Jump to content

TDP Sure to win Nandyal by Election

swas

Recommended Posts

నంద్యాలలో ఊపందుకున్న ప్రచారం

  • నియోజకవర్గంపై పట్టుబిగిస్తున్న అధికార పార్టీ
  • 13న నంద్యాలలో మంత్రి లోకే్‌శ పర్యటన
  • ఏంపీ టీజీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల మహా ప్రదర్శన
  • అక్కడే మకాం వేసి వ్యూహాలకు పదునుపెడుతున్న మంత్రులు
 
కర్నూలు, జూలై10(ఆంధ్రజ్యోతి): అభివృద్ది పనుల జోరు.. మంత్రుల పర్యటనలు.. ప్రచా ర హోరుతో నంద్యాల ఉప ఎన్నికల వేడి రాజుకుంది. నియోజకవర్గంపై అధికార టీడీపీ పట్టు బిగిస్తోంది. ఈ నెల 13న పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకే్‌శ నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడికి పరుగులు పెడుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యనేతలు పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని పరిచయం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం బలంగా ఉంది. 25 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పట్టు బిగించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆర్యవైశ్య, వ్యాపారవర్గాలు మహా ప్రదర్శన నిర్వహించారు. పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవ్వరూ ఆడ్డుకోలేరని అన్నారు. ఆర్యవైశ్య, వ్యాపారవర్గాలు అధికార పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అభ్యర్థిని గెలుపులో కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. మరో పక్క మంత్రులు ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, ఏపీఎ్‌సఐడీసీ ఛైర్మన్‌ కేఈ ప్రభాకర్‌, కర్నూ లు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్‌.శ్రీధర్‌రెడ్డి ఆటోనగర్‌లో విస్తృత ప్రచారం చేశారు. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి కలిసి ప్రచా రం చేయడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చింది. రాత్రి గోస్పాడు మండలం సాంబవరంలో మంత్రి అఖిలప్రియ, అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ, శాసనమండలి ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించడం, డాక్టర్‌ నౌమాన్‌కు ఉర్దూ అకాడమి ఛైర్మన్‌ పదవి ఇవ్వడంతో అత్యధిక ఓటు బ్యాంక్‌ ఉన్న ముస్లిం వర్గాల్లో నూతనోత్సాహం వచ్చింది. అటు.. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వ్యూహాత్మక ప్రచారాన్ని సాగిస్తున్నారు. అధికార పార్టీ వేగం ముందు ప్రచారంలో ప్రతిపక్షం చతికిలపడింది.
Link to comment
Share on other sites

announcement vache lopu pour money in that constituency in development activities cover each house problems 

Link to comment
Share on other sites

AV subbareddy baga kastapadutunnaru,chala mandini malli tdp loki tisukuni vacharu main ga silpa tho vellina batch ni

Main key is ground level lo andaru strong vallu undali

better each street ki focus cheyali what ever may be problem solve cheyandi as fast as we can before announcement from EC

It will become a cake walk

Link to comment
Share on other sites

‘శిల్పా’ అనుచరుడు వద్ద రూ. 7 లక్షలు స్వాధీనం
11-07-2017 13:15:31
 
636353759012528394.jpg
కర్నూలు: మాజీ మంత్రి, నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి అనుచరుడి వద్ద పోలీసులు మంగళవారం రూ. 7లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల విశ్వనగర్‌లో శిల్పా మోహన్‌రెడ్డి అనుచరుడు, కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎలాంటి పత్రాలు లేని రూ.7 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా... నంద్యాల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్ ఎదుట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన, శిల్పా మోహన్‌రెడ్డి వర్గం నేతలు ఆందోళన నిర్వహించారు.
Link to comment
Share on other sites

worst case lo 5K majority.....Best case lo 25k....seat pakka TDP de......Majority counts ante....5K lopu majority tho TDP geliste moral win YCP de... 

street street ki varalu prakatanalu cheyali solve all problems in hours time lo 

Link to comment
Share on other sites

20229280_1029281880540738_19477577634488

Ive avasaram ledu anavasarangaa...andaroo janaalu tight 5k tho bayatapadiddi ane mood lo vunnaaru...oka 20k tho geliste oka range +ve wave create avuddi..ippudu ee 50k lu sodi ani dabba kotite 20k tho gelchinaa janaalu verelaa anukontaaru

Link to comment
Share on other sites

నంద్యాల గెలుపుపై చంద్రబాబు కాన్ఫిడెన్స్‌ ఏంటో ఈ మాటే చెప్తోంది
24-07-2017 08:58:24
 
636364835314038499.jpg
  • మెజార్టీపై దృష్టి సారించండి
  • కార్యకర్తలకు దిశానిర్దేశం
  • అర్ధరాత్రి దాకా జనం మధ్యనేసీఎం
  • మీ వెంటే అన్న ఆడపడుచులు
  • నంద్యాలలో బాబుకు జన నీరాజనం
 
ఆంధ్రజ్యోతి - కర్నూలు: ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి శని, ఆదివారాలు నంద్యాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు తమ్ముళ్లలో నూతనోత్తేజం నింపారు. సీఎం రాక కోసం శనివారం అర్ధరాత్రి కూడా జనం ఎదురు చూశారు. ఎక్కడికి వెళ్లినా ఆయనకు జనం నీరాజనం పలికారు. శనివారం అర్ధరాత్రి 12.50 గంటల దాకా గోస్పాడు మండలం యాల్లూరులో పర్య టన సాగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నంద్యాల చేరు కొని రోడ్లు భవనాల అతిథి గృహంలో విశ్రమించారు. ఆది వారం ఉదయం అక్కడేకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మనకు ఉప ఎన్నికల్లో విజయం తథ్యం.. అయితే యాభై వేల మెజారిటీ రావాలి. తద్వారా నంద్యాల అభి వృద్ధి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన విధానాలు దేశ వ్యా ప్తంగా చర్చ జరగాలని సూచించారు. ఏ మాత్రం విరామం లేకుండా ఏకంగా 13 గంటలకు పైగా శనివారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం 11.45 గంటలకు సీఎం చంద్రబాబు నంద్యాల ప్రభుత్వ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. నేరుగా చామకాల్వను పరిశీలించి ఎస్‌జీపీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు చేరుకున్నారు.
 
గంటన్నరకుపైగా ఆ సభలో ప్రసంగించారు. నంద్యాలలో ఎస్సార్బీసీ కాలనీ లో 13 వేల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన అనం తరం రాత్రి 8 గంటల వరకు పట్టణ ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఆ తర్వాత నంద్యాల, గోస్పాడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. రాబోయే ఉప ఎన్నికల్లో భూమా దంపతుల బిడ్డలను ఆశీర్వదించి.. నమ్మక ద్రోహులు, అభివృద్ధి నిరోధకులకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎక్కడికి వెళ్లినా పొదుపు మహిళలు చంద్రన్నను అన్నలా గౌరవించారు. అన్నా.. ఈరోజు మేము ఆర్థికంగా బలోపేతమయ్యామంటే ఆనా డు మీరు చూపిన మార్గమే కారణం. మీ దూరదృష్టి వల్లే పొదుపులక్ష్మి సంఘాలు ఈరోజు మహావృక్షమై ఆర్థి క పురోభివృద్ధికి దోహదపడ్డాయి. అన్నా..మీ వెంటే మేమంతా అని ఆడపడుచులు అనడంతో చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 50 శాతం మీకే అంటూ.. ఆడపడుచులకు కానుకలు అందించారు.
 
ఇంటింటికి వెళ్లండి.. ఆప్యాయంగా పలకరించండి
నంద్యాల ఉప ఎన్నికల్లో జనం మన వెంటే ఉంటారు.. ఇంటింటికి వెళ్లండి.. ఆప్యాయంగా పలకరించండి.. మన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరంటూ పార్టీ అధినేతగా చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలు పు కోసం సమష్టిగా పని చేయాలని సూచించారు. ఉద యం లేవగానే ఇంటింటికి వెళ్లండి.. అమ్మా.. అక్కా.. అన్నా..మామా అని ఆప్యాయంగా పలకరించండి. ఒక్క సారి వెళితే..సరే అంటారు.. రెండోసారి వెళితే నమ్ముతారు.. మూడోసారి వెళితే ఆప్యాయంగా ఆరాధిస్తారు.. జనా నికి మనపై ఉన్న విశ్వాసం అదే అంటూ ఉత్తేజాన్ని నూరిపోశారు. తాను నమ్మిన వాళ్లే ఆ నమ్మకాన్ని గౌరవించకుండా ద్రోహం చేశారు. అభివృద్ధికి అడ్డుగా నిలిచా రు. డబ్బు ఉందని రాజకీయాలు చేస్తున్నారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో అలానే పోతుంది. వారి గురించి ఏ మా త్రం ఆలోచించకుండా జనంలో కలిసి ప్రభుత్వం చేపట్టే పథకాలను వివరించండి అంటూ కార్యకర్తలకు సూచించారు. నంద్యాల ఉప ఎన్నికలో 50 వేల మెజారిటీ సాధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడండి.
నంద్యాల నాయకులు మంత్రి అఖిలప్రియ, ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌, నౌమాన్‌, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, శాంతిరాముడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరులంతా కలిసికట్టుగా ప్రచారం చేయండని ఆదేశించారు. ఎవరికివారే ప్రచారం చేస్తే మనలో ఐక్యత లేదని ప్రజల్లో నమ్మకం పోతుందని, ఈ ఆలోచనే కలగకుండా ప్రచారంలోకి వెళ్లాలని సూచించారు. నంద్యాల చరిత్రలో ఎవరూ ఊహించని అభివృద్ధిని చేసి చూపిస్తున్నందు వల్ల దీన్నం తా ఓట్లుగా మార్చుకోవడం మన కర్తవ్యమని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఇక్కడికి వచ్చి మీటింగ్‌ పెడుతానని ఎన్నికల ప్రచార తీరుపై పార్టీ అధినేతగా కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ హయంలో ప్రతిపక్ష అభ్యర్థి శిల్పా మంత్రి గా ఉన్నప్పుడు ఇందూ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిని ప్రభుత్వ స్థలం కేటాయించి ఇళ్ల వ్యాపారం చేశారు. ఎండగట్టాలని, అలాగే ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు కార్యకర్తలకు ఉపదేశించారు.
 
పొదుపు మహిళలకు రూ.25 కోట్లు వడ్డీమాఫీ, రూ.28 కోట్లు పెట్టుబడి నిధి డబ్బు ఇచ్చామని, దుల్హన్‌ పథకం కింద ముస్లిం ఆడపిల్లల పెళ్లిలకు రూ.50వేలు ఇస్తున్నామని ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రులు ఎన్‌ఎంఢీ ఫరూక్‌, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, మణిగాంధి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కుడా ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులను ప్రణాళికాబద్ధంగా ఎలా నడిపించాలో, ఎలాంటి ఎత్తుగడలు, వ్యూహాలు అమలు చేయాలో బస్సులో నాయకులకు, మంత్రులకు సూచించారు. సీఎం పర్యటనలో చివరి వరకు పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చంద్రబాబు వెంటే ఉన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...