Jump to content

గోదావరి కొత్త నడక


sonykongara

Recommended Posts

గోదావరి కొత్త నడక

నదుల అనుసంధానానికి రాష్ట్రంలో బృహత్తర ప్రణాళిక

27.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం

ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభం

21ap-main1a.jpg

ఇదో మహాయజ్ఞం.

జలసిరిని ఒడిసిపట్టి.. ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన భగీరథ యత్నం.

వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నదీ జలాల్ని సద్వినియోగం చేసుకోవడానికి అమలుచేస్తున్న బృహత్తర కార్యక్రమం.

తెలుగునేలకు గోదావరి నది ఓ వరం. కానీ ఈ నది ద్వారా ఏటా సగటున 2500 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే వెయ్యి టీఎంసీలు వృథా అయ్యాయి. అలా వృథాకాకుండా.. పకడ్బందీ ప్రణాళికతో.. అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు గోదావరి నదీ జలాల్ని తరలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం వేల కోట్లు రూపాయలు వెచ్చించడానికి సమాయత్తమయింది. దుర్భిక్షాన్ని తరిమికొట్టాలంటే.. గోదారమ్మను రాష్ట్రం నలుమూలలకు తరలించడం, గోదావరిని ఇతర నదులతో అనుసంధానం చేయడమే ఉత్తమ మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు నుంచి ఉత్తరాంధ్ర వరకు నీటిని తీసుకువెళ్లడం...అనే పథకాలు ఈ జల ప్రణాళికలో అత్యంత కీలకమైనవి. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... పురుషోత్తపట్నం ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి నుంచి పెన్నాకు అనుసంధానంగా సోమశిలకు నీటి మళ్లింపు వంటివి సాకారం కాబోతున్నాయి. ఎత్తిపోతలు, గురుత్వాకర్షణ.. ఇలా భిన్న రూపాల్లో నీటిని తరలిస్తారు. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, చేపట్టబోతున్న ప్రాజెక్టుల ద్వారా 756 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసేలా కార్యాచరణ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల వల్ల 27.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దాదాపు 42 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. విశాఖ పారిశ్రామిక అవసరాలు తీరతాయి. వందల గ్రామాలకు తాగునీరందుతుంది. పోలవరం నిర్మించేలోపే వరద జలాలు 80 టీఎంసీలు వినియోగించుకునేలా ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పూర్తయింది. 30 టీఎంసీలు వినియోగించుకునేలా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణంలో ఉంది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా 320 టీఎంసీల నీటిని మధ్యాంధ్ర, రాయలసీమలకు తరలించే ప్రణాళిక మరికొద్ది రోజుల్లో ఖరారు కాబోతోంది. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌ సస్యశ్యామలం అవుతుందనడంలో సందేహం లేదని జల వనరుల నిపుణులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఇంతటి కీలకమైన ఈ కార్యక్రమంపై ‘ఈనాడు’ అందిస్తున్న సమగ్ర కథనం..

21ap-main1b.jpg

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...