Jump to content

జీసస్‌ క్షమించడు!


koushik_k

Recommended Posts

  • జగన్‌ తిరుమలకు వెళ్లడం తప్పు
  • వైఎస్‌పైనా క్రీస్తు ఆగ్రహించాడు
  • అందుకే పావురాలగుట్ట ప్రమాదం
  • జగన్‌ జీవితంలోనూ ఇబ్బందులు
  • చర్చిలో ఓ పాస్టర్‌ ప్రసంగం
 
 
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడాన్ని క్రైస్తవ సంఘాలు తప్పుపట్టాయి. క్రైస్తవుడై ఉండి తిరుమలేశుడిని పూజించడం పాపమని, జీసస్‌ క్షమించడని వ్యాఖ్యానించాయి. ఓట్ల కోసమే జగన్‌ విగ్రహారాధన చేస్తున్నారని ఆక్షేపిస్తున్నాయి. ‘‘విగ్రహారాధన మానితే జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఇలా తిరుమల కొండకు వెళ్లినందుకే జీసస్‌ ఆగ్రహించారు. దాని పర్యవసానమే పావురాలగుట్ట ప్రమాదం. ఇంత జరిగినా జగన్‌ తిరుమలకు వెళ్లడం సరికాదు’’ అని తిరుపతికి చెందిన పాస్టర్‌ డేవిడ్‌ కరుణాకర్‌ పేర్కొన్నారు. విగ్రహారాధన వల్లే జగన్‌ జీవితంలో బాధలు ఎదురవుతున్నాయని తెలిపారు. కరుణాకర్‌ చర్చిలో చేసిన ఆదివార ప్రసంగం తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘జగన్‌ సీఎం కావాలని క్రైస్తవ సమాజం కోరుకుంటోంది. అయితే అందుకోసం ఆయన విగ్రహారాధన చేయడం వారికిష్టంలేదు. జీసస్‌ విగ్రహారాధనను అసహ్యించుకుంటున్నాడు. ఈ విషయాన్ని జగన్‌కు తెలిపే పాస్టర్లు లేరు. ఆయన తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాడు. పాదయాత్రకు ఆయన ఆశీర్వాదం ఉంటుందని వచ్చాడంట.
 
దేవుడి ఆత్మను దుఃఖపరుస్తున్నాడు. దేవుడి సేవకులుగా, బిడ్డలుగా మనం హెచ్చరించడంలేదు. నాకు జగన్‌తో మాట్లాడే అవకాశం వస్తే.. ఆయన్ను హెచ్చరిస్తా. పాపం చేసే వారిని ఖండించకపోతే ఆ పాపం నీకూ అంటుతుందని దేవుడు చెబుతున్నాడు’’ అని తన ప్రసంగంలో కరుణాకర్‌ పేర్కొన్నారు. విగ్రహారాధన చేసిన వారిపై జీసస్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చరిత్ర చెబుతోందని, ఆయన జగన్‌ కళ్లు తెరిపించి విగ్రహారాధన మానేలా చూడాలని ఆకాంక్షించారు. అయితే హిందూ దేవుళ్లను తామెప్పుడూ కించపరచలేదని, విగ్రహారాధనకు క్రైస్తవులు వ్యతిరేకమని కరుణాకర్‌ వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...