Jump to content

Bharatmala


sonykongara

Recommended Posts

తెలుగు రాష్ట్రాలకు భారత్‌మాల

లాజిస్టిక్‌ పార్కులు, ఆర్థిక కారిడార్ల ఏర్పాటు

అన్ని పోర్టులకూ రహదారుల అనుసంధానం

రద్దీ తగ్గించడానికి రింగ్‌రోడ్లు, బైపాస్‌లు

ఈనాడు - దిల్లీ, అమరావతి

25ap-main3a.jpg

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన భారత్‌ మాల ప్రాజెక్టులతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కీలక రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వాటిని విస్తరిస్తున్నారు. పటిష్ఠపరుస్తున్నారు. వివిధ రూపాల్లో కొత్త వాటిని చేపట్టనున్నారు. మొత్తంగా కొన్ని వందల కిలోమీటర్ల పొడవైన రహదారులు అభివృద్ధి కానున్నాయి. మరోవైపు ఇప్పటికే వివిధ రూపాల్లో మంజూరైనవి, పనులు చేపట్టినవి, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్న వాటినీ భారత్‌ మాలలో భాగంగా చూపారు. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ వే ల పేరుతో 1,837 కిలోమీటర్ల ఏడు రహదారుల్ని అభివృద్ధి చేస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా భావించే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే కి స్థానం కల్పించలేదు. రాష్ట్ర విభజనలో పేర్కొన్న హైదరాబాద్‌- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రస్తావన లేదు. మోదీ సర్కారు వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 65,400 కిలోమీటర్ల రహదారులను సుమారు రూ.5.35 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎకనమిక్‌ కారిడార్లు, లాజిస్టిక్‌ పార్కులు, ఇంటర్‌కారిడార్‌ ఫీడర్‌ రోడ్లు, నేషనల్‌ కారిడార్ల సామర్థ్యం పెంపు, తీరప్రాంత రోడ్ల అభివృద్ధి, పోర్టులకు అనుసంధానంగా కొత్త రోడ్ల నిర్మాణాన్ని తలపెట్టారు. దేశంలో 35 నగరాల్లో నిర్మించతలపెట్టిన లాజిస్టిక్‌ పార్కుల్లో మూడింటిని తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదించారు. అందులో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. విజయవాడ, అమరావతిల చుట్టూ బాహ్య వలయ రహదారులు నిర్మించనున్నారు. బుధవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటనలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులున్నాయి.

పోర్టులకు అనుసంధానం

* విజయవాడ నుంచి మచిలీపట్నం పోర్టు వరకూ ఎన్‌హెచ్‌-65 ఆధునీకరణ- 65 కిమీ. (ఇది గతంలోనే మంజూరైంది. వేగంగా పనులు జరుగుతున్నాయి)

* కాకినాడ పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-16 రాజానగరం వరకూ నాలుగు వరుసల రహదారి అభివృద్ధి -55 కి.మీ.

* కాకినాడ యాంకరేజి పోర్టు ఉప్పాడ బీచ్‌రోడ్డు ఎన్‌హెచ్‌-16 వరకూ నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి -43 కి.మీ.

* నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టువరకూ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అభివృద్ధి - 37 కి.మీ.

* తూర్పుగోదావరి జిల్లాలో అచ్చంపేట జంక్షన్‌ నుంచి ఎన్‌హెచ్‌-16 కత్తిపూడి వరకూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం - 30 కి.మీ.

* గంగవరం పోర్టునుంచి విశాఖపట్నంజిల్లా అచ్యుతాపురంలోఏర్పాటుచేస్తున్న సెజ్‌వరకూ నాలుగు వరుసల బీచ్‌ రోడ్డు అభివృద్ధి - 30 కి.మీ.

* చిలకారు క్రాస్‌ (ఎన్‌హెచ్‌-16) నుంచి పవర్‌ప్లాంట్స్‌ వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డు అభివృద్ధి - 26 కి.మీ.

* కృష్ణపట్నం పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-5 వరకూ ఇప్పుడున్న రహదారి అభివృద్ధి - 24 కి.మీ.

* నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు వెళ్లే ఎన్‌హెచ్‌-5 నాలుగు వరుసలుగా అభివృద్ధి - 24 కి.మీ.

* మచిలీపట్నం దక్షిణ పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-9 వరకూ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు అభివృద్ధి - 20 కి.మీ.

* విశాఖపట్నంలో షీలానగర్‌ జంక్షన్‌ నుంచి అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం రోడ్డు వరకూ ఉన్న జాతీయ రహదారి-16తో వైజాగ్‌పోర్టుకు అనుసంధానం - 14 కి.మీ.

* మచిలీపట్నం ఉత్తర పోర్టు నుంచి 46వ రాష్ట్ర రహదారి వరకూ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అభివృద్ధి -10 కి.మీ.

* మంచిలీపట్నాన్ని కలిపేలా మంగినపూడి బీచ్‌ రోడ్డు నాలుగు వరుసలుగా అభివృద్ధి - 10 కి.మీ.

* గంగవరం పోర్టుకు మరింత మెరుగైన అనుసంధానం కల్పించడానికి గ్రీన్‌ఫీల్డ్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణం -8 కి.మీ.

* మచిలీపట్నం పోర్టును 65వ నెంబరు జాతీయ రహదారితో కలిపేలా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం - 7 కి.మీ.

* ఎన్‌ఎఫ్‌సీఎల్‌, సీఎఫ్‌ఎల్‌కు దక్షిణంవైపు కాకినాడ పోర్టుకు సమాంతరంగా కొత్త బైపాస్‌ నిర్మాణం - 7 కి.మీ.

* గాజువాక నుంచి గంగవరం పోర్టు వరకూ ఉన్న ఎన్‌హెచ్‌-16 ఆరు వరుసలుగా విస్తరణ - 5 కి.మీ.

* కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని కందలేరు క్రీక్‌ పారిశ్రామిక క్లస్టర్‌ ఉత్తర, దక్షిణాలను అనుసంధానం చేస్తూ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం -5 కి.మీ.

* వైజాగ్‌ పోర్టు వద్ద ఔటర్‌ హార్బర్‌ నుంచి పోర్టు కనెక్టివిటీ జంక్షన్‌ వరకూ రహదారి అనుసంధానం - 5 కి.మీ.

* వైజాగ్‌ పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-16 వరకూ (రెండోదశ) అనుసంధానం - 4 కి.మీ.

* కాకినాడ యాంకరేజి పోర్టువద్ద రహదారి అభివృద్ధి -3 కి.మీ.

* కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు దగ్గరున్న కుంభాభిషేక ఆలయం నుంచి ఫిషింగ్‌ హార్బర్‌ వరకూ ఆర్‌వోబీ, ఏడీబీ రోడ్డు నిర్మాణం - 3 కి.మీ.

* కాకినాడ యాంకరేజి పోర్టువద్ద ఉన్న దుమ్ములపేట క్రీక్‌ వద్ద కొత్త రోడ్డు అభివృద్ధి - 3 కి.మీ.

* కాకినాడలోని పాత పోర్టు ప్రాంతం, దుమ్మాలపేట వద్ద ఆర్‌వోబీ నిర్మాణం - 2 కి.మీ.

* వైజాగ్‌ పోర్టు సమీపంలో బైపాస్‌రోడ్డు నిర్మాణం- 2 కి.మీ.

తీరప్రాంత రహదారుల నిర్మాణం

దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 2,011 కిలోమీటర్ల తీర ప్రాంత రహదారి నిర్మించాలని నిర్ణయించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో దిగమర్రు-ఒంగోలు మధ్య 270 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు. ఇది సైతం ఇప్పటికే మంజూరై చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

ఆర్థిక కారిడార్లు

దేశవ్యాప్తంగా 26,160 కిలోమీటర్ల పొడవునా 44 ఆర్థిక కారిడార్లు తలపెట్టారు.

1. పుణె-విజయవాడ -906 కి.మీ. (పుణె- షోలాపూర్‌- హైదరాబాద్‌- విజయవాడ)

2. హైదరాబాద్‌- పనాజీ- 593 కి.మీ. (హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- దేవ్‌సుగూర్‌- లింగసుగూర్‌- బాగల్‌కోట్‌- బెలగావి- పంజిమ్‌)

3. రాయ్‌పూర్‌ -విశాఖపట్నం- 506 కి.మీ. (రాయ్‌పూర్‌- కుర్ద్‌- ఉమెర్‌కోట- సునబేడ-సాలూర్‌- విశాఖపట్నం)

4. చెన్నై- కర్నూలు- 482 కి.మీ. (చెన్నై- పుత్తూరు- కడప- నంద్యాల- కర్నూలు)

5. షోలాపూర్‌- బళ్లారి- గుత్తి- 434 కి.మీ. (సోలాపూర్‌- బీజాపూర్‌- కుష్టిగి- హాస్పేట- బళ్లారి- గుత్తి)

6. హైదరాబాద్‌- ఔరంగాబాద్‌- 427 కి.మీ. (ఔరంగాబాద్‌- జల్నా- నాందేడ్‌- దేగ్‌లూర్‌- సంగారెడ్డి- హైదరాబాద్‌)

7. షోలాపూర్‌- మహబూబ్‌నగర్‌- 290 కి.మీ. (షోలాపూర్‌- అక్కల్‌కోట్‌- కలబుర్గి- మహబూబ్‌నగర్‌)

8. బెంగళూరు- నెల్లూరు- 286 కి.మీ. (బెంగళూరు- కోలార్‌- చిత్తూరు- తిరుపతి- నాయుడుపేట- నెల్లూరు)

ఇంటర్‌ కారిడార్‌ ఫీడర్‌ రోడ్లు

దేశవ్యాప్తంగా 7,961 కిలోమీటర్ల పొడవైన 65 కారిడార్లు నిర్మించతలపెట్టారు. ఇందులో 1.హైదరాబాద్‌- ఒంగోలు -231 కి.మీ. 2. కడప-నెల్లూరు- 178 కి.మీ. 3.నాందేడ్‌- నిర్మల్‌ (ఎన్‌హెచ్‌-44పై)- 120 కి.మీ. 4. చిత్తూరు- రాణిపేట్‌- 47 కి.మీ. 5.ఆర్మూర్‌- రామగుండం- 149 కి.మీ. 6. కరీంనగర్‌- హైదరాబాద్‌ 131 కి.మీ. 7. జగిత్యాల- వరంగల్‌- 120 కి.మీ. 8. హైదరాబాద్‌- వరంగల్‌ 116 కి.మీ. 9. రాజమండ్రి లింక్‌రోడ్డు- 95 కి.మీ. 10. సూర్యాపేట- ఖమ్మం- 56 కి.మీ. 11. విశాఖపట్నం లింక్‌రోడ్డు- 47 కి.మీ. నార్కట్‌పల్లి నుంచి అద్దంకి వరకూ రాష్ట్ర ప్రధాన రహదారిగా నాలుగు వరుసలుగా నాలుగేళ్ల కిందటే విస్తరించారు. దీనినే భారతమాల కింద తీసుకున్నారా? కొత్తగా మరో రహదారిని అభివృద్ధి చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు.

రింగ్‌రోడ్లు, బైపాస్‌లు

దేశవ్యాప్తంగా 28 నగరాల్లో రింగు రోడ్లు నిర్మించాలని తలపెట్టారు. అందులో 1.విజయవాడ, 2.అమరావతిలను చేర్చారు. చెన్నై- కర్నూలు మార్గంలో కర్నూలు వద్ద, చెన్నై- కోల్‌కతా మార్గంలో ఒంగోలు, చిలకలూరిపేటలవద్ద బైపాస్‌లు నిర్మిస్తారు. విశాఖపట్నంవద్ద రహదారిని విస్తరించటంతోపాటు ఫ్లైఓవర్‌ నిర్మిస్తారు. బెంగుళూరు-నెల్లూరు మార్గంలో రేణిగుంట వద్ద, హైదరాబాద్‌- ఔరంగాబాద్‌ మార్గంలో సంగారెడ్డి వద్ద బైపాస్‌ నిర్మిస్తారు. పుణె- విజయవాడ మార్గంలో విజయవాడవద్ద రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తారు. ఒంగోలులో ఇప్పటికే బైపాస్‌ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కానుండటం గమనార్హం.

Link to comment
Share on other sites

Vallu cheppina danikanna eeyana raathale too much vunnayi. Akkadedho ichesi chesesinattu. Ivi pattukochi mana AP bjp pushpams emo 5Laks crores icham ani buildup.

Exactly...ee baffas lo no change..ee broker dramoji eenadu paper another shit paper in telugu states

Link to comment
Share on other sites

emi drama lu chestunaru baboi...

 

AP lo already work ayipoina PORT roads ni FUTRUE lekkalo chupincharu ani EENADU vaade rasadu....Just by adding them to no# of KM FOOL chestunaru

 

Even by adding AP existing roads here is the maths

 

1000 KM seacoast AP got around 400 KM even with already completed roads
700 KM MH got 800 KM!!!!!???

 

Gujarat&MH ports for last 3 years already had HUGE infra uplift on roads&ports part of sagarmala. Now they are again getting major lift and connection from South?

 

Look at below corridors meant for SOUTH INDIA and decide your self is this called SOUTH India corridor or South connecting Maharastra as main motive?

 

Count how many are forced to have Maharastra connection and how many connecting South India and you will get answer

 

Donakonda&VANPIC has 70,000 acres and AP govt asked to connect them. Where is that? AP was told DOnakonda gets connected with Anantapur-Amaravati expressway but now that project is GONE

 

1. పుణె-విజయవాడ -906 కి.మీ. (పుణె- షోలాపూర్‌- హైదరాబాద్‌- విజయవాడ)
2. హైదరాబాద్‌- పనాజీ- 593 కి.మీ. (హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- దేవ్‌సుగూర్‌- లింగసుగూర్‌- బాగల్‌కోట్‌- బెలగావి- పంజిమ్‌)
3. రాయ్‌పూర్‌ -విశాఖపట్నం- 506 కి.మీ. (రాయ్‌పూర్‌- కుర్ద్‌- ఉమెర్‌కోట- సునబేడ-సాలూర్‌- విశాఖపట్నం)
4. చెన్నై- కర్నూలు- 482 కి.మీ. (చెన్నై- పుత్తూరు- కడప- నంద్యాల- కర్నూలు)
5. షోలాపూర్‌- బళ్లారి- గుత్తి- 434 కి.మీ. (సోలాపూర్‌- బీజాపూర్‌- కుష్టిగి- హాస్పేట- బళ్లారి- గుత్తి)
6. హైదరాబాద్‌- ఔరంగాబాద్‌- 427 కి.మీ. (ఔరంగాబాద్‌- జల్నా- నాందేడ్‌- దేగ్‌లూర్‌- సంగారెడ్డి- హైదరాబాద్‌)
7. షోలాపూర్‌- మహబూబ్‌నగర్‌- 290 కి.మీ. (షోలాపూర్‌- అక్కల్‌కోట్‌- కలబుర్గి- మహబూబ్‌నగర్‌)
8. బెంగళూరు- నెల్లూరు- 286 కి.మీ. (బెంగళూరు- కోలార్‌- చిత్తూరు- తిరుపతి- నాయుడుపేట- నెల్లూరు)
ఇంటర్‌ కారిడార్‌ ఫీడర్‌ రోడ్లు

 

 

4ztVda8.jpg

Link to comment
Share on other sites

Amravati - Anantapur Express Highway

 

okati icham ani dappu kottatam..next AP officials ni Delhi ki tippatam....Torture petti chivaraki complete HOLD anatam last 3 years repeat in many cases

 

DELHI velte debba padutundi deliberate ga

 

Amaravati-Anantapur express way 25,000 crores aha oho ni dappu

50% land cost istam ani Gadkari dappu 2016 lone

 

1+ year tipparu Delhi lo cost ivvamu ani...

malli CBN monna adigite Gadkari again agred for 50% cost

 

cut cheste ippudu asalu a road completely ettesaru going by new announcement!!!!....

 

Sumita dawra R&B IAS a Delhi torture barinchaleka dandam pettindi CBN IAS meeting lone.

Gammon cancel cheyyataniki Delhi vallu chupettina tortute mamuldi kaadu by the way....

She is leaving to UNESCO it seems

Link to comment
Share on other sites

CENTER damaging states they hate with personnel agenda is the new policy.....Modi himself gave hint of that principal

 

His statement in Gujarat "central government would not dole out a single penny to such states"...meaning of "such" state is his personnel not development driven states 

 

Unfortunately SOUTH india and in particular AP is under "such" for personnel reasons....

 

These idiots are better than center treatment of South&AP..atleast these guys the day they come to South they will correct themselves

 

https://twitter.com/Mahanatiii/status/923298386857439232

 

/******

guuju picholla chetilo power mana South India kharma ki vachindi....

 

6 lakh crore Sagarmala, South&EAST ki nothing much

8 lakh crore Bharmala, maximum Mh&Gujju forceful connecting plans as main motive

8 lakh crore River interlink nothing in the SOUTH in the preference list of initial phases...

 

GST exemptions only for Gujarat GIFT city, mainly Gujarat Jewelers benefit and even GUjarat Food also special

 

 

DNG2j-WUEAA6lub.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...