Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply
ట్‌ మెట్రో డీపీఆర్‌కు మరో 2 మాసాలు!
ఈనెల 25న మధ్యంతర నివేదిక
కారిడార్లపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించిన మెట్రో ఎండీ
ఈనాడు, అమరావతి
amr-gen2a.jpg

విజయవాడలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారీలో జాప్యం జరుగుతోంది. డిసెంబరు నెలాఖరునాటికి నివేదిక అందనుంది. మధ్యంతర నివేదికను ఈనెల 25న అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడేళ్లుగా విజయవాడ మెట్రో మూడు అడుగులు ముందుకు పడితే ఆరు అడుగులు వెనక్కి పోతోంది. దిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ తప్పుకున్న తరువాత ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మెట్రో ప్రాజెక్టు తీరుపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సమీక్షలో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి పలు వివరాలు అందించారు.

ఎన్నెన్నో మలుపులు..!
విజయవాడ మెట్రోలో మొదట రెండు ప్రధాన రహదారుల్లో రెండు కారిడార్లు వస్తాయని ఆశించారు. నాడు డీఎంఆర్‌సీ ప్రధాన సలహాదారుగా ఉండటంతో దీనిపై విశ్వాసం నెలకొంది. కానీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. కేంద్రం అందించాల్సిన నిధులు పోయాయి. తర్వాత పీపీపీలో చేపట్టేందుకు ముందుకు రాలేదు. రెండుసార్లు పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండానే రద్దు చేశారు. తర్వాత డీఎంఆర్‌సీ తప్పుకుంది. జైకా రుణం ఇచ్చేందుకు మొహం చాటేసింది. దీంతో ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ప్రత్యేక చొరవతో ఫ్రాన్సు, జర్మనీ సంస్థల నుంచి రుణాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో మెట్రో సాధ్యాసాధ్యాలపై చర్చ ప్రారంభమయ్యింది. పీపీటీ కేవలం 6వేలు మాత్రమే ఉండటం మొత్తం 26 కిలోమీటర్లు ఉండటం వల్ల అంతగా ప్రయోజనం లేదని తేల్చారు. పలుమార్లు మార్కింగ్‌ చేశారు. మరోవైపు నిడమానూరు రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అని మొరాయించారు. ప్రత్యామ్నాయంగా గన్నవరం వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. సీఎం సూచనలతో దృష్టి లైట్‌మెట్రోకు మళ్లింది. లైట్‌ మెట్రోపై మలేషియా, చైనా దేశాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.
* మెట్రో ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ముందుకు వచ్చిన జర్మనీ, ఫ్రాన్సు సంస్థలే డీపీఆర్‌ తయారీ చేసి ఇస్తామని ఆసక్తి చూపాయి. దాదాపు రూ.3 కోట్ల వ్యయం అయ్యే డీపీఆర్‌ను ఉచితంగానే ఏఎంఆర్‌సీకి అందిస్తామని ప్రతిపాదించాయి. దీంతో టెండర్లను పిలిచి సిస్ట్రా-రైట్స్‌ సంయుక్త సంస్థకు అప్పగించారు. మూడు నెలల్లో అందించాల్సిన డీపీఆర్‌ ఇంతవరకు పూర్తి కాలేదు.
* డీపీఆర్‌ ప్రారంభించిన తర్వాత ఏలూరు రోడ్డు కారిడార్‌ గన్నవరం వరకు పొడించారు. మరోవైపు జక్కంపూడికి ఒక కారిడార్‌ కేసీ కాలువ జంక్షన్‌కు ఒక కారిడార్‌ ప్రతిపాదించారు. మరో నెల రోజుల తర్వాత కొంత భూమిపై, మరికొంత పైవంతెనలపై మెట్రోకారిడార్‌ ఉండాలని ప్రతిపాదించారు.
* మరోనెల రోజుల తర్వాత జరిగిన సమీక్షలో ముందుగా గన్నవరం నుంచి నేరుగా అమరావతికి కారిడార్‌ నిర్మాణం చేయాలని దీన్ని తొలిదశలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. జక్కంపూడి ఆర్థిక నగరం కారిడార్‌ రెండో దశలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.
* అమరావతిలో భూగర్భంలోనే కారిడార్‌ ఉండాలని మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది సాధ్యంకాదని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇలా మార్పులు చేర్పులు చేస్తుండటంతో డీపీఆర్‌ నివేదిక ముందుకు కదలలేదు.
* మరోవైపు మొదట ఏలూరు, బందరు కారిడార్‌లకు అనుగుణంగా రెవెన్యూ శాఖ మార్కింగ్‌ నిర్వహించి భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దీనికి ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. ఇది ముందుకు కదలలేదు.

25న మధ్యంతర నివేదిక..!
విజయవాడ మెట్రో ప్రాజెక్టు లైట్‌ మెట్రో నిర్మాణం చేయాలనే నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్నారని దీనికి అనుగుణంగా సవివర నివేదిక తయారు చేస్తున్నామని ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు.

Link to comment
Share on other sites

నింగీ.. నేల.. భూమిలో..!
అమరావతి మెట్రో ప్రాజెక్టు తీరు
మధ్యంతర నివేదికను అందించిన సిస్ట్రా
వచ్చేనెల 2న ఉన్నత స్థాయి సమావేశం

ఈనాడు, విజయవాడ: కొంత ఆకాశమార్గం.. కొంత భూమి మీద.. మరికొంత భూగర్భంలో.. ఇదీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టు తీరు. కేంద్రం సహాయ నిరాకరణ, దిల్లీ మెట్రో కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) వైదొలగడంతో ఈ ప్రాజెక్టు అనేక కీలక మలుపులు తీసుకుంది. మెట్రో నుంచి లైట్‌ మెట్రోకు మారింది. దీనికి అనుగుణంగా మధ్యంతర సమగ్ర ప్రాజెక్టు నివేదికను అంతర్జాతీయ సంస్థ సిస్ట్రా-రైట్స్‌ రూపొందించి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కు అందజేసింది. దీనిపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ నవంబరు రెండో తేదీన సమావేశం కానున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి చెప్పారు. కమిటీ నిర్ణయం మేరకు డీపీఆర్‌లో మార్పుచేర్పులు ఉంటాయని వివరించారు. తుది డీపీఆర్‌ను రెండు నెలల్లో అందించనున్నట్లు చెప్పారు. మధ్యంతర నివేదికలో నాలుగు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.
* విజయవాడ లైట్‌ మెట్రోకు జర్మనీ, ఫ్రాన్సులకు చెందిన సంస్థలు రుణమిచ్చేందుకు అంగీకరించాయి. డీపీఆర్‌ తామే ఉచితంగా తయారుచేస్తామని ఆ రుణ సంస్థలు అంగీకరించాయి.
* అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంనుంచి నేరుగా అమరావతికి కారిడార్‌ నిర్మించాలని మధ్యంతర నివేదికలో ప్రతిపాదించారు. బందరు కారిడార్‌, ఆర్థిక నగరం జక్కంపూడికి మరో కారిడార్‌ నిర్మించాలని తలపెట్టారు.
* 26 కిలోమీటర్ల దూరం కాస్త ఇప్పుడు 70 కిలోమీటర్లు పెరిగింది. 22 స్టేషన్లు 60కి చేరాయి.
* మధ్యంతర నివేదికలో మొదట గన్నవరంనుంచి అమరావతికి ప్రతిపాదించారు. ఇది గన్నవరం నుంచి నిడమానూరు వరకు భూమ్మీద, నిడమానూరు నుంచి పీఎన్‌బీ వరకు ఆకాశమార్గాన నిర్మిస్తారు. ఇదే లైను కేసీ కెనాల్‌ జంక్షన్‌ వరకు ఆకాశమార్గాన నిర్మించి రాజధాని ప్రాంతంలో మాత్రం భూగర్భంలో నిర్మించాలని ప్రతిపాదించారు.
* గన్నవరంనుంచి అమరావతిని లైన్‌1గా ప్రతిపాదించారు. లైన్‌2 బందరు కారిడార్‌ ప్రతిపాదించారు.
* రెండో దశలో జక్కంపూడికి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది ఆకాశమార్గంలో కొంత, భూమి మీద కొంత ఉంటుంది.
* ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. లైన్‌ 1లో 2021 నాటికి 10,170 మంది గంటకు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. లైన్‌ 2లో 9,040 మంది ఉంటారని అంచనా.
* మధ్యంతర నివేదికలో అంచనా వ్యయాన్ని ప్రతిపాదించలేదని తెలిసింది.

Link to comment
Share on other sites

‘లైట్‌ మెట్రో’కు వ్యయం ఎంత?
అంచనాల రూపకల్పనకు  ఆదేశించిన మంత్రి నారాయణ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి రెండు రకాల వ్యయాలను అంచనా వేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో అది ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి మధ్యంతర నివేదికను కన్సెల్టెన్సీ సంస్థ సిస్ట్రా-రైట్స్‌ ఇటీవల అందించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో ప్రయాణికుల రైడర్‌ షిప్‌, కారిడార్లు, మెట్రో రైల్‌ విధానాలను పొందుపర్చారు. లైట్‌ మెట్రో భూమి మీద, ఆకాశమార్గం, భూగర్భంలో ఉండే విధంగా ఎల్‌ఆర్‌టీ (లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌), లైట్‌ మెట్రో విధానాలను ప్రతిపాదించారు. విజయవాడ ఆర్టీసీ బస్‌భవన్‌లో గురువారం జరిగిన స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి మంత్రి పి.నారాయణ అధ్యక్షత వహించి సమీక్షించారు.
మొత్తం 77.2 కిలోమీటర్ల పొడవున మూడు కారిడార్లు ప్రతిపాదించారు.
1. అమరావతి క్యాపిటల్‌ సిటీ-పీఎన్‌బీఎస్‌-నిడమనూరు-గన్నవరం వరకు 52.5కి.మీ.
2. పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు 12.5 కి.మీ.
3. రైల్వేస్టేషన్‌ నుంచి జక్కంపూడి వరకు 12.2 కి.మీ.

* అమరావతి రాజధాని పరిధిలో 27కి.మీ.లను భూగర్భంలో... మిగిలినవి ఎలివేటెడ్‌ (ఆకాశంలో) కారిడార్లుగా ప్రతిపాదించారు. భూమి మీద (ఎట్‌గ్రేడ్‌) మాత్రం ప్రతిపాదించలేదు.
* జక్కంపూడికి వెళ్లే వైపు 4.2 కి.మీ, వచ్చే వైపు 8కి.మీలు సర్క్యులర్‌గా ప్రతిపాదించారు. నిడమనూరు వరకు 13కి.మీ., అక్కడి నుంచి గన్నవరం వరకు 9.5 కి.మీ. దూరం ఉంది.
* కేసీ కాలువ జంక్షన్‌ నుంచి అమరావతి వరకు 27 కి.మీ దూరం ఆకాశంలో, భూగర్భంలో కారిడార్లు నిర్మిస్తే అయ్యే వ్యయంపై అంచనా వేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఎలివేటెడ్‌, అండర్‌ గ్రౌండ్‌ కారిడార్ల లాభనష్టాలను బేరీజు వేయాలన్నారు. ఎయిర్‌పోర్టు ఏరియాలోనూ అండర్‌ గ్రౌండ్‌ కారిడార్‌ వల్ల ప్రయోజనాలను చెప్పాలన్నారు. ఈ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.  రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి డీపీఆర్‌ అందనుందని చెప్పారు.

Link to comment
Share on other sites

లైట్‌ మెట్రో రైలుకే మొగ్గు!
02-11-2018 07:38:49
 
636767411308812701.jpg
  • విజయవాడలో.. ఫ్లై ఓవర్‌ మార్గం!
  • అమరావతిలో.. అండర్‌ గ్రౌండ్‌!
  • మొత్తం కారిడార్‌ నిడివి 77.2 కిలోమీటర్లు
  • సీఎం అధ్యక్షతన త్వరలో సమావేశం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును నేలమీద నిర్మించే ప్రతిపాదనను స్టీరింగ్‌ కమిటీ అంగీకరించలేదు. విజయవాడ నగరంలో ఎలివేటెడ్‌ (ఫ్లై ఓవర్‌) విధానంలోను, అమరావతిలో అండర్‌ గ్రౌండ్‌ (భూ గర్భం), ఎలివేటెడ్‌ రెండు విధానాలను పరిశీలించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోవాలని మునిసిపల్‌ మంత్రి నారాయణ అధ్యక్షతన అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. విజయవాడ నగరానికి, అమరావతి రాజధానికి ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ ’శిస్ర్టా’ ప్రిలిమనరీ డీపీఆర్‌ను, అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కి అందించింది. ఈ డీపీఆర్‌పై గురువారం రాత్రి విజయవాడలోని ఏఎంఆర్‌సీ కార్యాలయంలో అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ భేటీ అయింది.
 
స్టీరింగ్‌ కమిటీలో సభ్యులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, ఏపీఎ్‌సఆర్‌టీసీ ఎండీ ఎన్‌బీ సురేంద్రబాబు, ఏపీ రెరా చైర్మన్‌ వీ రామనాథ్‌, అడిషనల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ రామరాజు, ట్రాఫిక్‌ డీసీ వై.రవిశంకర్‌ రెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా దాదాపుగా 500పేజీల ప్రిలిమినరీ డీపీఆర్‌ను అధ్యయనం చేశారు. ప్రధానంగా లైట్‌మెట్రో కారిడార్లను పరిశీలించింది. శిస్ర్టా సూచించిన విధంగా విజయవాడ ఎయిర్‌పోర్టు, నిడమానూరు, పీఎన్‌బీ్‌స అమరావతి క్యాపిటల్‌ సిటీ కారిడార్‌ 52.5 కిలోమీటర్లు, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌-పెనమలూరు కారిడార్‌ 12.5 కిలోమీటర్లు, రైల్వేస్టేషన్‌-జక్కంపూడి కారిడార్‌ 12.2కిలోమీటర్లు చొప్పున మొత్తం 77.2 కిలోమీటర్డ నిడివితో నిర్మించేందుకు సూచించిన ప్రతిపాదనను అంగీకరించింది.
 
లైట్‌మెట్రో ప్రాజెక్టును ఏ విధంగా నిర్మించాలన్న దానిపై శిస్ర్టా సంస్థ ఇచ్చిన నాలుగు ఆప్షన్లను స్టీరింగ్‌ కమిటీ సుదీర్ఘంగా పరిశీలించింది. విజయవాడ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నుంచి పీఎన్‌బీఎ్‌స వరకు, రైల్వేస్టేషన్‌ నుంచి జక్కంపూడి వరకు రెండు కారిడార్లను పూర్తిగా ఎలివేటెడ్‌ మార్గంలోనే నిర్మించాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోకి వచ్చే కారిడార్‌ను మాత్రం ఎలివేటెడ్‌ విధానంలో నిర్మించాలా, భూగర్భ మార్గంలో నిర్మించాలా అన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేదు. మొత్తంగా లైట్‌ మెట్రోప్రాజెక్టుకు సంబంధించి నేలమీద ప్రాజెక్టును తీసుకు వెళ్లకూడదని నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించిన అంశాలను ఉంచి .. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
3 minutes ago, surendra.g said:

Elevated and Underground ite, metro ki light metro ki anti difference?

railway track veru ga untundi,heavy metro lo metro rail lo coaches 3 kalaipi untayi,malli add cheyyali ante inko 3 add cheyyali ala untundi,medium metro lo coaches  2 kalaipi,add cheyyali inko malli 2 ala utundi,Light Metro mamlu train lagane,oka coach untundi saripoka pothe inkotadi add chesukovacchu adi sari poka inkoti ala add chesukovacchu ala utundi..

Link to comment
Share on other sites

21 minutes ago, surendra.g said:

Elevated and Underground ite, metro ki light metro ki anti difference?

heavy metro speed ekkuva untundi 80km/hr,daka vellvacchu, light metro lo earth meda velthundi kabatti speed takuuva untundi,kani manadi Elevated kabati a problem taggutunndi.

Link to comment
Share on other sites

లైట్‌ మెట్రో.. ఇలా
15-11-2018 09:26:10
 
636778707715138953.jpg
 
 
  • తుది డిజైన్లు ఏఎంఆర్‌సీ అందించిన శిస్ర్టా
  • ఫస్ట్‌ఫేజ్‌లో తొలి కారిడార్‌ గన్నవరం- అమరావతి
  • గన్నవరం బస్టాండ్‌లో మొదటి మెట్రోస్టేషన్‌
  • ఏలూరు రోడ్డు మీదగా రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎ్‌స అనుసంధానం
  • కృష్ణానది మీదగా లింగాయపాలెం వరకు కారిడార్‌
  • మహానాడు, క్రిష్ణాకెనాల్‌ జంక్షన్‌, పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్‌
  • ఇస్కాన్‌ టెంపుల్‌, ఉండవల్లి స్టేషన్‌, వెంకటపాలెం(ఈస్ట్‌)
  • వెంకటపాలెం(వెస్ట్‌) మీదుగా తాళ్ళాయపాలెం, మందడం
  • ఉద్దండ్రాయునిపాలెం.. అంతిమంగా లింగాయపాలెం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాజధానిలోని విజయవాడ-అమరావతి అనుసంధానంతో రూపొందించిన లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు తుదిడిజైన్లను డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’, అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కు అందచేసింది. లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్ల సమగ్ర స్వరూపం ఎలా ఉండబోతోంది? కారిడార్‌ అలైన్‌మెంట్‌ ఎలా ఉంటుంది? స్టేషన్లు ఎక్కడ వస్తాయి? స్టేషన్ల నిర్మాణం ఏ విధంగా ఉండబోతోంది? స్టేషన్ల ఆకృతులు ఎలా ఉంటాయి? భౌగోళికంగా విజయవాడ-అమరావతి లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఏవిధంగా ఉండబోతుందో కళ్ళకు కనిపించేలా యానిమేషన్‌ వీడియోను శిస్ర్టాసంస్థ, ఏఎంఆర్‌సీకి అందించింది. శిస్ర్టా అందించిన డిజైన్ల పట్ల ఏంఎఆర్‌సీ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది.
 
శిస్ర్టా సమర్పించిన డిజైన్ల ప్రకారం ముందుగా గన్నవరం-అమరావతి కారిడార్‌కు సంబంధించి పూర్తినిడివి డిజైన్లను అందచేసింది. ఆ తర్వాత శాటిలైట్‌ ఆధారితంగా పీఎన్‌బీఎ్‌స నుంచి పెనమలూరు సెంటర్‌, పీఎన్‌బీఎ్‌స నుంచి జక్కంపూడి వరకు ఏరియల్‌ వ్యూ అలైన్‌మెంట్‌ ఎలాఉంటుందో ముందుగా డిజైన్లను అందచేసింది. ఆ తర్వాత గన్నవరం-అమరావతి కారిడార్‌కు సంబంధించి సమగ్ర డిజైన్లను అందచేసింది. గన్నవరం శివారు నుంచి లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌-1 ప్రారంభం అవుతుంది. గన్నవరం బస్టాండ్‌ దగ్గర మొదటి స్టేషన్‌ వస్తుంది. ఆ తర్వాత గన్నవరం పట్టణం, యోగాశ్రమం, ఎయిర్‌పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీచైతన్య విద్యాసంస్థ, నిడమానూరు రైల్వేస్టేషన్‌, నిడమానూరు స్టేషన్‌, ఎనిపాడు స్టేషన్‌, ఎంబీటీ స్టేషన్‌, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్‌ల దగ్గర స్టేషన్స్‌ వస్తాయి ఆ తర్వాత ఏలూరు రోడ్డు మీదగా గుణదల, పడవల రేవు, మాచవరం డౌన్‌, సీతారామపురం సిగ్నల్‌ స్టేషన్ల దగ్గర లైట్‌ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇదే కారిడార్‌లో బీసెంట్‌ రోడ్డు రైల్వే స్టేషననర్‌ దగ్గర రెండు పీఎన్‌బీఎ్‌సదగ్గర ప్రధాన స్టేషన్‌ డిజైన్‌ను అందించటం జరిగింది.
 
పీఎన్‌బీఎ్‌స దగ్గర ప్రధాన స్టేషన్‌ను అత్యద్భుతంగా డిజైన్లు ఇచ్చారు. కృష్ణానది మీదగా రాజధానికి ఇదే కారిడార్‌ వెళుతుంది. నది ఆవల మహానాడు ,. క్రిష్ణాకెనాల్‌ జంక్షన్‌, పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, ఉండవల్లి స్టేషన్‌, వెంకటపాలెం, వెంకటపాలెం(వెస్ట్‌) మీదగా తాళ్ళాయపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, అంతిమంగా లింగాయపాలెం దగ్గర స్టేషన్లు ఎలా ఉంటాయో డిజైన్లను అందచేసింది. ప్రతి స్టేషన్‌ కూడా జీ ప్లస్‌ 1 విధానంలో ఉంటుంది. ప్లై ఓవర్‌ మొదటి అంతస్తులో ఉంటుంది. మెట్రో రైలు కూడా మొదటి అంతస్తులోకి వస్తుంది. స్టేషన్ల గ్రౌండ్‌ఫ్లోర్‌ నుంచి మొదటి అంతస్తులోకి వెళ్ళటానికి వీలుగా ఎక్సలేటర్లు, మెట్లు ప్రత్యేకంగా ఎలా ఉంటాయో డి జైన్లను అందచేసింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
లైట్‌ మెట్రో.. రూ.20000కోట్లు!
06-12-2018 09:12:47
 
636796843677262321.jpg
  • 70 కి.మీ. కారిడార్‌ నిడివికి అంచనాలు
  • అమరావతిలో అండర్‌గ్రౌండ్‌- విజయవాడలో ఎలివేటెడ్‌
  • కృష్ణాకెనాల్‌ జంక్షన్‌- లింగాయపాలెం కారిడార్‌-1 రూ. 12,000కోట్లు
  • కారిడార్‌-1లో ఎయిర్‌పోర్టు- పీఎన్‌బీఎస్ రూ. 5600కోట్లు
  • కారిడార్‌-2లో పెనమలూరు సెంటర్‌-పీఎన్‌బీఎస్ రూ. 2400కోట్లు
  • కారిడార్‌-3లో పీఎన్‌బీఎస్- జక్కంపూడి రూ. 1640కోట్లు
(ఆంధ్రజ్యోతి,విజయవాడ): రాజధాని ప్రాంత పరిధిలో.. విజయవాడ, అమరావతి నగరాలను అనుసంధానించేలా రూపొందుతున్న లైట్‌ మెట్రో రైల్‌ప్రాజెక్టు కారిడార్‌కు రూ.20,000కోట్లకు పైగా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఫైనల్‌ డీపీఆర్‌ను సిద్ధంచేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ వ్యయంపై కసరత్తు చేస్తోంది. నిర్మాణ పనులకు సంబంధించి విజయవాడలో రూ. 9600 కోట్లు, అమరావతిలో రూ. 12,000 కోట్ల మేర వ్యయం అవుతుందని తెలుస్తోంది. సివిల్‌ నిర్మాణాలకే రూ. 20వేల కోట్లకు పైగా వ్యయం అవుతున్న నేపథ్యంలో, భూసేకరణ, సాంకేతిక విధానాలకు సంబంధించి కూడా మరికొంత వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తుది నివేదికను మరికొద్ది రోజులలోనే శిస్ర్టా సంస్థ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) కి అందించబోతోంది.
 
విజయవాడ నగరాన్ని అమరావతితో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు అనుసంధాన ప్రాజెక్టుకు భారీ వ్యయమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూపొందించిన రూ.7500 కోట్ల కంటే రెండు రెట్ల వ్యయం కాబోతోంది. మీడియం లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కంటే , లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిడివి దాదాపుగా రెండు రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇంత భారీ వ్యయం కనిపిస్తోంది. మీడియం మెట్రో నిడివి 27 కిలోమీటర్లు. ఇందులో ఏలూరు రోడ్డు 13 కిలోమీటర్లు, బందరు రోడ్డు 12 కిలోమీటర్ల నిడివి ఉండేది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిడివి మొత్తంగా 70 కిలోమీటర్లు ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టునుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేసన్‌, బస్‌స్టేషన్‌, అమరావతిలోని లింగాయపాలెం వరకు 49.5 కిలోమీటర్ల నిడివి ఉంది. బందరు రోడ్డు మీదుగా పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎ్‌స వరకు 12 కిలోమీటర్లు, పీఎన్‌బీఎ్‌స , రైల్వేస్టేషన్‌ నుంచి జక్కంపూడి వరకు 8.2 కిలోమీటర్ల నిడివి ఉంది. అమరావతిలో పూర్తిగా భూగర్భమార్గం (అండర్‌ గ్రౌండ్‌)లోనూ, విజయవాడ ప్రాంతంలో పూర్తిగా ఎలివేటెడ్‌ (ఫ్లై ఓవర్‌) విధానంలోనూ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల ప్రిలిమనరీ డీపీఆర్‌పై సమీక్షించిన మెట్రో అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టాకు పలు సూచనలు చేస్తూ తుది డీపీఆర్‌ను రూపొందించాల్సిందిగా కోరింది.
 
ఈ ప్రకారం లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొత్తం 70 కిలోమీటర్ల కారిడార్‌ నిడివిలో కృష్ణానది మీదుగా అమరావతిలోని లింగాయపాలెం వరకు 24 కిలోమీటర్ల మేర పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలో నిర్మించనున్నారు. విజయవాడలో మిగిలిన 46 కిలోమీటర్ల నిడివిని పూర్తిగా ఫ్లై ఓవర్‌ విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. భూగర్భ మార్గంలో అయితే కిలోమీటర్‌కు రూ. 500కోట్లు, ఎలివేటెడ్‌ విధానంలో అయితే కిలోమీటర్‌కు రూ. 200 కోట్ల మేర ఖర్చు అవుతుందని శిస్ర్టా సంస్థ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే అమరావతిలో కృష్ణానది మీదుగా లింగాయపాలెం వరకు 24 కిలోమీటర్ల నిడివిలో కిలోమీటర్‌కు రూ. 500కోట్లు వంతున మొత్తం 24కిలోమీటర్లకు రూ.12,000 కోట్లవ్యయం అవుతుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే మూడు కారిడార్‌లు అంతర్భాగంగా ఉంటాయి. ఎయిర్‌పోర్టు నుంచి నిడమానూరు, రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎ్‌సకు వరకు 25.5 కిలోమీటర్ల నిడివిలో రూ. 5600 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. బందరు రోడ్డు మీదుగా పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎ్‌స వరకు రూ. 2400 కోట్లు, పీఎన్‌బీఎ్‌స - రైల్వేస్టేషన్‌ - జక్కంపూడి వరకు రూ. 1640 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
దశల వారీగా.. లైట్‌ మెట్రో
లైట్‌ మెట్రోకు దాదాపుగా రూ. 20వేల కోట్ల అంచనా వ్యయం అవుతున్న నేపథ్యంలో, దశల వారీగా పనులు చేపట్టడానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) సిద్ధమవుతోంది. ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ మీదుగా అమరావతిలోని లింగాయపాలెం వరకు కారిడార్‌ - 1 పనులను ముందుగా చేపట్టాలని భావిస్తోంది. రెండో దశలో బందరు రోడ్డు కారిడార్‌ను, మూడో దశలో జక్కంపూడి కారిడార్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఇలా చేయటం ద్వారా ఒక్కసారిగా వ్యయ భారం కాకుండా ఉంటుందన్నది ఏఎంఆర్‌సీ అంచనాగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఎలా వెళ్ళాలన్నది ప్రభుత్వ నిర్ణయం
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించాలా? కేంద్రానికి మళ్ళీ పంపించి సహకారం తీసుకోవాలా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మీడియం మెట్రోకు సంబంధించి కేంద్రం ఇబ్బందులు సృష్టించింది. ఈక్రమంలో మళ్ళీ కేంద్రానికి ప్రతిపాదించటమా? ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ప్రభుత్వం సివిల్‌ నిర్మాణాలు చేపట్టి.. ప్రైవేటు సంస్థ ఆపరేషన్స్‌ నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.
 
ఫైనల్‌ డీపీఆర్‌పై తుది కసరత్తు
ఫైనల్‌ డీపీఆర్‌ అందించటానికి కన్సల్టెన్సీ సంస్థ తుది కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు వ్యయంతో పాటు భూసేకరణ వ్యయం, కాస్టిండ్‌, ట్రైన్స్‌, రోలింగ్‌ స్టాక్‌, ఎలక్ర్టిఫికేషన్‌ తదితర అంశాలకు సంబంధించి కూడా పూర్తి అంచనాలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ కూడా తుది డీపీఆర్‌లో పొందు పరుస్తారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
వచ్చే నెలలో లైట్‌ మెట్రో ఫైనల్‌ డీపీఆర్‌!
11-01-2019 09:37:23
 
  • రూ.20 వేలకోట్ల వ్యయం
  • 70 కిలోమీటర్ల నిడివిలో మూడు కారిడార్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఫిబ్రవరిలో ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ అందించనుంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రిలిమినరీ డీపీఆర్‌లో మార్పులను చేపడుతున్న కన్సల్టెన్సీ సంస్థ ఫిబ్రవరి మొదటివారంలో ఫైనల్‌ డీపీఆర్‌ను అందించాలని నిర్ణయించింది. ఈమేరకు అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కు సమాచారం అందింది. నిర్ణీత గడువు సమీపిస్తున్న నేపథ్యంలో డీపీఆర్‌ను అందించాలన్న ఆలోచనలో శిస్ర్టా ఉంది. ఫైనల్‌ డీపీఆర్‌ ప్రకారం విజయవాడ-అమరావతిని అనుసంధానం చేస్తూ రూపకల్పన చేసిన లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ. 20వేలకోట్ల వ్యయం అవుతుందని సమాచారం.
 
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎ్‌సలను కలుపుతూ కృష్ణానది మీదుగా కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ నుంచి అమరావతికి కారిడార్‌-1, పెనమలూరు సెంటర్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎ్‌స వరకు కారిడార్‌-2, పీఎన్‌బీఎ్‌స నుంచి రైల్వేస్టేషన్‌మీదుగా జక్కంపూడి వరకు కారిడార్‌-3లను పొందుపరిచింది. మూడు కారిడార్ల నిడివి 70కిలోమీటర్ల మేర పొందు పరిచినట్టు తెలిసింది. ఈ రూట్‌లో మొత్తం కిలోమీటర్‌ దూరానికి ఒక మెట్రో స్టేషన్‌చొప్పున మొత్తం 65 స్టేషన్లను ప్రతిపాదించినట్టు సమాచారం. వీటితో పాటు పీఎన్‌బీఎ్‌స దగ్గర జాతీయ రహదారి-65పై ఒకటి, లింగాయపాలెంలో మరొకటి చొప్పున రెండు ప్రధాన స్టేషన్లను ప్రతిపాదించినట్టు తెలిసింది.
Link to comment
Share on other sites

  • 1 month later...
మెగా.. మెట్రో
24-02-2019 08:11:32
 
636865926907710826.jpg
  • లైట్‌ మెట్రో కారిడార్‌కు తుది డీపీఆర్‌ సిద్ధం
  • మొత్తం 80 కిలోమీటర్లు..
  • రూ.25 వేలకోట్ల వ్యయం?
  • 68 నుంచి 80 కిలోమీటర్లకు పెరిగిన నిడివి
  • జక్కంపూడికి రెండు కారిడార్లు
  • మూడు ఫేజుల్లో పనులకు ప్రణాళికలు
రాజధానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు.. ‘మెగా కారిడార్‌’గా అవతరించబోతోంది. మొత్తం 80 కిలోమీటర్ల నిడివిలో.. రూ.25వేలకోట్ల వ్యయంతో లైట్‌ మెట్రో ప్రాజెక్టు అంతిమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది! ఈనెల 28న ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కి అందించబోతోంది! మరో నాలుగురోజుల్లో నగర, రాజధాని అనుసంధాన లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఏమిటన్నది బహిర్గతం కానుంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): మహా కారిడార్లతో రూ. 25 వేలకోట్ల వ్యయంతో కూడుకున్న లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు వ్యయ ప్రతిపాదనలతో ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ సిద్ధం చేసింది. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు రాజధాని ప్రాంత లైట్‌ మెట్రో కారిడార్ల నిడివి 80 కిలోమీటర్ల వరకు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రిలిమనరీ డీపీఆర్‌లో 68కిలోమీటర్ల నిడివి మేర పొం దుపరచగా.. తుది డీపీఆర్‌లో అదనంగా మరో 12 కిలోమీటర్లు పెరిగింది. రాజధాని ప్రాంతంలో ఆర్థిక నగరం జక్కంపూడి ప్రాంతానికి తుది డీపీఆర్‌లో రెండు కారిడార్లను ప్రతిపాదించటం విశేషం. భౌగోళికంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్‌కు ఈస్ట్‌ వైపు నుంచి ఒక కారిడార్‌ను, వెస్ట్‌ నుంచి రెండవ కారిడార్‌ను జక్కంపూడికి తీసుకువెళ్లాలన్నది శిస్ర్టా అంచనాగా ఉంది. దీనికి సంబంధించి రెండు డిజైన్లను ఆ సంస్థ సిద్ధం చేసినట్టు సమాచారం. జక్కంపూడికి రెండు కారిడార్లతో పాటు అసలు ఈ ప్రాంతానికి లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ ఎంతవరకు అవసరమన్న దానిపై కూడా ప్రత్యా మ్నాయ నివేదికను తుది డీ పీఆర్‌లో పొందు పరిచినట్టు సమాచారం. దీని ప్రకారం లైట్‌ మెట్రో కాకుండా సత్వర రవాణా వ్యవస్థలకు సంబంధించి ఏ విధానాన్ని అవలంబించవచ్చో సూచించినట్టు తెలిసింది. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించిందన్నది ఫైనల్‌ డీపీఆర్‌ పూర్తిగా బహిర్గతమయ్యే వరకు వేచి చూడాల్సిందే. జక్కంపూడికి కేవలం నాలుగువేల పీహెచ్‌పీడీటీ మాత్రమే ఉందని తె లుస్తోంది. పీహెచ్‌పీడీటీ అంటే పీక్‌ అవర్‌లో ప్రయాణీకుల సంఖ్య.
 
 
రూ. 25 వేలకోట్ల ప్రాజెక్టు వ్యయం
మెగా కారిడార్‌ నేపథ్యంలో, ప్రాజెక్టు వ్యయం కూడా తగ్గట్టుగానే పెరిగింది. మొత్తం 25 వేలకోట్ల వరకు ప్రాజెక్టు వ్యయం అవుతుందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సివిల్‌ కాస్ట్‌ తో పాటు, కాస్టింగ్‌, కోచెస్‌, ఎలక్ర్టిఫికేషన్‌ తదితరాలతోపాటు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ కు వెచ్చించాల్సిన మొత్తానికి సంబంధించి అన్ని వ్యయాలను కలుపుకుని రూ.25 కోట్లుగా పేర్కొన్నట్టు తెలిసింది.
 
 
భూగర్భమార్గం
అమరావతి రాజధానిలోకి వెళ్ళే కారిడార్‌ను పూర్తిగా భూగర్భ కారిడార్‌గా ఏర్పాటు చేయాలని కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ సూచించింది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నుంచి రాజధాని ప్రాంతంలో పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్‌, ఇస్కాన్‌ టెంపుల్‌. ఉండవల్లి, వెంకటపాలెం (ఈస్ట్‌), వెంకటపాలెం (వెస్ట్‌), తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెంల వరకు భూగర్భ మార్గంలోనే లైట్‌మెట్రో రైల్‌కారిడార్‌ వెళుతుంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానాలకు ఇబ్బందిగా లేకుండా ఉండటానికి లోపల వరకు పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలోనే నిర్మించేందుకు ప్రతిపాదించింది.
 
 
మూడు ఫేజుల్లో ..
తుది డీపీఆర్‌ చేతికి రాగానే.. అత్యున్నత కమిటీ ముందు చర్చించిన తర్వాత ఏ విధానంలో వెళ్లాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తగిన గైడ్‌లెన్స్‌ తీసుకోనున్నారు. మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించటమా? లేకపోతే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్లటమా? అన్నది నిర్ణయం తీసుకున్నాక ఆ మేరకు అడుగులు వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే జాప్యమౌతుందనుకుంటే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇన్నోవేటివ్‌ పీపీపీ విఽధానంలో అయితే సివిల్‌ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేయించే అవకాశం ఉంది. నిర్వహణ ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి. ప్రత్యేక ప్యాకేజీ కింద విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకునే అప్పులను కేంద్రం భరించాల్సి ఉంటుంది కాబట్టి.. ఆ పద్దతిలో వెళ్ళే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ విధానంలో వెళితే రెడీగా ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన కేఎ్‌ఫడబ్లూ సంస్థ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తితో ఉంది. ఇప్పటికే ఈ సంస్థ తన సొంత ఖర్చుతో ఉచితంగా డీపీఆర్‌ రూపకల్పనకు కృషి చేసింది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే!
 
 
కారిడార్ల నిడివి..
ప్రిలిమనరీ డీపీఆర్‌లో కారిడార్ల నిడివి మొత్తంగా 68 కిలోమీటర్ల మేర ఉండగా.. తుది డీపీఆర్‌లో అది 80 కిలోమీటర్లకు పెరగటం గమనార్హం. ఇంతకు ముందు ఏలూరు కారిడార్‌ను గన్నవరం బస్‌స్టేషన్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు, తిరిగి అక్కడి నుంచి కేసరపల్లి, నిడమానూరు వరకు 12 కిలోమీటర్లు, తిరిగి నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్‌, ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ నుంచి బస్‌స్టేషన్‌ వరకు 13 కిలోమీటర్లు, బస్‌స్టేషన్‌ నుంచి ఇదే కారిడార్‌ను అమరావతికి తీసుకు వెళ్ళటానికి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు 14 కిలోమీటర్లు, తిరిగి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ అమరావతి వరకు 24 కిలోమీటర్ల మేర పొందు పరిచారు. జక్కంపూడికి నిర్దిష్టంగా సూచించలేదు. ఫైనల్‌ డీపీఆర్‌లో మాత్రం జక్కంపూడికి రెండు మార్గాలను సూచించింది. రైల్వేస్టేషన్‌కు వెస్ట్‌ నుంచి వెళ్ళే కారిడార్‌ను 6.3 కిలోమీటర్లు, ఈస్ట్‌ వైపు నుంచి వెళ్ళే కారిడార్‌ను 8.2 కిలోమీటర్ల మేర ప్రతిపాదించటం గమనార్హం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...