Jump to content

Spices park Guntur


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు.. శ్రీకారం
 
 
636427911539752580.jpg
  • ప్రారంభానికి స్పైసెస్‌ పార్కు సన్నద్ధం
  • ముందుకు వచ్చిన అంతర్జాతీయ సంస్థలు
  • నేడు గుంటూరులో సమీక్ష
  • రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవగాహన
ఆంధ్రజ్యోతి, గుంటూరు: సుగంధ ద్రవ్యాల పంటలు, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులకు రంగం సిద్ధమైంది. చిలకలూరిపేట - గుంటూరు రోడ్డులోని యడ్లపాడు మండలం మైదవోలులో స్థాపించిన స్పైసెస్‌ పార్కు పని ప్రారంభించబోతోంది. పార్కు ద్వారా సుగంధ ద్రవ్యాల పంటలు, అనుబంధ ఉత్పత్తులు ఎగుమతులు చేయడానికి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకొచ్చాయి. వివిధ వ్యాపార సంస్థలు, రైతులు, ఎగుమతి దారులతో గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 126 ఎకరాల్లో 30 - 40 అంతర్జాతీయ ఎగుమతుల సంస్థల అధిపతులు, కార్పొరేట్‌ వ్యాపారులు ఇప్పటికే రంగంలోకి వచ్చారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని స్పైసెస్‌ బోర్డు కార్యాలయం ద్వారా విదేశాలకు సుగంద ద్రవ్యాల పంటలు, అనుబంద ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
 
పసుపు, మిర్చిలపై ప్రత్యేక దృష్టి
గుంటూరు జిల్లా అంతర్జాతీయ స్థాయిలో మిర్చి పంట, అనుబంధ ఉత్పత్తులకు కేంద్రంగా ఉంది. దుగ్గిరాల యార్డు పసుపు లావాదేవీల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. మిరప కాయలు, కారం, ఆయిల్‌, ఇతర అనుబంధ ఉత్పత్తులను అనేక సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి. అదే తరహాలో పసుపు కొమ్ములు, పొడి, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనేక సంస్థలు బోర్డులో నమోదు చేసుకున్నాయి. 2017-18లోనే భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న స్పైసెస్‌ బోర్డు అధికారులు సుగంధ ద్రవ్యాల పంటలు, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులకు శ్రీకారం చుట్టారు. గుంటూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాల పంటల్లో నాణ్యతను మెరుగుపరిచి రైతులకు మెరుగైన ధరలు ఇప్పించడానికి బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆవు పేడ, మూత్రం ద్వారా ప్రకృతి సేద్యం చేయడానికి ఉద్యానవన, వ్యవసాయ శాఖలతో స్పైసెస్‌ బోర్డు ఉమ్మడి ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన ఫార్మర్‌ ప్రొడ్యుసర్‌ ఆర్గనైజేషన్స్‌ (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు - ఎఫ్‌పీవో)ను నాబార్డు ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. పసుపు, మిర్చి, కరివేపాకు, ఇతర సుగంధ ద్రవ్యాల పంటలు పండించే రైతులతో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌ల ద్వారా నేరుగా విదేశాలకు పంటలు, అనుబంధ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తారు. ఎగుమతుల్లో పాటించాల్సిన నిబంధనలపై ఎఫ్‌పీవోలకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.
 
name.jpgరైతులతో నేరుగా ఎగుమతులు..
ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను పండించే రైతులు నేరుగా విదేశాలకు, అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యాపార సంస్థలకు తమ సరుకు అమ్మే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయంలో సుగంధ ద్రవ్యాలను పండిస్తాం. ఈ పంటలలో నాణ్యతను స్పైసెస్‌ ల్యాబ్‌లో నిర్ధారిస్తాం. నాణ్యతా వివరాలను స్పైసెస్‌ పార్కు ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో డిస్‌ప్లే చేస్తాం. మెరుగైన ధరలు తెప్పించి రైతులకు అండగా ఉంటాం.
- డాక్టర్‌ తంపి, స్పైసెస్‌ బోర్డు డీడీ
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 7 months later...
త్యాధునిక శీతల గిడ్డంగుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
07-05-2018 17:09:37
 
636613097762148158.jpg
గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు సుగంధ ద్రవ్యాల పార్కులో అత్యాధునిక శీతల గిడ్డంగుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.46 కోట్లతో 13 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించనున్న రెండు గిడ్డంగులకు ఆన్‌లైన్ ద్వారా సీఎం శంకుస్థాపన చేశారు. మిర్చి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు, నీటి శుద్ధి ప్లాంటు, శ్రామికులకు విశ్రాంతి, వసతి సౌకర్యం కల్పిస్తామని గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్సార్కే ప్రసాద్ అన్నారు.
Link to comment
Share on other sites

స్పైసెస్‌ పార్కులో పనులు చేపట్టరే..?
24-05-2018 07:15:17
 
636627429198485486.jpg
  • 58 ప్లాట్లలో 48 ప్లాట్ల కేటాయింపు
  • రెండు సంస్థలే సంసిద్ధం
  • పనులు ప్రారంభించని కార్పొరేట్‌ సంస్థలు
  • భూమి కేటాయింపులను రద్దుచేస్తామన్న అధికారులు
గుంటూరు: గుంటూరు-చిలకలూరిపేట రోడ్డులో యడ్లపాడు మండలంలోని స్పైసెస్‌ పార్కును సుమారు 130 ఎకరాల్లో నిర్మించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులు చేసే పలు కంపెనీలకు గ్లోబల్‌ టెండర్ల ద్వారా భూములు కేటాయించారు. ఎకరం రూ.7.5 లక్షల వంతున డిపాజిట్‌ చెల్లించారు. ప్రతి ఏటా ఎకరానికి రూ.వెయ్యి వంతున మెయింటెనెన్స్‌ నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే పనులు ప్రారంభించాయి. అవి... ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 24.72 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో గిడ్డంగులు నిర్మించబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం పనులు ప్రారంభించింది. .కేరళకు చెందిన క్వాలిటీ ఫుడ్‌ ప్రాడెక్ట్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థకు 2.18 ఎకరాలు కేటాయించారు. రూ.6 కోట్లతో ఈ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది.
 
పనులు ప్రారంభించని సంస్థలు..
  • పనులు ప్రారంభించిన రెండు సంస్థలు మినహాయించి మిగిలిన పది సంస్థల వివరాలిలా ఉన్నాయి.
  • కర్నాటకలోని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఏసీఈ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థకు సుమారు రెండు ఎకరాలు కేటాయించారు.
  • ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వాని కార్పొరేషన్‌ సంస్థకు 2.022 ఎకరాలు కేటాయించారు.
  • తాడేపల్లిగూడెంకు చెందిన నంద్యాల సత్యనారాయణ 1.26 ఎకరాల్లో సంతా మార్కెట్‌ పేరుతో ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు స్థలం పొందారు.
  • వినుకొండకు చెందిన స్పిక్‌నెక్స్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ నాలుగు కోట్లతో 1.91 ఎకరాల్లో ఎగుమతి కేంద్రాన్ని స్థాపిస్తామని లైసెన్సు తీసుకున్నారు.
  • పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉమ ఎక్స్‌పోర్ట్స్‌ అనే సంస్థ సుమారు రెండు ఎకరాలు, తమిళనాడులోని యర్నాకులంకు చెందిన గ్రీన్‌మౌంట్‌ అనే సంస్థ సుమారు ఎకరం, మహారాష్ట్రకు చెందిన జాబ్స్‌ ఇంటర్నేషన్‌ అనే సంస్థ సుమారు 3ఎకరాలు, కేరళకు చెందిన ఈస్ట్రన్‌ కండీమెంట్స్‌ అనే సంస్థ 3.65 ఎకరాలు, తమిళనాడుకు చెందిన పి.సి కన్నన్‌ అనే సంస్థ సుమారు ఎకరం, గుంటూరు అగ్రహారానికి చెందిన రామి అగ్రోట్రేడర్స్‌ అనే సంస్థ సుమారు ఎకరం, భువనేశ్వర్‌కు చెందిన ఎస్‌కె ఆగ్రో బయోటెక్‌ అనే సంస్థ 1.11 ఎకరం, విశాఖపట్నంకు చెందిన ఎస్‌ఎంఈ అగ్రిటెక్స్‌ అనే సంస్థ సుమారు రెండు ఎకరాలు, హైదరాబాద్‌ మలక్‌పేటకు చెందిన డీకే ఎంటర్‌ ప్రైజస్‌ అనే సంస్థ 1.059 ఎకరాలు, గుంటూరు జీటీ రోడ్డుకు చెందిన ఐటీసీ సంస్థ రూ.30 కోట్లతో సుగంద ద్రవ్యాల ఎగుమతులు నిర్వహించడానికి 6.19 ఎకరాలు తీసుకుంది.
బినామీలకు కేటాయించడానికే...
దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్‌ సంస్థలు గ్లోబల్‌ టెండర్ల ద్వారా స్పైసెస్‌ పార్కులో ప్లాట్లు పొందాయి. నిబంధనల మేరకు ప్రభుత్వానికి డిపాజిట్లు చెల్లించాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పైసెస్‌ పార్కులో రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, గిడ్డంగులు ఇతర అన్ని రకాల వసతులు కల్పించాయి. 16 కంపెనీలకు 48 ప్లాట్లు కేటాయించగా ఇప్పటివరకు 14 కంపెనీలు అసలు పనులే ప్రారంభించలేదు. ప్రముఖ పొగాకు ఎగుమతుల సంస్థ ఐటీసీ మినహా మిగిలిన 13 సంస్థలు ఎప్పుడు పనులు ప్రారంభిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సంస్థలు తాము స్వాధీనం చేసుకున్న భూములు, ప్లాట్లను బినామీ పేర్లతో ఇతరులకు కేటాయించే ఏర్పాట్లలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన తరువాత గుంటూరు- చిలకలూరిపేట రోడ్డులోని స్పైసెస్‌ పార్కుకు గిరాకీ పెరిగింది. ప్రధానంగా గుంటూరులో ఐటీసీ జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అగ్రి ఎక్స్‌పోర్టు జోన్‌ను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ ఇప్పటికే గుంటూరు కేంద్రంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. దీంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. పలుకుబడి, పరపతి ద్వారా ప్లాట్లు పొందిన వ్యాపారులు బినామీలతో పరిశ్రమలు స్థాపించాలనే ఏర్పాట్లలో ఉన్నారు.
 
ఉద్యానశాఖ కమిషనర్‌ సమీక్ష
ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కొన్ని సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి, స్పైసెస్‌ బోర్డు డీడీ డాక్టర్‌ శ్రీకంఠం తంపి నాలుగైదు రోజుల క్రితం చుట్టుగుంట సెంటర్‌లోని స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో నేరుగా వ్యాపారులు, ఎగుమతి దారులు, ప్లాట్లు పొందిన సంస్థలతో సమీక్షించారు. జూలై నెలాఖరులోపు కార్పొరేట్‌ సంస్థలు తమ ఎగుమతి పరిశ్రమలను స్థాపించకపోతే భూముల కేటాయింపులను రద్దుచేస్తామని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి హెచ్చరించారు.
 
 
 
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...