Jump to content

AP ki Nitin Gadkari Gift


sonykongara

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌కు నితిన్ గడ్కరీ గిఫ్ట్
 
 
636426571726868828.jpg
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే అనంతపురం, అమరావతి రహదారి నిర్మాణంలో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి కూడా ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు గౌరవార్థం ఇచ్చిన విందులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. లంచ్ టేబుల్‌పై రెండు అంశాల ఆవస్యకతను చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీకి గట్టిగానే వివరించారు.
 
జలరవాణా ప్రాజెక్టు ప్రాథమిక దశ పనుల శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. వారి సమక్షంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తర్వాత వారి గౌరవార్థం విందు ఇచ్చారు. ఇందులో సీఎం, వెంకయ్య, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు గడ్కరీ, సుజనా చౌదరి, స్పీకర్ కోడెల ఒకే టేబుల్‌పై కూర్చున్నారు. 2010-2011లో పోలవరం అంచనా వ్యయం రూ. 16కోట్లు కాగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 58,319 కోట్లుగా ఉందని దీనిని వెంటనే ఆమోదించాలని చంద్రబాబు, గడ్కరీని కోరారు. ఈ అంశం కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉందని వచ్చేవారం ఢిల్లీకి వచ్చి పని చేయించుకోవాలని, వెంటనే ఆమోదిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.
 
మొత్తం అంచనా వ్యయంలో రూ. 33,858 కోట్లు కేవలం భూసేకరణకే సరిపోతుందని నీటిపారుదల శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ శశిభూషణ్ వివరించారు. దీనిపై స్పందించిన గడ్కరీ వచ్చేవారం సుజనా చౌదరీతో కలిసి తనవద్దకు రావాల్సిందిగా చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన రూ. 2,800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూస్తామని అన్నారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని పోలవరంను పూర్తి చేయాల్సిన ఆవస్యకతను వివరించారు. పట్టిసీమ ఎత్తిపోతల పతకం నిర్మించకపోతే 13 లక్షల ఎకరాలు బీడుగా మారిపోయేవని తెలిపారు. శ్రీశైలం సాగర్‌లో పరిస్థితిని ఆయన గడ్కరీ దృష్టకి తీసుకువచ్చారు. పోలవరం పూర్తి చేస్తే ఏపీలో తాగునీటి సమస్య 50 శాతానికి పైగా పరిష్కారమవుతుందని తెలిపారు. వెంకయ్య కూడా చంద్రబాబు వాదనకు మద్దతు తెలుపుతూ నదుల అనుసంధానమే సమస్యకు పరిష్కారమని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఏడు మండలాలను కలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

Link to comment
Share on other sites

Proper documentation and plan lekunda central funds release cheyaru. It's not as simple as we discuss.

 

But, few central ministers gave more than what they can do. BJP meedha vyathitekatha thagginchukunte manchidhi. Ledhu memu as usual ga oppose chestham ante, indirect ga Congi ni paiki lepinattu avuthundhi.

 

I hope Congi ni central lo malli choodatam istam ledhu meeku ane anukuntunna.

Link to comment
Share on other sites

Proper documentation and plan lekunda central funds release cheyaru. It's not as simple as we discuss.

 

But, few central ministers gave more than what they can do. BJP meedha vyathitekatha thagginchukunte manchidhi. Ledhu memu as usual ga oppose chestham ante, indirect ga Congi ni paiki lepinattu avuthundhi.

 

I hope Congi ni central lo malli choodatam istam ledhu meeku ane anukuntunna.

Cong better than B odi

Link to comment
Share on other sites

అధ్యయనంలోనే ఏపీ వినతులు

కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి రాని పూర్తి స్థాయి సానుకూల స్పందన

ఈనాడు, అమరావతి: జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కీలక విజ్ఞప్తులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ నుంచి పూర్తి స్థాయి సానుకూల స్పందన రాలేదు. రాష్ట్ర రహదారుల ముఖచిత్రాన్ని మలుపు తిప్పగల స్థాయిలో కొన్ని ప్రాధాన్యమున్న ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కొన్నాళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్న వాటినే సీఎం మరోసారి ప్రస్తావించారు. రాజధాని అమరావతిని రాయలసీమతో అనుసంధానించే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే, అమరావతి అంతర్‌ వలయ రహదారులకు భూసేకరణ వ్యయంలో కనీసం కొంత భాగమైనా కేంద్రం భరించేలా చూడటం ఇందులో ముఖ్యమైనవి. గత దిల్లీ పర్యటనలో గడ్కరీని కలిసినప్పుడు ఈరెండింటినీ సీఎం కోరినా... విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. తాజా పర్యటనలోనూ దీనిపై నిర్దిష్టమైన హామీ లభించలేదని అధికార వర్గాల కథనం. అధ్యయనం చేస్తున్నామనే మరోసారి గడ్కరీ అన్నట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన ఆరు అంశాలు...

1. అమరావతి-అనంతపురం కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే: భూసేకరణ చేపట్టటానికి వీలుగా జాతీయ రహదారిగా గుర్తించే ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. భూసేకరణ వ్యయంలో 50శాతం కేంద్రం భరించాలి.

2. అమరావతి అంతర్‌ వలయ రహదారి(ఏఓఆర్‌ఆర్‌): చెన్నై-కోల్‌కతా, పుణె-మచిలీపట్నం జాతీయ రహదారులను కలిపే బైపాస్‌ రహదారిగా దీనిని గుర్తించినందున భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరించాలి. దీనికి వెంటనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రూవల్‌ కమిటీ (పీపీపీఏసీ) అనుమతి ఇప్పించాలి.

3. విశాఖపట్నం-రాయ్‌పూర్‌ కారిడార్‌: దీని నిర్మాణానికి వెంటనే సవివర నివేదిక(డీపీఆర్‌) తయారు చేయించాలి.

4. విజయవాడ-గుండుగొలను రహదారి: విజయవాడ బైపాస్‌ రహదారితో కూడిన ఈప్రాజెక్ట్‌ని గతంలో గామన్‌ ఇండియా సంస్థకి చేసిన కేటాయింపును రద్దు చేసినందున వెంటనే ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలి. త్వరగా పని పూర్తయ్యేందుకు వీలుగా ఈపనిని మూడు ప్యాకేజీలుగా విడదీయాలి.

5. కొత్త జాతీయ రహదారుల ప్రకటన: దాదాపు 1,722 కిలోమీటర్ల పొడవుండే 18 రహదారులను జాతీయ మార్గాలుగా గుర్తించాలి. ఇవన్నీ రెండు వేర్వేరు జాతీయ రహదారుల్ని కలుపుతూగాని, ఇతర రాష్ట్రాలకు దారితీసేలాగాని ఉన్నాయి.

6. రూ.1,250కోట్ల అదనపు నిధులు: ఇటీవల కొత్తగా జాతీయ రహదారులుగా గుర్తించిన వాటిల్లో 100 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్వహణకి రూ.250కోట్ల మేర అదనంగా నిధులు కేటాయించాలి. ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల్ని మరమ్మతు చేసి వెడల్పు చేసేందుకు, పటిష్ట పరిచేందుకు రూ.వెయ్యి కోట్లు మంజూరుచేయాలి.

Link to comment
Share on other sites

Modi and batch ippati varaku AP vacchinappudu icchina dabbulu tho singapore yenti daani babu lanti dhi kattukune pani

 

Modi govt panulu yela untaayo baaga choostunnam..............Vizag metro ki budget lo 3 lacchalu icchinappude ardham aiyindhi vallaki AP meeda unna commitment and respect

Link to comment
Share on other sites

జాతికే ఖ్యాతి
04-10-2017 01:56:37
 
636426790244525210.jpg
  • పోలవరం ప్రాజెక్టు దేశానికే జీవనాడి: గడ్కరీ
  • నవ్యాంధ్ర కలలు సాకారం చేస్తాం
  • 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం బాధ్యత మోపారు
  • భారమైనా ఆ బాధ్యతను నెరవేరుస్తాం
  • రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రత్యేక ప్రాధాన్యం
  • పోలవరంపై చంద్రబాబువి కఠిన లక్ష్యాలు
  • ఆ లక్ష్యాలను చేరుకునేలా సహకరిస్తాం
  • అంతర్గత జల రవాణా పనులు పూర్తి చేస్తాం
  • యుద్ధప్రాతిపదికన ఎన్‌హెచ్‌ పనులు: గడ్కరీ
అమరావతి/ఏలూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కే కాదు. జాతికే జీవనాడి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఏపీ ప్రజల కలలను సాకారం చేస్తుంది.’ అని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం ఆరు జాతీయ రహదారులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. మరో ఏడు జాతీయరహదారులను జాతికి అంకితం చేశారు. ముక్త్యాల నుంచి విజయవాడ వరకు సాగే నాలుగో నంబర్‌ జాతీయ జలమార్గం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు.
 
ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించి, స్పిల్‌వేను సందర్శించారు. అంతకు ముందు పట్టిసీమనూ సందర్శించారు. ఆయా సందర్భాల్లో గడ్కరీ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును 2018కి 80 శాతం, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే నూరు శాతం పూర్తి చేయాలని సీఎం తనపై బాధ్యత మోపారని, భారమైనా నెరవేరుస్తానన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి అన్ని వేళలా.. అన్ని విధాలా కేంద్రం తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య శంకుస్థాపన చేసిన ఆరు జాతీయ రహదారులను తన హయాంలోనే పూర్తి చేస్తానని అన్నారు. ‘చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తికావాలని.. ఇందుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
 
నాకు ఉపరితల రవాణా, అంతర్గత జల రవాణా, షిప్పింగ్‌ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంది. నదుల అనుసంధానం.. ప్రాజెక్టులపై ఇంకా అవగాహన ఏర్పడలేదు. పోలవరం వంటి భారీ బహుళార్ధ సాధక ప్రాజెక్టు గురించి చంద్రబాబు చెబుతున్నప్పుడు.. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పుడు.. నా పరిస్థితి ఔనని, కాదని చెప్పలేకుండా ఉంది. అయినా చంద్రబాబు కోరుతుంటే వెంటనే పూర్తి చేస్తానంటూ హామీ ఇవ్వాలనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 70 నుంచి 80 శాతం సమస్యలు తన శాఖ వద్దే ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని అంగీకరించారు. తాను విదర్భ ప్రాంతానికి చెందిన రైతునని.. సాగునీటి కష్టాలేమిటో.. నీటి విలువ ఏమిటో తనకూ తెలుసునని గడ్కరీ వ్యాఖ్యానించారు.
 
100 శాతం నీటిని సద్వినియోగం చేసే డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటి వాటికి రైతులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రంలో చెన్నై-బెంగళూరు కారిడార్‌, చెన్నై- వైజాగ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సంబంధించిన పనులకు క్లియరెన్సులు ఇప్పటికే ఇచ్చేశామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీని ఇవ్వలేనని గడ్కరీ చెప్పారు. ఇదే సమయంలో తనకు నీరంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సంపూర్ణ అధ్యయనం చేశాక నిధులు మంజూరు చేసి పనులను పరుగులెత్తిస్తానని చెప్పారు. వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడమే తన విజయరహస్యమని .. పోలవరం విషయంలోనూ ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
 
చంద్రబాబుపై ప్రశంసలు
చంద్రబాబు దూరదృష్టి కలిగిన నాయకుడని.. అటువంటి సమర్థుడి నేతృత్వంలో రాష్ట్ర పాలన ఉండటం ఏపీ అదృష్టమని గడ్కరీ ప్రశంసించారు. కేంద్రానికి కూడాచంద్రబాబు వంటి దూరదృష్టి కలిగిన నేతల సలహాలూ.. సూచనలు అవసరమన్నారు. ‘వచ్చే ఏడాది ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరందించాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.ఇది కఠినమైనప్పటికీ ఆయన లక్ష్యం నెరవేరేందుకు నా శాఖ పూర్తిగా సహకరిస్తుంది. సాధారణంగా ఒక ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే సమాంతరంగా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఇది జాతికి శ్రేయస్కరం కాదు’ అని వ్యాఖ్యానించారు. స్పిల్‌వే పనులు అత్యంత వేగవంతంగా ఈ మూడేళ్లలోనే ఒక స్థాయికి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నాటికి పనులు మరింత పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహకారం ఉంటుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.
 
పోలవరం.. అద్భుతం: గడ్కరీ
‘పోలవరం నిజంగా ఓ అద్భుతం’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మంగళవారం గడ్కరీని, గవర్నర్‌ నరసింహన్‌కు ఏరియల్‌ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును చూపించారు. అంతకు ముందు పట్టిసీమ వద్ద కుడి కాల్వలోకి గోదావరి జలాలు మళ్ళిస్తున్న ప్రాంతానికి వారిని తీసుకువెళ్లారు. అక్కడ గోదావరి జలాలకు అందరూ కలిసి పూజలు చేశారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి జలాలు వినియోగించుకునే తీరు పట్ల గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాంక్రీటు పనులను, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. రేడియల్‌ గేట్లకు గడ్కరీ, నరసింహన్‌ కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. పనులపై అధికారిక సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా వాతావరణం సహకరించకపోవడంతో దాన్ని రద్దు చేసుకుని గడ్కరీ విజయవాడ చేరుకున్నారు.
 
తుది అంచనాలపై చర్చిద్దాం రండి!
రాష్ట్ర జల వనరుల శాఖ పంపిన పోలవరం తుది అంచనాలపై కేంద్ర జల సంఘం సుముఖంగా ఉందని గడ్కరీ వెల్లడించారు. దీనిపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ను ఆహ్వానించారు. ప్రాజెక్టు తుది అంచనాలపై సీడబ్ల్యూసీ ఆమోదంతోపాటు కేంద్ర కేబినెట్‌ ఆమోదమూ పొందాల్సి ఉన్నందున వీటిపై ప్రధానితోనూ చర్చించాల్సి ఉందని గడ్కరీ తెలిపారు.
 
రూ.4153 కోట్ల విలువైన ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఆరు నూతన జాతీయ రహదారి ప్రాజెక్టులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రాజెక్టులకు రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. మరో ఏడు జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.4153 కోట్లు. ప్రాజెక్టుల వివరాలు..
 
శంకుస్థాపన చేసినవి
  • ఎన్‌హెచ్‌ 340లో భాగంగా రాయచోటి- అంగల్లు సెక్షన్‌ను కలుపుతూ రూ.319 కోట్లతో 57.98 కి.మీ. రహదారి
  • ఎన్‌హెచ్‌ 26లో భాగంగా విజయనగరం శివారులో నాలుగు లైన్ల బైపాస్‌ నుంచి విజయనగరాన్ని కలిపేందుకు రూ.429 కోట్లతో 17.2 కిలోమీటర్ల మేర చేపడుతున్న నిర్మాణం
  • ఎన్‌హెచ్‌ 216లో భాగంగా ఈపూరుపాలెం- ఒంగోలు సెక్షన్‌ మధ్య రూ.574 కోట్లతో చేపట్టనున్న 57.87 కిలోమీటర్ల రహదారి
  • కృష్ణా జిల్లా మచిలీపట్నం- అవనిగడ్డ మధ్య 34.4 కిలోమీటర్ల మేర రూ.376 కోట్లతో రహదారి
  • తూర్పుగోదావరి జిల్లాలో పాసర్లపూడి- దిండి సెక్షన్‌ మధ్య రూ.263 కోట్లతో 21 కిలోమీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణం
  • రేపల్లె- ఈపూరుపాలెం మధ్య రూ.576 కోట్లతో 62 కిలోమీటర్ల మేర చేపడుతున్న రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
  • జాతికి అంకితం చేసినవి
  • ఎన్‌హెచ్‌ 30లో భాగమైన చంద్రగూడెం- ఏపీ, తెలంగాణ సరిహద్దును కలిపే 38 కిలోమీటర్ల రహదారి
  • ఎన్‌హెచ్‌ 42లో భాగమైన అనంతపురం- ముదిగుబ్బ పట్టణం మధ్య 33.5 కిలోమీటర్ల రహదారి
  • ఎన్‌హెచ్‌ 565లో భాగమైన దావులపల్లి- మార్కాపురం 43.4 కి.మీ. రహదారి, మార్కాపురం- వాగంపల్లె 95 కి.మీ. రహదారి
  • వాగంపల్లె- దోర్నాల టి జంక్షన్‌ మధ్య 67 కిలోమీటర్ల రహదారి
  • ఎన్‌హెచ్‌ 67లో భాగమైన మైదుకూరు- దోర్నాల టి జంక్షన్‌ మధ్య 52 కిలోమీటర్ల రహదారి.
  • దోర్నాల టి జంక్షన్‌- ఆత్మకూరు మధ్య 53 కిలోమీటర్ల రహదారి.
Link to comment
Share on other sites

Proper documentation and plan lekunda central funds release cheyaru. It's not as simple as we discuss.

 

But, few central ministers gave more than what they can do. BJP meedha vyathitekatha thagginchukunte manchidhi. Ledhu memu as usual ga oppose chestham ante, indirect ga Congi ni paiki lepinattu avuthundhi.

 

I hope Congi ni central lo malli choodatam istam ledhu meeku ane anukuntunna.

 

Criticism apart, at any given time better than cong accepted. But yeppudu aiyithe jaffas tho kaapuraaniki ready ayyaro.............Modi and shah are no different from Congi batch. YS gadu tirumala lo velaga pettina baagotham marchipolemu, jaffa gaadu tirumala lo chesina raccha maruvalemu. Uppudu vaadi tho RSS and Modi ranku yedhi aiyithe undho, it s big time let down!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...