Jump to content

Andhra Pradesh Govt Introduces Electric Bus In Vijayawada City .


Recommended Posts

విశాఖలో ఎలక్ట్రిక్ కార్లు... ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకి సన్నాహాలు....

electric-cars-vizag-04102017.jpg
share.png

విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

 

ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.

ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.

ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.

Edited by sonykongara
Link to comment
Share on other sites

కరెంటు బండివచ్చేస్తోంది!

636427714944758038.jpg



  • గ్రీన్‌ ఎనర్జీ విప్లవానికి నాందిగా వచ్చేనెల నుంచే ఈ-వాహనాలు
  • తొలుత విశాఖసిటీలో రోడ్డుపైకి.
  • కేంద్ర కార్యాలయాల పరిధిలో తొలిదశలో 10,000 వాహనాలు
  • 10.2 లక్షలకు కోట్‌చేసిన టాటా
  • చార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ఇప్పటికే సిద్ధమైన ఏపీ సర్కారు

అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశమంతా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈ-వెహికల్‌) యుగం మొదలవుతోంది. ‘గ్రీన్‌ ఎనర్జీ’ని సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం, పర్యావరణ సహిత రవాణా వ్యవస్థని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాల సాకార రూపంగా కరెంటు బళ్లు రోడ్డెక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నవంబరు నెల నుంచే ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్రంలో విశాఖలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో తొలిగా ఈ-వాహనాలు దర్శనమివ్వనున్నాయి. ప్రయో గాత్మకంగా అమలుచేసి.. ఇక్కడ వచ్చే ఫలితాలనుబట్టి జాతీయస్థాయిలోని తక్కిన స్మార్ట్‌ సిటీలకు విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ఈ-వాహనాల వినియోగంవల్ల .. పర్యావరణానికి మేలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

బ్యాటరీ వాహనాల వినియోగం వల్ల ‘‘ గ్రీన్‌ ఎనర్జీ’’ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది వరకే ప్రకటించడం గమనార్హం. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ఇంధన సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సోలార్‌ బ్యాటరీ స్టోరేజీ కోసం టెండర్లను కూడా ఆహ్వానించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ..రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ తమ పరిధిలోని స్మార్ట్‌ నగరాల్లో ‘‘చార్జింగ్‌ పాయింట్‌ ’’లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో ఈ పాయింట్‌లను ముందస్తుగా ఏర్పాటు చేసేందుకు ఏపీ డిస్కమ్‌లు సన్నద్ధమవు తున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రితో ఏపీట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఉన్నతాధికారుల సమావేశం తరువాత, దీనిపై కార్యాచరణను అమలు చేయనున్నారు.

 

సరఫరా చకచకా!

దేశ వ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల అమరికలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్ ఎల్‌) కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సంస్థ గ్రీన్‌ ఎనర్జీ పెంపుపై దృష్టి సారించింది. అందులోభాగంగా, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ శాఖల కోసం పదివేల ఈ-వాహనాల సరఫరాను కోరుతూ గ్లోబర్‌ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లకు పలు సంస్థలు స్పందించాయి. టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ఎల్‌-1గా నిలిచింది.

 

ఎలక్ట్రిక్‌ కార్లను రూ.10.20 లక్షలకే సరఫరా చేస్తామని టాటా ముందుకొచ్చింది. జీఎ్‌సటీతో కలుపుకొని ఒక్కో వాహనాన్ని రూ.11.20 లక్షలకు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ లెక్కన 10,000 వాహనాల సరఫరాకు గాను టాటాకు రూ.1,120 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, గ్లోబల్‌ టెండర్‌లో మహీంద్రా ఎల్‌-2గా నిలిచింది. ఒక్కో వాహనానికి 13 లక్షలు కోడ్‌ చేసింది. అయితే, టాటా కోట్‌ చేసిన మొత్తానికి సిద్ధమయితే, 40 శాతం వాహనాలను సరఫరా చేసే అవకాశం ఇస్తామని మహీంద్రాకు ఈఈఎ్‌సఎల్‌ స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

  • 8 months later...

త్వరలో ఎలక్ట్రిక్‌ వాహనాల రయ్‌..రయ్‌.. 
మొదటి దశలో విజయవాడ, విశాఖ, తిరుపతి ఎంపిక 
500 వాహనాల పంపిణీ కోసం ఈఈఎస్‌ఎల్‌ ఏర్పాట్లు 
దశల వారీగా రాష్ట్రమంతా విస్తరించేలా కార్యాచరణ 
కాలుష్యాన్ని జీరో శాతానికి తగ్గించే ప్రయత్నం 
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగర రహదారులపైకి మరో రెండు నెలల్లో విద్యుత్‌ వాహనాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంఓయూ) మేరకు 500 ఎలక్ట్రిక్‌ బ్యాటరీ వాహనాలను ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌) సరఫరా చేయనుంది. టాటా, మహేంద్ర సంస్థల నుంచి వాహనాలను కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌ తీసుకుంది. మొదటి విడతగా వచ్చే వాహనాలను రాష్ట్రంలోని మూడు నగరాల్లోగల ప్రభుత్వశాఖల ఉన్నతాధికారుల వినియోగం కోసం కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దశల వారీగా మొత్తం పదివేల వాహనాలను ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు.

కోటికిపైగా పెరిగిన వాహనాల వినియోగం... 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర మోటారు వాహనాల వినియోగం తాజా లెక్కల ప్రకారం కోటికిపైగా పెరిగింది. లీటర్‌ డీజిల్‌ వినియోగంతో 2.5 కిలోల బొగ్గు పులుసు వాయువు గాలిలో కలుస్తూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంతో కర్బన ఉద్గారాలు జీరో శాతం ఉంటాయని, రూ.10 ధరకు లభించే యూనిట్‌ విద్యుత్తుతో  ఆరు కిలో మీటర్ల దూరం కారులో ప్రయాణించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రవేశపెట్టాక దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసేలా రాష్ట్రంలో నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) ప్రణాళికలు రూపొందించింది. 2020-21 నాటికి రాష్ట్రంలో లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్లపైకి తీసుకురావాలన్నది ప్రయత్నం. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు రహదారులపై పరుగులు తీస్తున్నాయి.

250 ఛార్జింగ్‌ స్టేషన్లు... 
మూడు ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల రీఛార్జింగ్‌ కోసం 250 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, ఆసుపత్రుల వద్ద వీటిని ప్రారంభిస్తారు. ఇలాంటి స్టేషన్లు కేవలం విద్యుత్తు ఉత్పాదక సంస్థలు మాత్రమే నిర్వహించాలన్న 2003 విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరణలు చేసింది. అందువల్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున త్వరలో ప్రకటన చేయనున్నారు. ఏపీ ‘ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ విధానాన్ని’ గత నెలలో మంత్రిమండలి ఆమోదించడంతో త్వరలో జీవో విడుదల కానున్నది. ఇందులో ఎలక్ట్రిక్‌ వాహనాలపై రోడ్డు పన్ను, వాహన రిజిస్ట్రేషన్‌ రుసుంలపై రెండు, మూడేళ్లపాటు మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించనున్నారు. వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థలను ఆహ్వానించేందుకు 500 నుంచి 1000 ఎకరాల్లో ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎక్కడ నెలకొల్పాలన్న విషయమై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్నారు. దశల వారీగా 2030 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే తిరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని నెడ్‌క్యాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.కమలాకరబాబు అభిప్రాయపడ్డారు. కాలుష్యాన్ని జీరో శాతానికి తీసుకురావాలన్న గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని, కేంద్రం సైతం ఎంతో సహకారాన్ని అందిస్తోందని ఆయన వివరించారు.

బామ్మ మాట.. బ్యాటరీ బాట 
8ap-main14a.jpg
విజయవాడలో బ్యాటరీ వాహనంపై రయ్‌మంటూ దూసుకుపోతూ అందరినీ అశ్చర్యపరుస్తోంది ముత్యాలంపాడు లక్ష్మీనగర్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు బోనేపల్లి కనకదుర్గ. ఒకసారి ఛార్జింగ్‌ పెడితే 25 నుంచి 30 కి.మీ దూరం ప్రయాణించే బ్యాటరీ వాహనాన్ని అమెరికా నుంచి ఆమె తెప్పించుకున్నారు. బ్యాంకు, రైల్వేస్టేషన్‌, కూరగాయల మార్కెట్‌.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ వాహనంపైనే దూసుకెళ్తోంది.

- ఈనాడు అమరావతి
Link to comment
Share on other sites

On 10/4/2017 at 4:03 AM, sonykongara said:

విశాఖలో ఎలక్ట్రిక్ కార్లు... ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకి సన్నాహాలు....

electric-cars-vizag-04102017.jpg
share.png

విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

 

ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.

ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.

ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.

super!

 

oka bus bomma untadani vacha!

Link to comment
Share on other sites

  • 1 month later...

అందరూ మాటలు మాత్రమే చెప్తారు... చంద్రబాబు మాత్రం, చేసి చూపిస్తారు..

Super User
08 August 2018
Hits: 39
 
electric-08082018-1.jpg
share.png

ఎంతో మంది నాయకులు, మేము అది చేస్తా, ఇది చేస్తాం, దేశాన్ని మార్చేస్తాం, కొత్తగా ఆలోచిస్తాం అంటూ ఉపన్యాసాలు మాత్రం దంచి కొడతారు. ఆచరణలో మాత్రం ఏమి ఉండదు. చంద్రబాబు మాత్రం అలా కాదు, మాటలతో పాటు, చేతల్లో కూడా చేసి చూపిస్తారు. ఏ సంస్కరణలు అయినా, చేసి చూపించి, దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. అలా అని ఇవేవో, ఓట్లు రాలే పనులు కూడా కాదు. ప‌ర్యావ‌ర‌ణర‌హిత‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం కోసం, ఎందరో మాట్లాడటం మనం చూసాం, కాని మన రాష్ట్రంలో మాత్రం, ఇప్పటికే అవి మొదలయ్యాయి. తాజాగా ఈ రోజు కూడా మరి కొన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ముందుగా ప్రభుత్వంలో వీటిని ఉపయోగించి, నెమ్మదిగా ప్రజలకు కూడా ఇవే అలవాటు చెయ్యనున్నారు.

 

electric 08082018 2

ప‌ర్యావ‌ర‌ణర‌హిత‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని అన్ని ర‌కాలుగా ప్రోత్స‌హించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఎల‌క్ట్రిక్ మొబిలిటీకి అనుగుణంగా ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వం పాల‌సీని సిద్దం చేసింద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ‌, మహీంద్ర ఎల‌క్ట్రిక్‌, జూమ్ కార్ సంయిక్త భాగ‌స్వామ్యంలో ఇక విజ‌య‌వాడ రోడ్ల‌ పై ప‌రుగులు తీయ‌నున్న బ్యాట‌రీ కార్ల‌ శ్రేణిని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి స‌మీపంలోని సికె క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ప‌ర్యాట‌కుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మ‌హీంద్రా జూమ్ కార్లు ఉప‌యోగ‌ప‌డ‌టం ముదావ‌హ‌మ‌న్నారు.

electric 08082018 3

ఇప్ప‌టికే పూనా, కోల్‌క‌తా, ముంబై, న్యూడిల్లీ, జైపూర్, హైద‌రాబాద్‌, మైసూర్‌ల‌లో ఇవి న‌డుస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ద భాగ‌స్వామ్యంతో ప‌రుగులు పెట్టనుండ‌టం సంతోష‌మ‌న్నారు. ద‌క్షిణ భార‌తదేశంలోనే అతిముఖ్య‌మైన కూడ‌లి న‌గ‌రంగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి రూపుదిద్దుకుంటుంద‌ని, వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ఎవ‌రు వ‌చ్చినా ప్రోత్స‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఎవ‌రికి వారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన ఈ బ్యాట‌రీ అద్దె కార్లు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం, బెంజిస‌ర్కిల్, స‌చివాల‌యంల వ‌ద్ద అందుబాటులో ఉంటాయ‌ని, నిబంధ‌న‌ల మేర‌కు ఎవ‌రైనా వీటిని తీసుకోవ‌చ్చ‌ని అన్నారు.

electric 08082018 4

మ‌హీంద్రా ఎల‌క్ట్రిక్ సిఇఓ మ‌హేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో షేర్డ్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ విప్ల‌వానికి ఇది తొలి అడుగు అవుతుంద‌న్నారు. జామ్ కార్ సంయిక్త వ్య‌వ‌స్ధాప‌కుడు, సిఇఓ గ్రేగ్ మోరాన్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం రాష్ట్రంలో 15 వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తు డిమాండ్ మేర‌కు మ‌రిన్ని వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌న్నారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ద నిర్వ‌హ‌ణా సంచాల‌కులు హిమాన్హు శుక్లా మాట్లాడుతూ ప‌ర్యాట‌క శాఖ వెబ్ సైట్‌తో పాటు, ఇత‌ర ప్ర‌చార సామాగ్రిలో కూడా జూమ్ కార్ భాగ‌స్వామ్యం గురించి ప‌ర్యాట‌కుల‌కు వివ‌రిస్తామ‌న్నారు.

electric 08082018 5

అమ‌రావ‌తి రాజ‌ధానిలో సుస్ధిర ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేయ‌టానికి ఇవి ఉప‌క‌రిస్తాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ద అధ్య‌క్షులు అచార్య జ‌య‌రామిరెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాధికార సంస్ధ సిఎంఓ శ్రీ‌నివాస‌రావు, జియంలు హ‌ర‌నాధ్‌, సుద‌ర్శ‌న్‌, విశ్వ‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ప‌ర్యాట‌క శాఖ నూత‌నంగా స‌మ‌కూర్చుకున్న ఆధునిక ఓల్వో బ‌స్సుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆవిష్క‌రించారు. ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ ఛైర్మ‌న్ అచార్య జ‌య‌రామిరెడ్డి, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, అంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా ఇత‌ర అధికారుల స‌మ‌క్షంలో మంగ‌ళ‌గిరి సికె క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ జెండా ఊపి ప్రారంభించారు. స్వ‌యంగా బ‌స్సులోకి వెళ్లి ప‌రిశీలించిన సిఎం సౌక‌ర్యాల‌ను గురించి శుక్లాను అడిగి తెలుసుకున్నారు. విశాఖ‌ప‌ట్నం నుండి తిరుప‌తికి ఈ బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నామ‌ని, ఈ సంద‌ర్భంగా శుక్లా ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ప‌ర్యాట‌క సౌక‌ర్యాల‌ క‌ల్స‌న‌లో ఎటువంటి రాజీ లేని ధోర‌ణి వ‌ద్ద‌ని ఈ సందర్భంగా సిఎం అన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
2నెలల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు రయ్‌ రయ్‌..

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాబోయే రెండు నెలల్లో విజయవాడలో ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట రెండు బస్సులు నడపనున్నారు. ఇది విజయవంతమైతే మరో రెండు బస్సులు ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తామని బెలారస్‌కు చెందిన యాక్సిస్‌ మొబిలిటీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ, ప్లాంటు ఏర్పాటు తదితర అంశాలపై యాక్సిస్‌ మొబిలిటీ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రికల్‌ బస్సులను నడపాలని నిర్ణయించారు. 12 మీటర్ల పొడవున్న బస్సులు రాష్ట్రంలోని రహదారులకు అనువుగా ఉంటాయని ప్రతిపాదించారు. ఒక్కో బస్సు సామర్థ్యం 75- 87 మంది ప్రయాణికులకు సరిపడా ఉంటుందన్నారు. 5 నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే 25 కిలోమీటర్ల వరకూ వెళ్తాయని, డీజిల్‌ బస్సులతో పోలిస్తే నిర్వహణ వ్యయం మూడో వంతు మాత్రమే అవుతుందని తెలిపారు. బస్సులోకి వీల్‌ఛైర్‌తో సహా వెళ్లేలా ప్లాట్‌ఫాం రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కిలోమీటరుకు రూ.40 వ్యయమవుతోందని, దీన్ని రూ.35కు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒక్కో బస్సు 15 ఏళ్ల కాలపరిమితితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా నడపనున్న బస్సులను ఉచితంగా అందిస్తున్నందున వీటి దిగుమతికయ్యే కస్టమ్స్‌ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించుకోవాలని కోరారు.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి ఎలక్ర్టిక్‌ బస్సులు!
30-08-2018 03:06:37
 
  •  ప్రయోగాత్మకంగా విజయవాడలో..
  •  రెండు బస్సులు నడుపనున్న యాక్సిస్‌
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాలుష్య రహిత రవాణాకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ఎలక్ర్టిక్‌ బస్సులను తెప్పిస్తోంది. రెండు నెలల్లో విజయవాడలో రెండు ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రజా రవాణా కోసం వినియోగంలోకి రానున్నాయి. రహదార్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌, రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) ఎండీ కమలాకరరావు, బెలారస్‌ దేశ ప్రభుత్వరంగ సంస్థ బెల్కోమ్మునమాష్‌ సీఈవో కొరోల్‌, యాక్సిస్‌ సంస్థ ప్రతినిధులు తదితరులు బుధవారం సమావేశమై రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ కింద ఎలక్ర్టిక్‌ బస్సులను నడపడంపై చర్చించారు. ఈ ఏడాది విశాఖలో జరిగిన వాణిజ్య సదస్సులో బెల్కోమ్మునమాస్‌ సంస్థతో రాష్ట్ర రవాణా సంస్థ, నెడ్‌ క్యాప్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో భేటీ జరిగింది. తాము ఇప్పటికే తమ దేశంలో 20 ఎలక్ట్రికల్‌ బస్సులు నడుపుతున్నామని, చైనా సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు బ్యాటరీ విధానంలో కాకుండా.. క్విక్‌ చార్జర్‌ను ఉపయోగిస్తున్నామని బెల్కోమ్మునమాస్‌ సీఈవో కొరోల్‌ తెలిపారు.
 
ఈ విధానంలో 5 నిమిషాలు చార్జింగ్‌ చేస్తే.. 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చన్నారు. ‘విజయవాడలో ప్రయోగాత్మకంగా నడిపేందుకు రెండు నెలల్లో రెండు బస్సులు తెస్తాం. తర్వాత మరో మూడు బస్సులు తీసుకొస్తాం’ అని వెల్లడించారు. తమకు క్విక్‌ చార్జింగ్‌ పాయింట్లు కావాలని ప్రతిపాదించారు. ఇందుకు అజయ్‌ జైన్‌, విజయానంద్‌ సానుకూలంగా స్పందించారు. ఎలక్ట్రిక్‌ క్విక్‌ చార్జింగ్‌ పాయింట్లను అవసరమైన చోట్ల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా నడుపుతామని.. విజయవంతమైతే.. రాష్ట్రంలో నడిపేందుకు తయారీ ప్లాంటును స్థాపిస్తామని కొరోల్‌ స్పష్టం చేశారు.
 
 
‘కియ’ కోసం ఆర్వోబీ
‘కియ’ కోసం మౌలిక సదుపాయాలన్నీ పక్కాగా కల్పించేందుకు పరిశ్రమల శాఖ సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండలోని ఎర్రమంచిలో ప్లాంటును స్థాపిస్తున్నప్పుడే రహదారులు, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) తదితర సదుపాయాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
 
 
స్పోర్ట్స్‌ సిటీకి 150 ఎకరాలు
స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు విశాఖపట్నంలో 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేశ్‌కుమార్‌ తెలిపారు. విశాఖలో ప్రతిపాదిత క్రీడా నగరం ఏర్పాటుపై సింగపూర్‌కు చెందిన లగార్దేర్‌ క్రీడా సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. లగార్దేర్‌ క్రీడా సంస్థ ఆసియా బిజెనెస్‌ డెవల్‌పమెంట్‌ ఉపాధ్యక్షులు మాల్కం థోర్ప్‌, ఆ సంస్థ స్టేడియం అండ్‌ ఎరీనాస్‌ డెవల్‌పమెంట్‌, సర్వీసెస్‌ ఉపాధ్యక్షులు స్టీఫెన్‌ పొటీర్‌తో సీఎస్‌ చర్చించారు. ఈ సందర్భంగా లగార్దేర్‌ ప్రతినిధులు తమ ప్రతిపాదనలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియజేశారు.
 
ఎవరెస్ట్‌ అధిరోహకులకు 10 లక్షల నజరానా
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు సభ్యులకు ప్రభుత్వం రూ.10 లక్షలు నజరానా ప్రకటించింది. ఈ మేరకు క్రీడా, యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

విద్యుత్‌ బస్‌లకు.. అధ్యయనం!
01-09-2018 07:26:07
 
636713835687098046.jpg
  • సీఎం ఆదేశాల మేరకు పక్షం రోజులలో నివేదిక
  • వివరాలు తెలుసుకుంటున్న ఎలక్ర్టిక్‌ వాహన విభాగం
  • ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నివేదిక రూపకల్పన
విజయవాడ: ఎలక్ర్టిక్‌ బస్సులు నడపటానికి విజయవాడలో అధ్యయనం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పక్షం రోజుల్లో నివేదికను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్ర్టిక్‌ వాహన విభాగ అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. పక్షం రోజులలో నివేదిక ఇచ్చిన దానిని బట్టి నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పటంతో ఆ దిశగా అధికారులు పని ప్రారంభించారు. ఆర్టీసీలో ప్రధా నంగా ఎన్ని రకాలు సర్వీసులు ఉన్నాయో అధికా రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడ నుంచి ఎలాంటి సర్వీసులు నడుస్తు న్నాయి? వీటిలో హై ఎండ్‌ సర్వీసులతో పాటు వివిధ కేటగిరీలలో ఉన్న బస్సుల వివరాల లెక్కలను తీసుకుంటున్నారు. బస్సుల వివరాలతో పాటు వాటి ఆక్యుపెన్సీ వాటి సామర్థ్యం గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడ నుంచి నడిచే ఆర్టీసీ బస్సులలో పాత బస్సులు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు తెలుసుకుంటున్నారు. హై ఎండ్‌ శ్రేణిలో తిరిగే రూట్లలో ఎలక్ర్టిక్‌ బస్సును నడిపితే ఏ విధంగా ఉంటుంది? సాధారణ బస్సులలో ఒకటిగా నడిపితే ఎలా ఉంటుందన్న వివరాలు తెలుసుకునేందుకే ఈ లెక్కలు తీసుకుంటున్నారు.
 
హై ఎండ్‌ బస్సులలో అమ రావతి బస్సులు, సాధారణ బస్సు లలో ఎక్‌ ్సప్రెస్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ ఆర్డినరీ, తెలుగు వెలుగు బస్సుల్లో వేటి స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే సాధారణ బస్సులలో సిటీ అర్డినరీ బస్సులలో చాలావరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ ఆర్డినరీ సర్వీసుల స్థానంలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడితే కలిగే ప్రయోజనాలేమిటన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. విజయవాడ ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎలక్ర్టిక్‌ బస్సులను సరఫరా చేసే విషయంలో పలు కంపెనీలు కూడా పోటీలు పడుతున్నాయి. బీవైడీ, అశోక్‌ లేల్యాండ్‌, యాక్సెస్‌, ఐషర్‌, టాటా వంటి సంస్థలు ఎలక్ర్టిక్‌ బస్సులను సరఫరా చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలక్ర్టిక్‌ బస్సును ఒక సంస్థ రూ.3 కోట్లుకు అందించటానికి, మరో సంస్థ రూ.2.50 కోట్లకు అందిస్తామని చెబుతోంది.
 
ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ధర చెబుతున్నప్పటికీ, ఈ బస్సుల ఖర్చు తగ్గించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పన్నులకు మినహాయింపు ఇచ్చింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు రాయితీ వస్తుంది? ఎంత ఖర్చు తగ్గించగలమన్న ఆలోచనతో కూడా అధికారులు ఉన్నారు. ఎలక్ర్టిక్‌ బస్సులను ఉపయోగించడం వల్ల ఆర్టీసీ ప్రధాన వ్యయమైన డీజిల్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందన్న దానిపై అధికారులు నివేదిక తయారు చేయాల్సిఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినట్టు పక్షం రోజుల్లో ఆర్టీసీ అధికారుల సహకారంతో పూర్తి నివేది కను సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ర్టిక్‌ విభాగం డైరెక్టర్‌ భాను ప్రకాష్‌ ఆంధ్రజ్యోతికి చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజధాని రోడ్లపై తొలి ఈ-బస్సు
13-09-2018 03:19:38
 
636724055796060580.jpg
  •  త్వరలో రాజధానికి మరిన్ని బస్సులు
విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని రోడ్లపై తొలి ఎలక్ట్రిక్‌ బస్సు పరుగులు తీసింది. గన్నవరం నుంచి తుళ్లూరు వరకు ఈ-బస్సును ప్రయోగాత్మకంగా నడిపారు. డ్రైవర్‌ కాకుండా 39 మంది కూర్చునేందుకు వీలున్న ఈ బస్సులో ఆర్టీసీ నడుపుతున్న గరుడలో ఉన్న సౌకర్యాలన్నీ ఉన్నాయి. సుమారు 3 గంటలపాటు చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా పరుగులు తీయగల సత్తా ఈ-బస్సు సొంతం. ఈ బస్సును మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ సిబ్బంది కోసం అందుబాటులో ఉంచారు. కాలుష్య రహిత బస్సులు కావడంతో వీటి కొనుగోలుపై పలు రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి- తిరుమల నడుమ కూడా ఈ-బస్సును నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాజధాని ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఈ-బస్సుల వాడకాన్ని పెంచే దిశగా సీఎం చర్యలు చేపడుతున్నారు. బుధవారం గన్నవరం ఆర్టీఏ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేశారు.
Link to comment
Share on other sites

రాజధాని రోడ్లపై తొలి ఈ-బస్సు
13-09-2018 03:19:38
 
636724055796060580.jpg
  •  త్వరలో రాజధానికి మరిన్ని బస్సులు
విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని రోడ్లపై తొలి ఎలక్ట్రిక్‌ బస్సు పరుగులు తీసింది. గన్నవరం నుంచి తుళ్లూరు వరకు ఈ-బస్సును ప్రయోగాత్మకంగా నడిపారు. డ్రైవర్‌ కాకుండా 39 మంది కూర్చునేందుకు వీలున్న ఈ బస్సులో ఆర్టీసీ నడుపుతున్న గరుడలో ఉన్న సౌకర్యాలన్నీ ఉన్నాయి. సుమారు 3 గంటలపాటు చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా పరుగులు తీయగల సత్తా ఈ-బస్సు సొంతం. ఈ బస్సును మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ సిబ్బంది కోసం అందుబాటులో ఉంచారు. కాలుష్య రహిత బస్సులు కావడంతో వీటి కొనుగోలుపై పలు రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి- తిరుమల నడుమ కూడా ఈ-బస్సును నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాజధాని ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఈ-బస్సుల వాడకాన్ని పెంచే దిశగా సీఎం చర్యలు చేపడుతున్నారు. బుధవారం గన్నవరం ఆర్టీఏ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేశారు.
Link to comment
Share on other sites

2 minutes ago, kumar_tarak said:

Idi tirupati- tirumala trial run esaru now brought to amaravathi....once the trial run is done they would procure more buses....

BYD delivered 5 buses to TSRTC last week out of 100 buses ordered , next delivery to APSRTC within 3-4 weeks

hyd ki 40 vacchinattuyi bro last week lo

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...