Jump to content

Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)


Recommended Posts

biometric lo finger prints ivvala...every month?penisoners ante urlo unataru kabatti istharu...un-emplyed ante job trails kosam hyd,bangalore or chennai,inka akkadekkado untaru.every month deeni kosam vachipothe charge ke saripotadi.bangalore nundi aythe adi kuda saripodu

Link to comment
Share on other sites

8 minutes ago, SIVA_anNFAN said:

APPSC GROUPS coaching teesukone vallantha hyd ashok nagar lo vuntaru.

Atleat 2( 3 ayite best) months ki okasari ayina biometric pedite baguntadi.

Month ki okasari hyd to kadapa ravalante train ki vachina kuda 600 avuddi up n down.

lokesh ki ede message pettandi bro

Link to comment
Share on other sites

  • 3 weeks later...
యువనేస్తాలు.. 3 లక్షలు!
20-10-2018 03:14:13
 
636756020539410051.jpg
  • దేశంలోనే రికార్డు.. 10,378 మంది స్వచ్ఛందంగా వదిలేశారు
  • 35,767 ఫిర్యాదులు పెండింగ్‌
  • తక్షణ పరిష్కారానికి లోకేశ్‌ ఆదేశం
  • ఇతర రాష్ట్రాల వర్సిటీలకు ప్రత్యేక బృందాలు
  • ధ్రువపత్రాల పరిశీలన చేసుకొస్తున్న వైనం
  • నైపుణ్య శిక్షణ, ఉపాధిపైనా పెద్దఎత్తున ప్రచారం
  • ఖాతా సమస్యలపై బ్యాంకర్లతో త్వరలో భేటీ
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం దేశంలోనే రికార్డు సృష్టించింది. ఈ పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇంత పెద్దఎత్తున నిరుద్యోగ భృతి పొందుతున్నవారు దేశంలో మరే రాష్ట్రంలోను లేరు. ఎలాంటి దళారీలు లేకుండా.. లంచం ఊసే లేకుండా.. అంతా ఆన్‌లైన్‌లోనే జరగడం దీని విశిష్టత. పథకం ప్రారంభించిన 36 రోజుల్లో 3లక్షల 20మందికి పైగా యువత అర్హత సాధించారు. ఇప్పటికే వీరిలో చాలామందికి తొలి విడత భృతి అందింది. కొత్తగా అర్హత సాధించినవారిని కూడా కలిపి నవంబరు 1న ఇప్పటివరకు భృతి మొత్తం ఆన్‌లైన్‌లో జమ చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు గడువును ప్రతి నెలా 25వ తేదీగా నిర్ణయించి.. నిరంతరం నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
 
సమస్య ఏదైనా పరిష్కారమే లక్ష్యం
యువనేస్తం పథకం ప్రారంభానికి ముందే యువత చాలా సులభంగా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేలా వెబ్‌సైట్‌ రూపొందించారు. అది ప్రారంభించిన తర్వాత.. భూమి నిబంధన, పాత పీఎఫ్‌ ఖాతా కలిగి ఉండడం, బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం, డిగ్రీ సర్టిఫికెట్లను త్వరగా నిర్ధారించలేకపోవడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదువుకుని, యువనేస్తంకు దరఖాస్తు చేసినవారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపించారు.
 
ఈ పథకం కింద దరఖాస్తుచేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉందని తెలిసినా పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేశ్‌ వివరించారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో 1,24,324 మందివి పరిష్కరించగా.. ఇంకా 35,767పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. నిరుద్యోగ భృతికి అర్హత ఉన్నా.. ఇప్పటివరకు 10,378 మంది స్వచ్ఛందంగా దానిని వదులుకోవడం గమనార్హం. ఎవరైనా పొరపాటున స్వచ్ఛందంగా వదులుకున్నామన్న బటన్‌ నొక్కారా అన్నదానిపై ఆరా తీశారు. వారందరికీ ఫోన్లు చేసి అడిగారు. పొరపాటున బటన్‌ నొక్కిన వారిని మళ్లీ లబ్ధిదారులుగా చేర్చారు.
 
మహిళల్లోనూ చైతన్యం
యువనేస్తం పథకం దరఖాస్తుల్లో అత్యధిక శాతం పురుషుల నుంచే వచ్చాయి. దీంతో మహిళల్లోనూ అవగాహన పెంచాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతి అంటే నెలనెలా రూ.1000 చెల్లింపు మాత్రమే కాదని, నైపుణ్య శిక్షణ, ఉద్యోగం సంపాదించేవరకు తోడ్పాటు ఉంటుందని పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇంటింటికీ తిరిగి చెప్పనున్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకునేందుకు వారికి సహకారం అందించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించాక.. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు మంత్రి లోకేశ్‌ అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. దరఖాస్తులో సమస్యలు, ధృవపత్రాల ధ్రువీకరణలో ఇబ్బందుల నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ వరకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా రంగంలోకి దిగి పరిష్కారానికి సూచనలు ఇస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అన్ని జిల్లాల బ్యాంకర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...