Jump to content

Chodavaram barrage ,Vijayawada.


Recommended Posts

  • 2 weeks later...
  • 4 weeks later...
నీటి బొట్టు... నిలిచేట్టు... 
amr-top1a.jpg 
కృష్ణా నదిపై రెండు ఆనకట్టలు 
చోడవరం బ్యారేజీకి త్వరలో ప్రభుత్వ ఆమోదం 
దీని దిగువన మరొకటి నిర్మాణానికి యత్నాలు 
రాజధాని ప్రాంత భవిష్యత్తు అవసరాలే లక్ష్యం 
ఈనాడు - అమరావతి
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు బృహత్‌ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నదీ ముఖ ప్రాంతంగా అభివృద్ధి చేసే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దీంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం కృష్ణా నది వెంబడి మూడు బ్యారేజీలను నిర్మించబోతోంది. కృష్ణా నది నుంచి సముద్రంలోకి వదిలే నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలో ఉంది.

ఇందులో భాగంగా ఇప్పటికే గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద రూ.2వేల కోట్లు పైగా వెచ్చించి ప్రకాశం బ్యారేజికి 23 కి.మీ ఎగువున నిర్మించనుంది. దీనికి పరిపాలనపరమైన ఆమోదం తెలిపింది. బ్యారేజికి దిగువున చోడవరం వద్ద ఆనకట్టను కూడా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో దీనికి పచ్చజెండా ఊపనుంది. దీనికి దిగువున మరో బ్యారేజిని   నిర్మించడం ద్వారా మరింత అధిక పరిమాణంలో నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రెండు ఆనకట్టలు నిర్మితమైతే 7.2 టీఎంసీల మేర నీటిని నిలిపే అవకాశాలు ఉన్నాయి. నీరు లేక ఒట్టిపోతున్న నదిలోకి సముద్ర నీరు బాగా చొచ్చుకొస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 
* ప్రకాశం బ్యారేజికి దిగువున 12 కి.మీ వద్ద కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం సమీపంలో ఆనకట్టను నిర్మించనున్నారు. దీని నిల్వ సామర్థ్యం 2.7 టీఎంసీలు. దీని నిర్మాణ వ్యయం రూ.907 కోట్లు. తొమ్మిది గేట్లు బిగించనున్నారు. 
* ఆనకట్ట గేట్లు ఎయిర్‌ బ్యాగ్స్‌తో ఆపరేట్‌ అవుతాయి. అందులోని నీటి పరిమాణాన్ని బట్టి వాటంతట అవే పనిచేస్తాయి. పూర్తిగా సెన్సర్ల ఆధారంగా తెరుచుకుంటాయి. సిబ్బంది అవసరం లేకుండానే పనిచేస్తాయి. 
* 11.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించనున్నారు. 
* ఏడాది పొడవునా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. దీని వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. పర్యటకానికి కూడా ఇది ఉపయోగపడనుంది. తాగునీటి అవసరాలకు కూడా అక్కరకొస్తుంది. 
* ఈ ఆనకట్టు కోసం పట్టాభూమి, ప్రభుత్వ భూమిని సేకరించాల్సి ఉంది. పట్టాభూమి.. 50 హెక్టార్లు, ప్రభుత్వ భూమి.. 2,878 హెక్టార్లు అవసరమని గుర్తించారు. భూసేకరణ కోసం రూ.87.55 కోట్లు అవసరం. 
కడలిపాలయ్యే నీటికి అడ్డుకట్ట: రాజధాని ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యను అధిగమించి, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు విజయవాడ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని వైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కంకిపాడు మార్గంలో ఎక్కువ మంది వస్తున్నారు. 
* ప్రకాశం బ్యారేజిలో 3.02 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో అయితే నీటిని సముద్రంలోకి వదిలిపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో అధిక నీటిని వదలకుండా దిగువ ప్రాంతాలకు ప్రయోజనం కలిగేలా చోడవరంలో బ్యారేజికి రూపకల్పన చేస్తున్నారు. 
* దీని వల్ల కృష్ణా జిల్లా యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, గుంటూరు జిల్లాలోని ప్రాతూరు, చిర్రావురు, గుండిమేడ, రామచంద్రాపురం గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులు ఏడాది పొడవునా బోరు నీటితో పంటలు వేస్తున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాల రాక ఆలస్యం అయిన సందర్భాలలో నీటికి కొరత తలెత్తుతోంది. ఈ ప్రభావం కారణంగా తాగునీటి పథకాలు కూడా ఒట్టిపోతున్నాయి. దశాబ్దాల తరబడి ఇలా సాగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 
* ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెక్‌డ్యామ్‌లు, బ్యారేజి నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా చోడవరం బ్యారేజి నిర్మితమైతే సమస్యలు పరిష్కారమవుతాయి. వరద నీటిని ఒడిసిపట్టడం వల్ల తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. సరకు రవాణా, పర్యటకం, నదీముఖ అభివృద్ధికి ఇది తోడ్పతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు వస్తున్నాయి. వీటికి నీటిని అందించేందుకు వీలు కలుగుతుంది. 
* ఆనకట్ట నిర్మాణం వల్ల వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరనుంది. ఏటా రూ.166 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. చేపల పెంపకం ద్వారా ఏడాదికి రూ.15.91 కోట్లు, పర్యటకం ద్వారా రూ.56కోట్లు, భూగర్భ జలం పెరిగితే రూ.17.64 కోట్ల మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులు పంటలను సాగుకు నీరు అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల రూ.76.50 కోట్ల వరకు కర్షకులకు ఆదాయం లభిస్తుంది.

ప్రతిపాదనల్లో మరొకటి 
బ్యారేజీ నిర్మించనున్న చోడవరం ప్రాంతానికి దిగువన కూడా మరొకటి నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీని నిర్మాణం ద్వారా చుక్క నీరు కూడా వృథాగా పోకూడదన్న తలంపుతో ఉంది. ఈ మేరకు ప్రాథమికంగా జలవనరుల శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. నదిపై కృష్ణా జిల్లా శ్రీకాకుళం, గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని గాజుల్లంక మధ్య నిర్మించాలని అంచనాకు వచ్చారు. ప్రకాశం బ్యారేజీకి 46 కి.మీ దూరంలో ఇది రానుంది. దీని నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు. ఈ బ్యారేజి నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సవివర నివేదిక తయారీలో ఉంది. ఇది నిర్మితమైతే చుట్టుపక్కల లంక గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పటికే కొల్లూరు మండలం లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు వేస్తుండటంతో బోర్ల ద్వారా నీటిని అందించాల్సి వస్తోంది. దీని వల్ల 70 అడుగుల లోతుకు వెళ్లినా నీరు పడని పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలం వరకు సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. ఫలితంగా భూగర్భ జలాలు ఉప్పునీటి మయంగా మరాయి. శ్రీకాకుళం వద్ద బ్యారేజి నిర్మిస్తే ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీరుతుంది. దీంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి.

Link to comment
Share on other sites

paina benefits lo 950 crores cost ki 170 crores yearly direct benefit vesaru.....they missed one more major benefit if any chapta(but inflatable model lo chapta radu anukunta...chudali).......

 

even chapta rakapoyina river lo road vestaru low level lo which to be used when no water.....prastutam SRIKAKULAM-Gajulanaka  daggara undi river lo road for lorries and tractors e.t.c

 

if these is chapta along inflatable barrages it helps solve BIG traffic problems of vijayawada.....NH5 traffic atleast 20-25% will go via these barrages and not through vijayawada city....

Poranki big road helps them to split before entering vijayawada city and cross these to chennai/guntur east side...

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

7 minutes ago, AnnaGaru said:

paina benefits lo 950 crores cost ki 170 crores yearly direct benefit vesaru.....they missed one more major benefit if any chapta(but inflatable model lo chapta radu anukunta...chudali).......

 

even chapta rakapoyina river lo road vestaru low level lo which to be used when no water.....prastutam SRIKAKULAM-Gajulanaka  daggara undi river lo road for lorries and tractors e.t.c

 

if these is chapta along inflatable barrages it helps solve BIG traffic problems of vijayawada.....NH5 traffic atleast 20-25% will go via these barrages and not through vijayawada city....

Poranki big road helps them to split before entering vijayawada city and cross these to chennai/guntur east side...

 

eenadu lo emadya dani  ni river lo kabja ani rasadu

Link to comment
Share on other sites

8 minutes ago, AnnaGaru said:

paina benefits lo 950 crores cost ki 170 crores yearly direct benefit vesaru.....they missed one more major benefit if any chapta(but inflatable model lo chapta radu anukunta...chudali).......

 

even chapta rakapoyina river lo road vestaru low level lo which to be used when no water.....prastutam SRIKAKULAM-Gajulanaka  daggara undi river lo road for lorries and tractors e.t.c

 

if these is chapta along inflatable barrages it helps solve BIG traffic problems of vijayawada.....NH5 traffic atleast 20-25% will go via these barrages and not through vijayawada city....

Poranki big road helps them to split before entering vijayawada city and cross these to chennai/guntur east side...

 

water way antuaru asalu evi kattaka pothe water enduku eppudu nalibadi utundi

Link to comment
Share on other sites

16 minutes ago, sonykongara said:
కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలం వరకు సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. ఫలితంగా భూగర్భ జలాలు ఉప్పునీటి మయంగా మరాయి. 
 
enti antha lopalaki unda???????
Edited by AnnaGaru
Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

river sea kalise chala chotala ela jarugutundi bro

kalavala chivari bhoomula ku water andaka povatam kuda oka reason 

and also, Krishna lo water flow(after prakasam barrage) leka , ee issues annii - especially last couple of years.

2002 - 2005 lo ne chala darunam ga vundedi - 

Pattiseema leka pothe inka munduku vatchevi

 

Link to comment
Share on other sites

4 minutes ago, rk09 said:

kalavala chivari bhoomula ku water andaka povatam kuda oka reason 

and also, Krishna lo water flow(after prakasam barrage) leka , ee issues annii - especially last couple of years.

2002 - 2005 lo ne chala darunam ga vundedi - 

Pattiseema leka pothe inka munduku vatchevi

 

river lo flow taggutunnadi sea emo chocchuku vasthunadi

Link to comment
Share on other sites

44 minutes ago, AnnaGaru said:

paina benefits lo 950 crores cost ki 170 crores yearly direct benefit vesaru.....they missed one more major benefit if any chapta(but inflatable model lo chapta radu anukunta...chudali).......

 

even chapta rakapoyina river lo road vestaru low level lo which to be used when no water.....prastutam SRIKAKULAM-Gajulanaka  daggara undi river lo road for lorries and tractors e.t.c

 

if these is chapta along inflatable barrages it helps solve BIG traffic problems of vijayawada.....NH5 traffic atleast 20-25% will go via these barrages and not through vijayawada city....

Poranki big road helps them to split before entering vijayawada city and cross these to chennai/guntur east side...

 

poranki 100 ft road ni - IRR plan lo - Tadigadapa - Chodavaram cheyyali ani choosthunnaru

ee chodavarm daggara kuda oka road/barrage lantidi plan anukonta - as part of IRR

 

Link to comment
Share on other sites

13 minutes ago, rk09 said:

poranki 100 ft road ni - IRR plan lo - Tadigadapa - Chodavaram cheyyali ani choosthunnaru

ee chodavarm daggara kuda oka road/barrage lantidi plan anukonta - as part of IRR

 

రామలింగేశ్వరనగర్‌ వద్ద మరో రబ్బరుడ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు

దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్‌ దగ్గర మరో రబ్బరు డ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. chodavaram edi veru veru ga kattedi asalu ardham kavatala

Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:

రామలింగేశ్వరనగర్‌ వద్ద మరో రబ్బరుడ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు

దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్‌ దగ్గర మరో రబ్బరు డ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. chodavaram edi veru veru ga kattedi asalu ardham kavatala

Thats the initial plan - near Yanamalakuduru

later changed to Chodavaram - IRR plan lo bhagam ga change chesaru emo anukonna

Link to comment
Share on other sites

25 minutes ago, sonykongara said:

రామలింగేశ్వరనగర్‌ వద్ద మరో రబ్బరుడ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు

దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్‌ దగ్గర మరో రబ్బరు డ్యామ్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. chodavaram edi veru veru ga kattedi asalu ardham kavatala

Chodavaramm dagara barriage/bridge kadataru.. idhi eppudo avvalasindhi.. (Outer ring road for Vijayawada- long back proposal before state division)

 

Ramalingeswar Nagar ante Benz Circle ki south lo vuntadhi.. akkada rubber dam kadataru idhi 2014 taruvata theesukunna decision.

Edited by Raaz@NBK
Link to comment
Share on other sites

  • 1 month later...

Andhra Pradesh government nod for two check dams likely soon

While the check dam at Chodavaram, which is around 16km below from the barrage, is expected to cost Rs 898 crore.

Published: 13th August 2018 03:38 AM  |   Last Updated: 13th August 2018 03:38 AM   |  A+A-

check_dam.jpg

The Water ResourcesDepartment officials said the check dams would also help in maintaining ecological balance.

By Express News Service

VIJAYAWADA: The two long-pending check dams proposed downstream of Prakasam Barrage to tap into surplus waters during floods are set to materialise as the State government is expected to give administrative sanction to execute them in this month. The two check dams -- one at Chodavaram, and the other after Srikakulam (Krishna district) -- will together have a capacity to store 7.5 TMC of water.

Even though irrigation experts and farmers have been stressing on the need for having check dams downstream of the barrage to ensure water for the tail-end villages of the district, the proposal remained in a limbo. However, with no water flow from Nagarjuna Sagar in the last four years, it has become indispensable to channel the surplus water. In this context, the Water Resources department has expedited the process of making the check dams a reality.

“We are expecting the administrative approval for the check dam at Chodavaram, with a storage capacity of 2.7 TMC, in a week or two. We will immediately begin the tender process after that. The detailed project report (DPR) for the second check dam, around 60 KM downstream of the barrage, is being prepared. Once that is done, we will seek the government’s approval, and go for tenders,” the Chief Engineer of Krishna Delta System (KDS), R Satish Kumar, told TNIE.

While the check dam at Chodavaram, which is around 16km below from the barrage, is expected to cost Rs 898 crore, the estimated cost of the one after Srikakulam is around Rs1,200 crore. Both the estimated costs are inclusive of the land acquisition and other administrative components.

The Water ResourcesDepartment officials said the check dams would also help in maintaining ecological balance. “A minimum of 6 TMC water is required to be released every year for maintaining the balance. Since there were no substantial releases in the past years, salt water has started creeping inland. The salinity in aquifers is increasing due to which the groundwater is turning salty. So, if the check dams are built, it will help maintain the water prism,” a senior official from the department explained.

checka.JPG

 
Stay up to date on all the latest Andhra Pradesh news with The New In
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రకాశం బ్యారేజీ దిగువన.. చోడవరం వద్ద మరో డ్యాం
22-08-2018 01:05:05
 
  • టెండర్లు పిలవాలని సీఎం నిర్దేశం
  • వైకుంఠపురం కూడా త్వరగా పూర్తిచేయాలి
  • అప్పుడు సాగర్‌ కుడికాలువకు గోదారి నీరు
  • మంత్రులు, అధికారులకు చంద్రబాబు ఆదేశం
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి కలిసే నీటిని నిల్వ చేసేందుకు మరో కొత్త డ్యాంను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీ దిగువన చోడవరం వద్ద దీనిని చేపట్టాలని నిశ్చయించింది. ఇందులో రెండు టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నది లక్ష్యం. దీనివల్ల 25 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలం, మంచినీటి లభ్యత పెరుగుతాయని అంచనా.
 
 
ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారమిక్కడ రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నందున పోతిరెడ్డిపాడునుంచి వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమకు తరలించాలని నిర్దేశించారు. హంద్రీ-నీవా, తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ నీటిని తరలించాలన్నారు. అవుకు టన్నెల్‌ పూర్తయితే మరో 16 వేల క్యూసెక్కుల నీటిని సీమ జిల్లాలకు తరలించేవారిమని అభిప్రాయపడ్డారు.
 
 
గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, చేసిన పనుల వల్ల ఈ ఏడాది 415 టీఎంసీల నీటిని అదనంగా రిజర్వాయర్లలో నిల్వ చేయగలిగామని, ఇది అద్భుత విజయమని చెప్పారు. రాష్ట్రంలో ఒకపక్క భారీ వర్షాలు కురిసినా.. మరోపక్క లోటు వర్షపాతం కూడా ఉందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి అన్ని ప్రాంతాలకు నీటికోసమే గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశామని, భవిష్యత్‌లో ఐదు నదుల్ని అనుసంధానం చేస్తామన్నారు. కళ్లముందు లక్షలాది క్యూసెక్కుల నీరు అటు సముద్రంలోకి పోతుంటే బాధేస్తోందన్నారు. వైకుంఠపురం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. కొత్తగా ప్రతిపాదించిన చోడవరంతో పాటు వైకుంఠపురం పూర్తయితే గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ కుడికాలువకు మళ్లించవచ్చని చెప్పారు.
 
 
వర్షాలు, వరదపై సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ఉధృతిపైనా సీఎం సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాలువ ఉధృతిపై చర్చించారు. ఏ గ్రామంలోనూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. నీరు తగ్గిపోతానే పంటనష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
 
 
కేంద్రం కంటే యూఏఈ నయం
కేరళ విపత్తుపై గల్ఫ్‌ దేశమైన యూఏఈ స్పందించి.. రూ.700 కోట్ల సాయం ప్రకటించిందని సీఎం అన్నారు. కేంద్రం ఇచ్చింది కేవలం రూ.600 కోట్లేనని ఆక్షేపించారు.
Link to comment
Share on other sites

అవసరాలు పెరగటంతో దిగువ కృష్ణాపై తొలి అడుగు!
23-08-2018 09:55:03
 
636706149059963181.jpg
  • చిర్రావూరు-చోడవరం మధ్య డ్యామ్‌ నిర్మాణ నిర్ణయంతో హర్షం
  • ఓలేరు దగ్గర చెక్‌డ్యామ్‌ నిర్మిస్తే మరింత మేలు
విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయాక జలాశయాల నుంచి నీరు రాకపోవటం, కొత్త రాజధాని అవసరాలు పెరగటంతో నిన్నటి వరకు ఉన్న జీవనది కృష్ణానదే రాజధాని ప్రాంతవాసుల తాగునీటి కష్టాలు తీర్చటానికి ఉన్న ఒక్కగానొక్క ఆధారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నదిలోకి వచ్చే ప్రతినీటి బొట్టును జాగ్రత్తగా ఒడిసిపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజికి ఎగువన రెండు, దిగువన మూడుచోట్ల డ్యామ్‌లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధచూపి సాధ్యాసాధ్యాలపై పలుమార్లు సమీక్షలు జరిపారు. ఎగువన వైకుంఠపురం వద్ద డ్యామ్‌ నిర్మాణానికి అంగీకారం వెంటనే ప్రకటించినా, దిగువన ఎక్కడ నిర్మాణం చేపడతారనే విషయంపై నిన్నటివరకు ప్రశ్నగానే మిగిలివుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నదికి వస్తున్న వరదనీటి ప్రవాహాన్ని బ్యారేజి దగ్గర నిల్వవుంచలేక, అదనంగా వచ్చిన నీటిని వృధాగా నదిలోకి వదిలిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నదిపై డ్యామ్‌లు, చెక్‌డ్యామ్‌ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
 
 
ఈ నెలలో 30 టీఎంసీలపైనే వృధా..
ఈ నెలలో వర్షాలు, వరదల కారణంగా ప్రకాశం బ్యారేజి నుంచి ఇప్పటివరకు 30 టీఎంసీల నీరు సముద్రంలో కలసిపోయింది. బ్యారేజి వద్ద నీటిమట్టం 12అడుగులు మాత్రమే కావటంతో 11.5 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తూ, మిగిలిన నీటిని కిందికి వదిలేశారు. ఇప్పటి కీ వరద నీరు సముద్రంలోకి వెళుతూనే ఉంది. అయితే ఈ మొత్తం నీటిలో ఒక్క చుక్కకూడా ఎగువ జలాశయాల నుంచి వచ్చింది లేదు. వీటిలో బ్యారేజి క్యాచ్‌మెం టు ప్రాంతంగా ఉన్న మన రాష్ట్రం, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే మునేరు, పాలేరు వంటి ఉపనదుల నుంచి వచ్చిన నీరే ఎక్కువ. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌ జలాశయాలు నిండుతున్నా, వాటినుంచి మనకి అందేనీరు మన అవసరాలకు సరిపోయేదికాదు.
 
ఒకవేళ జలాశయాల నుంచి నీటిని కిందికి వదిలినా దానిని పులిచింతల, ప్రకాశం బ్యారేజిల దగ్గర నిల్వ ఉంచుకోవలసి ఉంటుంది. ఇదంతా ఖరీఫ్‌ వంటి మాగాణి భూముల సాగుకు ఉపయోగపడతాయి. అయితే నదీ పరీవాహక ప్రాంత గ్రామాల్లో ఉప్పురుకిని భూగర్బ జలాల మార్పునకు కానీ, తాగునీటి అవసరాలకు కానీ, మెట్ట పంటల సాగుకు కానీ ఉపయోగపడవు. ఈ ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తీరాలన్నా, రూ. కోట్ల విలువైన పంటలను పండించాలన్నా డ్యామ్‌ల వంటివే శాశ్వత మార్గాలుగా మిగిలాయి.
 
 
పైన డ్యామ్‌... దిగువన రెండు చెక్‌డ్యామ్‌లుంటేనే...
కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజి నిర్మాణం జరగకముందు దిగువ కృష్ణాతీరం మొత్తంలో వేల ఎకరాలు ఏ పంటలు పండని బీళ్లుగా ఉండేది. బ్యారేజి నిర్మాణం జరిగాక దిగువన 63 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపుల ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీటి లభ్యత పెరగటం, వరదలు తగ్గుముఖం పట్టడంతో క్రమేణా బంగారు పంటలు పండించే స్థితికి వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నదికి దిగువన భూగర్భజలాలపై లంకగ్రామాల్లో పంటలు పండించే పరిస్థితి ఉంటే, ఉప్పురికిన నీటితో నష్టాలే మిగులుతూ వచ్చాయి. తాగునీటి బోర్ల స్థానంలో ప్రతి గ్రామానికి రూ. కోట్లు వెచ్చించి తాగునీటి పథకాలు నిర్మించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అవికూడా పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెనమలూరు మండలం చోడవరం-దుగ్గిరాల మండలం చిర్రావూరు మధ్య డ్యామ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం, టెండర్లు పిలవాలని ఆదేశించటంతో ఈ ప్రాంత వాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
 
 
ఇక్కడ డ్యామ్‌ నిర్మిస్తే బ్యారేజికి డ్యామ్‌కి మధ్య, కొత్త డ్యాం దిగువన మరో పది కిలోమీటర్ల వరకు భూగర్భజలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే దీనితోపాటు గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గాజుల్లంక-శ్రీకాకుళం మధ్య, ఓలేరు దగ్గర డ్యామ్‌లు నిర్మించకున్నా, కనీసం చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే ఈ ప్రాంతాల వాసుల కష్టాలు కూడా తీరే పరిస్థితి ఉంది. బ్యారేజి దిగువనుంచి 43 కిలోమీటర్లు వరకు భూగర్భజలాల్లోకి సముద్రపు జలాలు చొచ్చుకొచ్చాయి. ప్రస్తుతం ఈ సరిహద్దు కొల్లూరు మండలం ఈపూరు దగ్గరకు చేరింది. ఇది మరింత పైకి చొచ్చుకురాకుండా ఉండాలంటే కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచుకునేలా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం అవసరం ఉంది. దీనిపైనా ముఖ్యమంత్రి దృష్టిపెడితే రెండు జిల్లాల వాసుల కష్టాలు తీరిపోతాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
బ్యారేజీలు.. జలసిరి నిలయాలు
కృష్ణానదిపై రెండు నూతన ప్రాజెక్టుల నిర్మాణం
సిద్ధమైన సవివర ప్రాజెక్టు నివేదికలు
రాజధాని ప్రాంతానికి తాగునీటి భరోసా
ఈనాడు, గుంటూరు
gnt-top1a.jpg
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజీని నిర్మిస్తున్నారు. 2050 నాటికి అమరావతి నగరంలో 35 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తారన్న అంచనా.  బ్యారేజీ నిర్మాణం ద్వారా 10టీఎంసీల నీటిని నిల్వచేసి తాగునీటి అవసరాలు తీరుస్తారు. దీంతో జాతీయ జలమార్గంలో భాగంగా బ్యారేజీ జలరవాణాకు కూడా ఉపయోగిస్తారు.  రాజధాని ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి సామగ్రి, వస్తువుల తరలింపునకు, రవాణా సౌకర్యాల్లో జలమార్గం కీలకం కానుంది. రాజధాని ప్రాంతానికి సిమెంట్‌, ఇనుము, ఇతర సామగ్రి రవాణాకు జలమార్గం ఉపయోగపడనుంది. కృష్ణానది ఒడ్డున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సిమెంట్‌ పరిశ్రమల నుంచి ప్రస్తుతం రోడ్డుమార్గం ద్వారా విజయవాడ, రాజధాని ప్రాంతానికి సిమెంట్‌ తరలిస్తున్నారు. జలమార్గం అందుబాటులోకి వస్తే  దూరం తగ్గడంతోపాటు రవాణాఛార్జీల భారం తగ్గనుంది. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం వల్ల పులిచింతల ప్రాజెక్టు వరకు 60కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండువైపులా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించవచ్చు. కృష్ణానది ఒడ్డునే ఉన్నా అటు సాగర్‌ నుంచి కాని, ఇటు కృష్ణానది నుంచి సాగునీరు అందడం లేదు. ఈక్రమంలో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడానికి వెసులుబాటు కలుగుతుంది. అదేసమయంలో నదికి రెండువైపుల ప్రాంతాల్లో భూగర్భజలాలు వృద్ధిచెందుతాయని జలవనరులశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. రాజధాని నగరం సమీపంలో బ్యారేజీ ఉండటంతో పర్యటకంగా ఎంతో కీలకం కానుంది. నదీముఖద్వారం కొన్ని కిలోమీటర్ల మేర ఉండటంతో జలక్రీడలు, స్పీడ్‌బోట్లు, బోటింగ్‌ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వైకుంఠపురంలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండటంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధికి అడుగులు పడతాయి.
చోడవరం... నీటికి నిలయం
ప్రకాశం బ్యారేజీలో 3.02 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో వరదనీటిని ప్రకాశంబ్యారేజీ నుంచి విడుదల చేస్తే సముద్రం పాలవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేసి అవసరాలకు ఉపయోగించుకునేలా చోడవరం బ్యారేజీకి రూపకల్పన చేశారు. నదీ వెంబడి ఈప్రాంతాల్లో రైతులు ఏడాది పొడవునా బోరుబావుల ద్వారా ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నదీతీరంలో ఉన్నప్పటికీ భూగర్భజలాల మట్టం పడిపోతోంది. కృష్ణానదిపై ఎగువప్రాంతంలో నూతన ప్రాజెక్టులు రావడం, అక్కడ నీటి వినియోగం పెరగడంతో నదిలో నీటిలభ్యత తగ్గిపోయింది. ఈ ప్రభావం కారణంగా బోరుబావులతోపాటు తాగునీటి పథకాలు సైతం వట్టిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెక్‌డ్యామ్‌లు, బ్యారేజీ నిర్మించాలని కొన్నాళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. నీటివనరులకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో చోడవరం బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. వరద నీటిని ఒడిసిపట్టడం వల్ల తాగునీటి సమస్యలు పరిష్కారం కావడంతోపాటు సరకు రవాణా, పర్యటకం, నదీముఖ అభివృద్ధికి ఇది తోడ్పతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు నీటిఅవసరాలు తీరనున్నాయి. ఆనకట్ట నిర్మాణంతో వివిధ మార్గాల ద్వారా ఏటా రూ.166 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.  చేపల పెంపకం ద్వారా ఏడాదికి రూ. 15.91 కోట్లు, పర్యటకం ద్వారా రూ.56 కోట్లు, భూగర్భ జలం పెరిగితే రూ. 17.64 కోట్ల మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతుందని అంచనా. ఈ ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పంటల ద్వారా రూ.76.50 కోట్ల వరకు కర్షకులకు లబ్ధి చేకూరనుంది.

వైకుంఠపురం
నిర్మాణ ప్రాంతం: ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతలకు 60కిలోమీటర్ల దిగువన
‌* ఎక్కడ నిర్మిస్తున్నారు :  వైకుంఠపురం (గుంటూరు జిల్లా), దాములూరు (కృష్ణా జిల్లా)
‌* నీటినిల్వ సామర్థ్యం: 10టీఎంసీలు
‌* బ్యారేజీకి చేరే వర్షపునీటి అంచనా :    35.44టీఎంసీలు
‌* దీనిద్వారా ఉపయోగించుకునే నీరు: 10టీఎంసీలు
‌* వరదనీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం : 1165383 క్యూసెక్కులు
‌* ఒకరోజులో నీటిని విడుదల చేసే సామర్థ్యం : 100.68 క్యూసెక్కులు
‌* నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూమి: 9744 హెక్టార్లు
‌* ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం: 2420.68 కోట్లు
‌* నిర్మాణం పొడవు : 3.068 కిలోమీటర్లు
‌* ప్రయోజనాలు: నూతన రాజధాని అమరావతి నగరానికి తాగునీరు సరఫరా బ్యారేజీకి ఇరువైపులా మండలాల్లో భూగర్భజలాల వృద్ధి, మత్స్యసంపదకు నిలయం, పర్యటక ప్రగతి
‌* ప్రస్తుత స్థితి: టెండర్లు పిలిచారు

చోడవరం
‌* నిర్మాణ ప్రాంతం : ప్రకాశం బ్యారేజీ దిగువన 12 కిలోమీటర్ల దూరంలో
‌* ఎక్కడ: పెనుమలూరు మండలంలోని చోడవరం
‌* ఏర్పాటుచేసే గేట్ల సంఖ్య: 9
‌* నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు
‌* దీని నుంచి నీటివిడుదల సామర్థ్యం: 11.50 లక్షల క్యూసెక్కులు
‌* నిర్మాణానికి భూసేకరణ : 75 హెక్టార్లు
‌* పట్టా భూమి సేకరణకు వెచ్చించే వ్యయం: ఎకరానికి సుమారు రూ.30.36లక్షలు
‌* నిర్మాణ వ్యయం అంచనా:  రూ.899.09కోట్లు
‌* లబ్ధిపొందే గ్రామాలు: యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం (కృష్ణా జిల్లా), పాతూరు, చిర్రావూరు, గుండిమెడ, రామచంద్రాపురం (గుంటూరు జిల్లా)
‌*  ప్రయోజనాలు: భూగర్భజలాలు వృద్ధి,  తాగునీటి అవసరాలు తీర్చడం,  జల  రవాణా, పర్యటకం అభివృద్ధి
‌* ప్రస్తుత పరిస్థితి: పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపాదనలు

 
 

 

 

 
Link to comment
Share on other sites

ప్రయోజనాలు: భూగర్భజలాలు వృద్ధి,  తాగునీటి అవసరాలు తీర్చడం,  జల  రవాణా, పర్యటకం అభివృద్ధి
‌* ప్రస్తుత పరిస్థితి: పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపానలు

  

vykuntapuram barrage-chodavaram barrage ki boat lo vellvaccha  prakasam barrage daggara navigation canal ledu ga, idea unnvallu cheppandi

Link to comment
Share on other sites

54 minutes ago, sonykongara said:

ప్రయోజనాలు: భూగర్భజలాలు వృద్ధి,  తాగునీటి అవసరాలు తీర్చడం,  జల  రవాణా, పర్యటకం అభివృద్ధి
‌* ప్రస్తుత పరిస్థితి: పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపానలు

  

vykuntapuram barrage-chodavaram barrage ki boat lo vellvaccha  prakasam barrage daggara navigation canal ledu ga, idea unnvallu cheppandi

No. no navigation canal. 

Edited by rk09
Link to comment
Share on other sites

1 hour ago, ravikia said:

Chodavaram barrage meedhuga vehicles allow chesthara(light vehicles at least). Guntur district nundi Krishna vellali ante chasthunnaru jenam. Have to go either via Varadhi or Penumudi bridge, which are almost 70kms apart.

Part of irr lo ani antunnaru

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...