Jump to content

Kidambi srikanth


Recommended Posts

ఒలింపిక్స్‌లో తెలుగు తేజాలు అదరగొట్టాలి

శ్రీకాంత్‌కు గ్రూప్‌-1 అధికారిగా అవకాశం

రూ.50లక్షల ప్రోత్సాహకం, వెయ్యి గజాల ఇంటి స్థలం

కోచ్‌ గోపీచంద్‌కూ రూ.15 లక్షల నజరానా: చంద్రబాబు

ఈనాడు - అమరావతి

28ap-main8a.jpg

వరసగా రెండు సూపర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో విజయ దుందుభి మోగించి కిదాంబి శ్రీకాంత్‌ రియో ఒలింపిక్స్‌ విజేతను సైతం చిత్తుచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ అద్భుత విజయాలు ఆంధ్రులందరికీ గర్వకారణమన్నారు. శ్రీకాంత్‌ గుంటూరుకు చెందిన యువకుడు కావడం మరింత సంతోషకరమన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం కిదాంబి శ్రీకాంత్‌ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది పీవీ సింధుకు ఇక్కడే సన్మానం చేశాం, నేడు మరో తెలుగు తేజం శ్రీకాంత్‌నూ ఇక్కడే సన్మానించడం సంతోషంగా ఉంది. వీరి స్ఫూర్తితో మరింత మంది క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలి. శ్రీకాంత్‌ ఇదే స్ఫూర్తితో ఆడి ఒలింపిక్స్‌లోనూ విజేతగా నిలుస్తారనటంలో అనుమానం లేదు’’ అంటూ ప్రశంసించారు. ‘‘శ్రీకాంత్‌కు రూ.50 లక్షలు ప్రోత్సాహకం, వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తాం. గ్రూప్‌-1 ఉద్యోగం కూడా ఇవ్వనున్నాం. శ్రీకాంత్‌కు ఉత్తమ శిక్షణ ఇచ్చిన పుల్లెల గోపీచంద్‌కు కూడా రూ.15లక్షలు ఇస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు. శ్రీకాంత్‌ ఆంధ్ర తరఫున ఆడాలని కోరుకుంటున్నానని, ఎలాంటి సాయమైనా చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ‘‘నోబెల్‌ బహుమతి సాధించే తెలుగువారికి రూ.వంద కోట్ల ప్రోత్సాహకం ఇస్తానని ఇటీవల ప్రకటించాను. ఒలింపిక్స్‌లోనూ ప్రథమ స్థానం సాధిస్తే మంచి బహుమతి ఇస్తా’’ అని పేర్కొన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు గోపీచంద్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ గెలిచినప్పుడు రూ.25లక్షల ప్రోత్సాహకం అందజేశానన్నారు. హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాలను ఇచ్చానని గుర్తుచేశారు. అమరావతిలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేయమని గోపీచంద్‌ను కోరగా ఆయన అంగీకరించారన్నారు. కిదాంబి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే తనలాంటి క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరఫున రూ.50లక్షల చెక్కును అందజేశారు. విదేశాలలో తాను ప్రత్యేకంగా కొనుగోలు చేసిన షటిల్‌ రాకెట్‌ను శ్రీకాంత్‌ ముఖ్యమంత్రికి బహుమతిగా అందజేశారు. వేదికపై ఆ రాకెట్‌తో ఇద్దరూ సరదాగా కొద్ది సేపు ఆడారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, పుల్లారావు, రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

  • 4 months later...
Guest Urban Legend

andhra singam srikanth

 

 

6months back

e kurrodiki 50 lakhs nd govt job icharu babu garu ani yedcharu idhey db lo

 

e roju india lo yevaru saadinchalenidhi sadinchadu :no1:

Link to comment
Share on other sites

AP Star - Kidambi Srikanth.

 

This year winning percentage 80%, consistency baaga perigindi.

 

Srikanth, Sai praneeth, Pranoy all are playing well this year. Next 2-3 years consitent ga aadithe Olympics lo Men's singles nunchi medal expect cheyyochhu.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...