Jump to content

గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద చూసినా మారరా ?

Recommended Posts

గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద చూసినా మారరా ?
pattiseema-19072017.jpg
share.png

గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీ వద్ద చూసి కూడా ఒక్క మాట కూడా మాట్లాడరేం అని ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సూటిగా ప్రశ్నించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా తిట్టాలో ఆవిధంగా 673 సార్లు తిట్టారని అన్నారు.

పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు వస్తే ఎందుకు మాట్లాడలేదని, వాస్తవం మాట్లాడటానికి ఇగో సమస్య అడ్డువచ్చిందా అని ప్రశ్నించారు. 88 టీఎంసీల నీరు తీసుకువచ్చి రూ.2,500 కోట్ల విలువైన పంటను కాపాడినట్లు చెప్పారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ ముసుగులో అనేకమంది, కేవీపీ, రఘువీరా రెడ్డి, ఊసరవెల్లి ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్మోహన రెడ్డి లాంటి వారు విమర్శిస్తున్నారన్నారు. పంటకాలువల్లోకి, పొలాల్లోకి నీరు వెళుతున్నా అందరూ బురదజల్లారని మండిపడ్డారు. కృష్ణా డెల్టాలో ఆక్వా, వ్యవసాయం ఉత్పత్తులు ద్వారా ఆదాయం భారీగా పెరిగినట్లు చెప్పారు.

పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తామంటే ఆ రోజు హేళనగా మాట్లాడారని, ఏడాదిలో పూర్తి అయితే రాజీనామా చేస్తానని ఉరవకొండ ఎమ్మెల్యే అన్నారన్నారు. చేస్తానని, చెప్పాను, చేసి చూపించానని చెప్పారు. పులివెందులకు నీరిస్తామన్నా కూడా హేళనగా మాట్లారని, కుప్పం కంటే ముందే పులివెందుకు నీరిచ్చినట్లు తెలిపారు. పట్టిసీమకు వ్యతిరేకం అన్నారు, రైతులను రెచ్చగొట్టారని అన్నారు. సముద్రంలో కలిసే నీరుని కృష్నా డెల్టాకు తెచ్చామని, ఆ విషయాన్ని రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆగస్టు 15కి పురుషోత్తమ పట్నంకు నీరిస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగు నీరు అందించడానికి వివిధ ప్రాజెక్టులపై 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 26 ప్రాజెక్టుల నీటి విడుదల తేదీలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు కూడా ముందుగానే పంటపొలాలకు నీరందించి, అక్కడి కష్టాలు తీరుస్తామన్నారు. రాయలసీమని రతనాల సీమ చేస్తామని, హార్టీకల్చర్ హబ్ గా తయారు చేస్తామని చెప్పారు.

ఇటుకిటుక పేర్చుకుంటూ ప్రతి సోమవారం పోలవరంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నాలుగు వేల మంది ఇంజనీర్లు పని చేస్తుంటే స్పిల్ వేకు పగుళ్లు ఇచ్చినట్లు చెప్పడం ఏమిటని మండిపడ్డారు. అటు పోలవరం, ఇటు రాజధాని అమరావతి విషయంలో రైతులను రెచ్చగొడుతూ అడ్డుపడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ కుట్రలు, కుతంత్రాలు తమవద్ద చెల్లవన్నారు.

పోలవరం, అమరావతి తమకు రెండూ రెండు కళ్లు లాంటివన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, అన్నీ ఆత్మహత్యలేనని చెప్పారు. అభివృద్ధిని గుర్తించకపోవడం అజ్ఙానానికి నిదర్శనం అన్నారు. కాగ్ అభ్యంతరాలకు సమాదానాలు చెప్పే సత్తా తమ జలవనరుల శాఖ అధికారులకు ఉందని చెప్పారు. అందుకు కావలసిన సమాచారం వారి వద్ద ఉందన్నారు.

Link to comment
Share on other sites

ఇగో సమస్య కాదు, ఇదీ సమస్య 

1) జులై లో కృష్ణా డెల్టా కి గోదావరి నీరు ఇచ్చేస్తే మరి డెల్టా రైతాంగాన్ని నీటి కోసం రెచ్చగొట్టే అవకాశం ఏది?

2) జులై లో కృష్ణా డెల్టా కి గోదావరి నీరు ఇచ్చేస్తే నారు మడులు కోసం కృష్ణా బోర్డుని అడుక్కునే అవకాశం ఉండక పోతే ఎలా?

3) మీరు అడుగుతూ ఉంటే, బోర్డు తిరస్కరిస్తూ ఉంటే మేము రాజకీయం నడపాలి. చరిత్ర తిరగ రాస్తామంటే ఎలా?

4) మీరు నారు మడులు కోసం నీరు అడక్కపోతే లంగా రావు కి ఆంధ్రోళ్ళని తిట్టే అవకాశం ఎక్కడిది?

5) మీరు తాగు నీరు కోసం బోర్డుని అడుక్కుంటుంటే , లేదు ఆ నీటిని పంటలకు వాడుకుంటారు అని బోర్డుని తప్పు దారి పట్టించే అవకాశం లంగా రావు కి లేకపోతే ఎలా?

6) ఆగస్టు లో శ్రీశైలం కు వచ్చే వరద నీరుని  కృష్ణా డెల్టా కి ఇవ్వకపోతే రాయలసీమ రైతాంగాన్ని ఎలా రెచ్చగొట్టాలి?

7) కృష్ణా రైతులకి, సీమ రైతులకి మధ్య చిచ్చు పెట్టే అవకాశం లేకపోతే మేము రాజకీయం ఎలా చెయ్యాలి?

:o 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...