Jump to content
sonykongara

Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)

Recommended Posts

త్రీ ఇన్‌ వన్‌!
03-08-2018 03:54:13
 
  • యువతకు భృతి... శిక్షణ... కొలువు
  • అతిపెద్ద ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌’
  • ఒకే వేదికపైకి సంబంధిత విభాగాలు
  • పకడ్బందీగా భృతి ‘పోర్టల్‌’
  • 600 గంటలు శ్రమించిన లోకేశ్‌
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వేదిక ఒక్కటే! ఉపయోగాలు అనేకం! నిరుద్యోగ భృతి చెల్లించేందుకు... నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందేందుకు... పరిశ్రమ వర్గాలు తమకు అవసరమైన వారిని ఎంచుకునేందుకు! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇది అతిపెద్ద ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌’! ఇంటర్నెట్‌ సౌకర్యంతో ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌కు వెళితేచాలు! ఈ పోర్టల్‌ రూపకల్పనలో ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ కీలకపాత్ర పోషించారు. పలు శాఖలు, విభాగాలు, కార్పొరేషన్‌లు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు అనేక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు సమీక్షించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పోర్టల్‌ను అత్యంత పకడ్బందీగా తయారీకి లోకే శ్‌ సుమారు 600 గంటలు శ్రమించారు. గురువారం మంత్రివర్గం అధికారికంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి కోసం నమోదు ఎలా.. తదితర అంశాలు ఒక్కసారి పరిశీలిస్తే...
 
నమోదు ఇలా...
నిరుద్యోగ భృతి కోరే యువతీ యువకులు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. వారికి ఒక ఓటీపీ నంబరు వస్తుంది. అది ఎంటర్‌ చేసి.. ఇదే వెబ్‌పోర్టల్‌లోనే దరఖాస్తు నింపాలి. పాలిటెక్నిక్‌, డిగ్రీ సమానార్హత ఉండి... 22 నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న వారే దీనికి అర్హులు. అర్హత లేకపోతే అప్పటికప్పుడే ‘రిజెక్ట్‌’ చేస్తారు. అన్నీ ఓకే అయితే... అప్పటికప్పుడే భృతిని మంజూరు చేస్తారు.
 
 
పరిశ్రమలకు ఇలా ఉపయోగం
నిరుద్యోగ భృతి వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకునే వారి వివరాలను పరిశ్రమవర్గాలు కూడా తెలుసుకోవచ్చు. వారికి ప్రత్యేక లాగిన్‌ కేటాయిస్తారు. దీనిద్వారా తమకు అవసరమైన అర్హతలున్న నిరుద్యోగుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించవచ్చు. వివిధ రకాల అర్హతలు, నైపుణ్యం ఉన్న యువత జాబితా ఒకే వేదికపై మరెక్కడా లభ్యం కాదని, ఇది కంపెనీలకు చక్కటి అవకాశమని పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు.
 
 
జాబ్‌ పోర్టల్‌ అనుసంధానం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో క్రమం తప్పకుండా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జాబ్‌ పోర్టల్‌ను కూడా నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తారు. ఎక్కడ ఎలాంటి కొలువుల ప్రకటనలు వెలువడినా దీని ద్వారా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పలు శాఖల్లోని పథకాలు, కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కసరత్తు చేశారు. దీనికోసం ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతోపాటు సంబంధిత మంత్రులతోనూ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటించి, దానిని విజయవంతంగా అమలు చేయలేని రాష్ట్రాల అనుభవాలను తెలుసుకున్నారు. లోటుపాట్లను ముందుగానే గుర్తించారు. అలాంటి పొరపాట్లు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 
శిక్షణ ఇలా...
నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసే సమయంలోనే... యువతీ యువకులు తమకు ఇష్టమైన మూడు రంగాలను ఎంచుకోవచ్చు. ‘నైపుణ్య శిక్షణ’కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఈ పథకంతో అనుసంధానించారు. అలాగే... వివిధ పారిశ్రామిక సంస్థల్లో అప్రెంటిస్ షిప్ కు కూడా అవకాశముంటుంది.

Share this post


Link to post
Share on other sites
50 మందికి నిరుద్యోగ భృతి అందజేసిన సీఎం
07-08-2018 17:33:12
 
636692599909613735.jpg
ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 50 మంది యువతకు నిరుద్యోగ భృతిని అందజేశారు. పందిళ్లపల్లిలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. అనంతరం చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత మగ్గం, అల్లికలను పరిశీలించారు. చేనేత వస్త్రాల స్టాల్స్‌ను పరిశీలించారు.

Share this post


Link to post
Share on other sites
4 hours ago, sonykongara said:

NN3iwIo.jpg

నిరుద్యొగ భ్రుతి కి నైపున్యాభిరుద్ది అనుసందానం ... excellent idea ... 

We should be taking this as a much needed support ...  when needed ... and struggle we must to stand up on our own ... not rely on someone's charity (or feel entitled) ... even the govt handouts.

That's how its supposed to be ... a safety net that protects ... not a way of life ... 

 

Share this post


Link to post
Share on other sites
యువనేస్తం అర్హులు 10 లక్షలు!
ప్రాథమికంగా తేల్చిన  ప్రభుత్వం
వివిధ రకాల సమాచారం ఆధారంగా జాబితా రూపకల్పన
దరఖాస్తులు అందాక పోల్చిచూసి తుది ఎంపిక
14న రిజిస్ట్రేషన్‌ ప్రారంభం
దరఖాస్తు ప్రక్రియ, అర్హత, అనర్హత అంశాలు వెల్లడి
ఈనాడు - అమరావతి
9ap-main1b.jpg

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు,  నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అప్రెంటీస్‌షిప్‌, ఉద్యోగావకాశాలను అందుకునేందుకు  అర్హుల జాబితాను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఈ జాబితాను రూపొందించింది. ప్రజా సాధికార సర్వేతో పాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాక రాష్ట్రంలో 10,11,234 మందికి అర్హత ఉన్నట్లుగా తేల్చారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమయ్యాక నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలను ఈ జాబితాతో పోల్చి చూసి అర్హులా, అనర్హులా అనేది తేల్చనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో అర్హులు అనర్హులుగా గుర్తింపబడితే ఫిర్యాదుచేసుకొనేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.

అర్హత :
* వయస్సు 22-35 మధ్య ఉండాలి.
* పీజీ/డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఏడాది అయి ఉండాలి.
* దారిద్య్ర రేఖకు దిగువ(బీపీఎల్‌)నున్న కుటుంబానికి చెంది ఉండాలి.
* తెల్లరేషన్‌కార్డులో పేరు తప్పనిసరి.
* ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి.
* ఆంధ్రప్రదేశ్‌లోనే నివసించాలి.
* తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు తీసుకుంటున్నా ఆ కుటుంబంలోని నిరుద్యోగి అర్హులే..

అనర్హత :
* ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందినవారు.
* కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా..
* కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉంటే.
* ప్రభుత్వ పథకాల కింద రూ.50వేలపైన రాయితీ పొంది ఉంటే.
* ప్రభుత్వ రంగ/ప్రైవేట్‌ రంగ సంస్థలో పనిచేస్తున్నా, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ కింద నమోదైన సంస్థల్లో ఒప్పంద/పొరుగు సేవల్లో పనిచేస్తున్నా..
* 2.5ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట కంటే ఎక్కువ భూమి ఉన్నా.. అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట గరిష్ఠం.
* శారీరక వికలాంగుల కోటా కింద పింఛన్‌ పొందుతున్నవారు.
* నేరస్తుడిగా శిక్ష పడి ఉంటే.

ఉండాల్సినివి :
* విద్యార్హత, వయసు ధ్రువీకరణ పత్రాలు.
* బ్యాంకు ఖాతా.
* ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబరు అనుసంధానం అయి ఉండాలి.
* కుల, మత ధ్రువీకరణ పత్రాలు.

నమోదు ఇలా :
http://yuvanestham.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అప్లై నౌ పై క్లిక్‌ చేయాలి.
* ఆధార్‌ నెంబరు నమోదు చేయాలి.
* ఓటీపీ పంపండి అని వస్తుంది అక్కడ క్లిక్‌ చేయాలి.
* మీ మొబైల్‌(ఆధార్‌లో ఉన్న నెంబరు)కి ఓటీపీ వస్తుంది.
* ఓటీపిని నమోదు చేసి పరిశీలన మీట నొక్కాలి.
* వెంటనే అభ్యర్థి సమాచారం స్క్రీన్‌పై వస్తుంది వాటిని సరిచూసుకుని దరఖాస్తు కొనసాగించాలి.
* విద్యార్హత సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేసి, అంగీకార మీట నొక్కి, క్లోజ్‌ బటన్‌  ఎంటర్‌ చేయాలి.
* మీకు అర్హత ఉంటే ఒక కోడ్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. దాన్ని సేవ్‌ చేసుకోవాలి.
* స్క్రీన్‌పై వచ్చిన మీ వివరాలు సరికావని గుర్తిస్తే వాటిని అంగీకరించట్లేదని(డిస్‌అగ్రీపై) నమోదు చేయాలి.
* అర్హులైనా అనర్హులుగా వస్తే 1100ను సంప్రదించవచ్చు.. yuvanestham-rtgs@ap.gov.in మెయిల్‌కు మీ సమస్యను తెలియజేయవచ్చు.

Share this post


Link to post
Share on other sites
4 minutes ago, sonykongara said:

3000 isthamu annaru ga

Congress? Not much publicity.

Edited by RKumar

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×