Jump to content

‘తారక్‌.. మాటలు సరిపోవటం లేదు’ - ఎస్‌.ఎస్‌.రాజమౌళి


Ramesh39

Recommended Posts

21brk78-ntr1.jpg

హైదరాబాద్‌: ‘నేటి యువతరంలో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని అడిగితే.. ఆయన మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ఎన్టీఆర్‌. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు కూడా. మరోసారి ఎన్టీఆర్‌ నటనకు రాజమౌళి ఫిదా అయిపోయారట. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ నటన, డ్యాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘జై లవకుశ’ సినిమాను చూసిన రాజమౌళి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘తారక్‌.. నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. మాటలు సరిపోవు. జై.. జై..’ అని ట్వీట్‌ చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...