Jump to content

NTR ఇంతకంటే ఇంకేం కావాలి?


srinelluri

Recommended Posts


మానవపాడు(వనపర్తి జిల్లా): అభిమానం అనేది ఎంత దూరం అయినా తీసుకెళ్తుందనడానికి పల్లెపాడు యువకులే ఆదర్శం. తమ అభిమాన నటుడిపై ప్రేమతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి గ్రామ పెద్దల మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో మరిచిపోయిన పండుగలను భుజాన వేసుకుని పల్లెకు వెలుగు తెచ్చారు.
 
గ్రామంలో ఇలాంటి పనులు ఎన్నో చేసిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియోషన్‌ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన 15మంది యువకులు కలిసి జూనియార్‌ ఎన్టీఆర్‌ పేరుపై అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలో ఎన్టీఆర్‌ పేరుపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. కానీ సంఘం ఎర్పాటు అనంతరం అభిమానులు మరింత ఉత్సాహంతో గ్రామంలో పలు సమాజ సేవలు చేశారు.
 
 ప్రయాణికుల కోసం
గ్రామానికి గద్వాల నుండి ఆర్టీసీ బస్సు వస్తోంది. కానీ బస్‌ షెల్టర్‌ లేదు. గ్రామంలోని విద్యార్థులు, వర్తక వ్యాపారులు, రైతులు, సాధారణ ప్రయాణికులు గద్వాల, ఎర్రవల్లి ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్సు కోసం వచ్చిన ప్రయాణికులు ఎండకు, వానకు తడుస్తూనే వేచి ఉండేవారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా బస్‌ షెల్టర్‌ నిర్మించేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు ముందుకొచ్చారు. యువకులంతా సమావేశమై అందరూ ఒక్కొక్కరు కొంత కొంత చందాలు వేసుకొని బస్టాండ్‌ నిర్మాణానికి పునుకున్నారు. అభిమానుల్లో ఇద్దరుమూగ్గురు యువకులు తాపీపని చేసేవారు ఉండటంతో రూ.40వేలతో నిర్మాణాన్ని సొంతంగా పనులు పూర్తి చేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బస్టాండ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలోని వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోదండాపూరం ఎస్సై వస్రాంనాయక్‌, గ్రామ సర్పంచ్‌ సత్యరెడ్డి హాజరై యువకులను అభినందించారు.
 
 గ్రామ పండుగలకు మహర్దశ
1972లో శ్రీశైలం ముంపునకు గురైన పల్లెపాడు గ్రామంలో నూతన ప్రాంతానికి తరలివచ్చారు. అంతకుముందు గ్రామంలో ఎన్నో పండుగలు జరిపేవారు. కొత్త ప్రాంతానికి వచ్చాక పండుగలు మసకబారాయి. 2016లో ఎన్టీఆర్‌ అభిమానులు గ్రామ పెద్దల సహకారం తీసుకొని గ్రామ పండుగలు జరిపేందుకు ముందుకొచ్చారు. ఏడేళ్లుగా గ్రామంలో మొహర్రం పండుగ జరిపేవారు కాదు. కానీ ఎన్టీఆర్‌ అభిమానులు చందాలు వేసుకొని సుమారు రూ.30వేలతో పాడుబడ్డ పీర్ల మజీద్‌కు మరమ్మతులు చేయించి గత రెండేళ్లనుంచి ఘనంగా మొహర్రం పండుగలు జరుపుతున్నారు. అదే విధంగా గ్రామ పండుగా పిలిచే గోకారమయ్య దర్గా చుట్టూ రూ.10వేలతో కంప చెట్లు తొలగించి సున్నం వెేయించి ఉర్సు నిర్వహించారు.
 
అట్టహాసంగా చెన్నకేశవ స్వామి జాతర
చెన్నకేశవ స్వామి జాతర అంటేనే ఒకప్పు డు పల్లెపాడులో మారుమోగేది. కానీ గత 33ఎళ్లుగా పండుగ జరిపేవారే కరువయ్యారు. యువకులు నూతనోత్తేజంతో చెన్నకేశవ స్వా మి జాతరను జరిపేందుకు ముందుకొచ్చారు. పెద్ద పండుగ కావడంతో వివిధ గ్రామాల్లో తిరిగి ఔత్సాహికుల నుండి చందాలు సేకరిం చి జాతరను ఆంగరంగవైభవంగా జరిపారు. దీంతో గ్రామ పెద్దల దృష్టిని సైతం ఆకర్షించారు. ఎన్నో ఎళ్లుగా నోచుకోని పండుగకు గ్రామ ఆడపడుచులు పిల్లాపాపలతో హాజరై తేరు, ప్రభ కార్యక్రమాలను తిలకించారు. జాతర సందర్భంగా గ్రామంలో పలు ఆటలపోటీలను నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
 
 రోగులకు బాసటగా
నిరుపేదలకు ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి రోగుల పట్ల తమ అభిమాన్ని చాటుకున్నారు. తమకు అభిమాన సంఘ అధ్యక్షుడు శ్రీరాములు గ్రామంలో ఆర్‌ఎంపీగా వృత్తి చెస్తుండటంతో తమకు తెలిసిన డాక్టర్లను ఆహ్వానించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 120 మందికి ఉచితంగా చక్కెర వ్యాధి పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు ఇచ్చారు. స్వల్ప వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు ఇచ్చి ఆరోగ్య సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా జోగుళాంబ జిల్లా ఎన్టీఆర్‌ అభిమాన సంఘ ఆధ్యక్షుడు ముదిరాజ్‌ హాజరై తమవంతు సహకారం అందించారు.
 
భవిష్యత్‌లో తెలుగు తల్లి విగ్రహ ఏర్పాటు
రాబోయో కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎర్పాటు చేయనున్నట్లు ఆధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఎంతో అకర్షితులమయ్యామని అయన అన్నారు. తెలుగు ప్రజల కోసం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తాం. అలాంటి సేవా భావం కలిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే పిచ్చి ప్రేమాతోనే ఈ పనులు చేస్తున్నాం. రెండు వారాల క్రితం జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశాం. మేం చేసే పనులను ఆయనకు వివరించాం.
 
‘మొదట మిమ్మల్ని కన్న అమ్మ నాన్నలను ప్రేమించండి ఆ తర్వాత భార్యా బిడ్డాలను, ఆ తర్వాతే నేను అన్న’ ఆయన మాటలను విన్న తర్వాత ఎన్టీఆర్‌ అభిమానులుగా ఉన్నందుకు గర్వపడ్డాం.
- శ్రీరాములు, అధ్యక్షుడు
ప్రతి పనిలో ఆయన ఉండాలి.. అందులో మేముండాలి..
మేము చేసే ప్రతి పనిలో ఆయన పేరు కనపడాలి.. ఆ పనిలో మేముండాలి.. గ్రామ ప్రజలు ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. సంఘం ఏర్పాటు చేసి కేవలం రెండేళ్లయింది. కొంత చేశాం. ఇంకా చాల పనులు చేయాల్సి ఉంది. అభిమానులు అందరికీ ఉంటారు. అభిమానుల కోసం ఎన్టీఆర్‌ ఉన్నాడనేది మేము విశ్వసిస్తాం.
 
- మద్దిలేటి, ఉపాధ్యక్షుడు
Link to comment
Share on other sites

13 minutes ago, srinelluri said:

ABN enti ee madya NTR meda koncham +ve vesthunnadu, full ga munchataniki planning aa enti....

Ante kada 

 

13 minutes ago, srinelluri said:

ABN enti ee madya NTR meda koncham +ve vesthunnadu, full ga munchataniki planning aa enti....

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...