Jump to content

GST,,,


sonykongara

Recommended Posts

జీఎస్టీ జీరో
 
 
636413810771756524.jpg
  • అభాసుపాలవుతున్న కొత్త పన్నుల విధానం
  • పాత పద్ధతిలోనే జీరో దందా యథాతథం
  • జనాన్ని దోచేస్తున్నా ఖజానాకు చేరని పన్ను
  • ఎగవేతకు వ్యాపారులకు ఎన్నెన్నో మార్గాలు
  • పన్ను వసూళ్లు సర్కారుకు చేరకుండా ఎత్తులు
  • అక్రమాలకు అవకాశమిస్తున్న పన్ను శాతాలు
  • నగదు ఇస్తే నజరానా.. కార్డు ఇస్తే బాదుడే
  • హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో తీరిదీ!
  • పన్ను ఎగవేతకు ప్రత్యేక ప్రోగ్రామింగ్‌
  • సాఫ్ట్‌వేర్‌తో నగదు లావాదేవీలు మాయం
  • ఎంపిక చేసిన బిల్లులే జీఎస్టీ ఖాతాకు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా ఉంది జీఎస్టీ పరిస్థితి. పన్నుల వసూళ్లలో క్రమశిక్షణ కోసం, మరింత రాబడి కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ ఆచరణలో అభాసుపాలవుతున్నది. పన్ను వసూలు పెరగడం సంగతి పక్కనపెడితే, మొదటికే మోసం తెచ్చేలా ఎగవేత సాగుతోంది. ఇదివరకటి ‘జీరో’ దందా ఏ మాత్రం ఆగకపోగా వినియోగదారుడిపై మాత్రం మరింత భారం పడుతోంది. జీఎస్టీ అంటేనే ప్రజలు బెంబేలెత్తి బిల్లుల్లేని దుకాణాల కోసం వెతుక్కుంటున్నారు.
 
హైదరాబాద్‌లోని ఓ బంగారం షాపు ఎలక్ర్టానిక్‌ పద్ధతిలోనే బిల్లులు ఇస్తోంది. అయితే, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై చేసిన కొనుగోళ్లపై జీఎస్టీ సర్కారుకు సరిగానే చేరుతోంది. నగదు రూపంలో చేసిన కొనుగోళ్లపై జీఎస్టీ మాత్రం సదరు షాపు ఖాతాలోకి చేరుతోంది. ఈ మేరకు ఏకంగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌నే తిరగరాయించినట్టు తెలిసింది.
 
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ షాపు యజమాని పద్ధతిగా బిల్లులిస్తున్నాడు. అయితే జనం మాత్రం బిల్లు లేకుండా, జీఎస్టీ వేయకుండా తమకు సరుకులు కావాలని అడుగుతున్నట్టు చెప్పారు. అందుకు అంగీకరించక పోవడంతో ‘అయితే మీ సరుకులు మాకు అక్కర్లేదు’ అంటూ కస్టమర్లు మరో షాపునకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.
 
రైల్వే స్టేషన్లలోనూ కొన్ని పార్కింగ్‌ ప్రాంతాల్లోనూ ఇటీవల కొత్తగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ‘జీఎస్టీ అదనం’ అంటూ అక్కడ కొత్తగా బోర్డులు కూడా పెట్టారు. కానీ, అక్కడ ఇచ్చే బిల్లు చిన్న కాగితం ముక్కే. వారు వసూలు చేస్తున్న జీఎస్టీ ప్రభుత్వానికి చేరుతోందా!? అంటే.. జవాబు అస్పష్టం. ఇందుకు కారణం.. పార్కింగ్‌కు ఎన్ని వాహనాలు వచ్చాయనడానికి సదరు పార్కింగ్‌ యజమాని ఇచ్చే వివరాలే ప్రభుత్వానికి ఆధారం. రోజుకు వంద వాహనాలు వస్తే పది వాహనాలకు పన్ను కట్టినా బేపర్వా!
 
హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొంతమంది వ్యాపారులు వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ, ఆ మొత్తాన్ని సర్కారు ఖజానాకు చెల్లించడం లేదు. మరికొందరు, అసలు జీఎస్టీనే వసూలు చేయడం లేదు. ఇంకొందరు, కార్డు పేమెంట్‌ అయితే జీఎస్టీ చెల్లించాలని, నగదు రూపంలో ఇచ్చేస్తే జీఎస్టీ ఉండదని ముందే చెప్పేస్తున్నారు. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్సు (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అవకతవకలివి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా, భారీగా పన్నుల ఆదాయంపై కన్నేస్తే, ఇప్పటికే వసూలయ్యే పన్నులు కూడా తగ్గిపోయాయి. వ్యాపారులు ఎగవేతకు కొత్త మార్గాలు కనిపెట్టారు. ఇప్పుడు జీఎస్టీ పేరిట కూడా దోపిడీ జరుగుతోంది. జీఎస్టీ వసూలు చేసే పలువురు వ్యాపారులు భిన్న మార్గాల్లో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అమలు చేస్తున్నారు. నగరంలోని వివిధ మార్కెట్లలో జీఎస్టీ అమలును ‘ఆంధ్రజ్యోతి బృందం’ నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
 
అవే పద్ధతులు.. అవే అక్రమాలు
జీఎస్టీ అమల్లోకి వస్తే హోల్‌సేల్‌ అక్రమాలకు తెర పడుతుందని ప్రభుత్వం చెప్పింది. జీరో దందాకు చెక్‌ పడుతుందని స్పష్టం చేసింది. అక్రమాల నిరోధానికి ప్రతి దశలోనూ రిటర్నుల విధానం ప్రవేశపెట్టింది. కానీ, వ్యాపారులు మూలంలోనే జీరో దందాకు తెరతీస్తున్నారు. దాంతో, అటు సర్కారు పూర్తిగా నష్టపోతుంటే.. వినియోగదారులు పాక్షికంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు, రూ.200 మించి అమ్మిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. కానీ.. అలా ఇచ్చేందుకు చాలామంది వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. నిత్యం వందల కోట్ల రూపాయిల లావాదేవీలు జరిగే బేగం బజార్‌, ఉస్మాన్‌ గంజ్‌ తదితర హోల్‌సేల్‌ మార్కెట్లలో బిల్లు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. బిల్లు అడిగితే, కొనుగోలు చేసిన సరుకుకు తగినట్లు 5 నుంచి 28 శాతం వరకూ పన్ను అదనంగా పడుతుందని చెబుతున్నారు. వెయ్యి రూపాయల కొనుగోలుకు రూ.50 నుంచి రూ.280 కట్టాలని చెబుతున్నారు. దీనికితోడు, ఇక్కడ అంతా నగదు లావాదేవీలే ఉంటాయి.
 
కార్డులు, పేటీఎంలు చెల్లవు. దాంతో, చాలామంది బిల్లులు తీసుకోకుండా నగదు ఇచ్చి సరుకులు తీసుకెళుతున్నారు. ఈ లావాదేవీల్లో ప్రభుత్వం పూర్తిగా నష్టపోతోంది. వినియోగదారుడు పాక్షికంగా నష్టపోతున్నాడు. ఎందుకంటే, కొన్ని మార్కెట్లలో నగదు ఇస్తే జీఎస్టీ వసూలు చేయడం లేదు. మరికొన్నిచోట్ల మెమోలు ఇచ్చి జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. మణికొండకు చెందిన శ్రీనివాసరావు ఇటీవల లిఫ్టు పాడైపోవడంతో విడిభాగం కొనుగోలుకు షాపునకు వెళ్లారు.
 
అది గుజరాత్‌లోనే తయారవుతుంది. దానిపై 18% జీఎస్టీ అమల్లో ఉంది. దాంతో సదరు షాపు యజమాని బిల్లు కావాలా వద్దా అని అడిగాడు. బిల్లు లేకుండా అయితే రూ.800 తగ్గుతుందని చెప్పాడు. దాంతో, బిల్లు లేకుండానే కొనుక్కుని బయటపడ్డాడు. ఇక మూలంలో లేదా హోల్‌సేల్‌ మార్కెట్లలో జీరో దందా సాగుతోంది. అక్కడి నుంచి మార్కెట్లకు, రీటెయిల్‌ మార్కెట్లకు పాకుతోంది. వెరసి, జీఎస్టీ విధానం మొత్తం అభాసుపాలవుతోంది. జీరో పేరిట పన్ను చెల్లించకుండా కొనుగోలు చేసిన వ్యాపారులు.. వాటితో తయారు చేసే వస్తువులకు జీఎస్టీ చేర్చి అమ్ముతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఐస్‌క్రీం పార్లర్లు తదితరాల్లో జీరోలో సరుకులు కొని జీఎస్టీ వేసి విక్రయాలు చేస్తున్నారు.
 
జీఎస్టీ పేరిట దోపిడీ
స్నేహితులతో ఒక రెస్టారెంట్‌కి వెళ్లాడు రాము. పార్టీ అనంతరం బిల్లు అడిగాడు. దానికి ఆ హోటల్‌ వెయిటర్‌ వినయంగా.. ‘సార్‌.. క్యాషా? కార్డా?’ అని అడిగాడు. తేడా ఏంటీ? అన్న ప్రశ్నకు ‘‘మామూలుగా అయితే జీఎస్టీ 18 శాతం సార్‌. కార్డు కాకుండా క్యాష్‌ ఇస్తే జీఎస్టీ లేకుండా డబ్బులు కట్టొచ్చు’’ అంటూ బదులిచ్చాడు. వెయ్యి రూపాయిల బిల్లుకు జీఎస్టీ 180 ఇచ్చే కన్నా జేబులో ఉన్న క్యాష్‌ ఇచ్చి బయటకు వచ్చాడు. ఇటీవల నగరంలో జరిగిన ఘటన ఇది. ఇక్కడ వినియోగదారుడికి, సదరు హోటల్‌ యజమానికి లాభం జరుగుతోంది. కానీ, సర్కారుకు మాత్రం జీఎస్టీ రావట్లేదు. కానీ, కొన్ని హోటళ్లలో వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దానిని సర్కారుకు కట్టడం లేదు. యజమానులు దానిని జేబులో వేసుకుంటున్నారు.
 
‘‘పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యాపారాలపై భారీగా పడింది కోలుకునేలోగానే జీఎస్టీ వచ్చి వ్యాపారాలకు ప్రమాదంగా మారింది. చట్ట ప్రకారం, ప్రతి వస్తువును పన్ను చెల్లించి కొనుగోలు చేస్తే మేం అమ్ముతున్న ధరలకు ఆహార పదార్థాలు అందించలేం. జీఎస్టీని పక్కాగా అమలు చేస్తే ధరల పట్టికను మార్చాలి. ఆ పని చేస్తే గిరాకీ తగ్గిపోతుంది. అందుకే, మెనూను పాత ధరలతోనే ఉం చేశాం’’ అని ఓ హోటల్‌ యజమాని చెప్పారు. కస్టమర్ల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నారు కదా? అని ప్రశ్నిస్తే.. ఔనని అంగీకరిస్తూనే, ఆ మొత్తాన్ని పెరిగిన నిర్వహణ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటున్నామని చెప్పారు. మరి, వసూలు చేసిన పన్నుకు సంబంధించిన లెక్క ప్రభుత్వానికి చెప్పరా? అంటే.. ‘బిజినెస్‌ సీక్రెట్‌’ అంటూ దాట వేశారు.
 
జీఎస్టీతో పోదుగా..
జీఎస్టీ వసూలుతోనే ప్రక్రియ నిలిచిపోవడమే కాకుండా ఆదాయ పన్ను శాఖ తదితరాలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉండడంతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ‘‘తెలుగు రాష్ర్టాల్లోని పలువురు హోల్‌ సేల్‌ వ్యాపారులు చాలాసార్లు అర శాతం (వందకు యాభై పైసలు) లాభాలకు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. ఉదాహరణకు, ఓ హోల్‌సేల్‌ వ్యాపారి 10 లక్షల అమ్మకాలు చేస్తే అతనికి వచ్చే లాభం 5000. కానీ.. జీఎస్టీ 5 శాతం చెల్లించాలంటే అతను వ్యాపారం చేయలేడు. అంతేనా.. అమ్మకాల ఆధారంగా ప్రభుత్వం లెక్కించే ఆదాయ పన్ను వేరుగా ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటానికి జీరో వ్యాపారం చేయక తప్పదు. అందుకే.. పన్నులు విధించే తీరుపై వాస్తవిక దృష్టితో ఉండాలే తప్పించి.. ఏసీ గదుల్లో కూర్చొని లెక్కకడితే జీరో వ్యాపారం ఎప్పటికి ఆగదు’’ అని ఓ వ్యాపారి చెప్పాడు.
 
శ్లాబులు తగ్గిస్తే మేలు
జీఎస్టీ శ్లాబులను భారీగా విధించడమే అక్రమాలకు కారణమని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల తరహాల్లో పన్ను కింద తక్కువ మొత్తం వసూలు చేస్తే, ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం వస్తుందని, వినియోగదారుడు పన్ను చెల్లిస్తాడని, వ్యాపారి కూడా భారం లేకుండా పన్ను వసూలు చేస్తాడని ఓ వ్యాపారి వివరించారు. శ్లాబుల్లో పన్ను మొత్తాన్ని తగ్గిస్తే జీరో దందాకు తెర పడుతుందని, ఆ పన్నులు ఎంత ఎక్కువ ఉంటే జీరో దందా అంత పెరుగుతుందని తెలిపారు. ‘‘జీఎస్టీలో కనిష్ఠంగా ఉన్న శ్లాబ్‌ 5 శాతం. అంటే వంద అమ్మకానికి రూ.5 పన్ను కట్టాలి. అదే లక్ష అమ్మకానికి రూ.5 వేలు చెల్లించాలి. బేగంబజారులోని ఒక్కో హోల్‌సేల్‌ వ్యాపారి రోజులో తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకూ అమ్మకాలు చేస్తాడు. అంటే.. రోజుకు రూ.50 వేల వరకూ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. అదే, 12 శాతం పన్ను ఉన్న వస్తువులు అయితే రూ.1.20 లక్షలు చెల్లించాలి. ఇంత మొత్తాన్ని రోజూ కట్టే కన్నా ఎగ్గొట్టేందుకే ప్రయత్నిస్తారు.
 
అదే.. ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతానికి పన్నును పరిమితం చేస్తే.. చెల్లించాల్సిన పన్ను మొత్తం 10 వేలు నుంచి 15 వేలు మాత్రమే. రోజుకు 10 వేలు చొప్పున లెక్కిస్తే నెలకు సరాసరిన రూ.3 లక్షలకు మించదు. ఈ మొత్తాన్ని చెల్లించకుండా కక్కుర్తి పడితే అధికారుల తనిఖీలో జరిమానాలు భారీగా విధించవచ్చు. దీనివల్ల, అన్ని దశల్లోనూ పన్నుల వసూలుకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు. అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువ వస్తుందని, జీఎస్టీ కూడా విజయవంతమవుతుందని తెలిపారు. ‘‘ప్రజా ధనంతో ప్రాజెక్టులు నిర్మించే ప్రభుత్వాలే జీఎస్టీ శ్లాబుల్ని భరించలేకపోతున్నామని, తగ్గించాలని కోరుతున్నాయి. అలాంటిది.. ఒక వ్యాపారస్తుడు ఎంత?’’ అంటూ మరో హోల్‌సేల్‌ వ్యాపారి విశ్లేషించారు.
 
జీఎస్టీ ఎగవేత మార్గాలివే..!
జీఎస్టీ ఎగవేతకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తున్నారు. కొందరు బిల్లుల్ని టాంపరింగ్‌ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లే రూపొందించారు. కొంతమంది రెండు బిల్లు పుస్తకాల్ని నిర్వహిస్తుంటారు. రెండింటిలోనూ జీఎస్టీ వసూలు చేసినా.. ఒక బిల్లు పుస్తకంలో ఉన్న అమ్మకాలను మాత్రమే ప్రభుత్వానికి సమర్పిస్తారు. రెండో దాన్లోని అమ్మకాల్ని అధికారికంగా చూపించడం లేదు.
ఎలక్ర్టానిక్‌ పద్ధతి బిల్లుల్లోనూ మాయాజాలానికి తెర తీస్తున్నారు. ప్రతి అమ్మకానికి బిల్లు ఇస్తున్నట్లు కనిపించినా.. ప్రభుత్వానికి మాత్రం ఎంపిక చేసిన అమ్మకాల్ని మాత్రమే సమర్పిస్తున్నారు. ముందుగా ప్రోగ్రామ్‌ చేసి పరిమిత కాల వ్యవధి తర్వాత డెబిట్‌, క్రెడిట్‌, చెక్కు, డీడీలకు అమ్మే వస్తువుల మొత్తాన్ని యథాతథంగా ఉంచేస్తున్నారు. నగదుతో చేసిన అమ్మకాల్లో 15 శాతం నుంచి 40 శాతం వరకూ తగ్గిపోయేలా ప్రోగ్రాంను రూపొందించుకుంటున్నారు.
 
ఎలక్ర్టానిక్‌ పద్ధతిలో బిల్లు ఇచ్చే మరికొందరు వ్యాపారులు మరో చిత్రమైన పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజువారీ అమ్మకాల బిల్లుల్ని పరిశీలించి.. ఎంపిక చేసిన కొన్ని బిల్లులను మాత్రమే అధికారిక అమ్మకాల రూపంలో చూపిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవటం కనిపించింది. జీఎస్టీ నిబంధనల్లో ఉన్న పరిమితులను తమకు అవకాశంగా మార్చుకుంటున్న వారు లేకపోలేదు. హోల్‌సేల్‌ మార్కెట్లలో కొనుగోలు విలువ మొత్తాన్ని సగానికి సగం తగ్గిస్తున్నారు. బేగం బజార్‌, ఉస్మాన్‌ గంజ్‌ తదితర హోల్‌సేల్‌ మార్కెట్లలో లక్ష రూపాయల సరుకు కొంటే రూ.50 వేలకే బిల్లు ఇస్తున్నారు.
 
చిన్న కొనుగోళ్లకు బిల్లుండదు
బేగం బజార్‌లోని ఓ హోల్‌సేల్‌ వ్యాపారితో జరిగిన సంభాషణ ఇది..
ఆంధ్రజ్యోతి ప్రతినిధి: ఎర్ర కొబ్బరి ఎంత?
వ్యాపారి: కేజీ రూ.160
ఆ.ప్ర: తురుము కొబ్బరి ముక్కలు కేజీ ఎంత?
వ్యాపారి: కేజీ రూ.120
ఆ.ప్ర: బిల్లు ఇస్తారా?
వ్యాపారి: ఇస్తాం
ఆ.ప్ర: కొబ్బరి పొడి ప్యాకెట్‌ ఎంత?
వ్యాపారి:మూట రూ.5425
ఆ.ప్ర:మూటలో ఎన్ని బాక్సులు ఉంటాయి?
వ్యాపారి: 25
ఆ.ప్ర: కొబ్బరి 10 కేజీల బాక్స్‌ (డబ్బా) ఉందా?
వ్యాపారి: ఉంది
ఆ.ప్ర: రూ.1600 మొత్తాన్ని ఇవ్వటంతో..
వ్యాపారి:ఇతనికి ఒక కార్టన్‌ (పెట్టె) ఇవ్వండి
ఆ.ప్ర: జీఎస్టీ బిల్లు ఇస్తారా?
వ్యాపారి:50కేజీలు కొంటేనే ఇస్తాం. 10కేజీలకు ఇవ్వం
 
(ముందు బిల్లు ఇస్తానని చెప్పిన వ్యాపారి.. డబ్బులు చెల్లించిన తర్వాత 50 కేజీలు కొంటేనే బిల్లు ఇస్తానని మాట మార్చేయటం గమనార్హం)

 

Link to comment
Share on other sites

  • Replies 76
  • Created
  • Last Reply

GST is super advantage and boost for business.

 

Situations ni vaadukovadam lo okkokadu okko daari ethukutaadu, kani ekkuva kaalam run avvav..

 

Keyboard theory kakunda manaki oka avakasam vachindi anukundam tax eggoti cash chesukovadam, ( if amount is small or medium or big and 1000% no body is there to catch u and many others are doing in market in ur knowledge) Naku nijayithe ga vachede kavali ilantivi vadhu Ani entha mandi untaru, just think and pass comments

 

 

All this zero business is already deeply rooted and nothing new bcoz of GST.

Link to comment
Share on other sites

GST is super advantage and boost for business.

 

Situations ni vaadukovadam lo okkokadu okko daari ethukutaadu, kani ekkuva kaalam run avvav..

 

Keyboard theory kakunda manaki oka avakasam vachindi anukundam tax eggoti cash chesukovadam, ( if amount is small or medium or big and 1000% no body is there to catch u and many others are doing in market in ur knowledge) Naku nijayithe ga vachede kavali ilantivi vadhu Ani entha mandi untaru, just think and pass comments

 

 

All this zero business is already deeply rooted and nothing new bcoz of GST.

Before GST also without bills vundevi. Now without bills they are adding GST. Ex. Nenu ghee regular ga oka shop lo kontanu vadu per KG 50 rs penchadu and said because of GST.

 

If u go to some villages in gold shops on each bill they are adding GST even vadiki gst number lekapoina and looting people.

Link to comment
Share on other sites

Before GST also without bills vundevi. Now without bills they are adding GST. Ex. Nenu ghee regular ga oka shop lo kontanu vadu per KG 50 rs penchadu and said because of GST.

 

If u go to some villages in gold shops on each bill they are adding GST even vadiki gst number lekapoina and looting people.

Yes, GST lo rate perigindo ledo manaku teleedu, mana daggara teesukuna GST ni vaadu Govt ki kadutunado ledo teleedu. So go for reputed shops who maintain more transparency and are genuine..

 

Asalu GST collect cheyadaniki customer ki number undanavasaram ledu, collect chesevadiki unte chalu.. again same, go to reputed ones.. kani villages lo no other options kabatti,, Gov should run more awareness campaigns, we should also do our bit..

Link to comment
Share on other sites

జీఎస్టీ.. సరికి సరి
21-09-2017 03:42:04
 
636415621449324799.jpg
  • వచ్చిన సొమ్ములో 70% వాపస్‌.. భారీగా తగ్గిన రాబడి
  • సర్కారు బెంబేలు.. విచారణకు ఆదేశం
  • నరకం చూపిస్తున్న నెట్‌వర్క్‌
  • జూలై రిఫండ్‌ అక్టోబరుకూ నో
  • పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసంతృప్తులు
(బిజినెస్‌ డెస్క్‌)
జీఎస్టీతో పన్ను ఎగవేతలుండవు. ప్రభుత్వ రాబడి పెరుగుతుంది. వినియోగదారులకు చౌకగా సరుకులు, సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఒకే దేశం- ఒకే పన్ను పేరిట అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న జీఎస్టీకి మద్దతుగా ప్రభుత్వం మొదటి నుంచీ వినిపిస్తున్న వాదన ఇది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకున్న ఫలితా లు ఆచరణలో తలకిందులవుతున్నాయి. మొదటి నెల జూలైలోనే జీఎస్టీ వసూళ్లు రూ.95 వేల కోట్ల ను దాటినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని అసాధారణ రికార్డుగా ప్రకటించింది. జీఎస్టీని వ్యతిరేకిస్తున్న వారు ఇక నోరు మూయాల్సిందేనని దబాయించింది. ఇంకా కొన్ని లక్షల సంస్థలు రిటర్న్స్‌ దాఖలు చేయాల్సి ఉందని, రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
 
అయితే, ఈ 95 వేల కోట్లలో రూ.65,000 కోట్లకు ట్రాన్సిషనల్‌ టాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. అంటే, జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు కొనుగోలు చేసిన స్టాక్‌పై చెల్లించిన పన్నులను వాపస్‌ ఇవ్వాల్సిందిగా కోరారన్న మాట. వసూలైన మొత్తంలో దాదాపు 70ు సొమ్మును ట్రాన్సిషనల్‌ టాక్స్‌ క్రెడిట్‌ కింద ట్రేడర్లు క్లెయిమ్‌ చేయడంతో ప్రభుత్వం ఒక్కసారిగా కంగుతింది. ఈ మొత్తం క్లెయిమ్‌లను అంగీకరిస్తే, సర్కారుకు లైలో లభించిన రాబడి కేవ లం రూ.30 వేల కోట్లు మా త్రమే. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ, స్టేట్‌ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ మూడూ ఉంటా యి. ఈ 3 పద్దుల కింద విభజన ఎలా ఉన్నా.. జూలై లో జీఎస్టీ వసూళ్లు దారుణంగా ఉన్నట్టే లెక్క. ఈ పరిస్థితి చూసిన ప్రభుత్వం .. ఈ టాక్స్‌ క్రెడిట్లపై దర్యాప్తునకు ఆదేశించింది.
 
ఎగుమతి సంస్థల గగ్గోలు..
ఎగుమతులపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకవైపు, లిక్విడిటీ సమస్య. మరోవైపు సాంకేతిక ఇబ్బందులతో ఎగుమతి సంస్థలు బేజారవుతున్నాయి. జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అక్టోబరు వరకు గతంలో వేసుకున్న ఎగుమతి అంచనాల్లో ఇప్పుడు 15-20 శాతం వరకు తరుగుదల ఉన్నట్టు చెబుతున్నారు. భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య సహా వివిధ సంస్థలు రిఫండ్స్‌ విడుదలలో జాప్యంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
జీఎస్టీ కంటే ముందు ఎగుమతిదారులు ముడి సరుకులను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడా సౌకర్యం లేదు. ముందుగా పన్నులు చెల్లించి ఆ తర్వాత రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రిఫండ్‌ కోసం రిటర్న్స్‌ దాఖలు చేయాలంటే నెట్‌వర్క్‌ సహకరించదు. ఈ పరిస్థితి ఎగుమతుల రంగంలో తీవ్రమైన నగదు సంక్షోభానికి దారితీసింది. ఎగుమతిదారుల వ్యయాలు భారీగా పెరిగాయి. జూలై రిఫండ్స్‌ కోసం నవంబరు ఆఖరువారం వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా జెమ్స్‌ అండ్‌ జువెలరీ, టెక్స్‌టైల్స్‌, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల రంగంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ వేడిని ఎదుర్కొంటున్నాయి. 15, 20 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న బడా సంస్థలు జీఎస్టీ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులను అలవోకగా అధిగమిస్తున్నాయని, చిన్న సంస్థ లు మాత్రం కునారిల్లుతున్నాయని పరిశ్రమల సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
 
రూ.2000 కోట్లు ఖర్చు చేసినా..
జీఎస్టీ అమల్లో అత్యంత కీలకమైనది ఐటీ నెట్‌వర్క్‌. ఇంటర్నెట్‌ ఆధారిత పన్నుల వ్యవస్థగా తీర్చిదిద్దిన కారణంగా జీఎస్టీ అమలుకు నెట్‌వర్కే వెన్నెముక. అందుకే దీనిపై ప్రభుత్వం 2000 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు రెండేళ్లుగా ఈ నెట్‌వర్క్‌ డెవల్‌పమెంట్‌పై అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ పనిచేస్తోంది. అయినా ఈ నెట్‌వర్క్‌ ఇంకా సమస్యలనే ఎదుర్కొంటోంది. దేశంలో రిజిస్టరైన ట్రేడర్ల సంఖ్య 80 లక్షల కంటే మించదని, కోటి మందికి పైగా ట్రేడర్ల ఒత్తిడిని తట్టుకునే విధంగా తొలిదశలోనే నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించిన త ర్వాతనే జీఎస్టీ అమలు ముహూర్తాన్ని ప్రకటించాలని చాలామంది నిపుణులు సూచించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, నెట్‌వర్క్‌ ఇప్పుడు ట్రేడర్లకు నరకం చూపిస్తోంది. రిటర్నులు దాఖలు కావడం లేదు. అందుకు కంప్యూటర్ల ముందు గంటల తరబడి నిరీక్షణ తప్పట్లేదు.
 
భగ్గుమంటున్న ధరలు
సర్కారుకు రాబడి రాకున్నా ప్రజలను మాత్రం జీఎస్టీ బాదేస్తున్నది. నిత్య జీవితం లో ఉపయోగించే సరుకులు, సర్వీసుల ధర లు జీఎస్టీతో పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం గణాంకాల్లో ఇది ప్రతిఫలిస్తోంది. ఇంకా అనేక రకాల సరుకులు, సర్వీసుల విషయంలో ప్రభుత్వం రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఏకపక్షంగా ప్రభుత్వం ముందుకు పోతే ద్రవ్యోల్బణం మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 
అదుపు లేనిఅక్రమాలు
జీఎస్టీలోని సంక్లిష్టతల కారణంగా వీలున్నంత వరకు జీరో దందాకే వ్యాపార సంస్థ లు మొగ్గుచూపిస్తున్నాయి. పన్ను అధికారు ల కనుగప్పి, కొన్నిచోట్ల వారితో కుమ్మక్కై యథేచ్ఛగా అండర్‌ బిల్లింగ్‌కు ట్రేడర్లు పాల్పడుతున్నారు. గృహ నిర్మాణంలో వినియోగిం చే ఫ్లైవుడ్‌, మార్బుల్‌ తదితరాల్లో ఇది భారీ గా ఉంది. బాదం, ఆక్రోట్‌, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌ విషయంలో భారీ ఎత్తున అండర్‌ బిల్లింగ్‌ జరుగుతోంది. రూ.వందకు కిలో చొప్పున కొనే బాదంను వినియోగదారులకు రూ.వెయ్యికి కిలో వరకూ అమ్మే వ్యాపారులు.. లెక్కల్లో మాత్రం 400-500 మాత్రమే చూపిస్తారని అధికారి చెప్పారు.
Link to comment
Share on other sites

Aadu munigi,anni states munuguthaayi

 

Alaane vundi..

 

I thought Demonetization is classic example for "Good Idea with Worst Execution" and Impact on economy is too bad..  Looks like GST implementation is much worse and impact is much beyond to my imagination..

 

Next question and thought came into my mind is, How to resolve this?.  Demonetization at least was resolved in 6 months by pumping cash again into economy. But how to resolve GST issues?.. I believe we are heading into economic depression as Subrahmanya swamy said..

Link to comment
Share on other sites

Subramanian Swamy says economy is heading for depression, claims warning govt last May The Indian economy is heading for a "major depression" and it can "crash" soon if efforts are not put to revive it, BJP leader Subramanian Swamy has said.

By: FE Online | Updated: September 18, 2017 7:10 PM
 
Subramanian-Swamy-PTI-1.jpeg

The Indian economy is heading for a “major depression” and it can “crash” soon if efforts are not put to revive it, BJP leader Subramanian Swamy has said. (Image: PTI)

 

 

The Indian economy is heading for a “major depression” and it can “crash” soon if efforts are not put to revive it, BJP leader Subramanian Swamy has said. The Rajya Sabha MP claimed that a year and half ago, he had written a 16-page letter to Prime Minister Narendra Modi warning him about the economy which is in a “tailspin”.

“Today, the economy is in a tailspin. Yes, it can crash. We need to do a lot of good things to revive the economy. Even a tailspin can be made to steady. If nothing is done, we are heading for a major depression. There will be mass scale… banks might collapse, factories might start closing,” he said in an interview to CNN-News18 recently.

 

“Last May, I wrote to the Prime Minister a 16-page letter with stats from his own departments to show that there are five storm signals,” he said.

Interestingly, former prime minister Manmohan Singh also hit out at the government once again on the GDP growth, saying hasty implementation of the GST and the withdrawal of 86 per cent of currency during the demonetisation exercise will further affect the GDP numbers.

The GDP for the first quarter (April-June) of financial year 2017-18 slumped to a three-year low at 5.7 per cent, far lower than 7.9 per cent recorded in the same quarter last year.

Subramanian Swamy also claimed that India’s growth rate is much lower than what is being presented. He said, “It is lower than what is being told to you, and it is going to decline, according to what I call Samuelson-Swamy theory of index numbers, which tells you how to calculate the correct index numbers.”

Subramanian Swamy suggested that to support the revival of the economy, it is important to enthuse the public with immediate change, which would be possible by abolishing the income tax. “Whatever you do, the public must see immediate change. I think first thing we should do is abolish the income tax. It’s such an easy thing to do, but they haven’t done it,” he said.

According to Subramanian Swamy, it would give a huge boost to the savings rate; and that would mean the investment cycle would start.

He also suggested the bringing down the interest rates which will get the small and medium industries moving and further start the employment cycle. Along with that he also advocated raising interest rates on fixed deposits.

“You must bring down the interest rates to 9%, and raise the fixed deposit interest rate also to 9% to encourage savings. The rate of interest is an instrument that affects the small and medium industries,” he Subramanian Swamy said.

“The big industries can borrow money abroad also. In the United States, you can borrow for 2%. While here, it being at 12%-18% is very cruel, and much of the damage from it has been to the small and medium industry, which produce bulk of the employment. The employment cycle must start, which can happen only if you get these small and medium industries moving, for which the cost of capital must come down,” he added.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...