Jump to content

Eodb


Saichandra

Recommended Posts

 

తుది ర్యాంకులివ్వలేదు 
ఇంకా రెండు నెలలు పడుతుంది 
మూల్యాంకనం ముగియలేదు 
ఇప్పటి దాకా ఏపీకి సంబంధించి 48 సంస్కరణలే లెక్కింపు 
తెలంగాణవి 224 మదింపు 
‘సులభతర వ్యాపార నిర్వహణ’ ర్యాంకులపై పరిశ్రమల శాఖ వివరణ 
ఈనాడు - అమరావతి 
1ap-main3a.jpg

దేశంలో సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తుది ర్యాంకులకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి ర్యాంకు సాధించిందని, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచిందని ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పందించింది. ఆ శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ బుధవారం ఒక ప్రకటనలో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు పంపడానికి గడువు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-బ్రాప్‌) అనేది దేశంలో సులభతర వ్యాపార నిర్వహణపై రాష్ట్రాలను గుర్తించేందుకు భారత పారిశ్రామిక, ప్రోత్సాహక విధాన(డీఐపీపీ) విభాగం ప్రపంచబ్యాంకు సహకారంతో రూపొందించిన ఒక సూచిక. దీన్ని ఆ సంస్థ 2015లో రూపొందించింది. ప్రస్తుతం మూడో ఏడాది ఈ సూచి ప్రకారం ప్రమాణాలను అమలు చేస్తున్నాం. బ్రాప్‌ ప్రమాణాల మేరకు ఆయా రాష్ట్రాలు తాము అమలు చేస్తున్న సంస్కరణలను సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల కోసం పంపుతాయి. వాటిని మదింపు చేసిన తరువాత ఆ సంస్థ తుది ర్యాంకులు ప్రకటిస్తుంది. బ్రాప్‌ గతేడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 12 విభాగాల్లో 372 సంస్కరణలను బ్రాప్‌ సూచించింది. వాటిని ఎంతమేర అమలు చేస్తున్నాయనేది ఆధారాలతో సహా చూపిస్తూ రాష్ట్రాలు ఈ సంస్థలకు నివేదికలు పంపుతుంటాయి. వాటిని ఆ సంస్థ మదింపు చేస్తుంటుంది. ఈ ప్రతిపాదనలు పంపడానికి అక్టోబరు 31 తుది గడువుగా నిర్ణయించి తరువాత దాన్ని ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆ సంస్థ 48 సంస్కరణలు, తెలంగాణకు సంబంధించి 224 సంస్కరణలు, హరియాణకు సంబంధించి 198 సంస్కరణలను మదింపు చేసింది. మొత్తం మదింపు ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఆ తరువాతే ఆ సంస్థ తుది ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా... ఈ ప్రక్రియను అర్థం చేసుకోకుండా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 15వ ర్యాంకు వచ్చినట్లు పేర్కొనడం సమంజసం కాదు’’ అని ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇంకా ప్రతిపాదనలు పంపుతున్నాయని దీన్ని కూడా అంతా గుర్తించాలని కోరారు.

Link to comment
Share on other sites

ఈసారీ మంచి ర్యాంకే సాధిస్తాం 
సులభతర వాణిజ్యంలో 15వ ర్యాంకు వచ్చిందన్న వార్త చూసి విస్మయం చెందా 
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు అమరావతి: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తుది ర్యాంకులకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియక ముందే... రాష్ట్రానికి 15వ ర్యాంకు వచ్చినట్టుగా వచ్చిన వార్తను చూసి విస్మయం చెందానని ముఖ్యమంత్రి చంద్రబాబు వాఖ్యానించారు. ‘‘పత్రికలో వార్త చూసి నేను షాక్‌ తిన్నాను. ఎందుకు ఇలా వచ్చిందో ఒక్క నిమిషం నాకేమీ అర్ధం కాలేదు. వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. నా పరిస్థితే అలా ఉంటే.. సామాన్య ప్రజలు దాన్ని చదివి నిజమే అనుకుంటారు కదా..! మీడియా అత్యుత్సాహం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి కూడా మన రాష్ట్రం మంచి ర్యాంకులో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తుది ర్యాంకులు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు వివరించారు. తుది ర్యాంకులు ప్రకటించే వరకు... అప్పటికి అప్‌లోడ్‌ చేసిన వివరాల్ని బట్టి రాష్ట్రాల స్థానాలు మారుతూ ఉంటాయని, తుది ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ..‘ఏదేమైనా ప్రతి రోజూ పోటీ ఉంటుంది. మనమే తెలివైన వాళ్లమనుకుంటే సరిపోదు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉంటున్నాయి. పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరింత తెలివిగా, సమర్థంగా వ్యవహరిస్తే తప్ప మనుగడ సాగించలేం’’ అని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

9 minutes ago, Saichandra said:

Abn tappa andaru ap 15 rank ani rasesaru clear ga website lo pettaru dynamic rankings ani,sakshi ayite anukovachu eenadu ki em ayyindo thupuk

eenadu eppudo against to tdp. nenu 6 months back observe sesa. TG edition lo kaani Hyd edition lo kaani okka news undadu tdp di. kaavalani ala sesthunnaru. BJP enduku silent ga undo artham kavatam ledu. 

Link to comment
Share on other sites

11 hours ago, LuvNTR said:

eenadu eppudo against to tdp. nenu 6 months back observe sesa. TG edition lo kaani Hyd edition lo kaani okka news undadu tdp di. kaavalani ala sesthunnaru. BJP enduku silent ga undo artham kavatam ledu. 

Aasthulu aadayaalu anni hyd lo pettukuni neethiga ela vundagalaru adyakshaa? :rofl:

Link to comment
Share on other sites

13 hours ago, Saichandra said:

2AD81A51-86EF-428C-B41B-80497A8D36F7.jpeg

nee Bokka ra .. nee bokka. Kaneesam AP 15th place enti ani kooda aalochinchukora? Nidrapothoo panichestaarentraa. Commonman ey ulikki paddadu endi ra ee rank lu nijamena ani. aa maatram gnanam lekapote ela?

 

Assalu entha utsaaham ante.. Ee news separate ga kuda raayaledu. Wold countries ni official ga announce chesindi... India 100th pondindi. Modi gaadu ekkadiko teesukupoyaadu ani raastoo ... sandatlo sademiyaa lo... ee TG raaganni kuda kalipesaadu. worst fellow. 

Asalu aa news ee news tho kalapatam edaite undo. Kiran, Sailaja, Dramoji ki mugguriki dandesi dannam pettali.

veella mohalu manda.. ippudochi Savarana anta. Sahrudayam anta. 

 

Maa Babu uncle lekapote... ee rendu rojullo emayipoye vaallo maa @Compaq lantollu

Link to comment
Share on other sites

13 hours ago, Saichandra said:

Abn tappa andaru ap 15 rank ani rasesaru clear ga website lo pettaru dynamic rankings ani,sakshi ayite anukovachu eenadu ki em ayyindo thupuk

Idi chaalu evado broker o, evadu ammudu potaado cheppataniki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...