Jump to content

Toyota Kirloskar Motors in AP


sonykongara

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌లో హైబ్రిడ్‌ కార్లు!
 
 
636400056013016229.jpg
  • కర్మాగారం ఏర్పాటుకు టొయోటా కిర్లోస్కర్‌ ఓకే
  •  సీఎంతో టొయోటా కిర్లోస్కర్‌ ఎండీ అకిటో భేటీ
అమరావతి, సెప్టెంబరు 2, (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. అటు ఇంధనం.. ఇటు బ్యాటరీ సాయంతో నడిచే హైబ్రిడ్‌ కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సంస్థ టొయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ. కేవలం బ్యాటరీ సాయంతో నడిచే ఎలక్ట్రిక్‌ కార్లు కొద్ది దూరాలు ప్రయాణించడానికే పరిమితమవుతున్నాయి. పెట్రోలు, విద్యుత్తు చార్జింగ్‌ రెండింటితో నడిచే కార్లు అయితే ఈ సమస్యను అధిగమించవచ్చు. రాష్ట్రంలో ఇలాంటి కార్లను తయారు చేస్తామని టొయోటా కిర్లోస్కర్‌ ఎండీ అకిటో టచిబాన సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. శనివారం ఆయన సీఎంను సచివాలయంలో కలిశారు. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి వనరులు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని అకిటోకు సీఎం సూచించారు. అమరావతిని అద్భుతమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగరంగా నిర్మించే ప్రక్రియలో భాగస్వాములవుతామని అకిటో సీఎంకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఇండో-అమెరికన్‌ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నెలకొల్పేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు అమెరికా బృందాన్ని ఇక్కడకు రావాల్సిందిగా సీఎం, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ గతంలో ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల యజమానులు రాష్ట్రానికి వచ్చారు. వారు శనివారం రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అరగంటపాటు చర్చించారు.
Link to comment
Share on other sites

టొయోట కిర్లోస్కర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈరోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబును కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విషయమై ముఖ్యమంత్రితో చర్చించారు. జపాన్ లోని ప్రసిద్ధ టొయోట మోటార్ కార్పొరేషన్ కిర్లోస్కర్ భాగస్వామ్యంతో భారత్ లో టొయోట కిర్లోస్కర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విభాగాన్ని నెలకొల్పి టొయోట కార్లను ఉత్పత్తి చేస్తోంది. భారతదేశంలో మారుతి సుజికి, హ్యుందాయ్, మహీంద్రా తర్వాత కార్ల ఉత్పత్తిలో నాల్గవ స్థానం టొయోటాదే. సమావేశం అనంతరం టొయోట కిర్లోస్కర్ సంస్థ ఎండీ అకితో తచిబానాను చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి మరో కార్ల తయారీ కంపెనీ...

 

 
car-maufacturing-03092017.jpg
share.png

రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక కార్ల తయారీ సంస్థ వస్తోంది. రాష్ట్రంలో అత్యాధునిక ‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాలను తయారు చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని జపాన్‌కు చెందిన టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిటో తఛిబనతో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీసంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తయారు చేయబోయే కార్ల మోడళ్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. ఈ సంస్థ టొయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ.

 

‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాల తయారీలో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ, యంత్ర సామాగ్రి, పరికరాలు, వాహనాలకు ఉపయోగించే మెటీరియల్‌, వాటి సామర్థ్యం, కాలపరిమితి తదితర కీలకమైన అంశాలపై అఖిటో తఛిబన తన ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు. ఈ వాహనాలు అటు ఇంధనంతోనూ ఇటు బ్యాటరీతోనూ రెండు విధాలుగా పని చేస్తాయని సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. ఈ వాహనాలు ఛార్జింగ్‌తో తక్కువ దూరం ప్రయాణించే విధంగానే కాకుండా, ఎంత దూరమైనా ఇంధనంతో ప్రయాణించే వీలుండటంతో పాటు ఎక్కడైనా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేలా రూపొందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అఖిటో తఛిబన బృందం వివరించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. కంపెనీ ప్రతిపా దనలు బాగున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అఖిటో తఛిబనతో సీఎం మాట్లా డుతూ ‘మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగానే ఉన్నామని, సంస్థ ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రపంచస్థాయిలో అమరావతిని ఒక మోడల్‌ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నామని’ చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం అయితే రాష్ట్ర భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని, సంస్థలు నిర్ధేశించిన సమయంలోనే కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అవ కాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఉట్టిపడేలా రూపొందించిన కార్యక్రమాలు రాజధాని అమరావతికి మరింత శోభను ఇస్తాయన్నారు.

Link to comment
Share on other sites

Naidu seeks report on hybrid vehicles

author-deafault.png Staff Reporter
Vijayawada, September 03, 2017 00:00 IST
Updated: September 03, 2017 04:25 IST
 

Chief Minister N. Chandrababu Naidu suggested to the MD of Toyota Kirloskar Motor Pvt. Ltd., Akito Tachibana, to come up with a detailed report on the introduction of plug-in hybrid vehicles in AP by the Japanese automobile giant. In a meeting with the Chief Minister here on Saturday, Mr. Tachibana said the vehicles were both engine-driven and could be electrically charged. Mr. Naidu told Mr. Tachibana to start working on the project.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ వాహన నగరం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీ నగరం ఏర్పాటు చేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఉపాధ్యక్షుడు ఎస్పీ టక్కర్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌లు సోమవారం సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. జపాన్‌ సంస్థ ఇక్కడ ఎలక్ట్రానిక్‌ వాహన (ఈవీ) తయారీ నగరం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని, ప్రస్తుతం ఆ దేశ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకించి ఈవీ విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

రాష్ట్రంలో విద్యుత్తు వాహనాలు
టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌తో  రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
లోకేష్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న ప్రతినిధులు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు వాహనాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టేందుకు అనుకూలమైన వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అవసరమైన అధ్యయనం చేసేందుకు టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని నగరాల్లో అంతర్గతంగా ఈ వాహనాలు తిరిగేందుకు ఎలాంటి రహదారి వ్యవస్థ ఉండాలి? వివిధ నగరాల మధ్య వీటిని నడిపేందుకు ఎలాంటి మౌలిక వసతులు అవసరమవుతాయి? ఎన్ని కిలోమీటర్లకు ఒక చోట ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి? వాటి స్వరూపం ఎలా ఉండాలి? తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. తొలి దశలో కొన్ని విద్యుత్తు వాహనాలను టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ సంస్థ ఏపీ ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తుంది. వీటిని అమరావతి, తిరుమలలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఐటీ  మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ ఎండీ అకిటో తచిబానా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

నారా లోకేష్‌: అమరావతిలో ప్రపంచశ్రేణి విద్యుత్తు వాహనాలను పరిచయం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ వాహనాలకు ఏపీ ప్రభుత్వం అతి పెద్ద వినియోగదారు కావాలనేది మా ఉద్దేశం. అధికారులు, మంత్రులు కూడా విద్యుత్తు వాహనాలను వాడితే ఎలా ఉంటుందనే దానిపైన ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విద్యుత్తు వాహనాలు ఇస్తే ఎలా ఉంటుందనేది కూడా యోచిస్తున్నాం.
అకిటో తచిబానా : కాలుష్య సమస్యకు విద్యుత్తు వాహనాలే పరిష్కారం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వాహనాల్లో అత్యుత్తమ సాంకేతికతను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం.
ప్రత్యేకతలు
* ఈ విద్యుత్తు వాహనాలకు ఒకసారి ఛార్జి చేస్తే 70 కిలోమీటర్లు మేర వెళ్లొచ్చు.
* స్పీడ్‌ఛార్జింగ్‌ విధానంలో 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ అవుతుంది. 

Link to comment
Share on other sites

ఎలక్ర్టిక్‌ కార్లు వస్తున్నాయ్‌
17-11-2017 02:00:38

    లోకేశ్‌ సమక్షంలో టయోటాతో ఒప్పందం
    దేశంలో ప్రథమంగా మన రాష్ట్రంతోనే
    తొలి దశలో ఉచితంగా 10 కార్లు
    అమరావతి పరిధిలో నడుపుతారు
    రోడ్లు, చార్జింగ్‌ స్టేషన్లపై అధ్యయనం
    తిరుమలకూ కరెంటు బస్సులు
    ప్రభుత్వ సహకారం భేష్‌: టయోటా

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విద్యుత్‌ వాహనాలను నడపడానికి.. అవి నడిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వంతో టయోటా మోటార్స్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలిదశలో టయోటా కంపెనీ 10 ఎలక్ర్టిక్‌ కార్లను రాష్ట్రప్రభుత్వానికి ఉచితంగా ఇస్తుంది. 2018 మే నుంచి డిసెంబరు లోపు వీటిని అందిస్తుంది. వీటిని అమరావతి పరిధిలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఆయా వాహనాలు నడిచేందుకు మన రోడ్లు వాటికి అనుగుణంగా ఉన్నాయా.. విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. విద్యుత్‌ వాహనాల పరంగా అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థగా ఉన్న టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ భారత్‌లో మన రాష్ట్రంతోనే ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ ఎండీ అకిటో తచిబానా గురువారమిక్కడ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.
 
ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ సీఈవో తిరుమలరావు చామల్ల తదితరులు పాల్గొన్నారు. అనంతరం లోకేశ్‌, తచిబానా విలేకరులతో మాట్లాడారు. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి రాష్ట్రప్రభుత్వం ఎంతో చొరవ చూపిందని తచిబానా ప్రశంసించారు. ఈ ఏడాది టయోటా 11 లక్షల విద్యుత్‌ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న చార్జింగ్‌ సదుపాయాల దృష్ట్యా పీహెచ్‌వీ మోడల్‌ ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కారు బాగుంటుదని భావిస్తున్నామన్నారు. ఒప్పందంలో భాగంగా టయోటా కంపెనీ రెండు మోడళ్ల విద్యుత్‌ కార్లను ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తుందని లోకేశ్‌ తెలిపారు. వాటిని సీఆర్‌డీఏ పరిధిలో ఉపయోగిస్తామన్నారు.
 
విద్యుత్‌ కార్లకు అవసరమైన చార్జింగ్‌ స్టేషన్లు ఎలా ఉండాలి? ఎన్ని ఉండాలి? రోడ్ల పరిస్థితి ఎలా ఉండాలి? తదితర అంశాలపై దేశంలో ఎవరికీ ఇంకా అవగాహన లేదని చెప్పారు. దేశంలో తొలిసారిగా ఈ ఒప్పందాన్ని ఏపీతోనే టయోటా చేసుకుందని, మరే రాష్ట్రంతోను ఒప్పందాలు చేసుకోబోమని కూడా చెప్పిందన్నారు. ఓలా, ఉబర్‌ లాంటి సంస్థలతో కూడా తన బెంగళూరు పర్యటనలో చర్చించానని.. అవి కూడా విద్యుత్‌ వాహనాల వినియోగానికి ఆసక్తి చూపించాయని.. అదేవిధంగా విద్యుత్‌ ఆటోలను కూడా ఎందుకివ్వకూడదని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. తొలుత ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ వాహనాల ఉపయోగం పెంచుతామన్నారు. పోలీసు శాఖలో పలు వాహనాలు వాడుతున్నారని, వారికి విద్యుత్‌ వాహనాలు ఇవ్వడం, ఇతర శాఖల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు తిరుపతి-తిరుమల నడుమ కూడా విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టే విషయమై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్‌ బస్సు తిరుమల కొండ ఎక్కగలిగితే ఇక అది దేశంలో ఎక్కడ తిరిగేందుకైనా అనుకూలంగా ఉన్నట్లేనని చెప్పారు. ఈ ఉద్దేశంతో విద్యుత్‌ బస్సు వినియోగానికి పైలట్‌గా తిరుపతిని ఎంచుకున్నామన్నారు.
 
టయోటాతో భాగస్వామ్యంలో ఇది తొలి అడుగు
టయోటా కంపెనీతో భాగస్వామ్యంలో ఇది తొలి అడుగని లోకేశ్‌ పేర్కొన్నారు. వారికి కూడా విద్యుత్‌ కార్ల తయారీకి భారత్‌లో ప్లాంటు లేదని, తదుపరి దశలో ఆ ప్రతిపాదనపైనా చర్చిస్తామన్నారు. విద్యుత్‌ కార్లకు 80శాతం చార్జింగ్‌ కేవలం 20 నిమిషాల్లోనే అయిపోయేలా చార్జింగ్‌ స్టేషన్లు ఉంటాయని, ఇంటి దగ్గర కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చని, రాత్రి పెట్టుకుని తెల్లారి కారు వాడుకోవచ్చని చెప్పారు. ఇంటి వద్ద చార్జింగ్‌ నెమ్మదిగా అవుతుందన్నారు. విద్యుత్‌ చార్జింగ్‌ పాయుంట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే దీనిపై ఒక విధానం తీసుకొస్తామని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన దిగుమతి సమస్యలను పరిష్కరించేందుకు.. అత్యుత్తమ సాంకేతికతలు రవాణా రంగంలో వచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని విజయానంద్‌, తిరుమలరావు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

They are procured by Kirloskar brothers. It could be their pump made-in china or bought in china.  but the end result 150 days non stop working with out any glitches.

https://economictimes.indiatimes.com/industry/indl-goods/svs/engineering/megha-engineering-enters-limca-book-of-records-for-river-linking-project/articleshow/57828655.cms

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...