Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply
  • 1 month later...

అమరావతికి ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ సంస్థ ‘అక్షర’ కూడా
1300 మందికి ఉద్యోగావకాశాలు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి మరో రెండు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌లో రాణిస్తున్న దేశీయ ఐటీ సంస్థ ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు మంగళగిరిలోని ఐ డాటా సెంటర్‌కు సమీపంలో ఎకరా స్థలం కేటాయించారు. ఈ సంస్థ  దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇప్పటికే క్యాడ్‌సిస్‌టెక్‌ తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అలాగే అక్షర ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కూడా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు అరఎకరా కేటాయించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ నెల 24న ఐటీ మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

అమరావతికి ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ సంస్థ ‘అక్షర’ కూడా
1300 మందికి ఉద్యోగావకాశాలు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి మరో రెండు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌లో రాణిస్తున్న దేశీయ ఐటీ సంస్థ ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు మంగళగిరిలోని ఐ డాటా సెంటర్‌కు సమీపంలో ఎకరా స్థలం కేటాయించారు. ఈ సంస్థ  దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇప్పటికే క్యాడ్‌సిస్‌టెక్‌ తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అలాగే అక్షర ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కూడా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు అరఎకరా కేటాయించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ నెల 24న ఐటీ మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Good. ilaa 1acre - 1000 Jobs reasonable.

Maree 100s of acres adigi 6-7 years ayina jobs create cheyyavu konni IT majors. Veetikanna medium range better.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
హెచ్‌సీఎల్‌కు 20 ఎకరాలు
06-12-2017 03:36:07
 
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని ఐటీ హబ్‌గా అభివృద్ధి పరచాలని గట్టిపట్టుదలపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌)కు అమరావతిలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో 20 ఎకరాలను కేటాయించింది. ఎకరం రూ.50 లక్షల చొప్పున ఈ భూములను ఇవ్వనున్నట్లు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కొద్ది రోజుల కిందటే విజయవాడకు సమీపంలోని గన్నవరంలో జాతీయ రహదారి పక్కన సుమారు 27 ఎకరాలను ప్రభుత్వం హెచ్‌సీఎల్‌కు కేటాయించిన సంగతి విదితమే. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 7500కి ఉపాధి లభించనుంది.
Link to comment
Share on other sites

అమరావతిలో హెచ్‌సీఎల్‌కు 20 ఎకరాలు

ఈనాడు అమరావతి: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కి రాజధాని అమరావతిలో 20 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.50 లక్షలు చొప్పున కేటాయిస్తూ సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ సంస్థకు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వం ఇప్పటికే 28 ఎకరాలు కేటాయించింది. ఈ రెండు చోట్లా ఏర్పాటు చేసే ఐటీ కేంద్రాల్లో హెచ్‌సీఎల్‌ సంస్థ 7500 మందికి ఉపాధి కల్పించనుంది.

Link to comment
Share on other sites

అమరావతిలో.. రామకృష్ణా టెక్నో టవర్స్‌
06-12-2017 03:20:14
 
  • ఫస్ట్‌క్లాస్‌-ఏ-బిజినెస్‌ స్కై టవర్స్‌
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ‘రామకృష్ణా టెక్నో టవర్స్‌’ కొలువుదీరనుంది. జాతీయ రహదారి-16కు దగ్గరలో ఉన్న కాజా సమీపంలో అత్యాధునిక వసతులతో అలరారబోయే ఈ స్కై టవర్స్‌ ఐటీ కంపెనీల ఏర్పాటుకు అద్భుత అవకాశం. మొత్తం 25 అంతస్థుల్లో జంట భవంతులలో చిన్న, మధ్య, భారీ సంస్థల ఏర్పాటుకు అవసరమైన కార్యాలయ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడికి భద్రత, వినియోగదారులకు సంతృప్తి లభించడం ఖాయం! ఆత్యాధునిక ఫర్నిచర్‌, మిరుమిట్లు గొలిపే లైటింగ్‌, కంటికింపైన ఔట్‌డోర్‌ పరిసరాలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఈ స్కై టవర్స్‌ ప్రత్యేకతలు. 500 చదరపు అడుగుల నుంచి 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు అందుబాటులో ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్‌ లింక్‌డ్‌ పేమెంట్‌ ప్లాన్‌తోపాటు 2019 జనవరి 1 నుంచి రెంటల్‌ ఇన్‌కంకు అవకాశం. మొత్తం 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ స్కై టవర్స్‌కి 5 స్థాయిల్లో పార్కింగ్‌ సౌకర్యం, 18 హైస్పీడ్‌ ఎలెవేటర్స్‌, 100ు పవర్‌ బ్యాకప్‌, ఫిట్‌నెస్‌, లైఫ్‌ స్టైల్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్ట్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌, బ్యాంకులు, ఏటీఎం తదితర అన్ని సౌకర్యాలు మరింత వన్నె తేనున్నాయి. స్కైటవర్స్‌ ప్రెమోటర్స్‌ ఉన్నత విద్యావంతులు కావడంతోపాటు అత్యంత నమ్మకమైన బిల్డర్లు కూడా. వినియోగదారుల సంతృప్తికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

198 ఎకరాల్లో ఐటీ పార్కు
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతిలోని శాఖమూరు, ఐనవోలు గ్రామాల పరిధిలో 198.52 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నారు. దీనిలో 56.10 ఎకరాల్లో ఐటీ సెజ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఐటీ సెజ్‌ ఐనవోలు గ్రామ పరిధిలోకి వస్తుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఐటీ పార్కు సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నిర్మాణంలో ముందు చూపుతో వ్యవహరించాలని, ఏ విషయాన్నీ విస్మరించరాదని, భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. శాఖమూరు పార్కు అభివృద్ధి ప్రణాళికలను ఏడీసీ అధికారులు వివరించినప్పుడు... పార్కింగ్‌ పరిస్థితేంటని ప్రశ్నించారు. పార్కింగ్‌ సహా అన్ని అవసరాలకు ముందే స్థలం కేటాయించుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు.
* ‘సిటీస్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌’ పేరుతో మార్చి నెలాఖరులో రాజధానిలో అమరావతి ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. సదస్సు ప్రధానంగా నగరాభివృద్ధి ప్రణాళికకు సంబంధించి ఉంటుంది. ఆధునిక సాంకేతికత, నవ్య ఆవిష్కరణలు, వినూత్న విధానాల మేళవింపుతో నగర రూకల్పనపై ఇక్కడ చర్చిస్తారు.
* ఈ సదస్సు నేపథ్యంలో రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో హ్యాపీసిటీ హ్యాకథాన్‌ నిర్వహిస్తారు. నగర నిర్మాణాల్లో ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో మొదటి రెండు రోజులూ బృంద చర్చలు, కార్యగోష్ఠులు ఉంటాయి. అమరావతిని విశ్వస్థాయి నగరంగా 21వ శతాబ్దంవైపు నడిపించేందుకు అవసరమైన వినూత్న సాంకేతిక విధానాలు, ఆవిష్కరణలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తారు.
* ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ను ఒక పర్యాయం నిర్వహించి వదిలేయకుండా ఏటా క్రమం తప్పకుండా ఒక క్రతువుగా నిర్వహించాలని సీఎం సూచించారు.
* రాజధాని ప్రాంతం మొత్తంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి మార్గంలో పచ్చదనం వెల్లివిరిసేలా తీర్చిదిద్దాలని సూచించారు.
* రహదారి నిర్మాణాలు ఏప్రిల్‌ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని అధికారులు చెప్పగా, అంతకంటే ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
* రాజధానిలో రహదారుల నిర్మాణానికి గ్రావెల్‌ కొరతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఆర్‌డీఏ, మైనింగ్‌ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

రాజధాని ప్రాంతంలో 
మరో 12 ఐటీ కంపెనీలు 
సుమారు 1300 ఉద్యోగాల కల్పన 
ఈ నెల 17న ప్రారంభం 
రావడానికి సిద్ధంగా మరో 20 సంస్థలు
ఈనాడు అమరావతి: రాష్ట్రంలో మరో 12 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నెల 17న వీటిని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ రాజధాని ప్రాంతంలోనే వస్తున్నాయి. మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో 9 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్‌ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్‌కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ఒకటి ఉన్నాయని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి ‘ఈనాడు’కి తెలిపారు. ఈ కంపెనీలు రావడంతో తక్షణం 5-6 వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1300 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ 12 కంపెనీలతో కలిపి ఇంత వరకు ఏపీ ఎన్‌ఆర్‌టీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన కంపెనీల సంఖ్య 53కి చేరినట్టు ఆయన తెలిపారు. వీటిలో ఎక్కువ కంపెనీలు విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటైనట్టు ఆయన వెల్లడించారు. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
 

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=517729

ఐటీ హుషార్‌!
08-01-2018 02:49:31
 
636509765700347001.jpg
  • కలిసొస్తున్న ‘వాతావరణం’
  • చిప్‌ డిజైనింగ్‌ శిక్షణకు ‘వేదా’.. రిక్రూటింగ్‌ ఏజెన్సీ ‘హ్యాపీ మైండ్స్‌’
  • పెట్టుబడులకోసం ఏంజెల్‌ నెట్‌వర్క్స్‌.. గుంటూరులో మకుట గ్రాఫిక్స్‌
  • ఐటీ అనుబంధ సంస్థలూ రాక.. అమరావతికి ‘బాహుబలి’ సంస్థ
  • నాలుగు టవర్లు ఇప్పటికే ఫుల్‌.. విస్తరణ బాటలో పలు సంస్థలు
  • ఈ నెల 17న ప్రారంభం కానున్న మరో 12 కొత్త కంపెనీలు
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అమెరికాలో ప్రసిద్ధి చెందిన ‘గ్లోబల్‌ ఫౌండేషన్‌’ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగం ఇన్‌వేకా్‌సకు అనుబంధంగా ఉన్న వేదా ఐఐటీ, మకుట సంస్థలు అమరావతికి వస్తున్నాయి. ‘వేదా ఐఐటీ’ దేశంలో చిప్‌ డిజైనింగ్‌లో పేరొందింది. ఈ సంస్థ చిప్‌ డిజైనింగ్‌లో ఎంటెక్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. అలాగే... బాహుబలి సినిమాకు గ్రాఫిక్స్‌ చేసిన ‘మకుట’ ఈ రంగంలో అగ్రస్థానంలో ఉంది.
 
 
ఈ సంస్థ కూడా గుంటూరులో ఏర్పాటు కానుంది. వేద ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేసిన వారిలో 80 శాతం మందికి అదే సంస్థ ఉద్యోగాలు ఇవ్వనుంది. మిగిలిన వారి కోసం ఇంటెల్‌ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పోటీపడే అవకాశముంది. మరోవైపు అమరావతి ఏంజెల్‌ నెట్‌వర్క్స్‌ అనే సంస్థ కూడా అమరావతికి వస్తోంది.
 
ఈ సంస్థ సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగాల్లో కొత్త ఆలోచనలు చేసే వారికి అవసరమైన నిధులు ఇచ్చి సహకరిస్తుంది. అమెరికాలోని బే ఏరియాతో పాటు చైనాలోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలకు పెట్టుబడులు, మార్కెటింగ్‌, షేర్ల లావాదేవీలు, ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకింగ్‌, నిధుల నిర్వహణ తదితర సేవలన్నీ ఈ సంస్థ అందిస్తుంది. మరోవైపు ఫస్ట్‌ అమెరికన్‌ కార్పొరేషన్‌కు చెందిన హ్యాపీ మైండ్స్‌ రిక్రూటింగ్‌ ఏజన్సీ కూడా అమరావతికి రానుంది. వివిధ సంస్థల్లో రిక్రూటింగ్‌, కన్సల్టెన్సీ సేవలను ఇది అందిస్తుంది.
 
 
‘శిక్షణ’తో బహుళ ప్రయోజనాలు
ప్రస్తుతం రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రారంభించినవారు నిపుణులైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నారు. శిక్షణ సంస్థలు ఉంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. జీసీఎస్‌, ఘనా, కెల్లీ తదితర శిక్షణ సంస్థలు రెండ్రోజుల క్రితమే అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆయా సంస్థల్లో 1027 మంది శిక్షణ తీసుకుంటుండగా... అందులో 730 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఖరారయ్యాయి.
 
 
భవిష్యత్తుపై ఆశలు...
ప్రోత్సాహకాలు ఇచ్చి, నచ్చజెప్పగా వచ్చిన ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఎంత వరకు ఉంటాయి? తొలుత ప్రారంభమైనా తర్వాత కొనసాగుతాయా? ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు వస్తున్నాయా? ఇలాంటి సందేహాల మబ్బులన్నీ ఇప్పుడు తొలగిపోతున్నాయి. కొత్తగా 12 ఐటీ కంపెనీలు అమరావతికి రానున్నాయి. వీటన్నింటినీ ఈనెల 17వ తేదీన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించనున్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవికుమార్‌ వేమూరి ఈ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.
 
 
గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌ ఇప్పుడు ఐటీ కంపెనీలతో ‘హౌస్‌ ఫుల్‌’ అయ్యింది. వాటిలో కొన్ని సంస్థలు విస్తరణకు కూడా వెళ్తున్నాయి. మెస్లోవా అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రాథమికంగా ఐదువేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు.
 
ఇప్పుడు ఆ సంస్థ తమకు మరో 10వేల చదరపు అడుగుల ప్రదేశం కావాలని అడుగుతోంది. మెస్లోవా కంపెనీ ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. విస్తరణతో మరో 350మందికి అవకాశం ఇస్తామని చెబుతోంది. అలాగే... మేథా టవర్స్‌లోనే ప్రారంభించిన చందు సాఫ్ట్‌ అనే కంపెనీ విశాఖపట్నంలో విస్తరణకు వెళ్తోంది. మరో రెండు, మూడు కంపెనీలు కూడా అదే దారిలో ఆలోచిస్తున్నాయి. ఏపీలో ఐటీ వాతావరణం బాగుందనేందుకు ఇది సంకేతమని రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది..
 
 
నాలుగు టవర్లు ఫుల్‌
రాష్ట్రంలో ఐటీ విస్తరణకు రెండు, మూడు మార్గాల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఐటీ శాఖ నేరుగా కంపెనీలను తీసుకొస్తుండడం... రెండోది ఏపీ ఎన్నార్టీ చొరవతో ఐటీ సంస్థలు రావడం! ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నాలుగు ఐటీ టవర్లు ఇప్పటికే కంపెనీలతో నిండిపోయాయి.
 
విజయవాడ ఆటోనగర్‌లో ఇండ్‌వెల్‌ టవర్స్‌, మహానాడు రోడ్‌లోని కే-బిజినెస్‌ స్పేసెస్‌, గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌, అదేవిధంగా మంగళగిరి ఐటీ పార్కులోని మేథా టవర్స్‌... ఈ నాలుగూ ఐటీ కంపెనీలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు 60 వేల చదరపు అడుగులతో ఉన్న ఏపీఎన్నార్టీ టెక్‌పార్కు కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో నిండుతోంది. కొత్తగా వచ్చే సంస్థలకోసం గన్నవరంతోపాటు, విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న పలు భారీ భవనాలను ఐటీ శాఖ, ఏపీఎన్నార్టీ అద్దెకు తీసుకుంటున్నాయి. సగం అద్దె ఐటీశాఖ భరిస్తుండగా, సగం అద్దెను మాత్రం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చెల్లించేలా ప్రోత్సాహకం ఇస్తున్నారు.
 
 
ఆంగ్లంలో శిక్షణ...
ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఆంగ్లంలో శిక్షణ ఇచ్చి వారిని కంపెనీలకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దేలా ఏపీఎన్నార్టీ కృషి చేస్తోంది. గ్రీన్‌కో కంపెనీ సామాజిక బాధ్యత కింద ఇచ్చిన నిధులతో... పేరెన్నికగన్న ఒక సంస్థతో ఏటా 900 మందికి ఆంగ్లంలో శిక్షణ ఇప్పించనున్నారు. తొలి విడతగా వందమందిని ఎంపిక చేసేందుకు అవసరమైన కసరత్తు పూర్తయింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...