Jump to content

IOD announced Golden Peacock Award to NCBN


Husker

Recommended Posts

చంద్రబాబుకు గోల్డెన్‌ పీకాక్‌ పురస్కారం 

ఈ నెల లండన్‌లో అందుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి 

18 నుంచి 26 వరకూ 3 దేశాల్లో సీఎం పర్యటన

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు లండన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐఓడీ) సంస్థ ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ పీకాక్‌ పురస్కారాన్ని అందించనుంది. లీడర్‌షిప్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీస్‌, ఎకనమిక్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో ముఖ్యమంత్రికి ఈ పురస్కారం దక్కింది. ఈ నెలలో ముఖ్యమంత్రి చేపడుతున్న మూడు దేశాల పర్యటనలో భాగంగా లండన్‌లో గోల్డెన్‌ పీకాక్‌ పురస్కారం అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇంగ్లాండ్‌లో చంద్రబాబు తన బృందంతో పర్యటిస్తారన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, అమరావతి పరిపాలన నగరం తుది ఆకృతుల ఖరారు లక్ష్యంగా పర్యటన ఉంటుందని చెప్పారు. లండన్‌లో రాజధాని ఆకృతులకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ బృందంతో సుదీర్ఘమైన చర్చలు చేయనున్నారని, రెండు రోజులపాటు ఇందుకు సంబంధించిన సమావేశాలుంటాయని తెలిపారు. ఈ చర్చల్లో దాదాపు ఆకృతులపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో పరకాల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మూడు దేశాల్లో అనేక మంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు, ఇతర ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.

 


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...