Jump to content

visakapatanam Fintech


Guest Urban Legend

Recommended Posts

American startups show interest to invest in Fintech in Vizag: Chowdary

author-deafault.png Santosh Patnaik
VISAKHAPATNAM, September 15, 2018 23:25 IST
Updated: September 16, 2018 09:42 IST
 

‘Over 300 delegates attended roadshow held in the Bay Area of Falcon’

The efforts by the State government to transform Visakhapatnam into a fintech hub seem to have to have yielded an overwhelming response with several American investors, startups and incubators participating in the $1 Million Fintech Startup Challenge Contest.

Before heading for Tel Aviv in Israel for the fourth roadshow out of eight planned across the world, J.A. Chowdary, Special Chief Secretary and IT Adviser to Chief Minister, said the response was beyond their expectation and many had expressed their willingness to invest in Fintech Valley Vizag. After Tel Aviv, the roadshows will be conducted in Paris, London, Hong Kong and Bengaluru with an aim to bring the best startups to Vizag Fintech Festival being held from October 22 to 26.

Around 1,500 delegates from all over the world will attend the conference. The themes selected for the mega event include ‘banktech, insurtech, govttech, financial inclusion, and emergetech.’ The purpose of the challenge is to attract innovative startups to showcase their solutions and explore the opportunities available in the country in general and the State in particular.

Mr. Chowdary said over 300 delegates representing banks, corporates, startups and investors attended the roadshow held in the Bay Area of Falcon. The $1 Million Fintech Startup Challenge delegation consists of Veena Gundavelli, Special Representative of A.P. Government in the United States, A.P. Fintech CEO Dharmendra Sunkara and General Manager Aneesha Chowdary. Bizofit, leading innovation platform for enterprises and technology companies, organised the roadshow in Silicon Valley.

Over 30 short-listed startups pitched in the areas of fintech, agritech nd emergetech areas. The roadshow in Tel Aviv will be hed on September 16. The fintech festival will conclude with 25 finalists chosen from world-over pitching their solutions at the Demo Day on October 22.

Student hackathon

As a prelude to the big event, Fintech Student Hackathon will be conducted within the next few days. The final 36-hour hackathon will be organised here on October 20 and 21. The winners will be named on October 25.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
భారీ ప్రైజ్‌మనీతో విశాఖలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌
22న ప్రారంభం: అధికారులతో లోకేశ్‌ సమీక్ష
 

0606460910LOKESH-BRKKA.JPG

అమరావతి: ఈ నెల 22 నుంచి 26 వరకు విశాఖలో జరిగే ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌పై ఐటీ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.7కోట్ల భారీ ప్రైజ్ మనీతో ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 మంది వక్తలు, 2వేల మందికి పైగా వివిధ కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. అగ్రిటెక్, ఎమర్జ్ టెక్నాలజీస్, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఫిన్‌టెక్‌ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. ప్రతి రంగంలో ఉత్తమ టెక్నాలజీ, ఉత్తమ ఐడియాను ఎంపిక చేయనున్నారు. మూడు రంగాల్లోనూ మొదటి ప్రైజ్ మనీ రూ.కోటి కాగా, రెండో ప్రైజ్‌మనీ రూ.70 లక్షలు, మూడో ప్రైజ్‌మనీగా 25 మందికి రూ.7 లక్షలు, అలాగే మూడు రంగాల్లో 25 మందికి మూడో బహుమతి ఉండనుంది. విశాఖలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత మొదటి, రెండో బహుమతి అందజేయనుంది. దీంతో పెద్ద ఎత్తున స్టార్టప్‌ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం కలగనుంది. ఫిన్‌టెక్‌ ఛాలెంజ్ కోసం ఇప్పటికే ఏపీ ఫిన్‌టెక్‌ వ్యాలీ తరఫున ఎనిమిది దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ప్రసంగించనున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రూ.7 కోట్ల చాలెంజ్‌!
23-10-2018 03:04:07
 
636758606479409343.jpg
  •  నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు ఏపీ పెద్ద పీట
  •  పలు సంస్థలతో ఒప్పందాలకు రాష్ట్రం సిద్ధం
  •  నేడు విశాఖలో ఫిన్‌టెక్‌ ప్రారంభం
అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... విశాఖపట్నంలో మంగళవారం ప్రారంభంకానున్న ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ను అందుకు వేదికగా వినియోగించుకోనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ పాల్గొననున్నారు. అగ్రిటెక్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు భారీ నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఈ మూడు రంగాల్లో ప్రతిదానిలోనూ ఉత్తమ టెక్నాలజీ, ఉత్తమ ఆలోచనను ఎంపికచేస్తారు. ఒక్కో రంగంలోనూ మొదటి బహుమతి కింద కోటి రూపాయలు, రెండో బహుమతి కింద రూ.70లక్షలు ఇస్తారు. మరోవైపు మూడురంగాల్లోని వారికి కలిపి 25మందికి రూ.7లక్షల చొప్పున మూడో బహుమతిగా ఇవ్వనున్నారు. మొదటి, రెండో బహుమతులు గెలుచుకున్న కంపెనీలకు... విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఆ బహుమతి మొత్తాలను అందిస్తారు. మొత్తంగా ఈ బహుమతులన్నీ కలిపి రూ.7కోట్లు ఉండనున్నాయి.
 
ఈ సదస్సు కోసం 8 దేశాల్లో రోడ్‌ షో నిర్వహించి... పలు కంపెనీల సీఈవోలను ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండువేల కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. 75మంది ప్రసంగించనున్నారు. అదానీ గ్రూప్‌, విహబ్‌, ఎస్‌వోఎ్‌సఏ, ఆర్‌3, స్టేట్‌ స్ర్టీట్‌, ఒరాకిల్‌ కార్పొరేషన్‌, సెవన్త్‌ సెన్స్‌, ఏజీ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌, టీ08, ఫేస్‌బుక్‌, 1-బ్రిడ్జ్‌, కార్డిటిక్స్‌, వెల్స్‌ ఫార్గో, తత్రాస్‌ డేటా, టెక్‌ స్టార్స్‌ తదితర కంపెనీల ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ అవుతారు. పలు కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోనున్నారు. కాగా సదస్సుకు సన్నాహకంగా సోమవారం 40మంది సీఎక్స్‌వోల గోల్ఫ్‌ టోర్నమెంట్‌ జరిగింది.
 
ఏపీ పవర్‌హౌస్‌
గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ పరిశ్రమకు పవర్‌హౌ్‌సగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని కోర్‌ టీమ్‌ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీ అట్లూరి అన్నారు. విశాఖపట్నంలో ఫిన్‌టెక్‌ వ్యాలీ అభివృద్ధికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీల సీఈఓలతో కోర్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ బృందం సభ్యులతో సోమవారం రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
సోఫియా రాక అనుమానమే!
ప్రపంచంలో తొలి మానవ రోబో సోఫియా విశాఖపట్నం ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌ వచ్చినప్పుడు సోఫియాను తీసుకువచ్చారు. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో సోఫియాను తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ అధికారులు... సోఫియా సృష్టికర్తలైన హాన్సన్‌ రోబోటిక్స్‌ (హాంగ్‌కాంగ్‌) ప్రతినిధులతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారు. హాన్సన్‌ కంపెనీ దగ్గర 8 రోబోలు ఉన్నాయి. ఇక్కడికి పంపించాల్సిన రోబోకు సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని టెక్‌ సపోర్టర్‌కు వీసా రాలేదు.
Link to comment
Share on other sites

7 కోట్ల ఛాలెంజ్‌
ప్రపంచ ఫిన్‌టెక్‌ సంస్థలకు ఆహ్వానం
భారత హబ్‌గా విశాఖ
ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
‘సిలికాన్‌ కారిడార్‌’గా తిరుపతి, నెల్లూరు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ఘనంగా ‘వైజాగ్‌ పండగ’
23ap-main1a.jpg
సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గత రెండేళ్లుగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన గ్రామాలను ఎంపిక చేయగా రాష్ట్రానికి చెందిన గ్రామాలు 55శాతం అవార్డులను గెలుచుకున్నాయి
ఈనాడు, విశాఖపట్నం: ప్రపంచస్థాయి ఫిన్‌టెక్‌ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘వన్‌ మిలియన్‌ డాలర్‌ ఛాలెంజ్‌’ (రూ. 7 కోట్లు) పోటీలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భారత ఫిన్‌టెక్‌ హబ్‌గా, ప్రపంచంలోని అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న మొదటి మూడు ఫిన్‌టెక్‌ కేంద్రాల్లో ఒకటిగా విశాఖ రూపాంతరం చెందనుందని తెలిపారు.  మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘వైజాగ్‌ ఫిన్‌టెక్‌  పండుగ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ.టి. రంగ అభివృద్ధికి కృషి చేశానని... ప్రస్తుత పరిస్థితుల్లో ఫిన్‌టెక్‌ రంగానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును గుర్తించి ఆ రంగాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నానన్నారు. అమెరికా, సింగపూర్‌, హాంకాంగ్‌ తదితర కొన్ని దేశాలు మినహా ఇతర దేశాల్లో ఫిన్‌టెక్‌ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంతో పాటు ప్రపంచ ఫిన్‌టెక్‌ రంగానికి కేంద్ర బిందువులా ఉండేలా విశాఖలో విస్తృత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విశాఖలో ఇప్పటికే ఆరు పెద్ద ఫిన్‌టెక్‌ సంస్థలు, 70 వరకు అంకుర సంస్థలు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో మరో 75 సంస్థలు, రూ.500 కోట్ల పెట్టుబడి, 50వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. ప్రపంచంలోని పలు దేశాల వారు ఇక్కడ ఫిన్‌టెక్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మరోపక్క న్యాయ నగరం, క్రీడా నగరం, వినోద నగరం తదితర తొమ్మిది నగరాలతో అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలవనుందన్నారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి..
అన్ని రంగాల పరిశ్రమలు భారీ ఎత్తున అభివృద్ధి చెందడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచామని, కొత్త పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. చెన్నై, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలు ‘సిలికాన్‌ కారిడార్‌’గా మారాయని, దేశంలో తయారవుతున్న సెల్‌ఫోన్లలో 30శాతం ఈ ప్రాంతంలోనే తయారవుతున్నాయని గుర్తు చేశారు.

పది శాతం వృద్ధి రేటుతో..
‘గత నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రం 10.5శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి చెందింది. రానున్న రోజుల్లో వృద్ధి రేటు 15శాతం ఉండేలా పలు చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 76శాతం ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. ప్రతిరోజూ 15 లక్షల మంది నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నాం. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో ఐ.టి., సైబర్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్‌, స్టార్టప్‌ తదితర రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించి పారదర్శకంగా రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాం.

ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అధునాతన పరిజ్ఞానాల్ని వినియోగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పలు ఫిన్‌టెక్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని.. ఇజ్రాయెల్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాల అంకుర సంస్థలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయన్నారు. అదే సమయంలో ఏపీ సంస్థలు ఆయా దేశాల్లో అంకుర సంస్థలు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఐ.టి. సలహాదారు జె.ఎ.చౌదరి మాట్లాడుతూ రెండేళ్ల కాలంలోనే ఫిన్‌టెక్‌ రంగానికి విశాఖ కేంద్ర బిందువుగా మారిందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐ.టి.శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు. తిత్లీ తుపానులో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం నిమిషం పాటు మౌనం పాటించారు.

 
 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

విశాఖలో ఫిన్‌టెక్‌ రంగ వికాసం
23ap-main8a.jpg

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఫిన్‌టెక్‌ రంగం మున్ముందు మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయా ఒప్పందాల ప్రతులను మార్చుకున్నారు.

ఆ ఒప్పందాలివే..
* హెచ్‌.డి.ఎఫ్‌.సి.బ్యాంకు విశాఖలో ‘యాక్సెలరేటర్‌’ కార్యాలయాన్ని ప్రారంభించి అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, బ్యాంకింగ్‌ రంగ ఉత్పత్తుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
* డబ్ల్యు-హబ్‌ సంస్థ హాంకాంగ్‌లో ‘అంతర్జాతీయ ల్యాండింగ్‌ ప్యాడ్‌’ ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌ సంస్థలకు సహకారం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
* సోసా అనే సంస్థ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్‌లో ల్యాండింగ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేయనుంది. సోసా సంస్థ విస్తృత యంత్రాంగం నుంచి ప్రయోజనాలు పొందడంతోపాటు మన రాష్ట్ర సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు సాగించడానికీ సహకరించనుంది.
* సింగ్‌ఎక్స్‌ సంస్థ రాష్ట్రంలో పలు అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
* వాద్వాని, ఉద్యమ్‌ సంస్థలు అంకుర సంస్థలకు అవసరమైన సేవలు, శిక్షణ అందించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
* హాంకాంగ్‌ ఫిన్‌టెక్‌ సంఘం విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీ అధికారులతో ఒప్పందం చేసుకుంది.
* విశాఖలో ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్మాణానికి అవసరమైన సేవలను బైజోఫోర్స్‌ సంస్థ రాష్ట్రప్రభుత్వ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
* విశాఖ ఫిన్‌టెక్‌ రంగంలో రెండువేల ఉద్యోగాలు కల్పించేలా డెస్టినేషన్‌ జాబ్స్‌ సంస్థ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
* యు.కె.కు చెందిన అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ ‘ఛార్టడ్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’(సి.ఐ.ఎస్‌.ఐ.) తరపున పలు కోర్సుల నిర్వహణకు, వివిధ కోర్సుల్లో నిపుణుల తయారీకి గీతం విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

లాంఛనంగా ప్రారంభాలు....
విశాఖలో కార్డ్‌లిటిక్స్‌ దశలవారీగా 350 ఉద్యోగాలు, ఫెడరల్‌ బ్యాంకు 600 ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఆయా సంస్థలు ఫిన్‌టెక్‌ కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాయి. డి.ఎక్స్‌.సి. అనంతపురంలో కార్యకలాపాల్ని ప్రారంభించినట్లు, రానున్న రోజుల్లో యువతకు ఇంటి వద్దే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. డెలాయిట్‌, ఫస్ట్‌ అమెరికన్‌ కార్పొరేషన్‌ సంస్థల ప్రతినిధులూ తమ కార్యకలాపాల్ని ప్రారంభించినట్లు ప్రకటించారు.


ఐదేళ్లలోపే డిజిటల్‌ భారత్‌
ఆన్‌లైన్‌ లావాదేవీలకు ప్రజలు అలవాటుపడతారు
ఫిన్‌టెక్‌ ఉత్సవంలో బ్యాంకింగ్‌ రంగ ఉన్నతాధికారుల ఆశాభావం

ఈనాడు, విశాఖపట్నం: డిజిటల్‌ భారత్‌ ఆవిర్భావం త్వరలోనే సుసాధ్యమవుతుందని, రానున్న మూడు నుంచి అయిదేళ్లలోనే ప్రజలందరూ ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలకు అలవాటు పడతారని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు ఆశాభావం ప్రకటించారు. విశాఖలో ఫిన్‌టెక్‌ ఉత్సవంలో భాగంగా మంగళవారం బ్యాంకింగ్‌ రంగ నిపుణులతో ఆన్‌లైన్‌ నగదు వ్యవహారాలు, సమాజంపై ప్రభావం అంశాలపై చర్చ నిర్వహించారు. టేలంట్‌ స్ప్రింట్‌ సీఈవో సాంతన్‌ పాల్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ట్రాయ్‌ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ, ద ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సీఎండీ ఏవీ గిరిజాకుమార్‌, హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్మితాభగత్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపాల్‌సింగ్‌ గుసైన్‌, ఎస్‌ బ్యాంకు అడిషనల్‌(నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ మాట్లాడారు. చైనా పదేళ్ల కిందటే డిజిటలీకరణ బాట పట్టిందని, ఇపుడక్కడ 90శాతం నగదు వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్నారు.

ఆధార్‌ అనుసంధాన నగదు వ్యవహారాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలుండేవని, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో వ్యక్తిగత వివరాలకు భద్రత ఉందని నమ్ముతూ కేవైసీ ఇస్తున్నారన్నారు. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరమన్నారు. ప్రత్యేకించి పట్టణాలు, గ్రామీణ ప్రజల్లో నగదు పొదుపు, బీమా ఆవశ్యకతలపై చైతన్యం తేవాలన్నారు. అప్పుడే సుసంపన్న భారత్‌ సాధ్యమన్నారు. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఛైర్మన్‌ గిరిజాకుమార్‌ మాట్లాడుతూ డిజిటలీకరణ తరువాత బీమా రంగంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. గతంలో బీమా చేసిన వాహనం ప్రమాదానికి గురైతే క్లెయిమ్‌కు చాలా సమయం పట్టేదని, ఇప్పుడు ఇంటి దగ్గర్నుంచే ఒక చిత్రం తీసి సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. ఆయుష్మాన్‌భవ బీమా పథకం ఎంతో ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ట్రాయ్‌ ఛైర్మన్‌ శర్మ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ చెల్లింపులకు ప్రజలు అలవాటు పడడానికి కాలపరిమితిని చెప్పలేమన్నారు.

Link to comment
Share on other sites

ఏపీలోనే ఫిన్‌టెక్‌ పెట్టుబడులు
24-10-2018 04:00:24
 
636759504246574534.jpg
‘దేశంలో ఏ రాష్ట్రమూ ఫిన్‌టెక్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఈ విషయంలో ముందుంది’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల ఏపీ కూడా ఒక స్టార్ట్‌పలాగే అభివృద్ధి సాధిస్తోందని ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ‘వ్యాపార నమూనాలు మారిపోతున్నాయి. వాటిని యువత అందిపుచ్చుకోవాలి. ఓలా, ఓయో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలే దీనికి ఉదాహరణలు. తర్వాతి తరం టెక్నాలజీ అంతా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించినదే. అందుకే ఫిన్‌టెక్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. 1.ఓ నుంచి 2.ఓకి వైజాగ్‌ ఫిన్‌టెక్‌ వ్యాలీ అభివృద్ధి సాధించింది’ అని లోకేశ్‌ వివరించారు.
 
-
Link to comment
Share on other sites

ఫిన్‌టెక్‌’ ద్వారా 50 వేల ఉద్యోగాలు
24-10-2018 02:45:11
 
636759459124200549.jpg
  • ఏడాదిలో 500 కోట్లతో 75 కంపెనీలు
  • ఇన్నోవేషన్‌ వ్యాలీగా విశాఖ
  • దేశానికే కేంద్రంగా మారుస్తాం
  • ఏటా మిలియన్‌ డాలర్‌ చాలెంజ్‌
  • ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో సీఎం చంద్రబాబు
  • పాలనపై 76% మంది సంతృప్తి
  • విశాఖలో మూడ్రోజులుంటే ఒత్తిళ్లు దూరం
విశాఖపట్నం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఫిన్‌టెక్‌ కంపెనీల ద్వారా ఏడాదిలో 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, విశాఖపట్నాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్ది.. ప్రపంచంలో మొదటి మూడు నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ, మీడియా సమావేశంలోనూ సీఎం మాట్లాడారు. ఏడాదిలో 75 కొత్త కంపెనీల ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు సాధిస్తామని ఆయన చెప్పారు. ‘ఐటీ రంగంలో అభివృద్ధికి కొంతవరకే పరిమితి ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల్లో అభివృద్ధికి అంతం లేదు. అందుకే ఆ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఫిన్‌టెక్‌కు అవసరమైన వాతావరణం విశాఖలో కల్పిస్తాం. భారతదేశానికే కేంద్రంగా మారుస్తాం’ అని సీఎం చెప్పారు.
 
ఎలక్ర్టానిక్‌, హార్డ్‌వేర్‌ క్లస్టర్‌గా తిరుపతి-చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఆ రెండు నగరాల మధ్య మూడు విమానాశ్రయాలు, రెండు పోర్టులు, జాతీయ రహదారి, రైలు మార్గం, నీరు, విద్యుత్‌ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని అమరావతిలో కేవలం భూ రికార్డుల భద్రతకే పరిమితం చేయలేదని, అన్ని ప్రభుత్వ శాఖల్లోను వినియోగిస్తున్నామన్నారు.
 
హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీగానీ, అక్కడికి అంతర్జాతీయ విమానాలుగానీ ఒక్క రోజులో రాలేదని, ఎంతో శ్రమిస్తేనే అవన్నీ సమకూరాయని, విశాఖలో కూడా ఆ విధంగానే ఫిన్‌టెక్‌ కంపెనీలకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘ఎక్కడ ఎటువంటి కొత్త ఆవిష్కరణ జరిగినా అది ఆంధ్రప్రదేశ్‌ నుంచే రావాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతిని నాలెడ్జ్‌ ఎకానమి హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల సంతృప్తే అంతిమ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో తొమ్మిది నగరాలను అభివృద్ధి చేసి.. ప్రపంచంలో మొదటి ఐదు రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం. తిరుపతిని ఉత్తమ ఉద్యోగ అవకాశాల జోన్‌గా మార్చాం. రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చాం. ప్రతి సమస్యను నమోదు చేసి పరిష్కారం చూపిస్తాం. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ తర్వాత రియల్‌ టైమ్‌ సిటిజన్‌ మానిటరింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం’ అని సీఎం చెప్పారు.
 
ప్రజల్లో 76% సంతృప్తి వ్యక్తమైందని, దానిని 90-95 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తునామన్నారు. ‘ఇకపై ఏటా మిలియన్‌ డాలర్‌ చాలెంజ్‌ పోటీలు నిర్వహిస్తాం. ప్రపంచంలో తొలి మానవ రోబో సోఫియా విశాఖపట్నం తప్పకుండా వస్తుంది. అక్కడ మెషీన్‌ లోపం లేదు. దానిని నడిపించే వ్యక్తికి సమస్య ఏర్పడడం వల్లే సోఫియా అనుకున్న సమయానికి ఇక్కడికి రాలేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. గత నాలుగేళ్లలో 10.5% అభివృద్ధి సాధించాం. దీనిని 15 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.
 
విశాఖ చాలా అందమైన నగరమని, నెలకు మూడు రోజులు ఇక్కడికి వచ్చి ఉంటే అన్ని రకాల ఒత్తిళ్లు పోతాయని సీఎం పేర్కొన్నారు. అంతకు ముందు ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విజయానంద్‌, ఐటీ సలహాదారు జేఏ చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాయ్‌ చైర్మన్‌ శర్మ, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
ఫిన్‌టెక్‌’కు బజాజ్‌ దన్ను
10-01-2019 02:48:59
 
  • సీఐఐ-ఏపీ ఫిన్‌టెక్‌ వ్యాలీ మధ్య ఒప్పందం
  • లోకేశ్‌తో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ ప్రత్యేక భేటీ
  • ఆర్టీజీఎస్‌ అద్భుతంగా ఉందని కితాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ‘ఫిన్‌టెక్‌’ రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఎండీ, సీఐఐ బీమా, పింఛన్ల విభాగం చైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌ చెప్పారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంతో ఇన్ని కార్యక్రమాలు, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అమలు చేయడం తాను మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఐటీ మంత్రి లోకేశ్‌తో సంజీవ్‌ బజాజ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ సమక్షంలో సీఐఐ, ఏపీ ఫిన్‌టెక్‌ వ్యాలీ మధ్య ఒప్పందం జరిగింది. ఆర్బీఐ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఫైనాన్స్‌ వ్యవస్థలు, ఫైనాన్స్‌ రంగంలో ఉన్న కంపెనీలతో సీఐఐ త్వరలో సమన్వయ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సంజీవ్‌ బజాజ్‌ తెలిపారు.
 
మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, సిటీ ఆఫ్‌ లండన్‌ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ఫిన్‌టెక్‌ రంగం అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘విశాఖ ఫిన్‌టెక్‌ హబ్‌గా మారుతోంది. ఫిన్‌టెక్‌ కంపెనీలు ఏపీకి వచ్చే విధంగా యూజ్‌ కేస్‌ రిపాజిటరీ ఏర్పాటు చేశాం. అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ.. కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి మా ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోంది. భూరికార్డులను డిజిటల్‌ రూపంలో తీసుకొచ్చి.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నాం. విశాఖలో ఇప్పటికే 25 ఫిన్‌టెక్‌ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి’ అని లోకేశ్‌ తెలిపారు.
 
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో నంబర్‌ వన్‌గా ఉందన్నారు. దేశంలో అతి పెద్ద రెండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకే వచ్చాయని వివరించారు. లోకేశ్‌తో కలిసి సంజీవ్‌ ఆర్టీజీఎస్‌ సెంటర్‌ను సందర్శించారు. వివిధ టెక్నాలజీల అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆర్టీజీఎస్‌ అమలు చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమాలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పోలవరంతో సహా వివిధ కీలక ప్రాజెక్టులను ఆర్టీజీఎస్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం, వివిధ కార్యక్రమాల అమలుపై ప్రజల సంతోష సూచిక ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, సర్టిఫికెట్‌లెస్‌ గవర్నెన్స్‌ అమలు చెయ్యాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...