Jump to content

నా చంద్రబాబు.. నా పెద్ద కొడుకు!!!


Recommended Posts

నా చంద్రబాబు.. నా పెద్ద కొడుకు!!!

‘నా చంద్రబాబు నా పెద్ద కొడుకు... పింఛను ఇచ్చే మహాదాత.. రాష్ట్రాభివృద్ధి ప్రదాత’ అని ఓ వృద్ధురాలు సీఎంను కీర్తించింది. కాకినాడ మహాసంకల్ప సభలో పలువురిని చంద్రబాబు సత్కరిస్తున్న సందర్భంలో నగరంలోని ట్రెజరీ కాలనీకి చెందిన 88 ఏళ్ల సింగం రాఘవమ్మ మైకు పట్టుకుని ఆయనపై పాట పాడింది.

దీంతో, చంద్రబాబు ఒక్కసారిగా అటువైపు చూశారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆమెను ఆయన వద్దకు తీసుకెళ్లారు. రాఘవమ్మ మాట్లాడుతూ.. ‘ప్రతి నెలా మీరిచ్చే పింఛనుతో 88 ఏళ్ల వయసులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను.

మీరు నాకు పెద్ద కొడుకు’ అని ఆయన చేతులు పట్టుకోగా చంద్రబాబు చలించి ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. ఈ పెద్దమ్మకు రూ.లక్ష నగదు ఇవ్వాలని, సొంతిల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను ఆదేశించారు.

- బెంగళూరు టీడీపీ ఫోరమ్!!!

18952971_1997986110341929_36635016234357

 

Link to comment
Share on other sites

Humane side of CBN.....

 

We are seeing this side profusely in this term in power....

 

Probably his age has made the difference.

Yes We are seeing now ..kaani he has it earlier too..just for info CM relief fundo dwara common man ki help cheytam start or highest chesindi CBN ne ..but publicity cheyledu appatlo..he fallowed the rules leader should not express the emotions anedi..may be ippudu aa emotion express ane rule ni vadilesibattunnadu naayakudu

Link to comment
Share on other sites

CBN mee kosam time nunchi chaala change vachindhi...

Result idhi..Inka ilativi choodali ani korukuntunna..

Jai CBN ..Jai CM of AP..Jai father of AP

s..anthaka mundhu kuda lolopala sensitive ga vunna paiki pratical ga,gambheeramga vundevadu..cmrf vi silent ga jarigipoyevi..post meekosam mottam maarchesindhi cbn ni..
Link to comment
Share on other sites

s..anthaka mundhu kuda lolopala sensitive ga vunna paiki pratical ga,gambheeramga vundevadu..cmrf vi silent ga jarigipoyevi..post

meekosam mottam maarchesindhi cbn ni..

Abn lo last week news vesaru last term lo cmrf undedi kani but ekkuva sanction chesevadu kadu anta max 10k sanction chese vadu enta close ayina

But ippudu evaraina vaste enta kavali ani adugutunnadu anta,vallu enta adigite antha sanction chestunnadu

Ex:last month oka teacher ki 15 lakhs sanction chesadu

Link to comment
Share on other sites

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి దీనగాధ గుర్తుందా..? పాపకు పుట్టుకతోనే కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు..ఆపరేషన్ చేయాలని అందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంతస్తోమత రమణప్ప కుటుంబానికి లేకపోవడంతో పాపను చంపడానికి అనుమతి ఇవ్వాలంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య మరణం పిటిషన్ చూసిన అక్కడి న్యాయవాదులు, జడ్జి నివ్వెరపోయారు. ఇది తమ పరిధిలోకి రాదని పైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో దంపతులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.


 


వీరి ఆవేదన మొత్తం పత్రికల్లో రావడం మరుసటి రోజు క్యాంపు కార్యాలయంలో పత్రికలు చదువుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ కథనం కనిపించడంతో ఆయన చలించిపోయారు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు. వెంటనే పాప చికిత్సకు కావాల్సిన రూ.30 లక్షల మొత్తాన్ని "సీఎం సహాయనిధి" నుంచి విడుదల చేశారు. ఇలా ఈ ఒక్క పాప మాత్రమే కాదు..తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యం చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక స్థోమత లేని పేదలకు "ముఖ్యమంత్రి సహాయనిధి" చేయూతనందిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 20,312 మందికి రూ.167.36 కోట్ల ఆర్థిక సాయం అందించారు.  


 


సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తారని జనానికి తెలుసు కాని...దానిని ఎలా పొందాలో..ఎవరిని సంప్రదించాలో తెలిసేది కాదు. హైదరాబాద్‌ వెళ్లి రెండు మూడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. పెద్ద సిఫార్సులు ఉంటే తెల్ల రేషన్‌ కార్డు లేకపోయినా సీఎం కార్యాలయ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. అంతే కాకుండా మంత్రి సిఫారసు ఉంటే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 85 శాతం వరకూ మంజూరు చేస్తుండగా, సీఎం వద్ద పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సిఫారసు చేస్తే 75 నుండి 80 శాతం వరకూ ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ఎవరి సిఫారసు లేని పేదలు వాస్తవంగా వైద్యానికి అయిన ఖర్చులుకుగాను నేరుగా దరఖాస్తు చేసుకుంటే అందులో 15 శాతం నుండి 30 శాతం వరకూ మాత్రమే మంజూరు చేసేవారు. ముఖ్యమంత్రి సహాయనిధి ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు సీఎం కార్యాలయం విజయవాడకే వచ్చేయడంతో నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ముఖ్యమంత్రినే కలిసే అవకాశం కూడా ఉంది.


 


సీఎంఆర్ఎఫ్ కింద పేద రోగులకు మూడు విధాలుగా సహాయం అందుతుంది. దానిలో మొదటిది లెటర్ ఆఫ్ క్రెడిట్ దీని కోసం వైద్యుడి సిఫారసు లేఖ, మెడికల్ రిపోర్టులు, గుర్తింపు కార్డు, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన మీదట వైద్యానికి ఎంత ఖర్చవుతుందో లెక్కవేసుకుని..దానిలో కొంత మొత్తాన్ని మంజూరు చేసి నేరుగా రోగికి చికిత్స చేసిన ఆసుపత్రికి పంపిస్తారు. మరో పద్ధతి రీయంబర్స్‌మెంట్..అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుని, ఆ తర్వాత తమకు ఎంత ఖర్చయిందో తెలిపే ఆసుపత్రి బిల్లులు, రిపోర్టులతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన అధికారులు కొంత మొత్తాన్ని మంజూరు చేస్తారు.


 


మూడో విధానం..ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుర్తించిన వ్యాధితో బాధపడుతూ..ఈ పథకం కింద చికిత్స పొందే అర్హత ఉండి కూడా..తెల్ల రేషన్‌కార్డు గానీ, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుగానీ లేకపోతే అలాంటి వారు నేరుగా విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ కేంద్రానికి రోగితో సహా వస్తే, అక్కడి వైద్యులు ఆ రోగిని పరిశీలించి ఒక సిఫారసు లేఖ ఇస్తారు. దాని ఆధారంగా ఉచితంగా చికిత్స పొందవచ్చు.


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...