Jump to content

Somasila Dam


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
పంట చేనుకు జలరాశులు 
కాలువలకు నేడు నీటి విడుదల 
(ఈనాడు-నెల్లూరు) న్యూస్‌టుడే, సోమశిల 
nlr-top2a.jpg

ఒకవైపు వర్షం.. మరోవైపు కాలువల్లో నీరు.. సాగు పనులు ముమ్మరం అయ్యాయి. సాగుకు సోమశిల జలాశయం నుంచి గురువారం నీరు విడుదల కానుంది. సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయించిన ప్రకారం గురువారం నుంచి నీటిని విడుదల చేయటానికి జల వనరుల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. గురువారం ఉదయం అధికారులు సోమశిల జలాశయం ఆనకట్ట తలుపులు ఎత్తి నీటిని వదలనున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని కాలువలకు నీటి కళ రానుంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైతులు ఇప్పటికే సాగు మొదలుపెట్టారు. కాలువలకు నీరు రావటం.. పూర్తి విస్తీర్ణానికి నీరు ఇవ్వాలని ఐఏబీ సమావేశంలో నిర్ణయించటంతో రైతులు అందుకు సన్నద్ధమయ్యారు. రబీలో సుమారు 4.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సాగుకు అనుగుణంగా చాలా వరకు కాలువలను ఇప్పటికే సిద్ధం చేశారు. దీంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులకు నీరు అందనుంది. పెన్నా డెల్టా కింద ఉన్న అన్ని కాలువలను ఇప్పటికే సన్నద్ధం చేశారు. వాటి ఆధారంగా 2.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 2.35 లక్షల ఎకరాలకు ఇతర కాలువల ద్వారా నీరు ఇవ్వనున్నారు. మొత్తం 51 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ప్రాజెక్టు కమిటీలు, సాగునీటి సంఘాల ఛైర్మన్లు జిల్లాలోని అన్ని కాలువలను నీరు పారటానికి అనువుగా తీర్చిదిద్దారు. సాగు పూర్తయ్యే వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వటానికి అధికారులు ప్రణాళికలను తయారుచేస్తున్నారు. గురువారం సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేసే ప్రక్రియను ఎస్‌ఈ ప్రసాదరావు పర్యవేక్షించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలనే విషయమై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమం లేకుండానే నీటిని విడుదల చేయటానికి జలమండలి అధికారులు నిర్ణయించారు. డెల్టా ప్రాంతంలో వర్షం కురిసిన నేపథ్యంలో అవసరానికి అనుగుణంగా నీటి విడుదల ఉంటుందని చెప్పారు. ఉత్తర, దక్షిణ కాలువల పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఈ నెల 10 నుంచి 15లోపు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. పెన్నానది ఎగువ నుంచి సోమశిల జలాశయానికి 8,631 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, కండలేరు వరద కాలువకు 7,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Link to comment
Share on other sites

నీరొచ్చే వేళ.. నిలకడతోనే మేలు 
nlr-gen1a.jpg

సోమశిల జలాలు ఉత్తరకాలువలో విడుదల చేసిన రెండోరోజే ఆత్మకూరు బ్రాంచి కాలువకు చేరాయి. మూడోరోజుకు ఆత్మకూరు చెరువును తాకాయి. గత ఏడాది సాగునీటిని చెరువులకు చేర్చడంలో సోమశిల ఉత్తరకాలువ అధికారుల అవగాహనకు నిదర్శనమిది. గతంలో సోమశిల జలాశయం నుంచి విడుదలైన నీరు ఉత్తరకాలువ పరిధిలో ఆత్మకూరు చెరువుకు చేరాలంటే 15 రోజుల పైనే పట్టేది. చెరువు తూములకు ఈ నీరు అందేసరికి నెల రోజులు పట్టేది. గతేడాది ఈ స్థితిని అధిగమించేందుకు అధికారులు ఉత్తరకాలువ పరిధిలోని అన్ని తూముల గేట్లు మొదట మూసేశారు. పంపిణీ అయిన నీరు మొదట ఆఖరు తూము వద్దకు పంపారు. అక్కడి నుంచి ఆయా తూముల అవసరాలకు అనుగుణంగా నీరు సరఫరా అయ్యేలా నియంత్రిచారు. అందుకే ఈ మేలైన మార్పు వచ్చింది. జలాశయంలో తగిన నీరు లేకున్నా ఉత్తరకాలువ ఆయకట్టు నిశ్చింతగానే పండింది.

న్యూస్‌టుడే, ఆత్మకూరు

జిల్లాలో సాగునీటి పంపిణీకి ఐఏబీ సమావేశం నిర్వహించారు. 4.92 లక్షల ఎకరాల సోమశిల ఆధారిత ఆయకట్టుకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకొన్నారు. నవంబరు 2న విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు.. అటు రైతులు ఆయకట్టు అవసరాలపై చైతన్యం అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మొదటి పంటకు సాగునీరు అంటే నియంత్రణలో ఎంత చైతన్యం ఉంటే అంత ఆదా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువలు, డెల్టా పరిధిలో క్రమబద్దమైన విధానాలతో సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. ఈ తీరుతెన్నులు పరిశీలిస్తే..

మోటార్ల నియంత్రణ తప్పనిసరి 
జలాశయంలో పరిధిలో మరో ప్రధాన సమస్య కాలువల పరిధిలో మోటార్లు. రైతులకు సాధ్యమైన ఎక్కువ ప్రయోజనం చేకూరడం మంచిదే అయినా మోటార్ల నిర్వహణలో క్రమబద్దత లేకపోవడం అసలు ఆయకట్టునే దెబ్బతీస్తుంది. గత ఏడాది ఈ సమస్య ఉత్పన్నం కాకుండా మోటార్ల నిర్వహణకు వారానికి రెండు రోజులు కేటాయించారు. అలా చేయడంతో ఇటు ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా అటు అదనపు ఆయకట్టు సాగు చేసిన రైతులు నష్టపోకుండా క్రమబద్దీకరించగలిగారు. తమ పక్కనే వెళ్లే నీరు వాడకుండా అడ్డుకొంటే రైతు అక్రమ మార్గాలు అనుసరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితి నీటి పంపిణీకి సమస్య తెస్తుంది. అలా కాకుండా అవగాహనతో చైతన్యం చేస్తే ఆయకట్టు సాగు సజావుగా ఉంటుంది.

సాగులో సమస్యలు 
సాగులో క్రమశిక్షణ లేకపోవడం కూడా సమస్య మరో సమస్యగా ఉంది. ఇది జలాశయం మొత్తం పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రధానంగా డెల్టాలో ఈ సమస్య ఉంది. ఒకచోట నార్లు పోస్తుంటే మరోచోట కరుకు దశలో వరి ఉంటుంది. నాటింది కరుకు దశకు వచ్చేసరికి కోసి నార్లు పోసే కార్యక్రమంలో ఇంకో ప్రాంతం ఉంటుంది. సాగులో క్రమశిక్షణ లేకపోవడంతోనే ఈ స్థితి నెలకొంది. దాంతో నాలుగు నెలలకు పూర్తికావాల్సిన పంటకు జలాశయం నుంచి అయిదున్నర నెలలపైనే నీరు విడుదల చేయాల్సి వస్తోంది. విడుదల సమయం ఎక్కువ కావడంతోపాటు వృథా అధికంగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారు. టీఎంసీకి 10 వేల ఎకరాల సాగు అనేది అధికారికంగా కేటాయించే విధానం. అయితే అధిక కాలపరిమితి కలిగిన వంగడాల సాగు సమయంలో ఈ లెక్క సరిగానే ఉంటుంది. కాలపరిమితి తక్కువగా ఉన్న వంగడాలు సాగు చేసినా వినియోగం మాత్రం పదివేల ఎకరాలకు టీఎంసీకన్నా అధికంగా ఉంటుంది. సాగులో క్రమశిక్షణ లేక నీటి విడుదల అధిక కాలం కొనసాగడంతోనే ఈ స్థితి నెలకొంది.

ఆఖరి ఆయకట్టుకే కష్టాలు 
జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసినపుడు ఆఖరి పొలాలకు సాగునీరు అందడంలో ప్రధానంగా మూడు అడ్డంకులు ఉంటాయి. వాటిలో మొదటిది పంపిణీ వ్యవస్థల గేట్ల నిర్వహణ. మొదటి ఆయకట్టు రైతులు కాలువల గేట్లు తమ చిత్తానుసారం వినియోగిస్తే ఆఖరి పొలాలకు సాగునీరు సకాలంలో అందడం కష్టమే అవుతుంది. మొదటే వినియోగం పెరగడంతో ఆఖరుకు ఆలస్యంగా చేరుతుంది. సాగులోనూ అనంతరం అవసరాలు తీరడంలోనూ ఈ అసమానత కొనసాగుతూనే ఉంటుంది. అటు కాలువలు, ఇటు డెల్టా పరిధిలోనూ ఆఖరి ఆయకట్టుకు ప్రధానంగా ఈ సమస్యతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళనలు చేసే వరకు సమస్య వస్తోంది. ఆఖరి పంపిణీ వ్యవస్థకు నీరు చేరే వరకు అనంతరం క్రమబద్దంగా తూములు నియంత్రిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఉత్తరకాలువ పరిధిలో గత ఏడాది ఇలా చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి.

రైతులను చైతన్యం చేస్తాం 
దేశ్‌నాయక్‌, ఈఈ, సోమశిల ప్రాజెక్ట్‌, ఉత్తరకాలువ 
సాగునీరు రైతులకు క్రమబద్దంగా అందేలా వారిని చైతన్యం చేస్తాం. కాలువ ఆఖరి వరకు మొదట నీటిని తీసుకువెళ్లి క్రమబద్ధంగా పంపిణీ చేస్తాం. గత ఏడాది అనుసరించిన విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. ఈ విధానం అమలయ్యేలా రైతులను చైతన్యం చేస్తాం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...