Jump to content

క్లాసికల్‌ డ్యాన్సర్‌గా ఎన్టీఆర్‌


Ramesh39

Recommended Posts

తకిట తథిమి... తకిట తథిమి తందానా 

15tollywood9a.jpg

ఎన్టీఆర్‌కి అత్యంత ఇష్టమైన చిత్రాల్లో ‘సాగర సంగమం’ ఒకటి. ‘ఎప్పటికైనా సాగర సంగమం తరహా చిత్రంలో నటించాలని, సంప్రదాయ నృత్యకారుడిగా కనిపించాలని వుంద’ని చాలాసార్లు తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చేసింది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి క్లాసికల్‌ డ్యాన్సర్‌ అవతారమని తెలుస్తోంది. లవకుమార్‌ అనే ప్రభుత్వాధికారిగానూ ఎన్టీఆర్‌ కనిపిస్తాడని తెలుస్తోంది. మూడో పాత్ర ‘జై’. ఇందులో ప్రతినాయకుడి ఛాయలు ఉంటాయట. ఈనెల 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘జై లవకుశ’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మూడు గెటప్పులనీ ఒకేసారి చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

టీమ్‌లో ఓ మార్పు: ‘జై లవకుశ’ చిత్రబృందంలో ఓ మార్పు చోటుచేసుకొంది. ఈ సినిమా కోసం ఛాయాగ్రాహకుడిగా తొలుత సీకే మురళీధర్‌ని ఎంచుకొన్నారు. దాదాపు 50 శాతం షూటింగ్‌ కూడా పూర్తి చేశారాయన. అయితే ఇప్పుడు సీకే స్థానంలో చోటా కె.నాయుడు వచ్చారు. జూన్‌తో మురళీధర్‌ ఇచ్చిన కాల్షీట్లు అయిపోతున్నాయని, ముందు జాగ్రత్తగా ఆయన స్థానంలో చోటాని తీసుకొన్నామని చిత్రబృందం తెలిపింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...