Jump to content

వెన్న లాంటి మనసున్న మా బాలయ్య

NBK2NTRMT

Recommended Posts

బాలకృష్ణ..బాలయ్య..

అత్యధికులు గత పదేళ్లలో దుష్ప్రచారం చేసిన పేరు..

సామాజిక మాధ్యమాల్లో పనిలేని ప్రతివాడికీ పని కల్పించే పేరు..

సాంకేతికసంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి పలు మంది కుహనా మేధావులు విమర్శించే పేరు..అసలు నిజమెంత..

భగవంతునిపై భక్తి .చరిత్రపై అనురక్తి .పురాణాలపై అమితాసక్తి ..

కల్మషమెరుగని నవ్వు ..ప్రశాంతమైన పసివాని మోము

మర్మం ఎరుగని మాట..మకిలి పట్టని మనసు..ఇదీ బాలయ్య

కులం కలం తో కళారంగంపై సంతకం చేయాలని ఎన్నడు ఆలోచించనివాడు

100 రోజుల థియేటర్ల కోసమనో, పారితోషికం కోసమనో నిర్మాతలని ఏనాడూ ఇబ్బంది పెట్టని వాడు

అభిమానుల నిస్వార్థ నిర్మల అభిమానాన్ని కొద్ది బుద్ధులతో స్వప్రయోజనాలకి ఏనాడూ వాడుకోనివాడు

తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి శరవేగం గా అభివృద్ది పనులు చేస్తున్నా,తల్లి పేరుతో నడుపుతున్న క్యాన్సర్ వైద్యశాల ద్వారా ఎందరికో ఉచిత సేవలందిస్తున్నా ఎన్నడూ ప్రచారం చేసుకోనివాడు

తండ్రి, బావ సుమారు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నా ఏ రోజూ ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్లి పైరవీలు చేయని వాడు

రాజసానికి చిరునామా ఆయన ఆహార్యం

పౌరుషాభినయం ఆయనకి కొట్టినపిండి

రౌద్రరస పోషణ కి ఆయన పెట్టింది పేరు

తొలినాళ్లలో తండ్రి నిర్దేశకత్వంలో సహాయ పాత్రల్లో నటించాడు.

పూర్తి స్థాయి కథానాయకుడిగా మారాక మన పక్కింటి పల్లెటూరి కుర్రవాడిలా ఆ పాత్రల్లో ఒదిగాడు. సహజంగానే గ్రామీణ ప్రాంత యువత ఆయన్ని తమ వాడిగా చేసుకుంది.

ఆ వరుసలో వచ్చిన మంగమ్మ గారి మనవడు,మువ్వగోపాలుడు,ముద్దుల కృష్ణయ్య,బాలగోపాలుడు, అల్లరి కృష్ణయ్య,ప్రెసిడెంటు గారి అబ్బాయి,నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం,పెద్దన్నయ్య,సమరసింహారెడ్డి,నరసింహ నాయుడు చిత్రాలు ఆయనలోని విభిన్న నటకోణాలని అవిష్కరించాయి.

ట్రెండు పేరు తో ఒకే మూసలో చిత్రాలు వస్తున్నప్పుడు ట్రెండు బెండు తీసి

జానపదాలు అందరూ మరిచినవేళ "భైరవద్వీపం" లో నటించడమే కాకుండా అందులో కురూపి పాత్రని అద్భుతంగా పోషించి

చారిత్రక చిత్రాలు చిరునామా కోల్పోతున్న రోజుల్లో "ఆదిత్య369" లో శ్రీకృష్ణ దేవరాయలుగా,సాహసించి శ్రీ రామరాజ్యం లో రాముడిగా నటించినవాడు.

చిత్ర పరిశ్రమ తీవ్రనష్టాల్లో ఉన్న ప్రతిసారీ మంగమ్మగారి మనవడు,ముద్దుల మావయ్య,సమరసింహారేడ్డి,సింహా వంటి అఖండవిజయాలనిచ్చి పరిశ్రమకి సంజీవని గా మారినవాడు బాలయ్య.

ప్రాణాలొడ్డి మరీ "నిప్పురవ్వ" చిత్రం కోసం బొగ్గు గనుల్లో నటించాడాయన.

ప్రయోగాత్మకంగా వచ్చిన "ఊ కొడతారా ..ఉలిక్కిపడతారా" చిత్రంలో జమీందార్ గా ప్యాలస్ లో రాజరికం ఉట్టి పడేలా తిరుగుతూ రింగులు గా పొగ వదిలిన దృశ్యంలో ఆయన హావభావాలకి తన్మయం చెందని వారుండరు.

తెలుగువారి ఘనచరిత్ర ని చాటుతూ "శాతకర్ణి" గా వెండితెర పై రాజనాలు పండించినవాడు బాలయ్య.

అవినీతి మరక అంటని బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి హిందూపూర్ కి శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తూ శరవేగంతో హిందూపూర్ రూపురేఖలు మారుస్తున్నారు.

ఎదగడం గొప్ప కాదు. కానీ ఎన్.టి.ఆర్ లాంటి మర్రి చెట్టు నీడలో ఎదగటం సామాన్యమైన విషయం కాదు.అది చేసి చూపించాడు మా బాలయ్య.

వెన్న లాంటి మనసున్న మా బాలయ్య కి 57వ జన్మదిన శుభాకాంక్షలు.

Link to comment
Share on other sites

thx brother naa content post chesinanduku

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...