Jump to content

25 సీట్ల పైనా కన్ను!


sonykongara

Recommended Posts

25 సీట్ల పైనా కన్ను!
25-09-2017 01:53:28
 
636419039394884020.jpg
  • ఏపీలోని ఎంపీ స్థానాలపై కమలం గురి!
  • ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు
  • అక్టోబరులో అమిత్‌షా రాక?
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిన వికాసానికి కమలనాథులు పెద్ద కసరత్తే ఆరంభించారు. 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల బాధ్యతలను మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన పార్టీ నాయకులకు అప్పగించింది. పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుకు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం బాధ్యతలు కట్టబెట్టింది. తెలంగాణకు చెందిన ఆయన ఏబీవీపీ నుంచి వచ్చారు. విద్యార్థి రాజకీయాల్లో ఉస్మానియా నుంచి జమ్మూకశ్మీర్‌ వరకు పలుచోట్ల పనిచేసి ఎదిగారు. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో పనిచేసి బీజేపీ మంచి ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల నాడిని పట్టి పార్టీని అక్కడ బలోపేతం చేస్తారని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఆయన అప్పుడే విశాఖ వచ్చి తన పని ప్రారంభించారు కూడా.
 
ఇక మహారాష్ట్ర విద్యా మంత్రి వినోద్‌ తావ్‌డేకు రాయలసీమ బాధ్యతలు అప్పగించారు. అక్కడున్న మొత్తం ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో పర్యటించి బూత్‌స్థాయిలో పరిస్థితిని అంచనావేసి పార్టీకి ఆయన నివేదిక ఇస్తారు. సీమలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, యువత నాడి పట్టి పార్టీని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌షా యోచిస్తున్నారు. కోస్తా బాధ్యతలను కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌కు అప్పగించారు. రాష్ట్రంలో ఇది కీలక ప్రాంతం కావడంతో కేంద్ర మంత్రిని ఎంపికచేసినట్లు సమాచారం. బీజేపీకి ఈ ప్రాంతంలో మొన్నటివరకూ వెంకయ్యనాయుడు పెద్దదిక్కుగా ఉండేవారు. ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాక రాష్ట్రంలోని ఇద్దరు ఎంపీల్లో ఒకరికి అవకాశం వస్తుందని భావించారు.
 
కానీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆర్‌కేసింగ్‌ను ఇక్కడకు పంపుతున్నారు. బ్యూరోక్రాట్‌ అయిన సింగ్‌ యూపీ రాజకీయాల్లో ఇప్పటికే క్రియాశీలంగా ఉన్నారు. మొన్నటివరకూ అదే రాష్ర్టానికి చెందిన సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఏపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో ఆరోగ్యమంత్రిగా ఆయనకు స్థానం దక్కింది. అయితే ఇటీవల అక్కడి ఆస్పత్రుల్లో చిన్నపిల్లలు చనిపోవడం లాంటి ఘటనలు జరిగాక.. శాఖపై పట్టు సాధించేందుకు వీలుగా తనను ఏపీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. అధిష్ఠానం సరేనంది. ఈ ముగ్గురు నేతలు బూత్‌స్థాయి వరకు వెళ్లి పార్టీ బలాన్ని అంచనా వేస్తారు. కాగా.. గత నెలలో వాయిదాపడ్డ అమిత్‌షా పర్యటన అక్టోబరులో ఉండొచ్చని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...