Jump to content

vizag metro


Recommended Posts

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్ జారీ

636332189485134654.jpg

అమరావతి: విశాఖ మెట్రోకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు కారిడార్‌లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మించనున్నారు. గాజువాక జంక్షన్ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కి.మీతో మొదటి కారిడార్‌ ఉండబోతోంది.

 

గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.25 కి.మీలతో రెండో కారిడార్.. తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6.9 కి.మీలతో మూడో కారిడార్ నిర్మాణం చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మెట్రో నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Link to comment
Share on other sites

Breaking News on Visakhapatnam Metro Rail Project. Govt.of Andhra Pradesh has issued a Notification vide http://G.O.Ms.No . 231 Dt: 16.06.2017 specifying the following areas, covered by the GVMC, Visakhapatnam and its contiguous areas to be the Metropolitan area of Visakhapatnam for construction of VMR Project.(Source:APGovt website http://ap.gov.in )-Image for representative purpose only.

 

DCb4dudVoAABtEW.jpg

Link to comment
Share on other sites

monnati daka twitter lo oka batch edche vallu cbn meeda,vij metro kosam vizag di apesadu ani,ippudu emantaro

 

CBN oka area ni tokki intkoti lepudam lanti cheap tanam eppudu ledu...a manishi a alochana kuda radu......

 

 

CBN Previous term lo ivanni CBN chesinave(emanna doubts unde proof kavalante ask me)

 

Pharma city,INS kasura,Bhimili road, Kailasagiri project,Tenneti park medornization,Ganagavaram port,Quandragular(1st in India)....Beach road like Tankbund, HSBC,Wipro,Kenexa,Satyam campus...okka tante okka new IT add avvala except bogus between 2004-2014

 

New term(2014)

 

Lawsons bay park,Totlakonda new park,Medial device park,Trina solar,Fintech valley(working hard).......IT tower coming, 900 crore Harbor park convention center ,Underground cable after Hudhud 

 

 

 

"Divide formula" lo papam CBN ni ki padi edustaru kani Vizag ki tanu chesinanta evadu cheyyala(even in 90's he got all those IT companies.....HSBC,SATYAm,WIPRO,KENEXA,SOFTPRO e.t.c we are seeing Today CBN techinave.....After CBN, 10 years not even 1 new IT got added....

 

adento ardam kadu Vizag ki DECOIT gadi time lo okkatante okakti cheyyala neat ga....kani Jaffas Vizag vallani usigolpatanaiki try chestunaru..

 

 

DECOIT vizag contribution

 

Daspalla layout manodi punyame,Venkataramireddy ani VUDa chariman petti mottam lands anni vetiki valla vallaki antagattaru....

 

ippudu latest Land issue kuda 2014 ki mundu jarigindi.....kani adi TDP ki blame chestunte okkadu sarigga cheppaledu.....Botchu gang  records marchadu ani telisinde....

YV subabreddy  VUDa land cheap ga kottesi record profit ki ammesukunnadu 

ST lukes bursing school ani prime Rushikonda area ni dobbesaru anil batch

1400 acres kapuluppada oka ooru peru leni vadiki rasi icahru....CBN govt fought in court and canceled it now.....

Volkswagon

RTC complex,Meghalaya daggara prime lands lands dobbesaru approvals tho

Link to comment
Share on other sites

విజయవాడ మెట్రోకు రూ.7 వేల కోట్లు ఖర్చవుతుంది’
 

 
విజయవాడ: విజయవాడ మెట్రోకు రూ.7 వేల కోట్లు ఖర్చవుతుందని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎలక్ట్రికల్‌ బస్సు ఎక్స్‌ప్రెస్‌ వే ను రూ.2500 కోట్లతో చేపట్టవచ్చని అభిప్రయాపడ్డారు. మెట్రోకు 70 ఎకరాలు కావాలని, బస్సు ఎక్స్‌ప్రెస్‌ వేకు 20 ఎకరాలు చాలని చెప్పారు. ఎలక్ట్రికల్‌ బస్సు ఎక్స్‌ప్రెస్‌ వే మన దేశంలో ఎక్కడా లేదని, దీనిపై త్వరలో సీఎంతో చర్చిస్తామని ఆయన చెప్పారు. రూ.9 వేల కోట్లతో పీపీపీ పద్దతిలో విశాఖ మెట్రో పనులు చేపడుతామని రామకృష్ణారెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

విశాఖ మెట్రోకు పచ్చజెండా

మూడు కారిడార్లలో ప్రాజెక్టు నిర్వహణ

ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు - అమరావతి

16ap-main2a.jpg

విశాఖపట్నంలో 42.55 కిలో మీటర్ల పొడవునా మూడు కారిడార్లలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిపై మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) తదుపరి చర్యలు తీసుకోనుంది. రాష్ట్రవిభజన అనంతరం ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా వూపింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై మొదటి నుంచి నెలకొన్న గందరగోళం ప్రభుత్వ ప్రకటనతో ప్రస్తుతం తొలగిపోయింది. తొలుత రెండు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించగా.. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక వరకు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో తాజా ప్రతిపాదనల్లో సవరణలు చేశారు. దీంతో కారిడార్ల సంఖ్య మూడుకు పెరిగింది. దీనిపై ప్రభుత్వ తదుపరి ఆమోదం కోసం జీవీఎంసీ కమిషనర్‌ పంపిన సమగ్ర నివేదికపై సర్కారు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నిధుల లభ్యత మేరకు జీవీఎంసీ పనులు చేపట్టే వీలుంది. మూడు కారిడార్ల ప్రతిపాదనలతో విశాఖలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకూ మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

మూడు కారిడార్ల వివరాలు..

* గాజువాక నుంచి జాతీయ రహదారి మీదుగా కొమ్మాది కూడలి (మధురవాడ) వరకు 30.381 కిలో మీటర్ల పొడవునా మొదటి కారిడారును ప్రతిపాదించారు. జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ కూడలి, గురుద్వార, మద్దిలపాలెం, హనుమంతువాక ప్రాంతాలను కలుపుతూ ఈ కారిడారును రూపొందించారు.

* జాతీయ రహదారిపై ఉన్న గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.255 కిలో మీటర్ల పొడవునా రెండో కారిడారును ప్రతిపాదించారు. ఇది నగర మధ్యలోని డాబాగార్డెన్స్‌, సూర్యాబాగ్‌ పోలీస్‌ బేరక్స్‌ మీదుగా పూర్ణామార్కెట్‌ వరకు వెళుతుంది. విశాఖలోని వాణిజ్య ప్రాంతాన్ని కలుపుతూ దీన్ని ప్రతిపాదించారు.

* తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు (ఈస్ట్‌ పాయింట్‌గెస్ట్‌హౌస్‌) వరకు 6.914 కిలో మీటర్ల పొడవునా మూడో కారిడారును ప్రతిపాదించారు. జాతీయ రహదారినుంచి తాటిచెట్లపాలెం మీదుగా రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్‌ వినాయకుని గుడి, సిరిపురం, ఏయూ ఔట్‌గేట్‌ మీదుగా చినవాల్తేరు వరకు ఇది వెళుతుంది.

పీపీపీ విధానంలో రూ.9,500 కోట్లతో విశాఖ మెట్రో రైలు

తాజా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఈనాడు అమరావతి: విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టును రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రధానంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తావనకు వచ్చింది. మూడు కారిడార్లతో చేపట్టే మెట్రో రైలు పరిధిపై శుక్రవారమే ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టు ఏర్పాటుకోసం చేపట్టాల్సిన ముందస్థు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో తాజా పరిస్థితిని అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. పీపీపీ విధాన అమలు కోసం ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ నారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...

Anni TDP govt. ee cheyyali vizag ki, ee congress & bjp vizag ki oraga bettindi emi ledu. 

 

ee metro 1st phase tondaraga start chesthe better, anti sentiment baaga vundi mainly because of railway zone issue & metro.

 

Baffas anti antha TDP meeda paduthundi.

 

BJP MP ni gelipinchina use ledu.

Link to comment
Share on other sites

chandrababu goru...meeru anyayam chesthunnaru bezawada ki vizag ki. Entha late ayina parledu, Entha cost ayina parledu. Please move forward with metro in both bezawada & Vizag. Atleast bhumi sekarana jarigina chalu next 3 years lo. Please don't give up.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌

అర్హత, ఆసక్తి వ్యక్తీకరణకు మూడు నెలల గడువు

రూ. 8,800 కోట్లు... 3 కారిడార్లు... 42 కి.మీ దూరం

ఈనాడు - అమరావతి

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థల నుంచి అర్హత, ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసింది. మూడు నెలల్లో వీటిని దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు మొదటి నుంచి పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి మొత్తం వ్యయం రూ.8,800 కోట్లు అవుతుందని దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ గతంలో అంచనా వేసింది. మొత్తం మూడు లైన్లుగా 42 కిలోమీటర్లు దూరంలో కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. మధురవాడ కారిడార్‌ 22.28 కి.మీ పరిధిలో 19 స్టేషన్లు, గురుద్వారా జంక్షన్‌ కారిడార్‌ 5.2 కి.మీ దూరంలో 7 స్టేషన్లు, తాటిచెట్లపాలెం కారిడార్‌ 6.9 కి.మీ దూరంలో 9 స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి కమిటీకి సూచించారు. విశాఖ మెట్రోకు ఆర్‌ఎఫ్‌క్యూ (రిక్వెస్టు ఫర్‌ క్వాలిఫికేషన్‌), ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణ)లకు గ్లోబల్‌ నోటీసు జారీ చేసినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. దరఖాస్తులు వచ్చిన తర్వాత ప్రీ బిడ్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని, దీనికి హాజరయ్యే సంస్థలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. 52 శాతం నిధులు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. కారిడార్‌, సివిల్‌, మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రికల్స్‌, రోలింగ్‌, ఇతర సాంకేతిక సదుపాయాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఓఅండ్‌ఎం) బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో పీపీపీ ఆధ్యర్యంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసిన అనుభవం ఉందని, విశాఖ మెట్రో కూడా పీపీపీలో విజయవంతంగా నిర్మాణం చేస్తామని తెలిపారు. విజయవాడలో మీడియం మెట్రోకు డీపీఆర్‌ తయారు చేసినా ఇక్కడ లైట్‌మెట్రో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

నేడు సీఎంను కలవనున్న శ్రీధరన్‌

దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ, మెట్రో రంగ నిపుణులు శ్రీధరన్‌ బుధవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నారు. వయోభారం వల్ల బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన రాజీనామా సమర్పించినా ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...