Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply
  • 2 weeks later...

Srisailam Inflow - 2.2L Cusecs & Outflow - 3K Cusecs

 

Last ki Jurala nunchi 12 gates ethhi 1.2L cusecs release chesthunnaru. Ippati varaku full dam ni maintain chesindi TG, by leaving extra water to canals.

 

Pray for few more days of good rain in catchment areas.

Link to comment
Share on other sites

భారీగా శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు జూపాడుబంగ్లా, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతోందని ఎంపీ ఎస్‌పీవై రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పోతిరెడ్డిపాడు నీటినియంత్రణ వ్యవస్థను తాకిన కృష్ణమ్మకు ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు 1,75,000 క్యూసెక్కులు చేరుతున్నాయని, కనుక నీటిమట్టం భారీగా పెరుగుతుందన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి, నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడానని, కృష్ణాబోర్డు నుంచి అనుమతి తీసుకుని నీటిని దిగువ ఉన్న రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చేస్తామన్నారన్నారు. ముందుగా వెలుగోడు రిజర్వాయర్‌ నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దిగువప్రాంతం నుంచి అధికసంఖ్యలో రైతులు అక్కడికి చేరుకొని సంతోషం వ్యక్తంచేశారు.

Link to comment
Share on other sites

శ్రీశైలంలోకి ఒక్క రోజులోనే 17 టీఎంసీలు
18-09-2017 02:34:06
 
636412988639588841.jpg
  • ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు
  • ప్రస్తుతం 849 అడుగులకు చేరిన నీరు
  • రాష్ట్రంలో 27% అధిక వర్షపాతం
  • కోస్తాలో 23 శాతం, సీమలో 37% ఎక్కువ.. ఐఎండీ వెల్లడి 
కర్నూలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణానది పరవళ్లతోపాటు... ఉపనది తుంగభద్ర నుంచి కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 1,08,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... నీటిమట్టం 849.10 అడుగులకు, నీటి నిల్వ 78.036 టీఎంసీలకు చేరింది. ఆదివారం ఒక్కరోజులోనే నీటి నిల్వ 17 టీఎంసీలు పెరగడం విశేషం. ఆదివారం ఉదయం వరద జూరాల నుంచి 1,37,735 క్యూసెక్కులు, సుంకేసుల (తుంగభద్ర) నుంచి 40,311 క్యూసెక్కులు కలిపి... 1,78,046 క్యూసెక్కులు వచ్చి చేరింది. సాయంత్రం ఇన్‌ఫ్లో 1,08,591 క్యూసెక్కులకు తగ్గింది.
 
 
Link to comment
Share on other sites

Jurala Inflow-2L Cusecs & Outflow-2.2L Cusecs

 

Evening ki Srisailam ki 2L paine inflow vuntundi. 855 Feet & 100 TMC by today night in Srisailam possible.

 

Pothireddypadu start cheyyandi inka.

SPY reddy yesterday went with local people and completed puja before lifting potireddypadu regulater

 

Then officials said sir still we don't have any conformation from Govt, he called uma and uma told we will get green signal from board tomorrow so we can proceed  

 

ivvala evaning ki release cheyochu emo

Link to comment
Share on other sites

Edo sketch vesaru.

 

TG power generation start cheyyaledu

 

AP kuda water release cheyyatam Ledu.

 

And also Krishna delta needs another 50 tmc till Dec end.

 

Sudden ga pattiseema stop ayithe ani AP hold lo pettindha?

TG requested 2 TMC water for Hyderabad drinking water needs. AP opposed but board gave permission to TG. So they started power generation and discharged allocated amount. 

Link to comment
Share on other sites

శ్రీశైలానికి జలశోభ

కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

851.70 అడుగులకు చేరిన నీటిమట్టం

నీటి విడుదలకు రెండు రాష్ట్రాల వినతి

ఈనాడు - హైదరాబాద్‌

18ap-main5a.jpg

శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి పెద్దగా నీటి విడుదల లేకపోయినా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, భీమా నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాలకు సోమవారం ఉదయానికి ఏకంగా 2.10 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడం విశేషం. నీటిమట్టం పడిపోయి.. తాగునీటి అవసరాలకు కూడా తడుముకుంటున్న పరిస్థితుల్లో శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలంలోకి సోమవారం ఉదయం లక్షా 67 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటిమట్టం 851.70 అడుగులకు చేరింది. ఇప్పటివరకు 70 టీఎంసీలకు పైగా వచ్చింది. మరికొద్దిరోజులు ఈ ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఆలమట్టిలోకి 36,746 క్యూసెక్కులు రాగా, మొత్తం బయటకు వదిలారు. ఉజ్జియిని నుంచి 17,000 క్యూసెక్కులు విడుదల చేశారు. తుంగభద్ర రిజర్వాయరుకు మాత్రం ప్రవాహం నామమాత్రంగానే ఉంది.

కృష్ణాబోర్డుకు లేఖ

శ్రీశైలంలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలంటూ తాజాగా రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డును కోరాయి. శ్రీశైలం నుంచి 17 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, కల్వకుర్తికి 4 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ కోరింది. అంతకుముందు నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టం రావడానికి వీలుగా శ్రీశైలం నుంచి 15.09 టీఎంసీలను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తామని ఆ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాలు కలిపి 21 టీఎంసీలు విడుదల చేయాలని కోరాయి. శ్రీశైలం నుంచి 17 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా బోర్డుకు సోమవారం లేఖ రాసింది. ఇందులో నాగార్జునసాగర్‌ కుడికాలువకు 6 టీఎంసీలు అవసరమని, ఆవిరయ్యే నీటితో కలిపి 7 టీఎంసీలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి ముచ్చుమర్రి ద్వారా 5 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 5 టీఎంసీల నీటిని విడదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలంలో ఆదివారానికి 844.80 అడుగులకు చేరినందున నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఈ లేఖను బోర్డు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు పంపి అభిప్రాయం కోరింది. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 4 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ రాసిన లేఖను బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు పంపింది.

జూరాలకు పోటెత్తిన వరద

ధరూర్‌, న్యూస్‌టుడే: జూరాలకు ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా వరద పోటెత్తింది. సోమవారం 10 గంటల ప్రాంతంలో ఏకంగా 2.10 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో జలాశయం నుంచి 22 గేట్లు, జల విద్యుదుత్పత్తి ద్వారా 2.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జూరాలకు 40 రోజుల వ్యవధిలో ఒకేరోజు ఈ స్థాయిలో వరద రావటం ఇదే మొదటిసారి. వస్తున్న మొత్తం నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న భీమా నుంచి ఆదివారం వరద ప్రవాహం కొంత తగ్గినా మళ్లీ పెరిగింది. సోమవారం భీమా నుంచి 17,500 క్యూసెక్కుల వరద జూరాలలో చేరుతోంది. జూరాల వద్ద వరద ఉద్ధృతి సాయంత్రానికి కొంత తగ్గింది. 1.70 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.73 లక్షల క్యూసెక్కులను గేట్లు, జల విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్నారు. సోమవారం రాత్రి వరకు వరద తగ్గినా లక్ష క్యూసెక్కులకు పైగా రాక కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటక ప్రాజెక్టు నుంచి కూడా వరద నీటి రాక కొనసాగుతోంది. నారాయణ్‌పూర్‌ జలాశయంలోకి 45,457 క్యూసెక్కుల వరద వస్తుండగా.. జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వచేసి 52,295 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

గోదావరికి నామమాత్రమే

గోదావరి నదికి సంబంధించి సింగూరు ప్రాజెక్టుకు 11,800 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మిగిలిన వాటికి నామమాత్రంగానే ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...