Jump to content

ఎన్టీఆర్‌ వరుసగా 4.. మొత్తంగా 5!


pavanesd

Recommended Posts

http://www.eenadu.net/nri/nri.aspx?item=nri-overseas-movies&no=48

 

హైదరాబాద్‌: సినీ అభిమానులకు దసరా పండగ సందడి ‘జై లవకుశ’ చిత్రంతో 10రోజుల ముందే వచ్చింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఎన్టీఆర్‌ నటనకు అందరూ ‘జై’ కొడుతున్నారు. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో ఆయన నటన, నత్తితో డైలాగ్‌లు పలికిన విధానం, హావభావాలు, ఆహార్యం అందర్నీ కట్టిపడేస్తున్నాయి. కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయడం సాధ్యమవుతుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జై లవకుశ’ ఓవ‌ర్సీస్‌లో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకూ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లు చేరిన చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లో వరుసగా ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాల తర్వాత ‘జైలవకుశ’ ఆ మార్క్‌ను అందుకుంది. అంతకుముందు ‘బాద్‌షా’ తొలిసారి మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది.

బాబి దర్శకత్వం వహించిన ‘జైలవకుశ’లో రాశీఖన్నా, నివేదా థామస్‌లు కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించారు.

 

 

Link to comment
Share on other sites

తారక్‌కు ఇది వరుసగా నాలుగోది..!

TNN | Updated: Sep 23, 2017, 02:51PM IST
-.jpg
తారక్‌కు ఇది వరుసగా నాలుగోది..!
​ ‘జై లవకుశ’తో తారక్ మరో హిట్ ను కొట్టినట్టే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. పాజిటివ్ రివ్యూలను, ఎన్టీఆర్ నటనకు బోలెడన్ని ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్లపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. విడుదలకు ముందు భారీ వ్యాపారాన్నే చేసిన ఈ సినిమా పోస్ట్ రిలీజ్ బిజినెస్ లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కు న్యాయం చేస్తోందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఇంటా,బయట ఈ సినిమా వసూళ్ల ఊపును చూస్తుంటే.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. విడుదల అయిన రెండో రోజుకే ‘జై లవకుశ’ ఈ ఫీట్ ను సాధించిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రీమియర్ షో వసూళ్లను, గురు, శుక్రవారాల కలెక్షన్లను కలుపుకుంటే ఈ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్ల మార్కును దాటిందని అంటున్నారు. విశేషం ఏమిటంటే.. యూఎస్ లో ఎన్టీఆర్ కు సంబంధించినంత వరకూ మిలియన్ మార్కును దాటిన ఐదో సినిమా ఇది. ఇంత వరకూ బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్ల మార్కు వసూళ్లను దాటాయి. ఇప్పుడు జై లవకుశ ఐదో సినిమా.

వీటిల్లో టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశలు వరసగా వచ్చిన సినిమాలు కావడం గమనార్హం. ఓవర్సీస్ లో ఈ విధంగా ఎన్టీఆర్ హవా కొనసాగుతోంది. ఈ సినిమా యూఎస్ లో దాదాపు రెండు మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...