Jump to content
Sign in to follow this  
sonykongara

Kurnool Airport, Orvakal.

Recommended Posts

గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు బాబు శంకుస్థాపన

21brk120-babu.jpg

కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 1,010 ఎకరాల్లో రూ.120 కోట్లతో ఏడాదిలోగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తిచేయనున్నట్టు స్పష్టంచేశారు. ఈ విమానాశ్రయంతో కర్నూలు జిల్లా నుంచి వివిధ నగరాలకు విమానం ద్వారా వెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు అంతకుముందు జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచలో జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ ఏర్పాటుచేసిన ఫుడ్‌ప్రాసిసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే కొన్ని శక్తులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ ద్వారా రూ.400 కోట్ల పెట్టుబడులు వస్తాయని.. తద్వారా 3500 మందికి ప్రత్యక్షంగా, 2వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు.

 

Share this post


Link to post
Share on other sites

Orvakallu lone Dwakra mahilalu 7cr petti kattinchina school kooda open chesadantaga...great asalu maamuluga ledu building..

Aa ladies antha cbn maaku inspiration ani chala happy feel avtannaru

Share this post


Link to post
Share on other sites

My vellage (Loddipalli) is in Orvakal madal

Mari are the people happy with the Airport and Industry coming?

Are the ppl happy with CBN?

Are the people happy with TDP Govt?

 

Please enlighten us Brother

Share this post


Link to post
Share on other sites

Orvakallu lone Dwakra mahilalu 7cr petti kattinchina school kooda open chesadantaga...great asalu maamuluga ledu building..

Aa ladies antha cbn maaku inspiration ani chala happy feel avtannaru

 

Super undi ga....

 

Share this post


Link to post
Share on other sites

Ippudu idenduku gurthochindi.. elections ana :peepwall:

Nope state devide ayyaka kurnool lo 1st independence day celebrations Kurnool lo jariginappudu promise adi,land aquisition late ayyindi,jaffa opposition undi ga rechakottadaniki lands ivoddu ani

Share this post


Link to post
Share on other sites

Super undi ga....

 

 

Yeah ide..TFS

 

Ittanti vi pramote cheskovala...ladies & nuetrals lo impact vuntadi baaga...kanisam open chesinattu ekkada adds newse chudala..nenu edo random chustante tagilindi

Share this post


Link to post
Share on other sites

 

 


Ittanti vi pramote cheskovala..

 

mana govt ka ads ki dabbulu levu...media emo CBN manaki ettagu emi ivvadu so better we take looty batch side ani decided.... :wall:  :wall:

CBN pettina DWACRA batch anta vallu....

 

ide pakka state lo ayete e patiki mottam maru mogi poyedi...

Share this post


Link to post
Share on other sites

mana govt ka ads ki dabbulu levu...media emo CBN manaki ettagu emi ivvadu so better we take looty batch side ani decided.... :wall::wall:

CBN pettina DWACRA batch anta vallu....

 

ide pakka state lo ayete e patiki mottam maru mogi poyedi...

Share this post


Link to post
Share on other sites

Mari are the people happy with the Airport and Industry coming?

Are the ppl happy with CBN?

Are the people happy with TDP Govt?

 

Please enlighten us Brother

 

Yes we are very much Happy brother and also any day happy with TDP and CBN

 

antha okate chepthaaru CBN baga kastapaduthunnadu next time kudaa CBN ee CM ani 

Share this post


Link to post
Share on other sites

Yes we are very much Happy brother and also any day happy with TDP and CBN

 

antha okate chepthaaru CBN baga kastapaduthunnadu next time kudaa CBN ee CM ani

Happy to hear and thank you for sharing.

Share this post


Link to post
Share on other sites

అదిగదిగో ... ఆకాశయానం
ఓర్వకల్లు వద్ద 1010 ఎకరాల కేటాయింపు
రూ.25.50 కోట్లతో భూసేకరణ పూర్తి
ప్రాజెక్టు వ్యయం రూ.88.50 కోట్లు
ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు వేగవంతం
మూడు నెలల్లో రన్‌వే పనులు పూర్తి
knl-top1a.jpg

ఏడాది లోపు పనులు పూర్తి చేసి 2018 జూన్‌ నాటికి విమాన రాకపోకలు జరిగేలా చూస్తాం’

- నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: భూసేకరణ దశ పూర్తి చేసుకుని పనులు వేగవంతం కావడంతో పల్లె ముంగిట ఆకాశయానానికి మార్గం సుగమమవుతోంది. పనులు వేగవంతం చేసి 2018 జూన్‌ నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని గత జూన్‌ 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో ఒక్కసారిగా ఓర్వకల్లుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం జిల్లాకే తలమానికం కానుంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో ఇప్పటికే ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా ప్రకటించారు. ఇందుకు విమానాశ్రయం అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. పనులు వేగంగా పూర్తిచేస్తే ఇక్కడి నుంచి అమరావతి, చెన్నై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల, కన్నమడకల, ఓర్వకల్లు గ్రామాల పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు 1010.08 ఎకరాల సేకరణ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వ భూమి 638.83 ఎకరాలు, పట్టా భూమి 243.08 ఎకరాలు, ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన భూమి 123.23 ఎకరాలు ఇందులో భాగంగానే కేటాయించారు. రూ.25 కోట్లు కేటాయించడంతో భూసేకరణ పూర్తి చేశారు. పూడిచెర్లలో 218.47 ఎకరాల భూసేకరణకు రూ.16.24 కోట్లు, కన్నమడకలలో 110.08 ఎకరాల సేకరణకు రూ.9.21 కోట్లు వెచ్చించారు. దీంతో భూసేకరణ సాధ్యమైంది. భారీగా ప్రభుత్వ భూములు ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పారిశ్రామిక హబ్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం ఏర్పాటుతో పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు పడనుంది. ఇప్పటికే 13 గ్రామాల పరిధిలోని 13,834 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించింది. పరిశ్రమలు నెలకొల్పాలంటే విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సంకల్పం ప్రాధాన్యం సంతరించుకుంది.

విమానాశ్రయం నిర్మాణానికి ఫేజ్‌-1 కింద ప్రభుత్వం రూ.88.50 కోట్లు కేటాయించిందని అధికారులు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో కేసీవీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ రూ.62 కోట్లతో పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రెండు కిలోమీటర్ల మేర రన్‌వే పనులు, ప్రహరీ నిర్మాణం, రహదారులు, సర్వీసు దారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రన్‌వే పనుల్లో భాగంగా ప్రస్తుతం గోతులను చదును చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. డిసెంబరు నాటికి రన్‌వే పనులు పూర్తి కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో రూ.26.50 కోట్లతో ‘స్టాండర్డ్‌ ఇన్‌ఫ్రా టెక్‌’ సంస్థ కొన్ని పనులు దక్కించుకుంది. ఈ సంస్థ టెర్మినల్‌, వాచ్‌ టవర్లు, ఏటీసీ భవనం, స్టోరేజ్‌ ట్యాంకు, విద్యుత్తు సౌకర్యంలో భాగంగా జనరేటర్ల పనులు చేపట్టనున్నారు. తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రహరీని ఇటుకలతో నిర్మించాల్సి ఉంది. ఇందుకుగానూ స్థానికులు రోజుకు వేయి ఇటుకలకు మించి తయారు చేయలేకపోవడంతో గుజరాత్‌ రాష్ట్రంలో నిర్మించిన ఆధునిక ఇటుకల తయారీ కర్మాగారం తరహాలో ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో 15 వేల ఇటుకలను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మూడు విభాగాలుగా...
ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ఎనిమిది విమానాలను నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరో విభాగంలో మూడు విమానాలు, ఇంకో విభాగంలో మరమ్మతులకు గురైన విమానాలు ఆపేందుకు అవకాశం ఉంటుంది. విమాన రాకపోకలు పెరిగాక మరో విభాగం ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థ అధికారులు నాణ్యతను పరిశీలించిన అనంతరం ముంబయి నుంచి సుప్రీం ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌, ఆపై కొత్త దిల్లీ నుంచి డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న రన్‌వే ఏమాత్రం తేడా ఉన్నా అనుమతి నిరాకరిస్తారని ఓ అధికారి పేర్కొన్నారు.

లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తాం - వెంకటేశ్వరరావు, డీఈ
గ్రీన్‌ఫీల్డ్‌ వియానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తాం. రన్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మూడు నెలల్లోపు పూర్తి చేయించే దిశగా ప్రణాళికలు రూపొందించాం. త్వరలో ప్రహరీ, టెర్మినల్‌, వాచ్‌ టవర్లు, ఏటీసీ భవనం, వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులు ప్రారంభించాలని భావిస్తున్నాం. 2018 ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం.

Share this post


Link to post
Share on other sites

ఓర్వకల్లుకు రూ.4 కోట్లతో విద్యుత్తు లైన్లు
ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం కోసం శ్రీశైలం నుంచి 400 కేవీ విద్యుత్తు లైనుతో విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.4 కోట్లతో ఈ పనులు చేపట్టాలని ట్రాన్స్‌కోను ప్రభుత్వం ఆదేశించింది.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×