Jump to content

బీటీటీ రానుందా?


KING007

Recommended Posts

బీటీటీ రానుందా?
08-11-2017 03:01:02
636457068634893074.jpg
  • జీఎస్టీ తర్వాత మోదీ బ్రహ్మాస్త్రం.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులన్నీ రద్దు
  • గుజరాత్‌ ఎన్నికల్లో గెలిస్తే ముందుకే
  • పన్నుల వ్యవస్థలో పెను విప్లవం
  • ప్రతీ పౌరుడికి కనీస ఆదాయ పథకం
  • వచ్చే సాధారణ ఎన్నికల్లోగా అమల్లోకి
  • వారంలో లక్ష మందికి ఐటీ నోటీసులు
  • జనవరిలో మలి దశ డిజిటల్‌ ఉద్యమం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? ఆదాయ పన్ను సహా దేశంలో పన్నులన్నీ రద్దుచేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను(బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌-బీటీటీ) విధించబోతున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని దూకుడుగా కొత్త సంస్కరణలను చేపడతారని విశ్లేషకులు అంటున్నారు. బీటీటీతో పాటు మద్యం, పొగాకు లాంటి కొన్ని రకాల హానికరమైన, కాలుష్యకారకమైన వస్తువులపై కన్జంప్షన్‌ ట్యాక్స్‌ విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటిదాకా దొంగ వెంటపడ్డ పోలీసులాగా ప్రభుత్వం ప్రజల వెంటపడి పన్ను వసూలు చేసుకోవాల్సి వస్తోంది. బీటీటీ అమల్లోకి వస్తే పన్ను ఆటోమాటిక్‌గా వసూలవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ మదిలోని ఈ ఆలోచన అమల్లోకి వస్తే పన్ను ఎగవేతకు అవకాశమే ఉండదు. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య ఏ లావాదేవీ జరగాలన్నా రెండు శాతం సమర్పించుకోవాల్సిందే. అందులో కేంద్రానికి .0.7 శాతం, రాష్ట్రానికి 0.6 శాతం, స్థానిక సంస్థలకు 0.35 శాతం, లావాదేవీ నిర్వహించిన బ్యాంకుకు 0.35 శాతం చొప్పున వాటాలు లభిస్తాయి. బీటీటీకి మెజారిటీ వాణిజ్య వర్గాలు మద్దతు పలుకుతున్నాయి. పుణేకు చెందిన అర్ధక్రాంతి ప్రతిష్ఠాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్‌ బోకిల్‌ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. ప్రధాని మోదీకి పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది కూడా అనిల్‌ బోకిలే. 2013లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తొలిసారి అనిల్‌ బోకిల్‌ మోదీతో భేటీ అయ్యారు.
 
నోట్ల రద్దుతో మొదలు
పెద్ద నోట్ల రద్దు సమయంలో బోకిల్‌ సూచనల ప్రకారమే ప్రధాని నడుచుకుంటున్నారని కథనాలు వచ్చాయి. పన్నులన్నీ ఎత్తేయమంటే మోదీ జీఎస్టీని తెచ్చారు. ఆయన చెప్పినట్లే పెద్ద నోట్ల రద్దు చేశారు. బోకిల్‌ మూడో సూత్రం బీటీటీయే కావడంతో మోదీ తదుపరి అస్త్రం అదేనని భావిస్తున్నారు. బీటీటీ, కన్జంప్షన్‌ ట్యాక్స్‌లతో సర్కారుకు ఆదాయ పన్ను కన్నా పలురెట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ సొమ్ముతో పేదా, గొప్పా తేడా లేకుండా దేశంలోని పౌరులందరికీ కనీస ఆదాయ పథకం(యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కం-యూబీఐ) కింద నిర్ణీత మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలన్నది మరో విప్లవాత్మక ఆలోచన. ఉద్యోగం లేనంత మాత్రాన కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి రాకూడదనే మానవీయ కోణం ఇందులో ఉంది. దీనిద్వారా క్రమంగా ప్రజల్ని దారిద్య్రరేఖకు ఎగువకుతీసుకు రావచ్చనేది ఆలోచన. అందరికీ కరెంటు పథకం కూడా అమలు చేసే ఆలోచనలో మోదీ ఉన్నారు. ఇవన్నీ అమల్లోకి తెచ్చి ప్రధాని మోదీ 2018 నవంబరులోముందస్తు ఎన్నికలకు వెళ్తారనే బలమైన ప్రచారం జరుగుతోంది.
 
రెండో దశ డిజిటల్‌ ఉద్యమం
జనవరి నుంచి రెండో దశ డిజిటల్‌ చెల్లింపుల ఉద్యమాన్ని చేట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రచార కార్యక్రమానికి డీఏవీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన లోగో, జింగిల్‌ సిద్ధమవుతున్నాయి.
 
బోకిల్‌ పంచసూత్ర పథకం
  •  దేశంలో పన్నులన్నీ ఎత్తేయండి.
  •  50 రూపాయలకు మించిన నోట్లన్నీ రద్దు చేయండి
  •  నగదు లావాదేవీల మీద పరిమితి విధించండి.
  •  ఆన్‌లైన్‌ లావాదేవీలపై 2ు పన్ను(బీటీటీ) విధించండి. డబ్బులు జమ అయ్యే ఖాతా నుంచే కట్‌ చేయాలి.
  • బీటీటీలో 0.7 శాతం కేంద్రానికి, 0.6 శాతం రాష్ట్రానికి, 0.35 శాతం స్థానిక సంస్థలకు, 0.35 శాతం పంచండి.
 
లక్ష నోటీసులు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు చేసిన సంస్థలు, వ్యక్తులు శ్రీముఖాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. వారితోపాటు ట్యాక్స్‌ రిటర్న్స్‌ అనుమానాస్పదంగా ఉన్న వారిపైనా ఆదాయ పన్ను శాఖ విచారణకు సిద్ధమవుతోంది. రూ.50 లక్షల పైన నగదును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయని లేదా ఐటీ విభాగం సూచనలకు స్పందించని 70 వేల సంస్థలకు తొలిదశలో నోటీసులు జారీ చేయనున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించాయి. నోట్ల రద్దు అనంతరం చేసిన నగదుడిపాజిట్లు, ట్యాక్స్‌ రిటర్న్స్‌కు పొంతనలేని 30 వేల మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసుల జారీ ఈ వారమే ప్రారంభం కానుంది. నోట్లరద్దు అనంతరం 23.22 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ.3.68 లక్షల కోట్లకు సంబంధించి 17.73 లక్షల అనుమానాస్పద కేసులను గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 16.92 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించి 11.8 లక్షల మంది ఆన్‌లైన్‌లో వివరణలు ఇచ్చారు.
1note-path...jpg 
Link to comment
Share on other sites

18 minutes ago, KING007 said:

entha varaku useful idhi?????

Once Income Tax is lifted, it will provide immense relief to the middle classes, especially the salaried class. The rich mostly avoid paying taxes, the poor don't come under the income tax net, most of the time the burden is on the middle class. They will be benefited with this proposal.

Of course we will still have BTT which is applicable to all those who does bank transactions ( this is also one of the reasons NaMo govt gave utmost priority to opening bank accounts for a larger number of public within short time).

 

 

Link to comment
Share on other sites

7 hours ago, Gunner said:

Ippudu 0% tax slab lo vunna vallaki baga impact avuddi... As they will have to pay 2% if BTT is implemented (creditor acct nunchi deduct cheste)

Rokuki laksha sampadinche vallu kuda 0 slab ee kada annay!! But there should be some mechanism so that transactions below a threshold are not taxed!! People will support then

Link to comment
Share on other sites

I may be wrong but this is what I read few yrs before.. 

2% is for all deposits.. not one time when one get salary.. if you transfer to pay some bill / buy.. you pay another 2% for that amount each time.. 

if you pay cash, the business who received, they pay 2% when they deposit themselves.. 

our ppl will not deposit / transfer (use cash) for few rounds until its necessary/cannot escape anymore.. that's why 50 rs bills will be the biggest note..

if you want a wealthy govt.. you can keep transfer your money btw your two accounts :)

Link to comment
Share on other sites

Black money generate ayyedi main ga registrations meeda... 50L ki oka property konte hardly 20L ki registration chesthaaru..... ikkade 30L black money generate ayinattu...... mallee ee transaction ki min 1L bribe kattaali....ilaanti major issues ni resolve cheyyakundaa enni tax lu enni rules pedithe em use? 

Asalu govt value market value ane difference theesesi enthaki konte antha ki registration cheyyaali.... registration charges and other taxes thaggichi alaa chesthe better eppatikaina 

Link to comment
Share on other sites

4 hours ago, nbk@myHeart said:

Black money generate ayyedi main ga registrations meeda... 50L ki oka property konte hardly 20L ki registration chesthaaru..... ikkade 30L black money generate ayinattu...... mallee ee transaction ki min 1L bribe kattaali....ilaanti major issues ni resolve cheyyakundaa enni tax lu enni rules pedithe em use? 

Asalu govt value market value ane difference theesesi enthaki konte antha ki registration cheyyaali.... registration charges and other taxes thaggichi alaa chesthe better eppatikaina 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...