Jump to content

Pattiseema to Godavari ni todestunaru


AnnaGaru

Recommended Posts

asalu storage ledu Godavari ki.....Dawaleswaram capacity is hardly 3 TMC..

 

eedu Godavari delta December-March Rabi season water demand ki right now at present SEA loki poye water ki link ettadu chudandi....idi eedi lanti chetta edavalaki tappite evadiki chetha kaadu...

 

malli Thota trimurtulu cheppadu ani bukayimpu...vallu cheppindi once Rabi starts after December better to stop Pattiseema...

That everybody knows.....Pattiseema is stopped the movement water level drops...

 

 

ittanti DIVIDE politics pulivendula sandula nunchi state daaka packincharu kadara..

 

 

MlQO2tu.jpg

Link to comment
Share on other sites

already SEEMA-DELTA ki visha parayatnalu as usual....

Chittor-Anantapur ki Handri meeda IGNITE articles rastunadu

GOdavari-Krishna vallaki Pattiseema meeda FIRE pedadam ani chustunadu....

Kamma-kapu kottukovali.....

Vizag edition lo Steel plant office Vijayawada ettuku poyaru ane meaning lo rasadu...asalu adi Vizag Steel ki AP lo works ki Sales office pettinchadu CBN to get them more sales...which infact is good for Vizag steel....Asalu center govt steel plant office CBN etla ettuku potadu!!!!!!

 

okatemendi le "DIVIDE people is the only strategy"

 

This guy want AP to go dogs and people to fight 

Link to comment
Share on other sites

vellaki water sea lo ki poyina parledu but krishna farmers matram rakudadu 

 

 

already dawaleswaram anni canals ki nonstop ga istunaru whenever there is no rains ink 3+ tmc going 2 sea 

 

 

vedi edupu 101+ tmc already given 2 krishna delta with rain water+ godavari water adi idi edupu

Link to comment
Share on other sites

even now 3 TMC a day is going waste in to sea. What kind of reporting is this? 

more over Sileru/Balimela full ga ne vundi kada Dec-March Godavari delta avasarala kosam.

 

Adi telika kaadu eedi family a pedda decoit daggara nunchi same formula...DIVIDE and benefit...

a divide formula ni chala successful ga vadaru villu....janalaki undali...

 

DECEMBER-MARCH Rabi ki shortage ki storage leka ippudu SEA loki potunna Pattiseema meeda IGNITE the FIRE game adutunandu

Link to comment
Share on other sites

In Eendau - WG dist edition - 24 Oct 2017

 

రబీకి గడ్డుకాలమే! 
గోదావరి నదిలో అందుబాటులో ఉండేది 18 టీఎంసీలే 
సీలేరు నుంచి అదనపు జలాలు వస్తేనే వెసులుబాటు 

 

 

ఖరీఫ్‌ పంట కాలం చివరి దశకు చేరింది. అన్నదాతలు రబీ వ్యవసాయ పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో గోదావరికి వచ్చి చేరే నీరు (ఇన్‌ఫ్లో) క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్‌ఫ్లోలు పడిపోతుండటంతో వచ్చే రబీకి సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.

నిడదవోలు, న్యూస్‌టుడే

జలవనరుల శాఖ అధికారులు వేసిన అంచనా ప్రకారం రబీ సీజన్‌లో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే పరిస్థితులు లేవు. జలవనరుల శాఖ (గోదావరి హెడ్‌వర్క్స్‌) అధికారుల అంచనా ప్రకారం రానున్న రబీలో 70 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించే పరిస్థితి ఉంది. అదీ సీలేరు జలాల సాయంతోనే. దీనిపై చర్చించడానికి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరి నదిలో లభ్యమవుతున్న సాగునీరు, సీలేరు నుంచి వస్తున్న నీటితో ఎంత మేర ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.. మిగిలిన ఆయకట్టుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఈనెల చివరిలో పశ్చిమ డెల్టా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సీలేరు నుంచి అదనంగా సాగునీరు తీసుకువస్తే తప్ప పూర్తి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని సీలేరు నుంచి ఇంకా అదనపు జలాలు రప్పించగలిగితేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 10.50 లక్షల ఎకరాల ఆయకట్టులో 7.35 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. సాధారణంగా గోదావరికి ఇన్‌ఫ్లోలు డిసెంబరు వరకు ఉంటే రబీకి సాగునీటి ఇబ్బందులు ఉండవనేది అధికారిక అంచనా. అయితే అక్టోబరు నెల నుంచి గోదావరికి వచ్చి చేరే ఇన్‌ఫ్లోలు క్రమంగా రోజురోజుకు పడిపోతున్నాయి. గత రెండేళ్లుగా అక్టోబరులోనే అదనపు జలాలు మందగించడంతో రబీలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది మరీ దారుణం 
ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడంతో పాటు ప్రధానంగా గోదావరి (క్యాచ్‌మెంట్‌) పరివాహక ప్రాంతంలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో గోదావరికి వచ్చే చేరే అదనపుజలాలు క్రమంగా పడిపోతున్నాయి. పైగా గోదావరి నుంచి పదేళ్లలో సముద్రంలోకి విడుదల చేసిన అదనపు జలాలతో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉన్నాయి. 2009లో 743 టీఎంసీల అదనపు జలాలు మాత్రమే విడుదల కాగా, ఆ సమయంలో కూడా కొంత ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించారు. ఈ ఏడాదీ గోదావరిలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇంతవరకు 960 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే సముద్రంలోకి విడుదల చేశారు. పదేళ్ల కాలంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటం ఇది రెండోసారి.

7.35 లక్షల ఎకరాలకే నీరు 
గోదావరి కాలువలపై ఆధారపడి రబీలో 10.50 లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. తాగునీరు, పరిశ్రమలు, సాగునీటి అవసరాల నిమిత్తం మొత్తం 105 టీఎంసీల వరకు అవసరం అవుతుందని అంచనా. ఏటా జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మొత్తంగా గోదావరి నదికి ఉండే ఇన్‌ఫ్లోలపై ఆధారపడి ఖరీఫ్‌ అవసరాలు పోను, రబీకి ఎంత నీరు లభ్యమవుతుందనేది అధికారులు అంచనా వేస్తారు. ప్రస్తుతం రబీకి గోదావరిలో 18 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. సీలేరు నుంచి 49.50 టీఎంసీల వరకు అందించేందుకు సీలేరు జల విద్యుత్తు శాఖాధికారులు అంగీకరించారు. ఇలా మొత్తం 67.50 టీఎంసీల వరకు నీరు అందుబాటులో ఉంటుంది. ఇందులో 8 టీఎంసీల వరకు తాగునీటి అవసరాలకు పోనూ మిగిలిన 59 టీఎంసీలు సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ఆధారంగా ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 10.50 లక్షల ఎకరాలకు 7.35 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. పశ్చిమడెల్టా పరిధిలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, మరో 70 వేల ఎకరాల్లో చేపలు చెరువులు, ఇతర పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం గోదావరి, సీలేరుల ద్వారా వచ్చే నీటితో పశ్చిమడెల్టా పరిధిలో మూడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితులున్నట్టు జలవనరుల శాఖాధికారుల అంచనా. సీలేరు నుంచి ఇంతవరకు అధికంగా 2015లో 52 టీఎంసీల నీటిని అందించారు. అదే ఇంతవరకు గోదావరికి వచ్చి చేరిన అత్యధిక నీరు. గతేడాది 46 టీఎంసీల వరకు సీలేరు నుంచి వచ్చి చేరింది. ఫలితంగా పంటను అతి కష్టమ్మీద గట్టెక్కించగలిగారు.

పడిపోతున్న ఇన్‌ఫ్లోలు 
గోదావరికి క్రమంగా అదనపు జలాల రాక తగ్గిపోతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నా గత ఏడాది కన్నా బాగా పడిపోయింది.

*ఈనెల 17న 88,127 క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేయగా, గతేడాది ఇదే రోజున 1.56 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.

* ఈనెల 18న 76,230 క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేయగా, గతేడాది ఇదే రోజున 1.60 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.

* ఈనెల 20న 78,603 క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేయగా, గతేడాది ఇదే రోజున 1.46 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.

* ఈనెల 21న 51,059 క్యూసెక్కుల అదనపు జలాలను విడుదల చేశారు. అంటే ఒక రోజు వ్యవధిలోనే 27,544 క్యూసెక్కుల జలాలు తగ్గిపోయాయి. గతేడాది ఇదే రోజున 70 వేల క్యూసెక్కుల వరకు అదనపు జలాలను విడుదల చేశారు.

నీటిపారుదల సలహామండలి సమావేశం తీర్మానం మేరకు... 
ప్రస్తుతం గోదావరిలో 18 టీఎంసీల వరకు నీరు అందుబాటులో ఉంది. సీలేరు నుంచి 49.50 టీఎంసీల వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 67.50 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, వాటిలో ఎనిమిది టీఎంసీల వరకు తాగునీటి అవసరాలకు ఇవ్వగా, మిగిలిన 59 టీఎంసీల ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో 70 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరు సరిపోతుంది. సలహా మండలి సమావేశాలు తీసుకునే నిర్ణయం మేరకు ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చనేది నిర్ణయిస్తాం.

Link to comment
Share on other sites

Sakshi/YSRCP/Jagan are crying because Krishna Delta Farmers (Krishna, West Godavari, Guntur, Prakasam) are benefited from Pattiseema & Even Rayalaseema & Nellore farmers are benifited by saving/storing krishna delta water in Srisailam.

 

Migatha state mothham water vunde sariki edupu modalettadu. 2-3TMC kanna ekkuva Godavari Districts lo storage ledu ani chinna pillodini adigina chebuthaadu. 

 

Water samudram loki poyina paravaledu kaani AP farmers godavari water use chesukokoodadu.

Link to comment
Share on other sites

మిగులు జలాలు ఆగగానే ఎత్తిపోతలకు ఆపివేస్తాం 

పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ రామరాజు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: గోదావరికి ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న మిగులు జలాలు రావడం ఆగగానే ఎత్తిపోతల పథకానికి నీరు ఆపివేస్తామని పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి నిత్యం 40.5 క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. ఇలా వృథాగా పోయే నీటిని పట్టిసీమకు తరలిస్తున్నట్లు తెలిపారు. గోదావరిలో నీరు లేకుండా పట్టిసీమకు తరలిస్తున్నట్లు కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అదనపు మిగులు జలాలనే పట్టిసీమకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు తెదేపా ప్రభుత్వ హయాంలో నూటికి నూరుశాతం న్యాయం జరుగుతుందన్నారు. ఈనెల 31న ఏలూరులో జరిగే ఐఏబీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...