు ఎకరాకు రూ.లక్షన్నర మాత్రమే పరిహారంగా చెల్లించారని, ఇప్పుడు ఏకంగా రూ.పదిన్నర లక్షలు ఎందుకు చెల్లిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2013 భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది కేంద్రమేనని, దాని అమలు బాధ్యత రాష్ట్రాలపై పడిందని చంద్రబాబు ఎంత చెబుతున్నా కేంద్రం వినిపించుకోవడం లేదు. 2010-11లో రూ.3000 కోట్లుగా ఉన్న భూ సేకరణ అంచనా వ్యయం రూ.33,000 కోట్లకు చేరుకుందని వాదిస్తోంది. భూసేకరణ, కాంట్రాక్టు పనుల్లోనూ 2010-11 అంచనాలను మించి చెల్లించబోమని కేంద్రం చెబుతోంది.

 

e batch  gurinchi inka evarikanna doubts unte manalni manam mosam chesukovatme........

Sankranti kanuka tho polavaram kattochu.....NREGA panulu apesi polavaram kattochu lanti durmargpu statements tho tagubothu matalu matladinappude ardam ayyindi enta rota edavalo...

 

ikkada mana edava okadu ekara 30 lakhs ivvali antunadu......malli vaadi babu 1-1.5 lakh max iste CBN govt 10.5 lakh istundi(which is fair).....malli vaade why land cost gone up ani matladatadu!!!!!!!!!

still 80000 acres acquisition pending........

Link to comment
Share on other sites

అసహనం కట్టలు తెంచుకుంటోంది. చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా…పూటకో మెలిక పెడుతూ రాజకీయం పండించాలనుకుంటున్న కేంద్రానికి స్ట్రైట్ సిగ్నల్ వెళ్తున్నట్టే ఉంది. ప్రాజెక్ట్ అంటూ కాకపోతే ఇక ఆ తర్వాత ఆలోచించడానికి ఏముందంటున్న ఏపీ ప్రశ్నకి ఎదురేముంది ? మోడీ కాదు ఎవరైనా సమాధానం చెప్పగలరా ? మా ప్రయోజనం కోసం ఉన్నాం… రాజకీయం కోసం కాదు. పదవులు లెక్కకాదు అని చంద్రబాబు ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అదే మాట ఏపీవైపు నుంచి ఢిల్లీ చెవుల్లో రీసౌండ్ వచ్చే రేంజులో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కాఫర్ డ్యామ్ పై కేంద్రం మెలిక పెట్టింది. తర్వాత అట్లాంటిదేం లేదు అని మాట మార్చింది. అటు తర్వాత ముందు నుంచి ఉన్న పంచాయతీని మళ్లీ తెరమీదకి తెచ్చింది. పోలవరం కోసం ఏపీ ఇప్పటికే 4900 కోట్లు ఖర్చుచేసింది. అందులో కేంద్రం తిరిగి ఇచ్చింది వెయ్యి కోట్లే ! మిగతా సొమ్ము ఇవ్వాలి కదా అని ఏపీ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు కొత్త లెక్క చెబుతోంది.

మీరు ఖర్చు చేసిన వాటిలో మిగతా 3900 కోట్లలో 2500 కోట్లు పునావాసం కోసం కేటాయించారు కాబట్టి అది ఇవ్వడం వీలు కాదు అంటోంది. ఏంటి తమాషాలా ? ప్రాజెక్టు అంటే పునారావాసం భాగం కాదా ? ఇల్లు కట్టి మీకు ఇస్తామని చెప్పి సిమెంటు, ఇటుకలతో మాకుసంబంధంలేదు మీరే కొనుక్కోవాలని పేచీ పెడతారా ? గొడవకి దిగుతారా ? కేంద్రం వదిలించుకునే ధోరణితో ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది ఈ మధ్య ! అందుకే ఏపీ ఓ నిర్ణయానికి వస్తోంది. చంద్రబాబు సహనమే నశించిన రోజు ఇక కేంద్రం సంగతేంటో… బీజేపీ ఎక్కడుంటుందో దెబ్బకి తేలిపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీ చెబుతున్న కబుర్ల సంగతీ తేలిపోతుంది. బహుశా ఆరోజు రావొచ్చేమో అనిపిస్తోంది. ఒక్క పోలవరం కోసమే ఇప్పటి వరకూ ఓపిగ్గా ఉన్నా అదే లేకపోతే ఇక మీతో మాకేంటి అనేందుకు పెద్దగా సంకోచం లేకపోవచ్చు !

 

 

Link to comment
Share on other sites

1 hour ago, curiousgally said:

Ivanni choosi I still wonder how any Andhra guy ela venakesukosthaaru modi ni ani. Jagan ki following ela vundo idi anthey ani sardicheppukuntaa !!!

Cbn unte ap mg aipoyina parvaledu kontamandiki ikkada alanti vallani lite teesukuni munduku sagatame 

Link to comment
Share on other sites

12 minutes ago, swarnandhra said:

AP nasanam ayipovali ani korukune vallu ani nenu anukonu. naaku artham ayinantha varaki ayithe matram, for them Nationalism a.k.a Hinduism more important than state development.

Akkada nationalism kadu  main thing is they want to rule the whole country by any means 

Link to comment
Share on other sites

Nationalism/hinduism  anedi just oka mask... Why they did not open their mouth when kcr was praising nizam... & making a issue of tippu sultan in karnataka.. Bcz they have different political priorities  in both states... 

Link to comment
Share on other sites

1 minute ago, MVS said:

Internal integrity lekunda nationalism ante navvutaru bro... Akkada nationalism kadu  main thing is they want to rule the whole country by any means 

integrity vundi ga. regional bias gurunichi evadaina matladithe vaadini pichodini chestaru, inka ekkuva matladithe sedition charges kinda bokkalo tostaru.

 

Link to comment
Share on other sites

AP should finish Dam and acquire lands at least for 75-100 TMC storage (majority of the 80000 acres are only needed for 100 to max storage). 

increase purushottampatnam lift capacity and store maximum at Yeleru reservoir.

increase Right main canal capacity

start another lift to Buggavagu from Krishna.

 

Link to comment
Share on other sites

53 minutes ago, JVC said:

అసహనం కట్టలు తెంచుకుంటోంది. చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా…పూటకో మెలిక పెడుతూ రాజకీయం పండించాలనుకుంటున్న కేంద్రానికి స్ట్రైట్ సిగ్నల్ వెళ్తున్నట్టే ఉంది. ప్రాజెక్ట్ అంటూ కాకపోతే ఇక ఆ తర్వాత ఆలోచించడానికి ఏముందంటున్న ఏపీ ప్రశ్నకి ఎదురేముంది ? మోడీ కాదు ఎవరైనా సమాధానం చెప్పగలరా ? మా ప్రయోజనం కోసం ఉన్నాం… రాజకీయం కోసం కాదు. పదవులు లెక్కకాదు అని చంద్రబాబు ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అదే మాట ఏపీవైపు నుంచి ఢిల్లీ చెవుల్లో రీసౌండ్ వచ్చే రేంజులో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కాఫర్ డ్యామ్ పై కేంద్రం మెలిక పెట్టింది. తర్వాత అట్లాంటిదేం లేదు అని మాట మార్చింది. అటు తర్వాత ముందు నుంచి ఉన్న పంచాయతీని మళ్లీ తెరమీదకి తెచ్చింది. పోలవరం కోసం ఏపీ ఇప్పటికే 4900 కోట్లు ఖర్చుచేసింది. అందులో కేంద్రం తిరిగి ఇచ్చింది వెయ్యి కోట్లే ! మిగతా సొమ్ము ఇవ్వాలి కదా అని ఏపీ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు కొత్త లెక్క చెబుతోంది.

మీరు ఖర్చు చేసిన వాటిలో మిగతా 3900 కోట్లలో 2500 కోట్లు పునావాసం కోసం కేటాయించారు కాబట్టి అది ఇవ్వడం వీలు కాదు అంటోంది. ఏంటి తమాషాలా ? ప్రాజెక్టు అంటే పునారావాసం భాగం కాదా ? ఇల్లు కట్టి మీకు ఇస్తామని చెప్పి సిమెంటు, ఇటుకలతో మాకుసంబంధంలేదు మీరే కొనుక్కోవాలని పేచీ పెడతారా ? గొడవకి దిగుతారా ? కేంద్రం వదిలించుకునే ధోరణితో ఉన్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది ఈ మధ్య ! అందుకే ఏపీ ఓ నిర్ణయానికి వస్తోంది. చంద్రబాబు సహనమే నశించిన రోజు ఇక కేంద్రం సంగతేంటో… బీజేపీ ఎక్కడుంటుందో దెబ్బకి తేలిపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీ చెబుతున్న కబుర్ల సంగతీ తేలిపోతుంది. బహుశా ఆరోజు రావొచ్చేమో అనిపిస్తోంది. ఒక్క పోలవరం కోసమే ఇప్పటి వరకూ ఓపిగ్గా ఉన్నా అదే లేకపోతే ఇక మీతో మాకేంటి అనేందుకు పెద్దగా సంకోచం లేకపోవచ్చు !

 

 

waiting eppudu bjp and Modi ni thenkuthado ani... history chusthe alaa cheyyadu but chuddam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...