Jump to content

తనను దొంగ అన్న కేటీఆర్‌కు కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి


KING007

Recommended Posts

తనను దొంగ అన్న కేటీఆర్‌కు కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి
02-11-2017 13:41:37
 
636452269021294266.jpg
హైదరాబాద్: కుంభకోణాల కాంగ్రెస్‌లోకి మరో దొంగ రేవంత్‌రెడ్డి చేరాడని మంత్రి కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని ఎద్దేవా చేసిన కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘ఇదిగో కేటీఆర్ దాచిన ‘‘సత్యం’’...!’ అనే శీర్షికతో ఓ ఫొటో పోస్ట్ చేశారు.
 
2016లో జరిగిన అఫీషియల్ ప్రోగ్రాంలో ‘‘అనఫిషియల్’’గా తేజారాజు S/O సత్యం రామలింగరాజుతో మలేషియన్ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాం స్టార్ కేటీఆర్‌కు ముందుంది ‘‘క్రోకోడైల్ ఫెస్టివల్’’ అని రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరి స్కాం స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్ నిన్న రంకెలేస్తూ ఆవేశపడ్డారని, అయితే ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారో సాక్ష్యం ఈ ఫొటోనేనని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
 
2016లో జూలైలో పెట్టుబడుల సేకరణ పేరుతో కేటీఆర్ మలేషియాకు వెళ్లారని, అప్పటి ఫొటోనే ఇది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఇది అఫీషియల్ టూర్ ఫొటోల్లో ఎక్కడా కనిపించదని రేవంత్ చెప్పారు. ఈ ఫొటోలో కేటీఆర్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి సత్యం రామలింగరాజు కొడుకు తేజా రాజు అని, వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రాజలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలని రేవంత్ ఎద్దేవా చేశారు. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న ‘‘సత్యం’’ తెలంగాణా సమాజం గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
 
revanth-post.jpg 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...