Jump to content

భారత్‌లో విపరీతంగా పెరిగిన ఆదాయ అంతరాలు


Ramesh39

Recommended Posts

ఆదాయం.. హస్తి మశకాంతరం 

భారత్‌లో విపరీతంగా పెరిగిన ఆదాయ అంతరాలు 
ఒక్క శాతం జనాభా చేతిలో 22 శాతం సంపద 
వాస్తవాలను వెల్లడించిన ఛాన్సెల్‌, పికెటీ నివేదిక 

23hyd-main12a.jpg

ఓ వైపు కాసుల గలగలలు.. మరో వైపు కన్నీటి జలజలలు- భారతావని ప్రస్తుత ముఖచిత్రమిది. సంపదతో తులతూగే కుబేరులు ఓ వైపు.. కడు పేదరికంలో మగ్గుతున్న దరిద్ర నారాయణులు ఇంకోవైపు- మన ఆర్థిక వ్యవస్థ సృష్టించిన రెండు భిన్న పార్శా్వలివి. ఆర్థికవృద్ధి ఏటికేడు పెరుగుతున్నా...దేశంలో దారిద్య్రం ఇప్పటికీ తాండవిస్తూనే ఉంది. సంపద కేవలం కొందరి చేతుల్లోనే పోగుపడిపోతోంది. భారత్‌లో ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశ జనాభాలోని కేవలం ఒక్కటంటే ఒక్క శాతం మంది చేతుల్లోనే అత్యధిక సంపద పోగుపడిపోతోంది. దేశంలో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన 1922(బ్రిటిష్‌ హయాం) తర్వాత- అంటే దాదాపు 95 ఏళ్లలో ఇప్పుడే అత్యధిక ఆదాయపు అసమానతలు ఏర్పడ్డాయి. ఆర్జనలో ముందున్న తొలి ఒక్క శాతం మంది ఆదాయం అత్యధిక స్థాయికి చేరుకుంది. దేశ మొత్తం ఆదాయంలో దాదాపు 22 శాతం ఇప్పుడు వీరి చేతుల్లో ఉంది. ఫ్రాన్స్‌ ఆర్థిక వేత్తలు లుకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెటీలు రూపొందించిన తాజా నివేదిక ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. ‘‘భారత్‌లో ఆదాయ అసమానతలు- 1922-2014: బ్రిటిష్‌ రాజ్‌ నుంచి బిలియనీర్స్‌ రాజ్‌ వరకు’’ పేరుతో ఛాన్సెల్‌, పికెటీ ఈ నివేదికను రూపొందించారు. ఆదాయపు పన్ను, జాతీయ ఆదాయ గణాంకాలు, శాంపిల్‌ సర్వేల వివరాల్ని కూలంకషంగా విశ్లేషించిన తర్వాత వీరు ఈ నివేదికను తయారుచేశారు.


దేశంలో ఆదాయ అసమానతలు మొదటి నుంచీ ఉన్నా.. అవి 1980ల తర్వాత విపరీతంగా పెరిగిన విషయాన్ని నివేదిక గణాంక సహితంగా వివరించింది. ఆదాయార్జనలో ముందున్న తొలి ఒక్క శాతం మంది సంపద- 1930 కన్నా ముందు జాతీయాదాయంలో 21% కన్నా తక్కువగా ఉండేది. 1950-80 మధ్య కాలంలో ఇది 13 శాతం కాగా... 1980ల ఆరంభంలో అది 5 శాతానికి తగ్గిపోయింది. 1980ల మధ్యలో ప్రారంభమైన వ్యాపార, మార్కెట్‌ అనుకూల చర్యల వల్ల వీరి ఆదాయం 2000 నాటికి 10 శాతానికి పెరిగింది. ఆ తర్వాత గణనీయంగా వృద్ధిచెందుతూ వచ్చి.. ప్రస్తుతం 22 శాతానికి చేరుకున్నట్లు నివేదిక వివరించింది. (జాతీయ శాంపిల్‌ సర్వే అంచనాల ప్రకారం- ఇది 28 శాతం, ‘క్రెడిట్‌ సూయిసీ’ ప్రకారమైతే ఇది 58 శాతంగా ఉంది). ప్రైవేటీకరణ, వ్యాపార వృద్ధి, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం.. ఇలా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలైన తర్వాత- ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి.

23hyd-main12b.jpg

దేశంలో 1950ల నుంచి 1970ల మధ్య తీవ్రమైన మార్కెట్‌ ఆంక్షలు, పురోగామి పన్ను విధానం అమల్లో ఉండేవి. 1951-80 మధ్యకాలంలో ఆదాయంలో అడుగునున్న దేశ జనాభాలోని 50 శాతం మంది వృద్ధిరేటు 28 శాతంగా నమోదయింది. ఇది సగటు వృద్ధికన్నా ఎక్కువ. ఇదే సమయలో అత్యంత సుసంపన్నులైన 0.1 శాతం మంది ఆదాయం తగ్గిపోయింది. 1980ల మధ్యలో నెమ్మదిగా ఆర్థిక సరళీకరణ ప్రక్రియ ఆరంభమైంది. రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదాయ అసమానతలు పెరగడం మొదలైంది. దేశీయ మార్కెట్‌ను బార్లా తెరవడం ప్రారంభమైన తర్వాత వ్యక్తుల వ్యక్తిగత ఆదాయాల్లో సమూల మార్పులొచ్చాయి. 1980-2014 మధ్య కాలంలో సుసంపన్నులైన 0.1 శాతం మంది ఆదాయం 12 శాతం కాగా.. ఆదాయంలో అడుగునున్న దేశ జనాభాలోని 50 శాతం మంది ఆదాయం 11 శాతంగా నమోదుకావడం గమనార్హం. ఆర్జనలో ముందున్న 10% మందిలో అభివృద్ధి విభజన అస్తవ్యస్తంగా జరిగింది. ఒక్క శాతం జనాభా చేతిలోనే అత్యధిక సంపద పోగుపడుతూ వచ్చింది. మధ్యస్థాయి ఆదాయ వర్గం(జనాభాలో 40%) వాటా 29 శాతానికి పెరిగింది.

చైనాతో పోలిక ఇలా... 
1980ల తర్వాత కొన్నేళ్లపాటు భారత్‌-చైనా జాతీయ ఆదాయాల్లో పెద్దగా తేడా లేదు. అయితే ఆ తర్వాత భారత్‌లో మధ్యస్థాయి ఆదాయ వర్గం వాటా 23 శాతానికి పెరగ్గా... చైనాలో అది 43 శాతానికి పెరిగింది. ఈ 20 శాతం భారీ అంతరాన్ని భారత్‌లో ఒకశాతం జనాభా అందిపుచ్చుకుని.. విపరీతంగా ఎదిగిపోయింది. భారత్‌లో మధ్యస్థాయి ఆదాయవర్గం కంటే చైనాలో మధ్యస్థాయి వర్గం బాగా లాభపడింది. అట్టడుగునున్న 50 శాతం జనాభా ఆదాయాల్లో మాత్రం రెండు దేశాల్లోనూ పెద్దగా తేడాలేదు. ఉత్పాదక రంగం కొత్త పుంతలు తొక్కడం చైనా ఘన విజయానికి కారణం కాగా.. ఆ విషయంలో భారత్‌ వెనుకబడింది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ విస్తరణల ప్రభావంతో వ్యవసాయరంగాన్ని వీడిన లక్షల మందికి తగిన ఆదాయాన్ని సమకూర్చే విషయంలో భారత్‌ విఫలమైంది. ఫలితంగా అట్టడుగునున్న 50 శాతం జనాభా ఆదాయాల్లో వృద్ధి జరగలేదు.

23hyd-main12f.jpg ఇంత మంది కుబేరులా! పి.వి.నరసింహారావు హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు వ్యక్తుల మధ్య ఆదాయ అంతరాల్ని అంతకంతకూ పెంచుతూ వచ్చాయి. ఫోర్బ్స్‌ పత్రిక వెలువరించే ప్రపంచ కుబేరుల జాబితాలో 1990ల కన్నా ముందు ఒక్క భారతీయుడి పేరూ ఉండేది కాదు. 1990ల తర్వాత జాతీయాదాయంలో వీరి వాటా 2 శాతం. 2015 నాటికి ఇది 10 శాతం. ప్రస్తుతం ఫోర్బ్స్‌ జాబితాలో చోటుదక్కిన భారతీయల సంఖ్య 101. భారత్‌, చైనాలాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో గ్రామీణ, పట్టణ ఆదాయాల మధ్య అసమతౌల్యం విపరీతంగా ఉంటుందని, వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలకు ఇదో ప్రధాన కారణమని నివేదిక వివరించింది. ప్రపంచీకరణ పుణ్యమా అని.. పట్టణీకరణ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. నిపుణులైన మానవ వనరులకు బాగా గిరాకీ ఏర్పడింది. వారి ఆదాయాలూ పెరుగుతూ వచ్చాయి. 23hyd-main12e.jpg23hyd-main12g.jpg 
23hyd-main12c.jpg 
23hyd-main12d.jpg

- ఈనాడు ప్రత్యేక విభాగం
Link to comment
Share on other sites

Good, going towards American style economy. 

 

Future lo middle and lower middle class S naaki povataaniki manchi signals ivi. 

Why America? it is the same in other countries too. the other option is socialism.. Do you want it? china is also moving away from it. There is no perfect system bro... Humans are selfish by nature.

 

the thing is how you look at it... evariki entha vunte manaki enduku... mana varuku jarugutonda ledha? In that way US is much better than India.... so if you say that India is moving towards US style, that means India will be much better in future than it is now.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...