Jump to content

Groundnut Ananthapur


jeevgoran

Recommended Posts

వేరుసెనగ.. విరిసెనుగ! 
ఎకరాకు 18-19 బస్తాల దిగుబడి ్ద సగటున జిల్లాలో పదిన్నర బస్తాలు 
కలిసొచ్చిన ఆగస్టు, సెప్టెంబరు వానలు 
ఈనాడు, అనంతపురం 
atp-top1a.jpg

‘‘ఖరీఫ్‌ వేళ సరైన వర్షాలు లేవు.. వర్షానికి వర్షానికి మధ్య విరామం అధికమైంది.. నేలలో తేమ కరవైంది.. పంట నిలువునా ఎండింది.. నిరుడు మాదిరిగానే కష్టాలు, కన్నీళ్లే దిక్కు, అప్పుల వూబి తప్పదని కర్షకులు మథనపడ్డారు. అయితే.. అనూహ్యంగా వరుణుడు కరుణించాడు. ఆగస్టు నుంచి మంచి వర్షాలు కురిశాయి.. చేతికి దక్కదని భావించిన పంటలకు జీవం వచ్చింది.. ఇప్పుడు వాటి దిగుబడి చూసి రైతులు సంబరపడుతున్నారు. మున్నపెన్నడూ లేనంతగా వేరుసెనగ ఉత్పత్తులు దరి చేరడం విశేషం.’’

జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో వేరుసెనగ వేసిన రైతుల్లో ఎక్కువ మంది మంచి దిగుబడి సాధించారు. అధికారులు గ్రామాల వారీగా దిగుబడి లెక్క తేలుస్తుంటే.. గత 15 ఏళ్లలో లేనంతలా దిగుబడి వస్తోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి మొదలైన ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 6 లక్షల హెక్టార్లలో వేరుసెనగ విత్తు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే జూన్‌, జులైలో వర్షాభావంతో అధికారుల అంచనాలు తప్పాయి. చివరకు రైతులు సాహసం చేసి 4 లక్షల హెక్టార్లలో పంట వేశారు. అది కూడా ఆగస్టు రెండో వారం నాటికి క్రమంగా ఎండిపోవడం మొదలైంది. రెండు మూడు వారాలు వర్షాలు లేక పంట పూర్తిగా వాడిపోయింది. ఇక ఈ ఏడాది కూడా వేరుసెనగపై పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని ఎక్కువ మంది రైతులు ఆశలు వదలుకున్నారు. వ్యవసాయ శాఖ కూడా అదే భావనలో ఉండేది.

పైరుకు జీవం...వాస్తవానికి జూన్‌లో 63.9 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 59.2 మి.మీలే కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 7.4 శాతం తక్కువగా కురిసింది. అలాగే జులైలో మరీ ఘోరంగా 67.4 మి.మి.కిగాను కేవలం 31 మి.మీలే కురిసింది. అంటే 54 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే రైతులను దెబ్బతీసే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే ఆగస్టులో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ఆగస్టు 88.7 మి.మీకుగాను 96.8 మి.మీ వర్షంతో 9.1 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరులో ఇంకా అధికంగా 118.4 మి.మీకుగాను 178.4 మి.మీలు కురిసింది. అంటే సాధారణం కంట 50.7 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఎండిన పంటలు ప్రాణం పోసుకున్నాయి. కాయలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఇక అక్టోబరులో 110.7 మి.మీకుగాను 186.6 మి.మీలు కురిసి 68.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇది ఆలస్యంగా పంట వేసిన రైతులకు ఎంతో మేలు చేసింది. మొత్తంగా ఖరీఫ్‌లో విత్తు వేసిన రైతుల్లో అధిక శాతం మంచి దిగుబడి పొందేలా వర్షాలు దోహదం చేశాయి.

ఆ మండలాల్లో అధికం... 
జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ వేసిన లెక్కల్లో.. గుత్తి, పెద్దవడుగూరు, పుట్లూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో అత్యధికంగా ఎకరాకు సగటున 18-19 బస్తాల దిగుబడి వచ్చింది. అత్యల్పంగా రామగిరి, కంబదూరు, కనగానపల్లె, అగలి, రొళ్ల మండలాల్లో కేవలం 3 నుంచి 3.5 బస్తాలే వచ్చింది. గుడిబండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, అమరాపురం, పరిగి, తలుపులలో 6 బస్తాలు, గోరంట్ల, శెట్టూరు, సోమందేపల్లి, గుమ్మఘట్ట, పుట్టపర్తి, మడకశిర మండలాల్లో 7 బస్తాలు, డి.హీరేహాళ్‌, సీకేపల్లి, హిందూపురం, కుందుర్పి, కొత్తచెరువు, ఆత్మకూరు, కూడేరు, యల్లనూరు మండలాల్లో 8-9 బస్తాలు దిగుబడి వచ్చింది. మిగిలిన అన్ని మండలాల్లో 10 నుంచి 15 బస్తాల దిగుబడి వచ్చింది. బ్రహ్మసముద్రం మండలంలో మాత్రమే ఇంకా దిగుబడి పరిశీలన మొదలు కాలేదు.

విభిన్న దిగుబడి... 
ఒక్కో గ్రామంలో ఐదు మీటర్ల పొడవు, వెడల్పులో 25 మీటర్ల పరిమాణంలో పరిశీలించిన దిగుబడి వివరాలు పరిశీలిస్తే.. పెద్దపప్పూరు మండలం చిన్నఎక్కలూరులో 10.2 కిలోలు, గాండ్లపెంట మండలం చేమచేనుబైలులో 9.6 కిలోలు, పెద్దవడుగూరు మండలం కొండూరులో 9.35 కిలోల అధిక దిగుబడి వచ్చింది. అలాగే అమరాపురం మండలం నిద్రగుట్టలో 1.3 కిలోలు, కళ్యాణదుర్గం మండలం చాపిరిలో 1.4 కిలోలు, పుట్టపర్తి మండలం జగరాజుపల్లెలో 1.55 కిలోలు, కంబదూరు మండలం కర్తనపర్తిలో 1.6 కిలోల చొప్పున తక్కువ దిగుబడి వచ్చింది.

రికార్డు దిగుబడి... 
జిల్లాలోని 63 మండలాల్లో ఒక్కో మండలంలో ఆరు గ్రామాలు ఎంపిక చేసుకొని, ప్రతి గ్రామంలో రెండేసి చొప్పున వేరుసెనగ దిగుబడిని పరిశీలిస్తున్నారు. అంటే మండలానికి 12 చోట్ల చొప్పున జిల్లా అంతటా కలిపి 756 చోట్ల ఈ పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 450 చోట్ల పరిశీలన పూర్తయింది. ఈ లెక్కలు పరిశీలిస్తే జిల్లాలో సగటున ఎకరాకు 10.5 మూటలు దిగుబడి వచ్చినట్లు తేల్చారు. ఒక్కో మూటలో 42 కిలోల వేరుసెనగను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా గ్రామాల్లో ఏదైనా వేరుసెనగ సాగు చేసిన పొలాన్ని ఎంపిక చేసుకొని.. అందులో ఐదు మీటర్ల పొడవు, మరో ఐదు మీటర్లు వెడల్పుని ఎంపిక చేసుకుంటారు. అందులో ఉన్న మొక్కలు పీకి, వాటికి ఉన్న వేరుసెనగ కాయలు తీసి తూకం వేస్తారు. అందులో 39 శాతం మేర తేమగా తీసేసి, మిగిలినది దిగుబడిగా పరిగణనలోకి తీసుకుంటారు

Link to comment
Share on other sites

కష్టాలతో కలబడి.. కన్నీటిలో దిగబడి! 
వేరుసెనగ కొనుగోళ్లు మొదలు.. 
ధర తగ్గిస్తున్న దళారులు, వ్యాపారులు 
ఇంకా తగ్గుతుందనే భయంతో విక్రయం 
కొనుగోలు కేంద్రాలపై వెలువడని నిర్ణయం 
atp-top1a.jpg

సాధారణంగా ఏదైనా ఒక వస్తువును తూకం వేయాలంటే ఒకవైపు తూనిక రాళ్లు, మరోవైపు వస్తువును ఉంచుతారు. కానీ.. వేరుసెనగ వ్యాపారులు మాత్రం కిలో.. రెండు కిలోలు అని పెద్ద ఇటుకలను ఉంచి ఒక్కో బస్తాలో 5 నుంచి 10 కిలోల వరకు అదనంగా దోచేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే రైతులను త్రాచులో ఎలాంటి తేడా లేవని మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు వేరుసెనగ రాశుల వద్ద మొదట 4, 5 పెద్దపెద్ద బస్తాల్లో కాయలు నింపి పెద్దగా ఏమీ లేవు.. తూకం కూడా అవసరం లేదని నేరుగా కాయలు తీసుకెళ్తున్నారు.

ఈనాడు - అనంతపురం, చెన్నేకొత్తపల్లి

‘‘ఖరీఫ్‌లో కరవు కసిరినా.. చివర్లో వర్షాలు కురిసి మంచి దిగుబడి వచ్చింది. ఆ సంతోషం వేరుసెనగ రైతుల్లో కొద్దిరోజులు కూడా కనిపించే అవకాశాలు లేకుండా పోతోంది. దరి చేరిన పంటను విక్రయించడానికి సిద్ధపడగా.. ధరలు తగ్గిపోయాయని దళారులు, వ్యాపారులు, మిల్లర్లు మాయ చేస్తున్నారు. దిగుబడి బాగుండటంతో ధరలు ఇంకా తగ్గిపోతాయని రైతులను భయపెడుతున్నారు. పర్యవేక్షించాల్సిన విజిలెన్స్‌ అధికారులు మచ్చుకైనా కన్పించడం లేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం వేరుసెనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరికదా.. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటన వెలువడి నాలుగు రోజులైనా అధికారులు ఆ సమాచారాన్ని రైతులకు చేరవేయలేదు. తమకు ఎలాంటి భరోసా లేదనే వేదనతో కర్షకులు దక్కిందే ప్రాప్తమని అయినకాడికి తెగనమ్ముకొని కన్నీల సుడిలో కూరుకుపోతున్నారు.’’

జిల్లాలో ఆగస్టు నుంచి కురిసిన వర్షాలు వేరుసెనగ పంటకు ఎంతో మేలు చేశాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగుబడి వచ్చింది. ఒక్కో ఎకరాకు బస్తాలకు బస్తాలు వేరుసెనగ దిగుబడి వస్తుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. ఇదే సమయంలో రైతుల సంతోషం క్షణాల్లో ఆవిరయ్యే పరిణామాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకీ వేరుసెనగ ధర తగ్గిపోతుండటం, మున్ముందు ఇంకా పతనం అవుతాయని దళారులు, వ్యాపారులు, మిల్లర్లు ఖరాకండిగా చెబుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. కొన్నేళ్ల వరుస కరవులు తర్వాత ఈసారి వేరుసెనగ వేసిన రైతుల్లో ఎక్కువ ప్రాంతాల వారికి అధిక దిగుబడి చేతికి వస్తోంది. అయితే... ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. సాధారణంగా 42 కిలోలను ఒక బస్తా చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. రెండు నెలల కిందటి వరకు ఈ బస్తా వేరుసెనగ కాయల ధర రూ.2,600-2,800 వరకు ఉండేది. క్రమంగా అది రూ.2,000కు చేరింది. ఇపుడు రూ.1500-1700 మధ్య చేరింది. ఇంకొన్ని చోట్ల రూ.1,400 చొప్పున కూడా కొనుగోలు చేస్తున్నారు. అంటే రెండు నెలల కిందటి ధరతో పోలిస్తే సగానికి సగం ధర తగ్గిపోయింది.

వాలిపోతున్న దళారులు.. 
జిల్లాలో పండే వేరుసెనగను ఎక్కువగా తమిళనాడుకు చెందిన వ్యాపారులతోపాటు, కడప, చిత్తూరు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వీరికి జిల్లాలో ఉండే దళారులతో మొదటి నుంచి పరిచయాలు ఉంటాయి. దీంతో వ్యాపారులు దళారులను రంగంలోకి దించుతున్నారు. దళారులు ఆయా గ్రామాలకు వచ్చి రైతుల నుంచి వేరుసెనగ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రాప్తాడు, కళ్యాణదుర్గం, తాడిపత్రి, శింగనమల, రాయదుర్గం తదితర నియోజకవర్గాల్లో ఎక్కువగా విక్రయాలు ఆరంభమయ్యాయి. దళారులు, వ్యాపారులు పల్లెలకు వచ్చి రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. మార్కెట్‌లో ధర తగ్గిపోయిందనీ, ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందని నమ్మబలుకుతున్నారు. దీంతో వారు చెప్పిన ధరలకే కాయలు విక్రయిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ తంతు జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో వేరుసెనగ ధరలో మోసంతోపాటు, రైతుల నుంచి ఎక్కువ కిలోలు తీసుకుంటూ మరో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. 42 కిలోలకు బదులు 45 కిలోలు, ఇంకొన్ని చోట్ల 48-50 కిలోలు సైతం తీసుకొని 42 కిలోలకే ధర చెల్లిస్తున్నారు.

పేరుకే మద్దతు ధర... 
ప్రభుత్వం మాత్రం వేరుసెనగకు క్వింటాకు రూ.4,450 మద్దతు ధరగా ప్రకటించింది. ఈ ధర బాగానే ఉన్నా ఈ రోజు వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా ప్రతి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వేరుసెనగ కొనుగోలు చేయాలి. ఇందుకు స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకుంటారు. గత ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఎక్కువ పంట కూడా చేతికి అందక పోవడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దిగుబడి ఎక్కువగా వచ్చింది. వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈమేరకు ఆయిల్‌ఫెడ్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా వెళ్లింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాత్రం ఆదేశాలు రాలేదు. ఈలోపు దళారుల, వ్యాపారుల కొనుగోళ్లు జోరందుకున్నాయి.

నాటి కుంభకోణమే కారణమా? 
వేరుసెనగ విత్తు కొనుగోలులో మూడేళ్ల కిందట జరిగిన కుంభకోణం ఆయిల్‌ఫెడ్‌లో సంచలనమైంది. అప్పట్లో ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, మిల్లర్లు ఒక్కటై దందా జరిపారు. మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తును గోదాముల్లో నిల్వచేయాల్సి ఉండగా.. అధికారులు, మిల్లర్లు మాట్లాడుకొని అక్రమాలకు పాల్పడ్డారు. రైతుల నుంచి తక్కువ ధరకు మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసిన విత్తును ఏపీ సీడ్స్‌ గోదాములకు తరలించి, ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను పంచుకున్నారు. రికార్డుల్లో మాత్రం రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేసినట్లు రాసుకున్నారు. ఇలా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో ఈ దందా భారీగా సాగింది. కొందరు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ఇందులో రూ.లక్షలు వెనకేసుకున్నారు. అప్పట్లో ఇది వెలుగులోకి రావడంతో కర్నూలు జిల్లాలో మాత్రమే చర్యలు తీసుకున్నారు. మిగిలిన జిల్లాలో అక్రమాలపై విచారణ సాగదీయడమే కాకుండా, చర్యలు తీసుకోకుండా జాప్యమయ్యేలా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి గతంలో జరిగిన ఈ దందాను దృష్టిలో పెట్టుకొనే, తాజాగా వేరుసెనగ కొనుగోలు విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోలేదని కొందరు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి 
రాప్తాడు: వేరుసెనగ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే రైతులకు ఉపయోగం. చాలా కాలం నుంచి సమస్యను విన్నవిస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా వేరుసెనగ రైతులకు నష్టం వస్తోంది. ఈ ఏడాది పూర్తిస్థాయిలో పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధరలేదు. మద్దతు ధర దక్కక.. కొనుగోలు కేంద్రాలు లేక అరకొర మొత్తానికి అమ్ముకోవాల్సి వస్తోంది.

- రామకృష్ణ, రైతు రాప్తాడు
Link to comment
Share on other sites

Guest Urban Legend
2 hours ago, Nekkanti said:

baga panta pandithe rendu undadu mamulega

Good rains this year 

So tarvatha vachey anni crops kuda same situation 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...