Jump to content

ఏంట్రా… ఆంధ్రోడి గొప్ప ?


Recommended Posts

ఏమప్పా అని మొదలుపెట్టేందుకు వీడికి ట్రేడ్ మార్క్ పలకరింపు లేదు. లుంగీకట్టుకొని ఇదీ నా స్పెషాలిటీ అనీ కనిపించడు. ఇంటిముందు కొబ్బరి నూనె దీపం వెలిగించి సెంటిమెంట్ నూ చాటుకోడు ! మరి దక్షిణాదిలో… ఆ మాటకొస్తే హోలిండియాలో ఆంధ్రోడి మార్కేది ? వీడి స్పెషాలిటీ ఏంటి ? ఆంధ్రోడు ఓ జ్వలించే కణం. ఎనర్జీ వీడి గుణం. అందుకే సవాళ్ల కొలిమిలో రగిలిపోతున్న నీ సోల్ ని కన్సోల్ చేస్తుంది వాయిస్ ఆఫ్ ఆంధ్రా !

 

ఎవరెస్ట్ ఎందుకు ఎక్కావ్ రా అని అడిగితే…అంతకంటే ఎత్తు ఇంకేం లేదుగా అందుకే – అన్నాడొక ఇండియన్ ! నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంటరీలో ఇది పంచ్ బైట్ ! అన్నది ఆంధ్రోడు ! విన్నది ఈ ప్రపంచం అంతా! ఆంధ్రోడి కసి ఏంటో.. వాడి దెబ్బేంటో చెప్పడానికి ఇదొక్కటి చాలు. గత ఆర్నెల్లుగా 38 మంది ఆంధ్రోళ్లు ఎవరెస్ట్ పై జెండా పాతారు ! ఓ నాన్ నేపాల్ ప్రాంతం నుంచి ఇంత మంది శిఖరారోహణ చేయడం ఓ రికార్డ్ ! అందుకే హయ్యెస్ట్ మన టార్గెట్. ఆకాశమే మన లిమిట్ !

 

వీడు శూన్యంలోకి చూసే తాత్వికుడు కాదు. రాళ్లూగీళ్లంటూ వాదించే నాస్తికుడూ కాదు. సౌమ్యంగా ఉండిపోయే సాత్వికుడు అంతకన్నా కాదు. వీడొక స్పెషల్ ష్పీషెస్. చైనావోడి పనితీరును… కొరియావోడి ఇన్నొవేషన్ కలిపి… జర్మనీ టెక్నాలజీ మిక్స్ చేసి… స్కాండినేవియన్ మైండ్ సెట్ తో అమెరికా లాగా ఆలోచిస్తాడేమో ఆంధ్రోడు ! అందుకే, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే… కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద నగరాన్ని నిర్మిస్తున్న రాష్ట్రం ఏపీ – అని రాతని తిరగరాసిన మొనగాడు ఆంధ్రోడు. మా తీరం అవకాశాల ద్వారం అంటూ కొత్త తలుపు తెరిచాడు. రారండోయ్ వేడుక చేద్దాం అంటూ యాపిల్, మైక్రోసాఫ్ట్ లను పిలిచాడు. గెంటినోళ్లే గోలెత్తిపోయేలా తలెత్తి నిలబడుతున్నాడు.

ఇది ఆంధ్రోడి తడాఖా !

 

 

 

ఆంధ్రోడు పనిమంతుడు. కాకపోవడానికి కారణాలు చెప్పడు. అవడానికి అవకాశాలు వెదుకుతాడు. ఆంధ్రోడు నిగ్గ దీస్తాడు. నెగ్గుతాడు. గుండెలు బాదుకోవడం వీడికి అలవాటు లేదు ! చెప్పుడు మాటలు వినడు. గుండె చప్పుడుని మాత్రమే ఫాలో అవుతాడు. సవాళ్లని సవాల్ చేయడం వీడి నైజం. కుంగదీసే మైనస్ లను కుళ్లబొడిచి లొంగదీస్తాడు.

అణుబాంబు వేయాలంటే ఆర్భాటం చేయక్కర్లేదబ్బా ! బటన్ నొక్కితే చాలు అన్నట్టుగా ఉంటుంది వీడి నేచర్ ! ఫ్రిక్షన్ వీడి డిక్షనరీలో మొదటి పదం. ఎక్కడున్నా అది సృష్టించి తీరుతాడు. అగ్గిపుట్టినట్టు ఆలోచన రగిలేది అక్కడి నుంచే ! వీడు ప్రాక్టికాలిటీలో జీవిస్తాడు. ప్రపంచాన్ని జయిస్తాడు.

 

ఇన్ని మాటలు కాదు. ఆంధ్రోడు యాంబీషియస్. అద్భుతాలు చూసి బుగ్గలు నొక్కుకొని ఆగిపోడు. అందుకుంటాడు. ఇంకా మీరితే, మించిపోయి చూపిస్తాడు. అందుకే వందకోట్ల మార్కెట్ తెలియని సినిమా ఇప్పుడు 2000 మార్క్ ని అమాంతం అందుకుంటుంది. కనీస నగరం  కూడా లేని రాష్ట్రం ప్రపంచానికే నగ లాంటి అమరావతిని సిద్ధం చేస్తోంది. నేషనల్ గేమ్స్ లోనే మనమెక్కడ అని భూతద్దంలో వెదుక్కునే వాళ్లకి ఒలింపిక్ సిల్వర్ వచ్చి వాలింది. ఎందుకంటే మన లెవెల్ కింగ్ సైజ్ ! మవం వేసే ప్రతీ అడుగూ లైఫ్ సైజ్ ! అందుకే ఇది వాయిస్ ఆఫ్ ఆంధ్రా !

 


 

Link to comment
Share on other sites

కుంగదీసే మైనస్ లను కుళ్లబొడిచి లొంగదీస్తాడు

 

వీడు ప్రాక్టికాలిటీలో జీవిస్తాడు. ప్రపంచాన్ని జయిస్తాడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...