Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

అటల్‌ నాటి విలువలేవీ?

Recommended Posts

అటల్‌ నాటి విలువలేవీ?
 
 
636381966584599651.jpg
అది 1999 ఏప్రిల్‌ 17వ తేదీ. 18 మంది ఎంపీలున్న జయలలిత పార్టీ అటల్‌ బిహారీ వాజపేయి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఐదుగురు ఎంపీలున్న మాయావతి.. వాజపేయికి మద్దతు ప్రకటించారు. అయినా మేజిక్‌ మార్కు కంటే ఒక ఓటు తక్కువగానే ఉంది. ఒడిసా ముఖ్యమంత్రిగా వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌ అప్పటికింకా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందున, నైతిక ధర్మాన్ని అనుసరించి ఆయన లోక్‌సభకు రారని, ఓటేయరని వాజపేయి భావించారు. కానీ ఆయన ఆఖరి నిముషంలో సభకు వచ్చారు. ఆయనకు ఓటేసే అధికారం లేదని రూలింగ్‌ ఇవ్వడం ద్వారా స్పీకర్‌గా ఉన్న బాలయోగి అయినా ప్రభుత్వాన్ని కాపాడతారని ఎన్డీయే పెద్దలు ఊహించారు. కానీ బాలయోగి రూల్‌బుక్‌ను అనుసరించి, గమాంగ్‌ను ఓటేసేందుకు అనుమతించారు. ఒక్క ఓటు తేడాతో వాజపేయి ప్రభుత్వం కుప్ప కూలింది. స్పీకర్‌ బాలయోగి తన ఓటు వేసి ఉన్నా ప్రభుత్వం పడిపోయేది కాదు. స్పీకర్‌ స్థానంలో కూర్చున్న తాను ఏ ఒక్క పక్షానికో మద్దతు ఇవ్వడం సరైనది కాదన్న భావనతో ఆయన తటస్థంగా ఉన్నారు.
 
 
లోక్‌సభలో ఒక్క ఎంపీ మద్దతు ప్రకటించి ఉన్నా నాడు వాజపేయి ప్రభుత్వం బతికి బట్టకట్టేది. కానీ ఎంపీలను కొనుగోలు చేయడం లేదా మేనేజ్‌ చేయడం ఇష్టంలేని వాజపేయి, ప్రభుత్వాన్ని కోల్పోవడానికే మొగ్గు చూపారు. తనకంటే ముందు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు, లోక్‌సభలో మెజారిటీ లేకపోయినా, జార్ఖండ్‌ ముక్తి మోర్చా వంటి పార్టీలకు చెందిన ఎంపీలను కొనుగోలు చేసి అధికారాన్ని కాపాడుకున్నారు. అయినా వాజపేయి ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. అనైతికంగా అధికారంలో కొనసాగడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అదే వాజపేయి వారసుడిగా, అదే భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఒక్క ఎంపీ కోసం అనైతిక చర్యలను ప్రోత్సహించారు. గుజరాత్‌లో తగిన బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని రాజ్యసభకు పోటీ పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా అదనంగా ఒక ఎంపీ సీటు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలను మనం చూశాం. పార్టీ ఒక్కటే! అయితే అందలం ఎక్కిన వ్యక్తులు వేరు!
నైతిక విలువలు– ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడంలో మాత్రం ఎంత పతనం! గుజరాత్‌లో ఇప్పుడు బాధిత పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడింది. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అని ఇప్పుడు మోదీ– షా ద్వయం అవే అనైతిక చర్యల ద్వారా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఫలితంగా 57 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ బలం గుజరాత్‌లో 44కి పడిపోయింది. ఈ 44 మందినీ కర్ణాటకలో క్యాంపులో ఉంచి తీసుకొచ్చినా అందులో ఇద్దరు చివరి నిముషంలో సొంత పార్టీ అభ్యర్థిని కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. అయితే అధీకృత ఏజెంట్‌కు కాకుండా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్‌కు తాము వేసిన ఓటును చూపించడంతో వారి ఓట్లు చెల్లవు అని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మోదీ కేబినెట్‌లోని అతిరథ మహారథులు స్వయంగా వచ్చి ఒత్తిడి తెచ్చినా ఎన్నికల కమిషన్‌ సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు.
 
ఇందుకు వారిని అభినందించాల్సిందే! ఇతర పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ చచ్చీ చెడీ గెలిచారు. నిజానికి రాజ్యసభలో ఒక ఎంపీ తక్కువైనంత మాత్రాన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ దేశాన్ని ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ చేయాలన్న పట్టుదలతో మోదీ– షా ద్వయం ఆ పార్టీని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు క్రీడకు తెర లేపారు. దేశం నుంచి అవినీతిని పారదోలాలనీ, నైతిక విలువలను నెలకొల్పాలనీ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటువంటి అనైతిక కార్యకలాపాలు జరగడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. దీనివల్ల ప్రధానమంత్రి చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దేశంలో నల్లధనానికి, అవినీతికి చోటు ఉండకూడదన్న నినాదంతోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురైనా తమ జీవితాలలో మార్పు వస్తుందనీ, నల్లకుబేరుల ఆట ముగిసినట్టేనని నమ్మిన సామాన్య జనం ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే దారిలో జీఎస్‌టీ తీసుకువచ్చినా ప్రధానికి అండగా ఉన్నారు. కుళ్లు, కుతంత్రాలు, అవినీతిమయమైన రాజకీయాలను నరేంద్ర మోదీ ప్రక్షాళన చేయగలరన్న నమ్మకం ఉండటం వల్లనే ప్రజలు ఆయనకు జైకొడుతున్నారు. కానీ జరుగుతున్నది ఏమిటి?
 
గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడిది? ఎవరు ఇచ్చారు? లెక్కలు ఉన్నాయా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదనీ, మోదీ– షాల నాయకత్వం పట్ల ముచ్చటపడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని బీజేపీ నాయకులు చెబుతూ ఉండవచ్చు గానీ, అది ఆత్మవంచనే అవుతుంది. వాస్తవంగా ఏమి జరిగిందీ వారికీ తెలుసు. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకూ తెలుసు. ప్రజలకూ తెలుసు. బ్యాంకులలో దాచుకున్న డబ్బును సొంత అవసరాలకు తీసుకోవడానికి కూడా రైతులు ఇబ్బందిపడటాన్ని మనం చూస్తున్నాం. నగదు ఉపసంహరణపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. వీటి అన్నింటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయినా ప్రధానమంత్రి ఉద్దేశం మంచిది కదా! అని సర్దుకుపోతున్నారు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గుజరాత్‌లో ఎమ్మెల్యేల మద్దతు కోసం డబ్బు ఖర్చు చేశారు. ఈ డబ్బుకు లెక్క ఉందో లేదో మోదీ– షా ద్వయమే చెప్పాలి. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు– పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఉపరితల విన్యాసాలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నికనే తీసుకోండి. ప్రధాన పార్టీలు రెండూ పోటీ పడి డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఓటర్లు కూడా ఈసారి ఒక్కో ఓటుకు అయిదు వేల రూపాయలు అయినా ఇవ్వాలని కోరుతున్నారట! నంద్యాలలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు.
 
అందరికీ కాకపోయినా ఇందులో కనీసం లక్ష మందికి డబ్బు పంచాలనుకున్నా అయిదు వేల వంతున ఒక్కో పార్టీ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవి కాక నాయకుల కొనుగోలుకు లేదా సొంత పార్టీవాళ్లు చేజారిపోకుండా కాపాడుకోవడానికి ఇతర ఖర్చులకు మరెంతో డబ్బు కావలసి ఉంటుంది. అంటే రెండేళ్ల పదవీకాలం కూడా లేని ఎమ్మెల్యే పదవి కోసం ఒక్కో పార్టీ వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తోందన్న మాట! ఇందులో ఒక్క రూపాయి కూడా తెల్ల డబ్బు ఉండదు. ఎన్నికల ఖర్చు లక్షల నుంచి కోట్లకు చేరిపోయింది. ఇప్పుడు నంద్యాలలో జరుగుతున్న దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే వచ్చే ఎన్నికలలో ఏపీలోని 175 స్థానాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. నంద్యాలలో ఖర్చు చేసినంత కాకపోయినా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థీ సగటున 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందని ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంటున్నవారే చెబుతున్నారు.
 
ఈ లెక్కన రెండు ప్రధాన పార్టీలూ కలిసి వచ్చే ఎన్నికలలో అయిదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందన్న మాట! ఇవికాక ఎంపీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో చూడాలి! ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నామని చెప్పినా నల్లధనం ఊరుతూనే ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారం. ఆ అధికారం అందుకోవడం కోసం ఎంతకైనా తెగబడతాయి. ఆ క్రమంలోనే ఖర్చు వందలు, వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది.
 
మోదీ.. ఏదీ తేడా?
ఇప్పుడు మళ్లీ గుజరాత్‌కు వెళదాం! గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఎంతో కొంత మసకబారిందని చెప్పవచ్చు. ఈ మూడేళ్లుగా తనవైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోదీ జాగ్రత్తగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో శివసేన పార్టీకి చెందిన ఎంపీ సురేశ్‌ ప్రభును ఆ పార్టీ అధిష్ఠానం అభిప్రాయానికి విరుద్ధంగా ఏకంగా కేబినెట్‌లోకి తీసుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. మోదీ ప్రభంజనంలో అది కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌– బిహార్‌లో తెర వెనుక ఏమి జరిగినా ప్రజలు గమనించలేదు. ఈ మూడేళ్లూ అవినీతి మరక అంటకుండా, ఇతరులకు కూడా అంటుకోనివ్వకుండానే మోదీ దేశాన్ని పాలించారు. అంతవరకు ఆయనను అభినందించవలసిందే! అయితే మొన్న బిహార్‌లో, నిన్న గుజరాత్‌లో జరిగిన పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. బిహార్‌లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నితీశ్‌– లాలూ కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. ఈ ఇద్దరు నాయకులూ విభేదాలు వచ్చి విడిపోయారు. దీంతో ప్రజలు తిరస్కరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బిహార్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. అంటే ప్రజల తీర్పుతో సంబంధం లేని ప్రభుత్వం అక్కడ ఇప్పుడు పరిపాలిస్తోంది. ఇది ఎంతవరకు సమర్థనీయమో మోదీజీనే చెప్పాలి.
 
కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోవాలేమో తెలియదు. ఇప్పుడు గుజరాత్‌లో కూడా తగిన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడవ అభ్యర్థిని పోటీ పెట్టింది. దీని ద్వారా ఎమ్మెల్యేల బేరసారాలకు తెర తీసినట్టే కదా! ఈ క్రతువులో చాలావరకు విజయం సాధించగలిగినా చివరి ప్రయత్నం విఫలమై మొదటికే మోసం వచ్చింది. ఫలితంగా మిగతా నాయకులకు, మిగతా పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి చెందిన మోదీ–షాలకు కూడా తేడా లేదని ప్రజలు భావించే పరిస్థితిని కోరి తెచ్చుకున్నారు. ఒక్క ఎంపీ కోసం ఇంతలా దిగజారడం అవసరమా? తామందరూ ఇప్పటికీ స్మరించుకుంటూ గౌరవం వ్యక్తంచేస్తున్న వాజపేయి నెలకొల్పిన విలువలను ఎందుకు పాటించలేకపోయారో తెలియదు. గుజరాత్‌ నుంచి ఒక్క రాజ్యసభ సీటును అదనంగా గెలుచుకున్నా, గెల్చుకోకపోయినా బలాబలాలు ఏమీ తలకిందులు కావు. మోదీ అధికారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయినా ఒక్క ఎంపీ సీటు కోసం కక్కుర్తిపడటంతో ఇతర రాజకీయ నాయకులకు, మోదీకి మధ్య అట్టే తేడా లేదు అని ప్రజలు భావించే పరిస్థితిని తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ విస్తరణ కాంక్ష మోదీ– షాలను నిలవనివ్వడం లేదు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్ర్టాలలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడాలన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! ఈ కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వాన్ని బుట్టలో వేసుకున్నారు. పేరుకు బీజేపీ ప్రభుత్వం కాకపోయినా తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం మోదీ– షాల ద్వయం ఆడమన్నట్టు ఆడుతోంది. లేని పక్షంలో ఏమవుతుందో శశికళ విషయంలో రుజువైంది కదా! కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అన్ని రాష్ర్టాలలో అధికారంలోకి రాలేకపోయింది. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఒకే ఏలుబడిలో ఉండాలనుకోవడం అత్యాశ కాదా! ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకున్నవాళ్లు కూడా సఫలం కాలేదు. అలాగే ఇప్పుడు దేశాన్ని జయించాలనుకుంటున్న మోదీ– షాలు ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూద్దాం. గుజరాత్‌ వ్యవహారంలో బాధితపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం.
 
చట్టాలను తెచ్చిందీ వాళ్లే-– వాటికి తూట్లు పొడిచిందీ వాళ్లే! పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే! ఆ చట్టాన్ని తుంగలో తొక్కి అవసరమైనప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందీ కాంగ్రెస్‌ పార్టీనే! అటల్‌ బిహారి వాజపేయి ప్రభుత్వానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలిపోయింది. కానీ ఆ తర్వాత కొంతకాలానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి కూడా లోక్‌సభలో బలాబలాల సమస్య తలెత్తింది. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అనేక అడ్డదారులు తొక్కింది. ఇప్పుడు చచ్చీ చెడీ గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్‌ పటేల్‌ వంటివారే అప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను ప్రలోభపెట్టారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే బాధ్యత అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన రాజశేఖర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీలపై గురిపెట్టారు. ఫలితమే.. డీకే ఆదికేశవులునాయుడు, మందా జగన్నాథం వంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వానికి జైకొట్టారు. ఇక రాష్ర్టాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేయని అరాచకం లేదు. ఐబీ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖ వంటి ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పిన ఘనచరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ ద్వారా విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అడుగుజాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్‌ నాయకుల మీదకు ప్రయోగిస్తున్నారు. తన కుమారుడిని ముప్పుతిప్పలు పెడుతున్న సీబీఐ, ఆదాయపుపన్ను విభాగాలపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఇప్పుడు చిందులేస్తున్నారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవే ఏజెన్సీలను ఆయన పర్యవేక్షణలో రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పలేదా? కక్ష సాధింపులు అనేవి రాజకీయాలలో ఒక క్రీడగా మారిపోయాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న పార్టీల చేతుల్లో పావులుగా ఉంటున్నాయి. ఫలితంగా నిజంగా తప్పుచేసిన వాళ్లు కూడా బుకాయించగలుగుతున్నారు. ప్రజలలో కూడా దర్యాప్తులపై అపనమ్మకం ఏర్పడుతోంది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీపై ఆదాయం పన్ను శాఖ అధికారులు పదే పదే దాడులు నిర్వహించారు. దీంతో కలత చెందిన సదరు ఎంపీ సీపీఎంకు చెందిన ఒక ముఖ్య నాయకుడైన ఎంపీని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వద్దకు రాయబారం పంపారు. ‘‘దాడులకు గురవుతున్న ఎంపీపై నాకు వ్యక్తిగతంగా కోపం ఏమీలేదు. మేడం సోనియాగాంధీ నుంచి ఆ ఆదేశాలు రావడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి కారణం’’ అని ప్రణబ్‌ చెప్పారట. సదరు తెలుగుదేశం పార్టీ ఎంపీ కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించకపోవడమే అప్పుడు రాజశేఖర్‌రెడ్డి ఆగ్రహానికి కారణం! ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్‌ దురాగతాలు ఎన్నో ఉంటాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ అన్ని రాజకీయ పార్టీలకు ఎంతో కొంత పాత్ర ఉంటూనే వస్తోంది. ఈ క్రీడలో అధికారంలో ఉన్నవారిది అప్పటికి పైచేయి అవుతుంది. అధికారం కోల్పోగానే వారే బాధితులుగా బోరుబోరుమంటుంటారు. బహుశా అందుకే కాబోలు పార్టీ ఫిరాయింపులను ప్రజలు కూడా సీరియస్‌గా పరిగణించడం లేదు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలకు గురవుతున్న రాజకీయ నాయకులను కూడా ఆదరిస్తున్నారు.
 
నోరు జారితే..
ఇప్పుడు కాసేపు ఏపీ వ్యవహారాలకు వద్దాం. భూమా నాగిరెడ్డి మృతి వల్ల ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం– వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయకుల నోటి నుంచి మాటల తూటాలు వర్షంలా కురుస్తున్నాయి. ఈ క్రమంలో హద్దూ– పద్దూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి రోజుల తరబడి నంద్యాలలో మకాం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నడిబజారులో కాల్చినా తప్పులేదని జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఎంత వివాదం అయ్యిందో, భూమా నాగిరెడ్డి కుమార్తె మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా చలామణి అవుతున్న రోజా చేసిన వ్యాఖ్యలు కూడా అంతే వివాదాస్పదం అయ్యాయి. చీర కట్టుకోకుండా చుడీదార్‌తో తిరిగే అఖిలప్రియకు సంప్రదాయం తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు రోజాకే ఎక్కువ నష్టం కలిగించాయి. రోజా కూడా చుడీదార్‌ ధరించిన రోజులు ఉన్నాయి. టెలీషోలలో ఇప్పటికీ ఆమె చుడీదార్‌ల వంటి దుస్తులు ధరించి అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. అంతెందుకు రోజా కుమార్తెలు చీరలే కట్టుకుంటున్నారా? లంగా- ఓణీలు, చీరలు ధరించడం అనేది పెళ్లిళ్లు, పేరంటాలు వంటి ఉత్సవాలలోనే చూస్తున్నాం. మిగతా సందర్భాలలో చాలామంది మహిళలు, యువతులు సౌకర్యంగా ఉంటుందని చుడీదార్లు, ప్యాంట్‌- షర్టులే ధరిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ మన పిల్లల వస్త్రధారణలో భాగమైపోయాయి. అలాంటిది– నిండా 30 ఏళ్ల వయసు కూడా లేని అఖిలప్రియ చుడీదార్‌లు ధరిస్తే తప్పు ఏమిటో రోజాకే తెలియాలి. ఎదుటివారు చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే కాలు జారినా తీసుకోవచ్చు గానీ, నోరు జారితే వెనక్కు తీసుకోలేమని పెద్దవాళ్లు చెప్పారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే ఇలా ఉంటే ప్రచారం ముగింపు దశకు వచ్చేనాటికి మన నాయకుల మాటలు మరెంత వేడి పుట్టిస్తాయో చూడాలి. గతంలో ఉప ఎన్నికలు చడీ చప్పుడు లేకుండా జరిగేవి. ఇప్పుడు ఏ ఎన్నిక అయినా రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతోనే నోళ్లు అదుపు తప్పుతున్నాయి. నంద్యాల ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఏపీలోనే కాదు– తెలంగాణలో కూడా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినందున ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బలం పెరిగిందని రుజువు చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే నంద్యాల పోరు ప్రతిష్ఠాత్మకం అవుతోంది. పనిలో పనిగా కాకినాడ నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రధాన పార్టీల ప్రధాన నాయకులందరూ నంద్యాలలోనే మకాం వేసినందున కాకినాడలో ఏమి జరుగుతున్నదో అంతగా తెలియడం లేదు. నేతలు ప్రచార రంగంలోకి దిగితే అక్కడ కూడా వేడి రాజుకోకుండా ఎలా ఉంటుంది?
 

 

Share this post


Link to post
Share on other sites

NTR naaati viluvalevi TDP lo...

Emi miss ayayo cheppandi. One or two examples tho kaadu.. overall ga discuss chedham uncle. Constructive ga. Egos ki vellakunda.

Meeru sidhdhamaite cheppandi

 

Just to remind you 1999 lo TDP party adhyakshudu CBN ey. Aa 1999 lo jarigina incident gurinche matter

Share this post


Link to post
Share on other sites

He is not involved in criminal cases like Modi & Shah

If they are criminals how come no courts have convicted them so far.....and who are you to decide they are criminals....lol jaffas also say that babu is a criminal ...we dont the truth how good he is...ee broker gadini ante niku enduku kalindi inaa ..valu criminals ite sonta mama mida cheppulu enchina vadini emantaro ...

Share this post


Link to post
Share on other sites

If they are criminals how come no courts have convicted them so far.....and who are you to decide they are criminals....lol jaffas also say that babu is a criminal ...we dont the truth how good he is...ee broker gadini ante niku enduku kalindi inaa ..valu criminals ite sonta mama mida cheppulu enchina vadini emantaro ...

India lo courts sangati telsu gaaaaaaaaaaaaa

Share this post


Link to post
Share on other sites

If they are criminals how come no courts have convicted them so far.....and who are you to decide they are criminals....lol jaffas also say that babu is a criminal ...we dont the truth how good he is...ee broker gadini ante niku enduku kalindi inaa ..valu criminals ite sonta mama mida cheppulu enchina vadini emantaro ...

media antene andaru brokers ye.no exception for others

Share this post


Link to post
Share on other sites

Prathi okkallaki modi/shah ni tittatam/egatali cheyyatam edo goppa achievement annatlu aipoindhi.. main ga mana db lo.. it just shows how high they are currently.... krishna bidda bro.. meeru lite teeskondi.. off late every thread is being converted either to modi vs cbn or tdp vs bjp or central vs state.. politics section lo ye thread open chesina ive unte chirakestondi... asalu prathi thread lo nu same rotta arguments tho ela kottukuntaru either sides.. nenu theda gadina lekapothe meekevvariki kastha kuda chiraku anpinchatledha.. ?

Share this post


Link to post
Share on other sites

 shah kanna pedda broker ledu india lo

shah own ga kastapadindi yedi ledu,power ni addu pettukoni longa deesukuntunnaru.yeduru tirigitry sasikala ki pattina gati yevariki aina.ante kani vella strenght yemi ledu.

Share this post


Link to post
Share on other sites

Sohrabuddin encounter case nunchi evaru ela escape ayyaro, andariki telusu.....

Andariki telusu.. okka courts and SIT(constituted by UPA) ki tappa... anthey na bro ?

Idhrat jahan edo amayakuralu ani 10 yrs janalni erripukulni chesaru ga.. final ga nijam bayatapadaledha ? Any given day, modi/shah stood firmly for what they are even when faced by adversaries jf highest order.

Oka supreme court SIT mundhu continuous ga 7 hrs kurchoni answers cheppi dhairyam g abayatikochi ye tappu cheyyaledhani garvam ga prove cheskunna okka CM ni chupinchandi.. modi gadini vadilesi desamantha aadiki jai kottiddi..

Share this post


Link to post
Share on other sites

Power lenappudu enta mandi support chestaro whole heartedly ee modi/shah dwayam ki chuddam :roflmao::roflmao::roflmao::roflmao:

 

 

power lenappudu ekkada unnaro vellantaaaaaaaaaaa

Power unna lekapoina simham simhame... adi andarki artham kaadhu lite teeskondi.

Share this post


Link to post
Share on other sites

Power unna lekapoina simham simhame... adi andarki artham kaadhu lite teeskondi.

simham ante dairyam ga yedurkovali political ga ante gani pilli laga cases petti bedirinchatam kadu insecurity feeling tho.centre level lo undi state level ,galli level lo unna vallani bedirinchatam kadu  :roflmao:  :roflmao:  :roflmao:

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×