Jump to content

Srisailam

sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply

nsagar nidae chances unaya ee season lo?

emo,asalu intha water vasthadi ani evaru expect chesaru ippati varaku vachina water lo only 25% vachi vuntadi ghats nundi, remaining water antha local areas Anantapur, Kurnool,bellary,raichur,koppal,yadgir,gulbarga,yadgir, mahabubnagar, rangareddy Districts lo rain valla vachina water

Ninna padda rain inko sari padite chance vundachu

Link to comment
Share on other sites

Guest Urban Legend

Inflow will increase to 1lak cusecs tomorrow

Heavy rains in Kurnool

super brother,

it touched 1 L today itself 1,02,395

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

10brk-81a.jpg

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 71,335 క్యూసెక్కులు, రోజా గేజింగ్‌ కేంద్రం నుంచి 44,790 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 37,313 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది. కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 106 మెగావాట్ల సామర్ధ్యంతో 7 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 150 మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 6వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Link to comment
Share on other sites

శ్రీశైలం నిండింది 

నేడు గేట్లు ఎత్తే అవకాశం 

ముందస్తు రబీకి మెరుగైన అవకాశాలు 

ఈనాడు - హైదరాబాద్‌ 

10hyd-main1a.jpg

శ్రీశైలానికి వరద ఉద్ధృతి పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో 2.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆరుగంటలకు కొంత తగ్గి 1.75 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి 1.7 అడుగులు మాత్రమే తక్కువగా ఉండగా, ఇంకా తొమ్మిది టీఎంసీల నిల్వకు అవకాశం ఉంది. రెండు విద్యుత్‌ కేంద్రాలనూ పూర్తి స్థాయిలో నిర్వహించడంతోపాటు.. పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి కలిపి మొత్తం 72,814 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. హంద్రీనీవాకు నిలిపివేశారు. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నామమాత్రంగానే నీటి విడుదల ఉన్నా, స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో జూరాల, తుంగభద్ర, హంద్రీనదుల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. ఇదే ప్రవాహం కొనసాగితే బుధవారం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు నాగార్జునసాగర్‌ కింద ముందస్తు రబీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. త్వరలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. ఆలమట్టిలోకి 25 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో, ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటితోపాటు భీమా నుంచి రావడం, స్థానికంగా కురిసిన వర్షాలతో జూరాలకు ఉదయం 50 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సాయంత్రానికి 1.07 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో సుంకేశుల నుంచి

మధ్యాహ్నం 67,158 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 34 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో శ్రీశైలానికి 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూరాలకు వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి నీటి విడుదల పెరగడంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం 523 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్‌ నిండాలంటే మరో 160 టీఎంసీలు అవసరం. ఆలస్యంగా అయినా కృష్ణాబేసిన్‌లోని రిజర్వాయర్ల పరిస్థితి మెరుగైంది. రెండు రాష్ట్రాల్లోని అనేక చిన్న నదుల్లో కూడా వరద ప్రవాహం ఉంది.

ఖరీఫ్‌కు తరచూ గడ్డుకాలం 

కృష్ణాబేసిన్‌లో ప్రత్యేకించి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌ సీజన్‌కు తరచూ గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ముందస్తు రబీకో లేక రబీకో మాత్రమే నీటిని ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఒకటిన్నర దశాబ్దం నుంచి ఆరుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సంవత్సరం కూడా సాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద ఖరీఫ్‌కు నీటి లభ్యత లేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు కూడా నీటి ప్రవాహం ఎక్కువవుతూ ఉండటంతో రబీకి అవకాశాలు పెరిగాయి. అయితే రెండు కాలువల కిందా ఎంత ఆయకట్టుకు ఇవ్వడం వీలవుతుందనే స్పష్టత రావాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాలని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగర్‌ ఎడమకాలువ కింద రబీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించడంతోపాటు 54 టీఎంసీలు కేటాయించాలని బోర్డుకు ఇండెంట్‌ కూడా పెట్టింది. 2002-03, 2003-04వ సంవత్సరాల్లో సాగర్‌ కింద ఖరీఫ్‌కు నీటిని ఇవ్వలేదు. 2009, 2012లో కూడా ఇవ్వలేదు. 2015-16లోనూ తాగునీటికి మాత్రమే ఇచ్చారు. గత ఏడాది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌ లేదు. సాగర్‌ ఆయకట్టు మాత్రమే కాదు.. శ్రీశైలం మీద ఆధారపడిన ఎస్సార్బీసీ, జూరాల నుంచి తీసుకొనే భీమా, మిగులు జలాల ఆధారంగా నిర్మించిన నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ అక్టోబరులో గానీ నీటిని విడుదల చేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం జాప్యం కావడమో లేదా ఖరీఫ్‌కు అసలు ఇవ్వలేకపోవడమో జరుగుతోంది.

1.1 Lakhs inflow taggindi ga

Link to comment
Share on other sites

రీశైలం ప్రాజెక్ట్‌కి జలకళ
11-10-2017 15:40:21

636433332224303396.jpg
కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్ట్‌కి జలకళ సంతరించుకుంది. జలాశయానికి భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. కాసేపట్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదల

12brk39a.jpg

శ్రీశైలం ఆలయం, కర్నూలు: మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం ఉదయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుగుల మేర ఎత్తారు.

12brk39b.jpg

ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు.

12brk39c.jpg

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...