Jump to content

PV first review


Divi

Recommended Posts

 57 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలాగా ఫుల్ ఎనర్జీ తో చెలరేగి పోయాడు. బాడీ లాంగ్వేజ్ , యాటిట్యూడ్ , డైలాగ్స్ చెప్పే విధానం బాలకృష్ణ కు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. పేరుకి తగ్గట్టుగానే తేడా తేడా గా నటిస్తూ తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ బ్రహ్మాండం గా ఒదిగిపోయారు. శాతకర్ణి గా రాజసం చూపించింది ఈయనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఫైట్స్ లో కానీ, డైలాగ్స్ చెప్పడంలో కానీ, డబల్ జోష్ కనిపిస్తుంది. ముఖ్యం గా పాటల్లో స్టెప్స్ అదరగొట్టేసారు. ‘మావా ఏక్ పెగ్ లాలో’ పాటలో అయితే ఫుల్ గా రెచ్చిపోయారు. పాట పాడిందీ ఆయనే కాబట్టి, చాలా గమ్మతుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటను ఇందులో రీమిక్స్ చేసారు. ఆ పాటలో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ తన తండ్రి లా స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు. ఈ పాటకు ఫాన్స్ పరవళ్లు తొక్కడం ఖాయం. సినిమా మొత్తం బాలకృష్ణ వన్ మాన్ షో లాగా నడిపించేసాడు.

 

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలం లో తను తీసిన చాలా సినిమాల్లో సెకండాఫ్ విషయం లో బాగా తడబడుతున్నాడు. అందుకేనేమో ‘పైసా వసూల్’ సెకండాఫ్ విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా తడబాటు లేకుండా తన మార్క్ స్పీడ్ టేకింగ్ తో సినిమా ని చక చక పరుగెత్తించాడు. తన అంబుల పొది లో ప్రధాన అస్త్ర మైన హీరో క్యారక్టర్యజేషన్ , ఆటిట్యూడ్ నే మళ్ళీ నమ్ముకొని ఈ సినిమా తీసాడు. బాలకృష్ణ ను ఇలా చూపించొచ్చని ఎవరూ ఊహించని విధంగా తీసాడు. ముకేశ్ ఫోటోగ్రఫీ , ఈ సినిమా కి మంచి ఎస్సెట్. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమా కి మెయిన్ పిల్లర్. పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. శ్రియ , ముస్కాన్ , కైరా దత్ లు ఉన్నంతలో పర్వాలేదనిపించారు. కబీర్ బేడీ, విక్రంజీత్ లు ఆయా పాత్రల్లో ఫ్రెష్ గా అనిపించారు. అలీ కామెడీ పై పెద్ద గా పూరి దృష్టి పెట్టినట్టు అనిపించలేదు పోకిరి లాంటి కథే అనిపిస్తుంది కానీ , సినిమా లో చాలా లోపాలున్నట్టు అనిపిస్తాయి కానీ… బాలకృష్ణ తన ఆటిట్యూడ్ తో మెస్మరైజ్ చేయడం ఖాయం. మాస్ తో పాటు యూత్ కూడా ఈ ఆటిట్యూడ్ కి బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది.నిర్మాత ఆనంద ప్రసాద్ ని బిగ్ లీగ్ లోకి తీసికెళ్ళే సినిమా ఇది . టైటిల్ కి తగ్గట్టే ఇదీ పైసా వసూల్ సినిమా.

 

ప్లస్ పాయింట్స్:

1 . బాలకృష్ణ క్యారక్టర్యజేషన్

2 . బాలకృష్ణ ఆటిట్యూడ్

3 . బాలకృష్ణ డైలాగ్ డెలివరీ

4 . బాలకృష్ణ ఎనర్జీ.

5 . పూరి డైరెక్షన్.

 

మైనస్ పాయింట్స్:

1 . కథ లో మెరుపులూ, మలుపులూ లేకవడం.

2 . రెగ్యులర్ మాఫియా కథలా అనిపించడం.

 

ఓవరాల్ రేటింగ్ : 3 .5 /5

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...