Jump to content

Vijayawada ki Light Metro!


Recommended Posts

లైట్‌ మెట్రోకు మరో ముందడుగు

ఈనాడు, అమరావతి

kri-top2a.jpg

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ సంస్థ ఉచితంగానే తేలికపాటి మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక అందించనుంది. దీనికి గాను దాదాపు రూ.6కోట్లు మేరకు ఖర్చు చేయనుంది. స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతోనే లైట్‌మెట్రో డీపీఆర్‌ తయారు చేయాలని ఏఎంఆర్‌సీ నిర్ణయించింది. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ చేతికి అందనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది.

మారనున్న మెట్రో స్వరూపం..!

విజయవాడ నగరంలో మెట్రో స్వరూపం మారనుంది. గతంలో విజయవాడ మెట్రో కేవలం రెండు కారిడార్లకే పరిమితం అయింది. ప్రస్తుతం లైట్‌ మెట్రో నిర్ణయంతో నాలుగు కారిడార్లు 42 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ తయారు చేయనున్నారు. విజయవాడకు మెట్రో ప్రాజెక్టు వస్తుందని గత మూడేళ్లుగా వూరించారు. ఏలూరు, బందరు రోడ్డులో 26 కిలోమీటర్ల మేరకు కారిడార్లు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. డీఎంఆర్‌సీ దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారు చేసింది. మొత్తం రూ.6769 కోట్లు అంచనా వ్యయం. అయితే మారిన పరిణామాలతో విజయవాడకు మెట్రో సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. మొదట కేంద్రం 20శాతం నిధులు అందించేందుకు ముందుకు వచ్చింది. కనీసం 20లక్షల జనాభా ఉండాల్సి ఉంది. కానీ శివారు పంచాయతీలతో కలిపి 15లక్షల జనాభా ఉంటడంతో సాధ్యం కాదని తేల్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రోకు వెళ్లిన విషయం తెలిసిందే. స్టేషన్లు, కారిడార్లు పొడవు పెంచి డీపీఆర్‌ తయారు చేయనుంది.

* మొదట మెట్రో ప్రాజెక్టుకు డీఎంఆర్‌సీ తయారు చేసిన సవివర నివేదిక 2015లో సమర్పించింది. దీనికి రూ.2కోట్ల వరకు వ్యయం అయింది. నాటి డీపీఆర్‌ ప్రకారం పీఎన్‌బీ బస్టాండు నుంచి పెనమలూరు వరకు ఒక కారిడారు బందరు రోడ్డులో, నిడమానూరు వరకు ఏలూరు రోడ్డులో రెండో కారిడార్‌ నిర్మాణం చేయాల్సి ఉంది.

* లైట్‌ మెట్రోలో స్వరూపం మారింది. బందరు కారిడార్‌ పెనమలూరు వరకు ఉంటుంది. ఏలూరు రోడ్డులో కారిడార్‌ నిడమానూరుకు బదులుగా గన్నవరం వరకు పొడగించనున్నారు. అదనంగా మరో 8 కొలోమీటర్ల వరకు పెరగనుంది.

* మరో కారిడార్‌ పీఎన్‌బీ నుంచి జక్కంపూడి గ్రామం వరకు వెళ్లనుంది. దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుంది. నాలుగో కారిడార్‌ కృష్ణా కాలువ జంక్షన్‌ వరకు గుంటూరు జిల్లాలో నిర్మాణం చేయనున్నారు. ఇది మూడు కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.

* దాదాపు నాలుగు కారిడార్లు 42 కిలోమీటర్లు వరకు ఉంటుంది. ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు వ్యయంలోనే ఈ మొత్తం నిర్మాణం చేయనున్నారు.

* రెండు నెలల కిందట దీనికి ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్పీవీగా ఉన్న ఏఎంఆర్‌సీతో పాటు జర్మనీ ఆర్థిక సంస్థ కెఎఫ్‌డబ్ల్యూ సంయుక్తంగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. గ్లోబల్‌ బిడ్లను ఆహ్వానించారు.

* స్వదేశీ సంస్థలతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలకే ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం అయిదు సంస్థలు పోటీలో ఉన్నాయి. అనుభవం, ఇతర సాంకేతిక అర్హతలను బట్టి జర్మనీ సంస్థ కెఎఫ్‌డబ్ల్యూ ఖరారు చేస్తుందని ఏండీ రామకృష్ణారెడ్డి చెప్పారు.

* జర్మనీకి చెందిన లైట్‌మెట్రో నిపుణులు డాట్సన్‌ ఇటీవల విజయవాడలో 15 రోజులపాటు ఉండి అధ్యయనం చేసి ప్రాథమిక నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం లైట్‌మెట్రోపై నిర్ణయం తీసుకుంది. దీంతో ఫండింగ్‌ సంస్థ కెఎఫ్‌డబ్ల్యూ డీపీఆర్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. ఆదేశం నుంచి నిధులు సమకూర్చుతున్నారని ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మొత్తం రూ.6కోట్లు భరించనున్నారు. డీపీఆర్‌ తర్వాత కేంద్రం నుంచి అనుమతులు తీసుకోనున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లను పిలుస్తారు.

Link to comment
Share on other sites

  • Replies 309
  • Created
  • Last Reply

ఆరు నెలల్లో సవివర నివేదిక

కొత్త విధానంలోనే విజయవాడకు తేలికపాటి మెట్రో

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు

నాలుగు కారిడార్లతో ముందుకు

వచ్చే ఏడాది పనులు ప్రారంభం

‘ఈనాడు’తో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి

21ap-main8a.jpg

విజయవాడలో తేలికపాటి మెట్రో రైలు ఏర్పాటుకు సవివర నివేదిక మరో ఆరునెలల్లో రూపొందనుందని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ ఎన్‌.పి.రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేపట్టనున్నామని ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి అనుమతుల్లో జాప్యం వల్ల విజయవాడకు పాత మెట్రో విధానంలో ప్రాజెక్టు రాకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ప్రధాన సలహాదారుగా ఉన్న దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)కి చేసిన పనులకు అయిన ఖర్చు మాత్రమే చెల్లిస్తామన్నారు. తేలికపాటి మెట్రోలో రెండు కారిడార్లకు మాత్రమే పరిమితం కాకుండా నాలుగు కారిడార్లకు డీపీఆర్‌ తయారు చేయిస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో అనువైందని, వ్యయం తగ్గుతుందని మెట్రో రంగ నిపుణులు శ్రీధరన్‌ రాసిన లేఖలోనూ ఉందని ఆయన వెల్లడించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ప్రతిపాదనలు, డీపీఆర్‌ తయారీ, డీఎంఆర్‌సీతో వివాదం తదితర అంశాలను ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.

టెండర్ల వరకు వెళ్లిన విజయవాడ మెట్రో వ్యవహారం మళ్లీ మొదటికి రావడాన్ని మీరెలా విశ్లేషిస్తారు?

చిన్న నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ఎక్కడా చేపట్టలేదు. విజయవాడకు ప్రత్యేక పరిస్థితుల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. విజయవాడ నగర జనాభా 10.48 లక్షలు. శివారు అర్బన్‌ ప్రాంతాలు కలిపితే 14.91 లక్షలు. రాజధాని నగరంగా విజయవాడ విస్తరించనుంది. ఆ దృష్టితో ఇక్కడ మెట్రో అవసరాన్ని గుర్తించిన సీఎం కేంద్రం నుంచి అనుమతులు కోరారు. నాటి పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారు. సాధారణంగా మెట్రో ప్రాజెక్టుకు 20 లక్షల జనాభా ఉండాలి. రద్దీ సమయంలో గంటకు వివిధ మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య(పీహెచ్‌పీడీటీ) 20 వేలు ఉండాలి. విజయవాడలో 6,366 ఉంది. డీఎంఆర్‌సీ 26 కిలోమీటర్లకు రూ.6,769కోట్లతో డీపీఆర్‌ తయారు చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతులకు పంపింది. నీతి ఆయోగ్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి ఇది జాతీయ పట్టణ రవాణా విధానం ప్రకారం అమలు కాదని తేల్చింది. పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు కూడా ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది.

డీఎంఆర్‌సీ, ఏఎంఆర్‌సీ మధ్య విభేదాల వల్ల సమన్వయం లోపించిందన్న విమర్శ ఉంది!

మేమేం చేశాం? డీఎంఆర్‌సీ కేంద్రం నుంచి అనుమతి రాకుండానే అది టెండర్లను పిలవడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత డీఎంఆర్‌సీ ఒప్పందం చేసుకోవాలి. కానీ అనుమతులు లేకుండానే ప్రధాన కన్సల్టెంట్‌గా ఒప్పందంపై సంతకాలు చేయించింది. ముందుగా రూ.1800 కోట్లకు టెండర్లను పిలిచి తర్వాత దాన్ని తగ్గించింది. ఎందుకు తగ్గించిందో తెలియదు. కనీసం సమాచారం లేదు. రెండు సంస్థలు టెండర్లలో అర్హత సాధిస్తే వాటిని రద్దు చేశారు. ఈలోగా కొత్త విధానం అమలులోకి వచ్చింది.

తొలుత అనుకున్న ప్రాజెక్టుకు సంబంధించి డీఎంఆర్‌సీకి చెల్లించాల్సిన మొత్తంపై వివాదం ఏమిటి?

ఒప్పందం ప్రకారం నెలకు రూ.6కోట్లు డీఎంఆర్‌సీకి చెల్లించాలి. కానీ పనులే ప్రారంభం కాలేదు. ముందస్తు అడ్వాన్సుగా రూ.15 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు రూ.75 కోట్లు బకాయి అంటున్నారు. వాస్తవ ఖర్చులు ఎంత అయితే అంత ఇస్తాం. పనులు చేయకుండా సొమ్ములు ఎలా చెల్లిస్తాం? ఒప్పందాన్ని ముగిద్దామని డీఎంఆర్‌సీ లేఖ రాసింది. దానికి సరే అన్నాం. తేలికపాటి మెట్రోలో డీఎంఆర్‌సీకి అనుభవం లేదు. అందుకే దాని సేవలు వినియోగించుకోలేకపోతున్నాం.

పాత విధానంలో అనుమతులు రాకపోవడం వల్ల కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల నిధులు అందకుండా పోయాయిట కదా..?

ఈ ప్రచారంలో వాస్తవం లేదు. ఒప్పందం ప్రకారం మొత్తం వ్యయంలో కేంద్రం 20శాతం నిధులు భరించాలి. అంటే సుమారు రూ.1,354కోట్లు అందించాలి. ఈ మొత్తం సర్దుబాటుకు ఏదో రూపంలో ప్రభుత్వం సహకరించాలి.

ఎంతో అనుభవం ఉన్న మెట్రో రంగ నిపుణులు శ్రీధరన్‌ తేలికపాటి మెట్రోపై ఎలా స్పందించారు?

ఆయన కూడా తేలికపాటి మెట్రో అనువైందని, 20శాతం వ్యయం తగ్గుతుందని రాశారు. అయితే భవిష్యత్తులో మెట్రో అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాత మెట్రో విధానంలో మరోసారి ప్రయత్నాలు చేయమని ఆయన సూచించారు. దాంతో ప్రభుత్వం లేఖ రాసింది. మంత్రి నారాయణ నేతృత్వంలో కేంద్ర మంత్రిని కలిశాం. అభ్యర్థించాం. ఆర్థిక శాఖకు రాస్తామని చెప్పారు. మంత్రి కూడా కొత్త విధానంలోనే వెళ్లమని చెప్పారు. తేలికపాటి మెట్రో పరిశీలించాలని సూచించారు.

పాత డీపీఆర్‌తో పోల్చితే పెద్ద వ్యత్యాసం ఉండదని పైగా ఎక్కువ వ్యయం అవుతుందని డీఎంఆర్‌సీ అధికారులు అంటున్నారు..?

పాత డీపీఆర్‌తో వెళ్లడానికి రెండు కారిడార్లు మాత్రమే ఉన్నాయి. కొత్త డీపీఆర్‌ తయారీకి జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయిదు సంస్థలు ముందుకు వచ్చాయి. డీపీఆర్‌కు ఆరు నెలలు పడుతుంది. డీపీఆర్‌ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఉచితంగా (సర్వీసు) అందించనుంది. మెట్రో ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక ఎక్కడ ఎక్కువ వ్యయం అవుతుంది. గత డీపీఆర్‌లో ఏలూరు రోడ్‌, పెనమలూరు రోడ్‌- ఈ రెండు కారిడార్‌లే ఉన్నాయి. ఈ డీపీఆర్‌లో ఏలూరు కారిడార్‌ గన్నవరం వరకు ఉంటుంది. పెనమలూరుతో పాటు కొత్తగా జక్కంపూడి, కేసీ జంక్షన్‌ కారిడార్‌లు ఉంటాయి. గతంలో 26 కిలోమీటర్లు ఉండేది. ప్రస్తుతం 42 కిలోమీటర్ల వరకు వస్తుంది. డీపీఆర్‌ రాగేనే సీఎం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతాం. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభం అవుతాయి. భూసేకరణకు మార్గం సుగమమైంది.

తేలికపాటి మెట్రో ప్రైవేటు భాగస్వామ్యంలో వీలవుతుందా..?

మెట్రో ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సూచించింది. కౌలాలంపూర్‌, జోజొ నగరాల్లో పర్యటించాం. ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రతిపాదన వచ్చింది. తేలికపాటి మెట్రో సరైందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై జర్మనీ నిపుణులు డాట్సన్‌ 15 రోజులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. భారీగా అంచనా వ్యయం తగ్గుతుందని తేల్చారు. 25 శాతం వరకు వ్యయం తగ్గుతుంది. తేలికపాటి మెట్రోకు ప్రభుత్వం కొంత భరిస్తే మిగిలిన నిర్వహణకు పీపీపీ పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది.

తేలికపాటి మెట్రో ఎక్కడా విజయవంతం కాలేదని అంటున్నారు..?

మన భారత్‌లో చిన్న నగరాల్లో ఎక్కడైనా మెట్రో ప్రాజెక్టు ఉందా..? కనీసం 20లక్షల జనాభా ఉండాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం దూర దృష్టితో ఈ ప్రతిపాదన తెచ్చారు. కేసీ జంక్షన్‌ వరకు కారిడార్‌ రావడం వల్ల భవిష్యత్తులో అమరావతికి వెళుతుంది. గుంటూరు నగరానికి కారిడార్‌ వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో తేలికపాటి మెట్రో విస్తరించుకోవచ్చు. మెట్రో ప్రాజెక్టుగా రూపాంతరం చేయవచ్చు.

విశాఖపట్నం మెట్రో పరిస్థితి ఏమిటి..?

ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ ఇచ్చాం. పలు సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించాం. నూతన మెట్రో విధానంలో ముందుకు వెళతాం.

-ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

  • 1 month later...
జక్కంపూడికి మూడో కారిడార్‌
27-11-2017 07:15:30
 
636473642854528547.jpg
  •  మొత్తం కారిడార్ల నిడివి 50 కిలోమీటర్లకు పైనే
  •  నెలాఖరుకు ఆర్‌ఎ్‌ఫపీ బిడ్ల పరిశీలన
  •  డీపీఆర్‌ రూపకల్పనకు తుది కాంట్రాక్టర్‌ ఎంపిక
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ నగరంలో మూడవ కారిడార్‌ కూడా తెరమీదకు వచ్చింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకు రిక్వెస్టు ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎ్‌ఫపీ) ప్రకారం ప్రతిపాదిత అమరావతి ఆర్థిక నగరం జక్కంపూడికి మరో కారిడార్‌ వేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మీడియం మెట్రో ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన బందరు, ఏలూరు రోడ్డు కారిడార్లకు అదనంగా లైట్‌ మెట్రోకు జక్కంపూడి మూడవ కారిడార్‌గా వస్తుంది.అమరావతి రాజధానిలోకి కూడా లైట్‌ మెట్రో రైల్‌ను తీసుకు వెళ్ళటానికి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ వరకు ప్రతిపాదించటం జరిగింది. అయితే దీనికి కొత్తగా కారిడార్‌ రాదు. ఎందుకంటే పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు ఉన్న కారిడార్‌ను అక్కడి నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌కు పొడిగించటానికి అవకాశం ఉంది కాబట్టి నాల్గవ కారిడార్‌కు అవకాశం లేదు.
 
 ఈ కారిడార్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రతిపాదిస్తారనేది డీపీఆర్‌లో వస్తుంది. మొత్తంగా చూస్తే విజయవాడ లో నిర్మించబోయే లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిడివి 50 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత మీడియం మెట్రో ప్రాజెక్టు విషయానికి వస్తే.. పీఎన్‌బీఎస్‌ నుంచి నిడమానూరు వరకు 13.05 కిలోమీటర్ల నిడివి ఉంది. ఆర్‌ఎ్‌ఫపీలో గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించారు. దీని ప్రకారం చూస్తే.. మరో పది కిలోమీటర్లు అదనంగా పెరుగుతుంది. పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు మరో ఐదు కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. విజయవాడ నుంచి జక్కంపూడికి వెళ్ళాలంటే మరో 8 కిలోమీటర్ల మేర నిడివి పెరుగుతుంది. దీంతో పాత మీడియం మెట్రో కంటే రెట్టింపుగా నిడివి పెరుగుతుంది. నవంబర్‌ నెలాఖరుకు లైట్‌ మెట్రో రైల్‌ ఆర్‌ఎ్‌ఫపీ బిడ్ల పరిశీలన జరుగుతుంది. డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి మొత్తం అర్హత సాధించిన ఐదు కన్సల్టెన్సీ సంస్థలు తమబిడ్లను సమర్పించాల్సి ఉంది. ఈ బిడ్లలో తాము డీపీఆర్‌ రూపకల్పన చేయటానికి ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాము? ఫీజు తదితర వివరాలు ఉంటాయి.. వీటిని పరిశీలించిన మీదట ఒక కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ లైట్‌ మెట్రో రైల్‌ డీపీఆర్‌ను రూపొందించాల్సి ఉంటుంది. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, ఇండియాలకు చెందిన కన్సల్టెన్సీలలో ఏ సంస్థ డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలను దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

  • 5 weeks later...

లైట్‌ మెట్రో.. మరో అడుగు
27-12-2017 07:15:31

 డీపీఆర్‌కు ‘శిస్ర్టా’ ఎంపిక
 ఫ్రాన్స్‌ దేశానికి చెందిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ...
 జనవరిలో బాధ్యతలు అప్పగింత
 ఈ లోపు కాంట్రాక్టు సంస్థతో సంప్రదింపులు
 
విజయవాడ: లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసేందుకు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ అర్హత సాధించింది. టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లు రెండింటిలోనూ ఈ సంస్థ అర్హత సాధించటంతో ఈ సంస్థకు మాస్టర్‌ప్లాన్‌ బాధ్యతలు అప్పగించటానికి అమరావ తి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) అధికారులు రంగం సిద్ధం చేశారు. పక్షం రోజుల్లో అధికారికంగా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఈ లోపు ఆ సంస్థతో ఏఎంఆర్‌సీ బృందం చర్చలు జరుపుతుంది. నూతన సంవత్సరం జనవరి 15వ తేదీ నాటికి ఈ సంస్థతో అగ్రిమెంట్‌ కుదిరే అవకాశం ఉంది. మూడవ వారంలోనే ఈ సంస్థ డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలు చేపట్టనుంది. జర్మనీలో రుణ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో పిలిచిన గ్లోబల్‌ టెండర్లను ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ శిస్ర్టా దక్కించుకున్నప్పటికీ, దేశంలో ఈ సంస్థ ఎంపిక చేసుకున్న దేశీయ సంస్థతో కలిసి డీపీఆర్‌ రూపకల్పన కోసం కృషి చేస్తుంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు టెండర్లు పిలవటానికి ఏఎంఆర్‌సీ గ్లోబల్‌ టెండర్లు పిలవగా మొత్తం 12 సంస్థలు వచ్చాయి. ఇండియా, ఇటలీ, జర్మనీ, జపాన్‌ , ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన ఈ కన్సల్టెన్సీ సం్థలు ఇండియాలో దేశీయ కన్సల్టెన్సీ సంస్థలతో టై అప్‌ అయ్యి సంయుక్తంగా బిడ్లను దాఖలు చేశాయి. అర్హతల ప్రాతిపదికన ఎలిమినేషన్‌లో 9 సంస్థలు మాత్రమే మిగిలాయి. వీటికి సంబంధించి టెక్నికల్‌ బిడ్ల పరిశీలన తర్వాత మూడు సంస్థలు మాత్రమే బరిలో నిలిచాయి. సీపీసీఎస్‌, శిస్ర్టా, ఈజీఐఎస్‌ సంస్థలకు సంబంధించిన ఫైనాన్షియల్‌ బిడ్ల పరిశీలన తర్వాత.. శిస్ర్టా అర్హత సాధించింది. విజయవాడలో మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగిన సంగతి తెలిసిందే.
 
నూతన మెట్రో పాలసీ ప్రకారం ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో విజయవాడలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన మీదట డీపీఆర్‌ రూపకల్పన కోసం గ్లోబల్‌ టెండర్లను పిలవటం జరిగింది. మీడియం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి విజయవాడ నగరంలో ఏలూరు, బందరు రోడ్డు కారిడార్లలలో 27 కి లోమీటర్ల నిడివితో మాత్రమే డీపీఆర్‌ను రూపొందించటం జరిగింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి అదనంగా జక్కంపూడికి మూడో కారిడార్‌కు కూడా అంచనాలు రూపొందించాల్సి ఉంటుంది. బందరు రోడ్డు కారిడార్‌ను అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు పొడిగించటానికి , ఏలూరు రోడ్డు కారిడార్‌ను విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేయటానికి వీలుగా డీపీఆర్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. డీపీఆర్‌ను తయారు చేయటానికి అతి తక్కువ కాలాన్ని నిర్దేశించాలని ఏఎంఆర్‌సీ నిర్ణయించింది. కనిష్టంగా మూడు నెలల్లోనే రిపోర్టు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వనుంది. ఒకవేళ కాని పక్షంలో మరో నెల రోజులు పొడిగించి నాలుగు నెలల సమయం ఇవ్వాలన్న ఆలోచనలో ఏఎంఆర్‌సీ ఉంది. నాలుగు నెలల్లో డీపీఆర్‌ రాగానే వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి ఫండింగ్‌ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సారి కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టడానికి వీలు లేని పరిస్థితి కల్పించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం పాత పరిస్థితిని పునరావృతం చేస్తే ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో సొంతంగా వెళ్ళటానికి కూడా ప్రభుత్వం ఆసక్తితో ఉందని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...

కదులుతున్న లైట్ మెట్రో
25-02-2018 07:33:29

 ‘శిస్ర్టా’తో ఏఎంఆర్‌సీ అగ్రిమెంట్‌
 ఆరు నెలల్లో డీపీఆర్‌ ఇవ్వాలి..
 26న ప్రాథమిక సమావేశం
 మార్చి14న కేఎఫ్‌డబ్ల్యూ టీమ్‌ బెజవాడకు..
 విజయవాడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాజధానికి లైట్‌ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’తో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఆరు నెలల్లో లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను ఈ సంస్థ అందించాల్సి ఉంటుంది. అగ్రిమెంట్‌ కుదరటంతో ఈ నెల 26వతేదీన శిస్ర్టా బృందం విజయవాడ వస్తోంది. ఏఎంఆర్‌సీ డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి ప్రిలిమినరీ సమావేశంలో పాల్గొంటుంది. టెండర్లు పిలిచి తుది కన్సల్టెన్సీ సంస్థగా ‘శిస్ర్టా ’ను ఖరారు చేసిన తర్వాత ఆ సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకోవటంలో జాప్యం జరగటంతో అనుమానాలు రేకెత్తాయి. ఈ నెల 22వ తేదీన అధికారికంగా శిస్ర్టాతో ఏఎంఆర్‌సీ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవటంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి శిస్ర్టా సంస్థ కూడా రంగంలోకి దిగింది. గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ మీదుగా అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానించేలా సరికొత్త ప్రతిపాదనలతో డీపీఆర్‌ను తయారు చేయాల్సి ఉంటుందని, టెండర్లు పిలిచిన తర్వాత రిక్వెస్టు ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ)లో స్పష్టంగా ఏఎంఆర్‌సీ తెలియపరిచింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లతో పాటు జక్కంపూడి, కృష్ణా కెనాల్‌ మీదుగా అమరావతికి, ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు అదనంగా మరో మూడు కారిడార్లను ప్రతిపాదించటం జరిగింది. ఈ ఐదు ప్రతిపాదనలే కాకుండా కన్సల్టెన్సీ సంస్థ విఽవిధ సర్వేలు, అధ్యయనం, ట్రాఫిక్‌ మూవ్‌మెంట్‌, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కారిడార్‌లకు కూడా ప్రతిపాదించవచ్చని సూచించటం జరిగింది. డీపీఆర్‌ను సమర్పించటానికి ఏఎంఆర్‌సీ అధికారులు ముందుగా నాలుగు నెలల సమయాన్ని మాత్రమే గడువుగా ఇచ్చారు. అగ్రిమెంట్‌ సందర్భంగా నాలుగు నెలల సమయం వల్ల సమర్ధంగా డీపీఆర్‌ను అందించలేమని శిస్ర్టా కోరడంతో మరో రెండు నెలల సమయాన్ని ఇచ్చేందుకు ఏఎంఆర్‌సీ అధికారులు అంగీకరించారు.
 
జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ టీమ్‌ మార్చి 14న విజయవాడకు రానుంది. లైట్‌ మెట్రో డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి ఏఎంఆర్‌సీ గ్లోబల్‌ టెండర్లు పిలవగా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నడిపించింది. షార్ట్‌లిస్ట్‌, తుది సంస్థను ఎంపిక చేయటం వరకు ఈ సంస్థ కనుసన్నలలోనే జరిగింది. లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు మరో ఆర్థిక సంస్థ ఏఎఫ్‌డీతో కలిసి దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రుణాన్ని ఇవ్వటానికి ఈ సంస్థ ఆసక్తి చూపుతోంది. విజయవాడ లైట్‌ మెట్రో ప్రాజెక్టును ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో చేపట్టడానికి ఆసక్తి కనపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో సొంతంగా సివిల్‌ నిర్మాణాలు చేపడతారు. రోలింగ్‌ స్టాక్‌, ఆపరేషన్స్‌ అంతా ప్రైవేటు సంస్థలు చూసుకోవాల్సి ఉంటుంది. రాయల్టీలో మాత్రం ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో సివిల్‌ నిర్మాణాలకు అయ్యే వ్యయాన్ని కేఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్‌డీ సంస్థలు ఇచ్చే రుణం ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు.

Link to comment
Share on other sites

ఏఎంఆర్‌సీ ఎండీతో చెక్‌ రిపబ్లిక్‌ రాయబారి మిలన్‌ హవోర్క్‌ భేటీ
25-02-2018 09:47:16
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేటివ్‌ మెట్రో పాలసీపై చెక్‌ రిపబ్లిక్‌ ఆసక్తి చూపిస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకోవాలని ఉందని ఆ దేశ రాయబారి మిలన్‌ హవోర్క్‌ ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరౌతున్న సందర్భంగా చెక్‌ రిపబ్లిక్‌ రాయబారి మిలన్‌ హవోర్క్‌ విజయవాడ వచ్చారు. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డితో రెండుగంటల పాటు భేటీ అయ్యారు. ఏఎంఆర్‌సీ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మిలన్‌ హవోర్క్‌తో పాటు ఆ దేశ ఆర్థిక నిపుణులు దోస్తల్‌ కూడా ఏఎంఆర్‌సీ కార్యాలయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన రౌలింగ్‌ స్టాక్‌ సరఫరాలో ఆరితేరిన కంపెనీలను చెక్‌ రిపబ్లిక్‌ కలిగి ఉంది. లక్నో నగరంలోని మెట్రోకు రౌలింగ్‌ స్టాక్‌ సరఫరాకు చెక్‌ రిపబ్లిక్‌ ఆసక్తి చూపిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడి మెట్రో ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపి స్వయంగా విజయవాడ వచ్చారు. ఏఎంఆర్‌సీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లతో పాటు పీపీపీ విధానాలకు ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. పీపీపీ విధానంలో భూ సేకరణ, సివిల్‌ వర్క్స్‌ ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధంగా ఉందని ఆపరేషన్స్‌ ప్రైవేటు సంస్థ నిర్వహించటంతో పాటు లాభాలలో ఏపీ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించే విధంగా తమ పాలసీ ఉంటుందని చెప్పారు. ఈ విధానం పట్ల హవోర్క సంతృప్తి వ్యక్తం చేశారు.
 
తమ దేశం రౌలింగ్‌ స్టాక్‌లో సిద్ధహస్తమైనదని చెప్పారు. మెట్రో కోచ్‌ల తయారీ, సరఫరా, ఆపరేషన్స్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము అందచేయగలమని చెప్పారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 27వ తేదీతో ఆసక్తి వ్యక్తీకరణ గడువు ముగుస్తున్నందున ముందుకు వచ్చిన సంస్థల షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత ఆయా సంస్థలతో జాయింట్‌ వెంచర్‌గా ముందుకు రావటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా రామకృష్ణారెడ్డి సూచించారు. విశాఖతో పాటు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పట్ల కూడా హవోర్క ఆసక్తిని చూపించారు. తమ దేశ కంపెనీలతో ఇక్కడి ప్రాజెక్టుల గురించి విశదీకరించి ఆయా కంపెనీలతో సమావేశానికి అవకాశం కల్పిస్తామని హవోర్క్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

10 hours ago, Kiran said:

Not a fan of light metro. Roads worst avuthai and on top manolla traffic sense ki expecting accidents 

private partnership lekunda metro ki permission ivvam ani law marchesaru ga bro 2017 sep lo...inka emi sestharu mari. i'm also hoping for metro. but babu seems gave up on it after funds crunch.

Link to comment
Share on other sites

అడుగు ముందుకు 
తేలికపాటి మెట్రోకు నివేదిక! 
నేడు విజయవాడకు ప్రతినిధుల రాక 
ఈనాడు, విజయవాడ 
amr-top2a.jpg

విజయవాడలో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టుపై మరో అడుగు ముందుకుపడింది. తేలికపాటి మెట్రో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేసేందుకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు నెలల్లో డీపీఆర్‌ అందనుంది. అనంతరం మెట్రో నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తేలికపాటి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేసేందుకు ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా సంస్థ ప్రతినిధులు బుధవారం విజయవాడకు రానున్నారు. దశలవారీగా సిస్ట్రా సంస్థ తమ ఉద్యోగులను విజయవాడకు తరలించనుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో డీపీఆర్‌ తయారు చేసేందుకు ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి ఒప్పందం దక్కించుకుంది. దీనికి నాలుగు నెలల కిందటే టెండర్లను పిలిచినా ఒప్పందం చేసుకోవడంలో జాప్యం జరిగింది. ఇటీవల ఒప్పందం చేసుకోవడంతో డీపీఆర్‌ తయారీకి రంగం సిద్ధం చేసుకున్నారు. భారత్‌, ఫ్రాన్సు, జర్మనీలో ఆ సంస్థల ఉద్యోగులు సంయుక్తంగా కలిసి రూపొందిస్తారని మెట్రో అధికారులు చెబుతున్నారు. సిస్ట్రా సంస్థ రాకతో మళ్లీ మెట్రో ప్రాజెక్టులో కదలిక వచ్చినట్లయిందంటున్నారు. విశాఖ మెట్రోకు అయిదు సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. త్వరలో దీనికి సంస్థను ఎంపిక చేసి ఒప్పందం చేసుకోనున్నారు. విశాఖ మెట్రో కంటే ముందే ప్రారంభం కావాల్సిన విజయవాడ మెట్రో పలు మలుపులు తిరుగుతోంది.

నివేదిక తర్వాతే నిర్ణయం..! 
విజయవాడ జనాభా తక్కువగా ఉండటం, రవాణా రద్దీ లేకపోవడం ప్రధాన ఆటంకంగా చెబుతున్నారు. అమరావతి నగరానికి మెట్రో ప్రాజెక్టు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉంది. భవిష్యత్తులో రాజధాని నగరంగా పెరిగి ప్రపంచంలోనే మేటిగా రూపుదిద్దాలనే సంకల్పం తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి లైట్‌ మెట్రో డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత పీపీపీ పద్ధతిలో సంస్థలు ముందుకు వస్తే నిర్మాణం చేపట్టే అవకాశం ఉందంటున్నారు. కొంత ప్రభుత్వం నిధులు భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అసలు మెట్రో కథ కంచికి చేరి.. తేలికపాటి మెట్రో తెరమీదకు వచ్చిన తర్వాతే నగరప్రజల్లో దీనిపై అనుమానాలు పెరిగాయి. కేంద్ర బడ్జెట్‌లో విజయవాడ మెట్రో ఊసే లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడినట్లయింది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న లైట్‌ మెట్రోలో బందరు కారిడార్‌ పెనమలూరు వరకు ఉంటుంది. ఏలూరు రోడ్డులో కారిడార్‌ నిడమానూరుకు బదులుగా గన్నవరం వరకు పొడగించనున్నారు. మరో కారిడార్‌ పీఎన్‌బీ నుంచి జక్కంపూడి వరకు వెళ్లనుంది.  నాలుగో కారిడార్‌ కృష్ణా కాలువ జంక్షన్‌ వరకు గుంటూరు జిల్లాలో నిర్మాణం చేయనున్నారు. దాదాపు నాలుగు కారిడార్లు 42 కిలోమీటర్లు వరకు ఉంటుంది.

సిస్ట్రా-రైట్స్‌ సంస్థకు డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతలను జర్మనీలో కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ అప్పగించదని మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దశలవారీగా సంస్థ ప్రతినిధులు విజయవాడకు రానున్నారని, ఫ్రాన్సు, జర్మనీలోనూ ఆ సంస్థ ఉద్యోగులు ఉంటారని తెలిపారు. నాలుగు నెలల్లో నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.

Link to comment
Share on other sites

 మెట్రో డీపీఆర్‌ ప్రక్రియ ప్రారంభం
01-03-2018 07:36:41
 
636554866005046578.jpg
  • ప్రక్రియ ప్రారంభం
  • ట్రాఫిక్‌ సర్వే చేపట్టిన శిస్ట్రా టీమ్‌
  • ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డితో భేటీ
  • 6న మరో బృందం
 
విజయవాడ: నగరానికి ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ పనులను శిస్ట్రా సంస్థ ప్రారంభించింది. తొలి విడత బృందం విజయవాడకు బుధవారం వచ్చి పని ప్రారంభించింది. నగరాన్ని అమరావతి రాజధానితో అనుసంధానించేలా ట్రాఫిక్‌ సర్వే పనులు ప్రారంభించింది. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఇచ్చిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎ్‌ఫపీ) ప్రకారం ప్రతిపాదిత 1.ఎయిర్‌పోర్టు-విజయవాడ, 2.కారల్‌ మార్సు రోడ్డు, 3.ఎంజీ రోడ్డు, 4.పీఎన్‌బీఎ్‌స-కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, 5.విజయవాడ- జక్కంపూడి కారిడార్లను టీమ్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక అవగాహనకు వచ్చింది.
 
   ఈ టీమ్‌కు శిస్ట్రా నుంచి ఠాగూర్‌, శిస్ట్రా ఇండియా నుంచి సిడ్డిభా, రైట్స్‌ నుంచి నమీత్‌కుమార్‌ పాల్గొన్నారు. విజయవాడకు రావడంతోనే అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డితో టీమ్‌ భేటీ అయింది. లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ ఎలా ఉండాలో ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించాలన్నారు. మీడియం మెట్రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పుడు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ డీపీఆర్‌ రూపకల్పన చేయించి నట్లు తెలిపారు. అప్పటి డీపీఆర్‌ విశేషాలను వివరించడంతో పాటు అందులోని లోపాలను కూడా టీమ్‌కు వివరించారు. లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు వీలైనంత వరకు ప్రైవేట్‌ స్థలాలు పోకుండా చూడాలని సూచించారు.
 
   ఆర్‌ఎఫ్‌డీలో పొందుపర్చిన ప్రతిపాదిత కారిడార్‌లే కాక అవసరమైన వాటిని కూడా సూచించాల్సిందిగా తెలిపారు. సమావేశం అనంతరం శిస్ట్రా టీమ్‌ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ట్రాఫిక్‌ సర్వే ద్వారా మెట్రో వయబిలిటీ ఉన్న కారిడార్లకు అంచనా వేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ సర్వే తర్వాత పాసెండర్‌ సర్వే చేపడతారు. ఈ సర్వేలో భాగంగా నిర్ణీత రూట్ల లో ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారు. డీపీఆర్‌ను ఆరునెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నందున వేగంగా పనులు చేపట్టడానికి శిస్ట్రా సిద్ధమౌతోంది. మార్చి ఆరో తేదీన శిస్ట్రా రెండో బృందం విజయవాడ వచ్చి పని ప్రారంభిస్తుంది.
Link to comment
Share on other sites

లైట్‌ మెట్రోకు రైట్‌ 
విజయవాడకు చేరుకున్న సిస్ట్రా బృందం 
amr-top2a.jpg

ఈనాడు, విజయవాడ: విజయవాడలో తేలికపాటి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. సవివర నివేదిక రూపొందించేందుకు సిస్ట్రా-రైట్స్‌ సంస్థ గుత్త దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల ప్రతినిధులు బుధవారంనాడు విజయవాడకు చేరుకున్నారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం నగరంలో నిర్మించే కారిడార్‌ ప్రాంతాలను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు సాధ్యం కాదని తేలడం, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కొత్త విధానంలో ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టాలని సూచించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్న విషయం తెలిసిందే. 
మెట్రో స్థానంలోనే ఎలివేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని నిర్ణయించారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ మలేషియా, చైనా దేశాల్లో పర్యటించింది. చివరికి లైట్‌మెట్రో సరైనదని తేల్చారు. ఆ రంగంలో నిపుణులైన జర్మనీకి చెందిన డాట్సన్‌ విజయవాడలో 15 రోజులపాటు అధ్యయనం చేసి లైట్‌మెట్రో సరైనదేనని సిఫార్సు చేసి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు జర్మనీ, ఫ్రాన్సు దేశాలకు చెందిన కెఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డబ్ల్యూ సంస్థలు ఏఎంఆర్‌సీతో కలిసి నోటిఫికేషన్‌ ఇచ్చాయి. ఈ సంస్థలు మెట్రోకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి డీపీఆర్‌ అందించనున్నాయి. బుధవారం 
సిస్ట్రా ఉప బృందనాయకుడు డాక్టర్‌ ఠాగూర్‌, రోలింగ్‌ స్టాక్‌ నిపుణులు సిద్ధిఖ్‌, రైట్స్‌ సంస్థ ప్రతినిధి నమిత్‌కుమార్‌లు విజయవాడ చేరుకున్నారు. ఏఎంఆర్‌సీ కార్యాలయంలో ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులను, పీఎన్‌బీ బస్టాండ్‌ ప్రాంతాలను పరిశీలించారు. పీఎన్‌బీ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్‌, పీఎన్‌బీ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్‌, పీఎన్‌బీ నుంచి జక్కంపూడివరకు మడో కారిడార్‌, పీఎన్‌బీ నుంచి కృష్ణా నది ఆవల వైపు కేసీ జంక్షన్‌ వరకు ఒక కారిడార్‌ నిర్మాణం చేసేందుకు పరిశీలిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విజయవాడలో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో..!
19-03-2018 08:05:32
 
636570435314933618.jpg
  • ఎయిర్‌పోర్ట్‌ వద్ద అరకిలోమీటర్‌ వరకు ఎలివేటెడ్‌ అసాధ్యం
  • అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణను దృష్టిలో ఉంచుకుని..
  • డీపీఆర్‌లో పొందుపరచనున్న ‘శిస్ర్టా’
  • కేసరపల్లిలో మెట్రో కోచ్‌ డిపో?
 
విజయవాడ: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు దగ్గర అండర్‌గ్రౌండ్‌ విధానంలో లైట్‌ మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి అడుగులు పడుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో ‘లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు’ను అనుసంధానం చేయాలని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) నిర్ణయించిన సంగతి తెలిసిం దే. దీనికి అనుగుణంగానే లైట్‌ మెట్రో డీపీఆర్‌ రూపకల్పనకు ముందుగానే ఏఎంఆర్‌సీ తన ఆర్‌ఎఫ్‌పీలో ఈ విషయా న్ని పొందుపరిచింది. దీనికి అనుగుణంగా లైట్‌ మెట్రో డీపీఆర్‌ బాధ్యతలు తీసుకున్న ‘శిస్ర్టా’ సంస్థ దీనిపైనే దృష్టి కేంద్రీ కరించింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తిగా ఎలివేటెడ్‌ విధానంలో ఉంటుంది. విజయవాడ ఎయిర్‌పోర్టు దగ్గర ఎలివేటెడ్‌ విధానాన్ని అనుమతించే అవకాశం ఉండదు. విజయవాడ ఎయిర్‌పోర్టు కొద్దికాలం కిందట అంతర్జాతీ య హోదాను సాధించింది. నూతనంగా ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌, కార్గో టెర్మినల్‌ ఇలా విస్తరణ జరుగుతూ వస్తోంది. తాజాగా ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కూడా బీజం పడుతోంది. ఇలా విమానాశ్రయ అధికారులు ఒక మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళుతున్నారు.
 
ఈ నేపథ్యంలో, విజయవాడ ఎయిర్‌పోర్టుకు, లైట్‌ మెట్రోను అను సంధానించే విషయంలో కూడా రెండు, మూడు దశాబ్దాల అవసరాల ప్రామాణికం గానే అడుగులు వేయనున్నారు. ఎయిర్‌ పోర్టు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వెళితేనే అనుసంధానించగలమని ఏఎంఆర్‌సీ అధికారులు కూడా భావిస్తున్నారు. రన్‌వేతో అనుసంధానం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం అంతర్జాతీయ టెర్మినల్‌, కార్గో టెర్మినల్‌, ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌లు మూడు వేర్వేరు చోట్ల ఉన్నాయి.
 
మరో ఏడాదిలో పనులు ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ కూడా మరో చోట ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
 
వీటిని దృష్టిలో ఉంచుకుని కామన్‌గా పాసెంజర్స్‌ ఒకేచోటకు వచ్చే ఏరియాను సృష్టించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది.
 
ఎలివేటెడ్‌ విధానంలో విమానా శ్రయ అధికారులు అంగీకరించే అవకాశం దాదాపుగా ఉండకపో వచ్చు. కాబట్టి అండర్‌ గ్రౌండ్‌ విధానంలో నిర్మించటమే సబబు అన్న భావనలో ఏఎంఆర్‌సీ అధికారులు ఉన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న శిస్ర్టా సంస్థ దీనిపైనే దృష్టి నిలిపినట్టు సమాచారం. ఎయిర్‌పోర్టుకు సంబంధించి దాదాపుగా అండర్‌ గ్రౌండ్‌ మెట్రోకే ప్రతిపాదించనున్నట్టు సమాచారం.
 
 
కేసరపల్లిలో లైట్‌ మెట్రో కోచ్‌ డిపో
లైట్‌ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను కేసరపల్లిలో ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు దగ్గరే కోచ్‌ డిపోను ఏర్పాటు చేయటం అసాధ్యమని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ఎగువున అంటే గన్నవరం వైపు పట్టణ ప్రాంతం ఉంది. ఇక్కడ భూములు దొరకటం కూడా సమస్యే. ఇంతకు ముందు మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైట్‌ మెట్రో కోసం 40 ఎకరాలు అయితే సరిపోతుందని ఏఎంఆర్‌సీ భావిస్తోంది. ఎయిర్‌పోర్టుకు అనుసంధానించే ప్రాంతంలోనే కోచ్‌ డిపో కూడా ఉండాలి కాబట్టి కేసరపల్లిలో కోచ్‌ డిపోను ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

కేసరపల్లిలో లైట్‌ మెట్రో కోచ్‌ డిపో
19-03-2018 07:22:13
 
636570409325713213.jpg
విజయవాడ: లైట్‌ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను కేసరపల్లిలో ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు దగ్గరే కోచ్‌ డిపోను ఏర్పాటు చేయటం అసాధ్యమని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ఎగువున అంటే గన్నవరం వైపు పట్టణ ప్రాంతం ఉంది. ఇక్కడ భూములు దొరకటం కూడా సమస్యే. ఇంతకు ముందు మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైట్‌ మెట్రో కోసం 40 ఎకరాలు అయితే సరిపోతుందని ఏఎంఆర్‌సీ భావిస్తోంది. ఎయిర్‌పోర్టుకు అనుసంధానించే ప్రాంతంలోనే కోచ్‌ డిపో కూడా ఉండాలి కాబట్టి కేసరపల్లిలో కోచ్‌ డిపోను ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

On 2/25/2018 at 8:02 PM, Kiran said:

Not a fan of light metro. Roads worst avuthai and on top manolla traffic sense ki expecting accidents 

దీనికి అనుగుణంగా లైట్‌ మెట్రో డీపీఆర్‌ బాధ్యతలు తీసుకున్న ‘శిస్ర్టా’ సంస్థ దీనిపైనే దృష్టి కేంద్రీ కరించింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తిగా ఎలివేటెడ్‌ విధానంలో ఉంటుంది

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...