Jump to content

అసలు వైఎస్ వచ్చాక తిరుమలలో ఏం జరిగిందంటే..


Recommended Posts

76578598575.jpg

జగన్ బ్యాచ్ ఈ మధ్యకాలంలో అఫెన్స్ తగ్గించి డిఫెన్స్ లో పడింది. అడ్డగోలుగా మాట్లాడ్డం తగ్గించి.. అప్పుడు అంటిన మచ్చలను తుడుచుకునే పనిలో పడింది.. అందులో భాగంగానే తిరుమలలో వైఎస్ అన్యాయం చేయలేదు.. ఆయనే ఆద్భుతంగా అభివృద్ధి చేశాడంటూ.. దరువు వేయడం మొదలు పెట్టారు. ఏడుకొండలు వెంకటేశుడివే.. అంటూ జీవో తెచ్చామని.. అన్యమత ప్రచారం చేయకుండా చట్టం తెచ్చామని అడ్డగోలు వాదన తెస్తున్నారు… అసలు వైఎస్ వచ్చాక తిరుమలలో ఏం జరిగిందంటే..

అసలు దేవుడంటేనే నమ్మకం లేదని.. విగ్రహాలను చెప్పుతో కూడతానంటూ.. వీరంగాలాడిన సూడో కమ్యునిస్టు…కరుణాకరరెడ్డిని ఛైర్మన్ గా చేశాడు. ఇక ఆయన ఆడిన ఆటలు అన్నీ కావు.. ఒక్కసారిగా.. నిలువుబొట్టు పెట్టి.. ఆధ్యాత్మికతకే.. అసలు రూపం అన్నట్లు.. అవతరించాడు. తిరుమలలో ఉన్న పకడ్బందీ అడ్మినిస్ట్రేషన్ ను సర్వనాశనం చేశారు. వైఎస్, భూమన రాకముందు.. ఎవరైనా.. తెలిసిన వారికి.. సిఫారుసులతో దర్శనాలు మాత్రమే చేసేవారు.. వీరొచ్చాక.. మొత్తం వ్యాపారంగా మార్చారు. వైఎస్ చేసిన మరో ఘనకార్యం.. అసలు జెఈవోగా అర్హతలేని.. వేరే రాష్ట్రానికి చెందిన IAS కాని సివిల్ సర్వీస్ అధికారిని తెచ్చి.. తిరుమలలో కూర్చోబెట్టారు.. వాళ్లిద్దరూ చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు.. వీళ్ల హయాంలో ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్మేశారు. స్వయంగా కరుణాకరరెడ్డి ఇంట్లో నుంచే టికెట్లు అమ్ముతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీ ఛైర్మన్ కాకముందు…ఆర్థిక ఇబ్బందులతో రైళ్లలో ప్రయాణించిన కరుణాకరరెడ్డి.. ఆ తర్వాత… కాలు కిందపెట్టింది లేదు. కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయి…? కరుణాకరరెడ్డి ప్రాపకం ఎంత వరకూ వెళ్లిందంటే.. ఆయన మోకాలు ఆపరేషన్ కోసం.. ముంబయ్.. బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళితే.. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఆసుపత్రి వరకూ.. ఓ కార్పోరేట్ సంస్థ.. హెలికాఫ్టర్ ఏర్పాటు చేసింది. మహద్వారం ఉల్లంఘనలు లెక్కేలేదు. ఊరూ పేరూ లేని స్వామీజీలకు మఠాల కోసం… తిరుమలలో స్థలాలు ఇచ్చారు. వీఐపీల కాటేజీలకు ఇష్టం వచ్చినట్లు స్థలాలు ఇస్తున్నారని .. వాటిని హైకోర్టు నిలుపుదల చేసింది.. కరుణాకరరెడ్డి టైమ్ లో క్యూకాంప్లెక్స్ లలో భక్తుల కోసం.. 110ఇంచ్ ల పానాసానిక్ కలర్ టీవీలు పెట్టే విషయంలో 5కోట్ల కుంభకోణం జరిగింది. స్వామి వారిపై సీరియల్ తీస్తున్నామంటూ.. ఊరూ పేరులేని ఉత్తరాది నటులతో తీస్తే.. అంతా ఛీ అన్నారు… దానికి మూడుకోట్లు సమర్పించుకున్నారు.. ఇంతవరకూ ఆ సీరియల్ రానేలేదు. ఇక ప్రతి దానికి నోరేసుకుని అరిచే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి… సొంత వూరిలో తన సొంత గుడికి.. టీటీడీ నిధులు 50లక్షలు మళ్లించాడు.. వీళ్లందరూ ఇవాళ నీతులు వల్లె వేస్తున్నారు. టీటీడీ లో జరిగిన డాలర్ల కుంభకోణం జరిగింది కూడా.. కాంగ్రెస్ టైమ్ లోనే..‍‌! వ్యవస్థలను నాశనం చేసి.. సర్వభ్రష్టం చేసిన నాయకులు వీళ్లు.. అప్పట్లో లడ్డూల టోకెన్లు రీసైక్లింగ్, కల్యాణం టికెట్లు , సెల్లారు టికెట్లు బ్లాకులో అమ్ముకున్నట్లు రెండు రోజులకో వార్త పేపర్లో వచ్చేది.. ఇప్పుడు అవన్నీ పోయాయి. వీళ్ల పరిస్థితి ఎంత దారుణమంటే సాక్షాత్తూ బోర్జు మెంబర్లే టికెట్లు అమ్ముకున్నారని వాళ్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది.

 

ఇక… వైఎస్ అన్నీ కొండలూ స్వామివే అంటూ.. జీవో తెచ్చారని.. జఫ్ఫాలు “దరువు” వేస్తున్నారు. వినేవాడండాలే కానీ.. ఆనందనిలయానికి స్వర్ణతాపడం చేయించింది మా మేతేనని చెబుతారు వీళ్లు..! వీళ్లు జీవో తెచ్చామని చెబుతున్నారు కానీ అసలు ఆ జీవో ఎందుకు తేవాల్సి వచ్చిందో తెలుసా..? ఈ జీవో కంటే ముందే తిరుమల పరిధిని తగ్గిస్తూ.. మరో జీవో ఇచ్చారు. దానిపై గగ్గోలు రేగింది.. దేశంలోని స్వామీజీలందరూ ఆందోళన చేశారు. తిరుమల పరిరక్షణ సమితి పేరుతో ఓ కమిటీ ఏర్పాటైంది. హిందూ ధార్మిక వాదులు, స్వామీజీలు, పీఠాధిపతులంతా.. తిరుపతి తరలివచ్చి.. అలిపిరి దగ్గర భారీ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత.. వేలాది మంది కాలినడకన కొండకు వెళ్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దానికి దడిచి.. ఏడు కొండలు స్వామివే అని తర్వాత జీవో ఇచ్చారు. అసలు కొండలు సంగతి పక్కన పెడితే… కొండలపై ఎర్రచందనం చెట్లని కొట్టేసింది ఈ బ్యాచే కదా..?
అన్యమతప్రచారం చట్టం తీసుకొచ్చింది.. వైఎస్సేనంట..!? అసలు వైఎస్ రాకముందు ఆ చట్టం అవసరం రాష్ట్రంలో రాలేదు. వీళ్లు వచ్చాకనే.. తిరుమలలో విచ్చలివిడిగా.. ఇతర మతస్థుల ప్రచారం జరిగింది. వేరే ప్రార్థనలు చేస్తున్న అనేక మందిని విజిలెన్స్ వాళ్లు పట్టుకున్నారు.. ఇక తిరుమలలో జీఎన్ సీ టోల్ గేట్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకూ.. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయదలచిన స్థంభాలు శిలువ ఆకారంలో ఉన్నాయంటూ.. గగ్గ్గోలు రేగింది. అలిపిరి వద్ద పెద్ద గొడవే చెలరేగింది. దాంతో ఆ స్థంభాలను పక్కన పెట్టారు.. ఈ గొడవలన్నీ చెలరేగాక.. అన్యమత ప్రచార నిషేధం చట్టం తెచ్చారు. అంతే కానీ.. వీళ్లేం మతో్ద్ధారకులు కాదు. ఒంటికి పూసుకున్న మసికి సున్నం కొట్టుకునే.. చిల్లర చేష్టలు ఇవి..!

ఇక వీళ్లన్నియ్య జగన్ గురించి చెప్పాలి.. తిరుమలలో రాజకీయ ప్రచారం నిషేధం.. కనీసం పార్టీ జెండా కూడా కనిపించకూడదు.. కానీ వెఎస్ అధికారంలోకి వచ్చాక.. 2006లో జగన్ బాబు తిరుమల వచ్చారని.. ఆ పార్టీ కార్యకర్తలు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. కొండపైన బాలాజీ నగర్ లో టపాసులు పేల్చి.. కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఊరేగింపులు చేశారు. ఇక ఆయన మందీ మార్బలాన్ని వెంటేసుకుని.. చెప్పులు కూడా తీయకుండా.. వైకుంఠం కాంప్లెక్స్ లోకి వచ్చిన విషయం.. అప్పట్లో అందరికీ తెలుసు.. ఒకటి కాదు.. రెండు కాదు.. బయటకు తీస్తే.. చిట్టా చాంతాడంత ఉంటుంది..

తిరుమలను అద్భుతంగా అభివృద్ధి చేశారంట…తిరుమలలో అభివృద్ధి ఏదన్నా జరిగిందంటే.. అది తెలుగుదేశం ముఖ్యమంత్రుల టైమ్ లోనే అన్న విషయం బాండ్ పేపర్ మీద రాసివ్వొచ్చు. ఎన్టీఆర్ టైమ్ లో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి.. మిరాశీ వ్యవస్థను రద్దుచేయడం.. అన్నదానాన్ని అందరికీ వర్తింపజేయడం.. వివాదాలు లేని పాలకమండళ్లు ఏర్పాటు చేయడం. వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక చంద్రబాబు టైమ్ లో టీటీడీ స్వరూపం మొత్తం మారిపోయింది. తిరుమలపై రాజకీయాలను పూర్తిగా తీసేశారు. స్వయంగా తాను ఆడంబరాలకు దూరంగా నిలిచి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్యూలైన్లలోనే స్వామిని దర్శంచుకున్నాడు. తిరుమల మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చిందే చంద్రబాబు అధికారంలో..! రాజకీయాలతో ఇబ్బంది అని… ఛైర్మన్ కూడా లేకుండా చేసి.. అజయ్ కల్లామ్ ను ఈవోను చేసి.. తిరుమల స్వామివారి సన్నిధికి ఓ రూపు తీసుకొచ్చారు. ఆలయం ముందు వరకూ ఉన్న దుకాణాలతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్న తిరువీధులు.. ప్రస్తుతం ఉన్న రూపుకు వచ్చాయంటే కారణం.. చంద్రబాబు డైరక్షన్ .. అజయ్ కల్లామ్ యాక్షన్ వల్లనే..! బర్డ్ , స్విమ్స్ అభివృద్ధి చెందింది చంద్రబాబు టైమ్ లో..! తిరుమల వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… టోకెన్ విధానం తీసుకొచ్చింది చంద్రబాబు.. సుదర్శనం పేరుతో ప్రతిజిల్లాలో కౌంటర్లు ఏర్పాటు చేయించింది చంద్రబాబు. అంతెందుకు … ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక.. అంతా సెట్ రైట్ గానే ఉంది. ఈ మూడేళ్లలో ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశి పాసులు అమ్ముకున్నారని కానీ.. తొక్కిసిలాట జరిగిందని కానీ.. వీఐపీల హవా పెరిగిపోయిందని కానీ.. ఎవన్నా ఇష్యూ అయిందా.. అది బాబు మార్క్ కమాండ్..! మీరేం చేశారో లోకం మొత్తం తెలుసు.. దాని గురించి ఇప్పుడెవరూ మాట్లాడ్డం లేదు కూడా..! అయిపోయిన ఇష్యూని మళ్లీ తెచ్చి….. ఉద్ధరించాం.. సంస్కరించాం.. అంటూ.. లేపి తన్నించుకోవద్దు.

Link to comment
Share on other sites

Intha corruption TTD lo YSR & Co chesthe why TDP government enquiry vesi arrest cheyyadu both Karunakar reddy & Chevi reddy ni?

 

Bro, Anni evidence unna emi cheyyaloka potundi Gali&Jagan ni Center kuda..inka manam Tirupati lo villa archakam meda LEGALLY how you can go?

 

Bhumana gadu Rajareddy jail lo rommate....veedu Radical anedi court lo veste emi cheyyagaluvu courts?

 

BHumana gadu "Anti god sahityam/books" naku baga istam nenu ave chadiva jail lo ani direct ga cheppukuntadu....malli naku a sahityam valle devudu ki daggara ayya ani next sentence lo covering istadu :)...

 

A JAFFA gallaki undali kani manam emi chestam....

Link to comment
Share on other sites

Bro, Anni evidence unna emi cheyyaloka potundi Gali&Jagan ni Center kuda..inka manam Tirupati lo villa archakam meda LEGALLY how you can go?

Big boss in Tirumala will take care of these idiots

 

BHumana gadu "Anti god sahityam/books" naku istam nenu ave chadiva jail lo ani direct ga cheppukuntadu....malli naku a sahityam valle devudu ki daggara ayya antadu...

 

A JAFFA gallaki undali kani manam emi chestam....

Link to comment
Share on other sites

Deeniki Central govt. CBI ki relation emiti? TTD handled by State government, TTD should order enquiry & AP Police should act.

 

Chetakaaka pothe avanni aaropanala gaane migilipothaayi.

Link to comment
Share on other sites

Tirupati meda paina article lo chala miss chesaru.....I will post one day

 

-Christian VC for Temple affiliated university

 

Veena Nobel das ane matam picha danni christian college nunchi techi Padamavati university VC ga petti vampus lo "devudi photos" teyincharu

Veena das emo campus lo thana room lo Jesus photos pettukunid..also Sunday pradanalu conduct chesindi campus lo

 

 

- INTENATIONAL ISLAMIC UNIVERSITY ani cheppi Tirupati main area lo permission ichadu..court kuda acharya poindi how they can do it ani

 

- Tirupati DEER PARK ni ettesi Idupulapaya own estate ki marche GO ichadu.....E DEEP park manam HILL digutunte untundi...chala famous....Vere state vallu compulsory agutaru...

 

Idupula paya starts with Tirupati Seven hills point ... hill kinda modatlo kinda antha occupy chesi veedu estate pettadu...1000 acre kabja

 

- Tirupati temple money ni Christian organization charity dwara icharu madyalo..heart operations for poor ani....

 

- Special GO to IAS kani vyakti AV DHARMA REDDY Special offier post ichadu...DHARMA reddy meda India TOday vallu jewelery ammesadu ani sting operation chesaru.....plus e candidate valla oka employee suicide kuda jarigindi....a sucide scam ki related ni news vachindi

 

- Devudi meda TV program ani dabbulu open ga dobbesaru...100 crores daka hamphut anukunta dantlo....

 

- Ticket scam ayete inka open....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...