Jump to content
sonykongara

Krishna River Management Board

Recommended Posts

వైకుంఠపురం స్కీం కింది ఆయకట్టే దెబ్బతింటుంది
 
 
 • కృష్ణా ట్రైబ్యునల్‌కు ఏపీ సాక్షి వెల్లడి
 • రెండో రోజు కొనసాగిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌
 • విచారణ వచ్చే నెల 15కి వాయిదా
న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణంతో కేవలం వైకుంఠపురం పంపింగ్‌ పథకం కింద ఉన్న ఆయకట్టు మాత్రమే దెబ్బతింటుందని.. మిగిలిన చోట యథాతథంగా ఉంటుందని ఏపీ ప్రతిపాదించిన సాక్షి నీటిరంగ నిపుణుడు కేవీ సుబ్బారావు కృష్ణా ట్రైబ్యునల్‌కు నివేదించారు. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కృష్ణా ట్రైబ్యునల్‌లో రెండో రోజైన శుక్రవారం విచారణ కొనసాగింది. ఏపీ సాక్షి కేవీ సుబ్బారావుని తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాఽథన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన భూమిలో ఇకపై సాగు ఉండదు కాబట్టి, ఆ ప్రాంతానికి సాగునీరు అవసరం ఉండదు కదా? అని ప్రశ్నించారు. దానికి కేవీ సుబ్బారావు సమాధానిస్తూ.. రాజధాని నిర్మాణానికి సీఆర్‌డీఏ 217.23 చ.కి.మీ. భూమిని ప్రతిపాదించిందని తెలిపారు. ఇది ప్రస్తుతానికి ఒక డ్రాఫ్ట్‌ ప్రణాళికని, ఇక్కడ రాజధాని నిర్మించడం వల్ల కేవలం వైకుంఠపురం కిందకు వచ్చే ఆయకట్టు మాత్రమే దెబ్బతుంటుందని పేర్కొన్నారు కృష్ణా డెల్టా చాలా వరకు ప్రకాశం బ్యారేజీ దిగువకు వస్తుందని, ప్రతిపాదిత రాజధాని ఎగువన ఉందని ఈ ప్రాంతంలో సాగుభూమిని తగ్గించబోరని సమాధాన మిచ్చారు. బ్రిజేష్‌ కుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.

Share this post


Link to post
Share on other sites
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అజెండాలో పెట్టి చర్చించాలని కోరింది. నగరంలో ఆంధ్ర వాసులు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా ఇక్కడ వినియోగించే నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. ఐతే ఈ వాదన పై ఆంధ్ర ప్రజలు మండి పడుతున్నారు. హైదరాబాద్ లో నివసించే ఆంధ్రవారి నీటి అవసరాలు తెలంగాణా ప్రభుత్వం తీర్చలేకపోతే వారి నుండి పన్నులు ఎందుకు తీస్కుంటున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు? అదే విధంగా హైదరాబాద్ వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు వారందరి నీటి అవసరాలు వల్ల రాష్ట్రాలే తీరుస్తున్నాయా? అని అడుగుతున్నారు. పోనీ ఆంధ్రుల నీటి అవసరాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుస్తే వాళ్ళు నగరంలో కట్టే పన్నులలో ఆంధ్ర ప్రదేశ్ కు వాటా ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెట్ట్‌లర్ల కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఏమైనట్టు? గతంలో సెట్ట్‌లర్ల పై కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అన్ని మర్చిపోయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్ కు గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించారు. రెండు సంవత్సరాల లోపే ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఇటు వంటి ప్రయత్నాలు మొదటికే చేటు తెస్తాయని తెలుసుకోవడం మంచిది. గతంలో ఉన్న కృష్ణా బోర్డ్ సెక్రెటరీ ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించి తెలంగాణా ప్రభుత్వం కొత్త సెక్రెటరీ ని నియమించేలా కేంద్రం పై ఒత్తిడి చేసి సాధించుకుంది. ఈ కొత్త సెక్రెటరీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని తెలంగాణా ప్రభుత్వం నమ్మకం. చూడాలి ఏం జరగబోతుందో! హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేస్తే మాత్రం అదో రాజకీయ దుమారం రేపడం తధ్యం! Twitter Facebook Google+ Whats

 

Share this post


Link to post
Share on other sites
కృష్ణా ట్రిబ్యునల్‌లో ముగిసిన వాదనలు
13-12-2017 14:43:18
 
636487730036177138.jpg
న్యూఢిల్లీ: కృష్ణా జలాలా వివాదంలో భాగంగా బుధవారం న్యూఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ తరపు సాక్షి సుబ్బారావును ఈ రోజు తెలంగాణ తరపు న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్ రావులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీనిపై తదుపరి విచారణ జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు, ఫిబ్రవరి 22 నుంచి రెండు రోజుల పాటు జరుగనుంది. తదుపరి విచారణలోనూ తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.

Share this post


Link to post
Share on other sites
వరికి తెలంగాణలో నీరెక్కువ కావాలి
ఒక టీఎంసీ నీటితో ఏపీలో 7,882 టన్నుల ధాన్యం దిగుబడి
తెలంగాణలో 4,947 టన్నులే
అక్కడి నేలలు ఆరుతడి పంటలకు అనువైనవి
అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్‌
ఈనాడు - హైదరాబాద్‌

క టీఎంసీ నీటితో ఆంధ్రప్రదేశ్‌లో 7,882 టన్నుల ధాన్యం దిగుబడి వస్తే తెలంగాణలో 4,947 టన్నులు మాత్రమే వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. వరి సాగుకు తెలంగాణలో ఎక్కువ నీరు అవసరమవుతుందని నివేదించింది. ఒక కేజీ బియ్యం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌లో 3,593 లీటర్ల నీరు అవసరమైతే తెలంగాణలో 5,742 లీటర్లు కావాలని పేర్కొంటూ పదేళ్ల సాగు వివరాలతో అదనపు పత్రాన్ని సోమవారం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు అందచేసింది. కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విచారణ జరుపుతున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట వ్యవసాయ పరిస్థితులపై గత ఏడాది సెప్టెంబరు ఐదున ప్రమాణపత్రం(అఫిడవిట్‌) దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్‌, ఇప్పుడు అనుబంధ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. మొదట ప్రమాణపత్రంలో కొన్ని పొరపాట్లున్నాయని, వాటిని సవరించడంతో పాటు తన పరిశోధనలో తేలిన అంశాలతో అదనపు ప్రమాణపత్రాన్ని దాఖలు చేస్తున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్త పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోని సాగు విధానాలను అధ్యయనం చేశానన్నారు. నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ నివేదికలో వరి సాగు గడువు 122 రోజులుగా పేర్కొన్నారని, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 150 రోజులు పడుతుందన్నారు. వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఒకే రకంగా ఉన్నా, వరి ఉత్పత్తికి ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ నీరు అవసరమని, కృష్ణాబేసిన్‌ పరిధిలోని జిల్లాలను చూస్తే తెలంగాణలో హెక్టారుకు 3.3 మిలియన్‌ లీటర్ల నీరు ఎక్కువ కావాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీఎంసీ నీటితో తెలంగాణ కంటే 2,935 టన్నుల దిగుబడి అదనంగా వస్తుందని తాజా ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. 2006-07 నుంచి 2016-17 వరకు ధాన్యం ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ధారణకు వచ్చినట్లు నివేదించారు. కృష్ణాబేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల కింద పంటల సాగును, పంటలకు అవసరమైన నీటిని, రైతులు వాస్తవంగా సాగు చేసే పద్ధతులను పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనం చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సాగు సమయం 140 రోజులని, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూరాల కింద కూడా 140 రోజులని.. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి 122 రోజులు కాకుండా 140 రోజుల్లో వచ్చే రకంవైపు రైతులు మొగ్గు చూపుతారని విశ్లేషించారు. గత ఏడాది దాఖలు చేసిన ప్రధాన ప్రమాణపత్రంలో రెండు రాష్ట్రాల్లోని నేల స్వభావం, వాతావరణం గురించి ఎక్కువగా పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోనూ, డెల్టా అప్‌లాండ్‌ ఏరియా నేలల స్వభావానికి, డెల్టా ప్రాంతంలోని నేలల స్వభావానికి ఉన్న తేడాను వివరిస్తూ, డెల్టా ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో 14 రోజులపాటు నీరు నిలిచిపోతుందని, ఈ నేలలు వరి పండించడానికి మాత్రమే అనుకూలమన్నారు. ఎర్రనేలలున్న ప్రాంతంలో ఆరుతడి పంటలు సాగు చేయడానికి అవకాశం ఉందని, తెలంగాణలో కూడా ఆరుతడి పంటలకు నేల అనువైందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాల వారీగా వరికి అనుకూలమైన ప్రాంతం ఎంత అనే వివరాలూ ఇచ్చారు.

కృష్ణాజలాలపై మళ్లీ సుప్రీంకు..
కృష్ణాజలాలపై తెలంగాణ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కృష్ణా నీటి కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. 2015లో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు అనుబంధంగా ఈ దరఖాస్తు చేసిన తెలంగాణ, దీనిపై వెంటనే విచారణ చేపట్టి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు రెండురోజుల క్రితం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. బచావత్‌, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునళ్ల ఎదుట తన వాదనను వినిపించుకునే అవకాశం తెలంగాణకు లేకుండా పోయిందని, తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాదనలు వినిపించలేదని పేర్కొంటూ 2014 జులై 14న కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. నీటి కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి వీలుగా మొత్తం నీటిపై కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం లేదా ఉన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కే ఫిర్యాదును పంపాలని కోరింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 2015 ఆగస్టు పదిన సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసి తమ ఫిర్యాదును ట్రైబ్యునల్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ కోరింది.

Share this post


Link to post
Share on other sites
ఏపీకి అన్ని నీళ్లెందుకు?
29-01-2018 01:12:45
 
636527919209942189.jpg
 • గోదావరి నుంచి తరలిస్తున్నారు..
 • కృష్ణా నీటివాటాలో కోత పెట్టాలి
 • 512 నుంచి 150 టీఎంసీలకు తగ్గించాలి
 •  తెలంగాణకు 299 టీఎంసీల నుంచి 661 టీఎంసీలకు పెంచాలి
 •  ట్రైబ్యునల్‌లో వాదనకు తెలంగాణ సిద్ధం
 •  సమావేశాలు వచ్చే నెల 22కు వాయిదా
హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీటి కోటాలో భారీగా కోత విధించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ సర్కారు గోదావరి నుంచి నీటిని కృష్ణా బేసిన్‌కు భారీగా తరలిస్తున్నందున ఆ కోత పెట్టాలంటూ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 362 టీఎంసీల కోత విధించి, 150 టీఎంసీలకు పరిమితం చేయాలని కోరనుంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌లో సమర్పించడానికి ప్రత్యేక పత్రాన్ని రూపొందించింది. త్వరలో జరిగే ట్రైబ్యునల్‌ సమావేశాల్లో ఇరు రాష్ర్టాలూ తమ వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నాయి.
 
ఈ క్రమంలోనే.. తెలంగాణకు భారీగా నీటిని తగ్గించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో తెలంగాణలోని భూముల్లో వరి పంట పండదని, ఒక వేళ పండించినా నీరు ఎక్కువగా అవసరం ఉంటుందని, తక్కువ దిగుబడి వస్తుందని ఏపీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ అఫిడవిట్‌పై ఇప్పటికే కౌంటర్‌ను దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ వాదనలకు దీటుగా సమాధానం ఇవ్వాలని, ట్రైబ్యునల్‌లో బలంగా వాదించాలని నిర్ణయించింది. ఏపీకి నీటి కోటాను ఎందుకు తగ్గించాలో తగు సమాచారాన్ని సమర్పించనుంది.
 
45లో 43 టీఎంసీలివ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నీటిపై ఆధారపడే ప్రాంతాలు తగ్గిపోతున్నాయని తెలంగాణ సర్కారు అంచనా వేస్తున్నది. ముఖ్యంగా గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 టీఎంసీలే తరలించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా పట్టిసీమను చేపట్టినట్టు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతున్నందున దీనిని చేపట్టామని చెప్పారు. నిజానికి పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. అయితే ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను, కర్నాటకకు 21 టీఎంసీలను మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగినందున ఉమ్మడి రాష్ట్రానికి ఉద్దేశించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం ఈ 45 టీఎంసీల్లో 43 టీఎంసీలను, దాంతోపాటు మరింత కృష్ణా నీటిని తమ రాష్ర్టానికి కేటాయించాల్సి ఉంటుందని తెలంగాణ కోరనుంది.
 •  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నీటిని భారీగా ఇతర బేసిన ్లకు మళ్లిస్తోందని సుమారు 350 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లో కాకుండా పెన్నా వంటి ఇతర బేసిన్లకు తరలిస్తున్నారని వాదిస్తోంది.
 •  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ 811 టీఎంసీల నికర జలాల్ని కేటాయించగా.. విభజన తర్వాత అందులో 512 టీఎంసీలను ఏపీ, 299 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటునాయి. అయితే ఈ కోటాలో మార్పులు కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ జరగాల్సిన ట్రైబ్యునల్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. వీటిని ఫిబ్రవరి 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ట్రైబ్యునల్‌ నుంచి టి-సర్కారుకు సమాచారం అందింది.

Share this post


Link to post
Share on other sites

Ma neelu ma istam dikkuna chota chepukondi... Ante repu kaleshwaram modalu aithe meeru krishna neelu vadilestara :thinking:

Share this post


Link to post
Share on other sites

ఎవరి వాదన వారిదే 
రెండు రాష్ట్రాల భారీ అజెండా 
15న దిల్లీలో జలవనరుల శాఖ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం 
పట్టిసీమలో వాటా తేల్చాలంటున్న తెలంగాణ 
పునర్విభజన చట్టానికి విరుద్దంగా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించాలంటున్న ఏపీ 

ఈనాడు హైదరాబాద్‌: బోర్డు పరిధి నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్‌..కృష్ణాజలాల్లో తమ వాటా ఎంతో తేల్చాలని తెలంగాణ.. ఇలా రెండు రాష్ట్రాలు 11 అంశాలను కృష్ణా బోర్డు ముందు చర్చకు పెట్టాయి. పునర్విభజన చట్టానికి విరుద్దంగా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించాలని కోరిన ఆంధ్రప్రదేశ్‌ పాలమూరు-రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ల, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలను కొత్తవిగా పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరింది. ఈ నెల తొమ్మిదో తేదీ సమావేశంలోనే తమ పరిధికి సంబంధించిన అంశాలను పేర్కొన్న కృష్ణా బోర్డు చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగాన్ని తేల్చాలని అదనపు అంశంగా అజెండాలో చేర్చినట్లు తెలిసింది. బోర్డు పరిధిని నిర్ణయించడం, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తదితర అంశాలను ఇప్పటికే బోర్డు కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ దృష్టికి తెచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని సమస్యలు, రెండు రాష్ట్రాలు తమ దృష్టికి తెస్తున్న అంశాలను చర్చించేందుకు ఈ నెల 15న దిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్‌ చీఫ్‌లు, కృష్ణా, గోదావరి బోర్డు అధికారులు, కేంద్రజలసంఘం అధికారులు పాల్గొంటారు. అజెండాలో ఏయే అంశాలుండాలో సూచించాలని రెండు రాష్ట్రాలు, బోర్డులను కేంద్రం కోరింది.
తెలంగాణ ప్రతిపాదించిన అంశాలివి 
కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని,  పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలో వాటా, ఆర్డీఎస్‌ ఆధునికీకరణలో సమస్యలు, నీటి వినియోగ లెక్కల్లో పారదర్శకత లేకపోవడం, బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాల ప్రయోజనాల పరిరక్షణ గురించి చర్చించాలని కోరింది. కృష్ణానదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీలలో చిన్న నీటి వనరుల కింద 89 టీఎంసీలున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతం, బేసిన్‌ పరిధిలోని అవసరాలను పరిగణనలోకి తీసుకొంటే తమకు ఎక్కువ నీటిని కేటాయించాల్సి ఉంటుందని బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు తెలంగాణ నివేదించగా విచారణ జరుగుతుంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయకుండా బోర్డు పరిధిని ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ గతంలో అనేక సమావేశాల్లో ప్రశ్నించింది. ప్రస్తుత అజెండాలో కూడా కృష్ణా జలాల్లో వాటా అంశాన్నే ముఖ్యంగా పేర్కొంది. ఇది తేల్చే అధికారం జలవనరుల మంత్రిత్వశాఖకు లేదు కాబట్టి పరిధి అంశాన్ని కూడా తేల్చడాన్ని తెలంగాణ వ్యతిరేకించనుంది. గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా కోసం ప్రత్యేకంగా కేంద్రం కమిటీ ఏర్పాటు చేసినా, నివేదిక ఇవ్వకుండానే ఆ కమిటీ పని ఆగిపోయింది. కమిటీ గడువూ పొడిగించలేదు. గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా తేల్చాల్సింది ట్రైబ్యునల్‌ తప్ప కమిటీలు కాదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడంతో పాటు రెండు రాష్ట్రాలు కమిటీ అడిగిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్‌ అజెండా ఇదీ 
బోర్డు పరిధి నిర్ణయించాలని, ఉమ్మడి రిజర్వాయర్లపై విద్యుత్తు బ్లాకులతో సహా బోర్డుకు అధికారాలివ్వడం, నీటి విడుదలకు బోర్డు ఆదేశాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పునర్విభజన చట్టానికి విరుద్దంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను అజెండాగా ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వరకైనా పూర్తి అధికారాలు బోర్డుకు ఇవ్వాలని కోరనుంది. సాగర్‌ ఎడమ కాలువ కింద తమ ఆయకట్టుకు నీటి లభ్యతలో ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఈ కాలువను సీఐఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణకు అప్పగించాలని కోరనుంది.కొత్త ప్రాజెక్టుల కింద పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, తుమ్మిళ్ల, భక్తరామదాసులతో పాటు మిషన్‌భగీరథ కింద వినియోగాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌ చేర్చింది.
కృష్ణా బోర్డు కొత్త ఛైర్మన్‌గా వై.కె.శర్మ 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కొత్త ఛైర్మన్‌గా వై.కె.శర్మను కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ నియమించనుంది. 2018 ఆఖరు వరకు ఆయన సర్వీసులో ఉంటారు. శ్రీవాత్సవ జనవరి 31న పదవీ విరమణ చేయగా, అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

Share this post


Link to post
Share on other sites

కృష్ణాలో 575 టీఎంసీలు కేటాయించాలి: హరీశ్‌రావు
ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై గట్టిగా పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణాలో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించి న్యాయం చేయాలని కోరనుంది. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ చేసే ప్రతిపాదనలు తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ప్రభావితమయ్యే ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. పట్టిసీమపై కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. ఈ ప్రాజెక్టులోనూ తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఉందన్న విషయాన్ని  విన్నవించనుంది. గురువారం దిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు.ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారమిక్కడ జలసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

Share this post


Link to post
Share on other sites

నీటి విడుదలలో తెలంగాణవి తప్పుడు లెక్కలు 
జలనరుల శాఖ కార్యదర్శికి ‘వినతి’ పంపిన సాగునీటి సంఘాల సారధులు
విజయవాడ, న్యూస్‌టుడే: ‘ఆంధ్ర ప్రాంతంలోని నాగార్జునసాగర్‌ కాల్వలకు సాగునీటి విడుదలలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో పక్కదారి పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురావాలి’ అని సాగునీటి సంఘాల సారథులు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిని కోరుతూ ఇ-మెయిల్‌లో వినతిపత్రం పంపినట్లు రాష్ట్ర జలవనరుల ఎపెక్సు కమిటీ సభ్యుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఎడమ కాల్వ కింద 2, 3 జోన్లలో కృష్ణా జిల్లాలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. దశల వారీగా 12 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉండగా ఈనెల ఒకటో తేదీ నాటికి కేవలం 6.35 టీఎంసీలు విడుదల చేశారన్నారు.

Share this post


Link to post
Share on other sites

పరిధి గుర్తింపునకే మొగ్గు!
కృష్ణా, గోదావరి బోర్డుల విషయంలో  నిర్ణయం తీసుకోనున్న కేంద్రం 
అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాక ముందుకు 
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ 
ఈనాడు - హైదరాబాద్‌ 

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని గుర్తించడానికే కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తెలంగాణ వ్యతిరేకిస్తున్నప్పటికీ పరిధి లేకుండా బోర్డులు పనిచేయడం కష్టమని, కొన్ని పరిమితులతో అయినా గుర్తించాలన్న అభిప్రాయాన్ని కేంద్రజలవనరుల శాఖ అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించిన తర్వాత దీనిపై ముందుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం దక్షిణాది రాష్ట్రాల అధికారులతో సమావేశానికి ముందుగా కేంద్రజలవనరుల శాఖ సహాయమంత్రి తమ పరిధిలోని జలవనరుల మంత్రిత్వశాఖ, జలసంఘం, జాతీయ జల అభివృద్ధి సంస్థ, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డు అధికారులతో చర్చించారు. బోర్డుల పనివిధానం, కేంద్రం తీసుకోవాల్సిన చర్యల గురించి  మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బోర్డు పరిధిని గుర్తించాల్సిన అవసరాన్ని అధికారులందరూ ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలిసింది. బోర్డు పరిధితోపాటు బజాజ్‌ కమిటీ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం గురించి మాట్లాడినట్లు సమాచారం. కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పటి వరకు ఎదురుచూడకుండా పార్లమెంటులో చేసిన చట్టం ప్రకారం చేయాల్సిన అవసరం ఉందని,   ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా మార్పులు చేసుకోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. ఎక్కువ కాలం జాప్యం చేసే కొద్దీ సమస్యలు వస్తాయని, వీలైనంత త్వరగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం పెట్టి పరిధి గుర్తించడానికి చర్యలు తీసుకొంటామని కేంద్రమంత్రి అన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకించనుంది. ఈ నెల 15న దిల్లీలో జరిగిన కార్యదర్శుల స్థాయి సమావేశంలో బోర్డు పరిధి తప్పనిసరని, అయితే భాక్రానంగల్‌ లాగానా లేక నర్మదా బోర్డులాగానా అన్నది పరిశీలిస్తున్నామని కేంద్రజలవనరుల శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చిన తర్వాత చేయండి లేదా బేసిన్‌ పరిధిలోని నాలుగు రాష్ట్రాలకు కలిపి చేయండని  తెలంగాణ సీఎస్‌ జోషి ఈ సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే. నీటి కేటాయింపులు లేకుండా బోర్డు పరిధిని గుర్తించి ఏం చేస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది.
ఏపీ మిగులు నీరు 6.393 టీఎంసీలు మాత్రమే 
తెలంగాణ మిగులు 21.082 టీఎంసీలు 
స్పష్టం చేసిన కృష్ణా నదీయాజమాన్య బోర్డు
ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఆమోదించిన నీటి విడుదలలో ఆంధ్రప్రదేశ్‌కు 6.393 టీఎంసీల మిగులు మాత్రమే ఉందని కృష్ణా నదీయాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణకు 21.082 టీఎంసీలు ఉందని తెలిపింది. శ్రీశైలం, సాగర్‌లలో నీటి నిల్వలు తగ్గి కనీస నీటిమట్టాలకు చేరుతున్న తరుణంలో ఇప్పటివరకు జరిగిన నీటి వినియోగం, రెండు రాష్ట్రాలకు మిగిలిన కేటాయింపుల గురించి బోర్డు బుధవారం ఏపీ, తెలంగాణకు లేఖ రాసింది. జనవరి పదో తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం, ఇప్పటివరకు అమలు జరిగిన తీరు గురించి కూడా ఇందులో వివరించింది. ఈ నెల 19 వరకు ఆంధ్రప్రదేశ్‌ 227.752 టీఎంసీలు, తెలంగాణ 81.959 టీఎంసీలు కలిపి మొత్తం 309.711 టీఎంసీల నీటిని వాడాయని పేర్కొంది. శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా,ఈ మట్టం వరకు 19వ తేదీ నాటికి 25.609 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. సాగర్‌లో 510 అడుగుల వరకు 24.251 టీఎంసీల నీరు ఉంది.  నాటి త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ 60 టీఎంసీలు, తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకొనేలా నిర్ణయించగా,  ఇందులో ఏపీ 6.393 టీఎంసీలు, తెలంగాణకు 21.082 టీఎంసీల మిగులు ఉందని బోర్డు తెలిపింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 26 టీఎంసీలు విడుదల చేయాలని ఈ నెల ఎనిమిదన ఆదేశాలు జారీ చేయగా, 7.993 టీఎంసీల విడుదల జరిగిందని, కుడి విద్యుత్తు కేంద్రం నుంచి ఎక్కువ నీరు విడుదల చేశారని, అయితే ఈ కేంద్రం నుంచి తమ ఆదేశాల ప్రకారం నీటి విడుదల జరగలేదని బోర్డు పేర్కొంది. విద్యుత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలంలోని రెండు విద్యుత్తు కేంద్రాల ద్వారా నీటి విడుదల జరగాలని, జెన్‌కో నుంచి డిమాండ్‌ లేకపోతే గేట్ల ద్వారా విడుదల చేయాలని వివరించింది. 2018 ఆగస్టు వరకు తాగు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వినియోగించాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.

Share this post


Link to post
Share on other sites
16 minutes ago, KaNTRhi said:

Ee Harishrao gadu statement.. 1500 TMC godavari Water veellaki ichi Godavari Penna linkage chesukovali anta.. :kick:

telangana can utilisze atmost 6 tmc per day , in the best case they can get water for 150 days 

150*6 = 900 tmc sufficient for them, already they have share of 950 tmc

harish rao indirectly saying no to interlinking . instead of asking telangana, center should take up polavaram - penna 

Share this post


Link to post
Share on other sites
ఆంధ్రప్రదేశ్‌కు 26.38 టీఎంసీలు..తెలంగాణకు 19 టీఎంసీలు 
  కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీలో నిర్ణయం 
  ప్రస్తుతం బయటపెట్టకూడదని అంగీకారం 
ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో మార్చి నెలాఖరు వరకు ఏ రాష్ట్రం ఎంత నీరు వినియోగించుకోవాలో దాదాపు ఖరారు చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 26.38 టీఎంసీలు, తెలంగాణ 19 టీఎంసీలు వాడుకోవచ్చు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో కనీస నీటిమట్టాలకు దిగువకు వెళ్లి కూడా అవసరమైన నీరు తీసుకునేందుకు నిర్ణయించారు. ఈ వివరాలు ఏవీ అధికారికంగా తక్షణమే వెల్లడించకూడదని నిర్ణయించారు. నీటిమట్టాల నిర్వహణ మాత్రం ఇరు రాష్ట్రాల పరిస్థితులకు తగ్గట్టుగా చూసుకుని వాటిని కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి 20 వరకు సాగర్‌లో 520 అడుగుల నీటి మట్టం,  మార్చి చివరికి 515 అడుగుల మట్టం ఉండేలా చూసుకోవాలనే చర్చ జరిగింది. సాగర్‌లో కనీస నీటిమట్టం పడిపోతే రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలకు భంగం వాటిల్లుతుందని, ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి జలాలు విడుదల చేస్తేనే సమస్యలు రావని తెలంగాణ అధికారులు తెలిపారు. సాగర్‌ కనీస నీటి వినియోగ మట్టం దిగువ నుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

గతేడాది రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలకు నీళ్లు అందించలేక ఇబ్బంది పడిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ప్రజాప్రయోజనాలు పణంగా పెట్టలేమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు  బోర్డుకి తెలిపారు.  ఏపీ తన వాటాకు మించి అదనంగా కృష్ణా జలాలు వాడుకుందని అన్నారు. సాగర్‌ దిగువ నీటిమట్టాల నుంచి కూడా నీటిని తీసుకునేందుకు ప్రయత్నించిందన్నారు ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో 33 టీఎంసీలు అందుబాటులో ఉండగా ఇందులో 24 టీఎంసీలు తెలంగాణకు, 9 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలన్నారు. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. తమ వాదన వినకుండా ఏకపక్షంగా నీటి విడుదలను ఎలా నిలిపివేస్తారని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. నీటి నష్టాలపై తెలంగాణ చెబుతున్న లెక్కలు ఏకపక్షంగా ఉన్నాయన్నారు. సంయుక్త కమిటీ నీటి నష్టాలపై వేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలు వేరే ఉంటాయన్నారు. ఆ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 33 టీఎంసీల్లో ఏపీకి 14 టీఎంసీలకు పైగా దక్కుతాయని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ వాదనల తర్వాత మార్చి కేటాయింపులపై పై విధంగా ఒక అభిప్రాయానికి వచ్చినా బయటకు వెల్లడించదలుచుకోలేదు. నీటి నష్టాలపై సోమవారం బోర్డు వద్ద రెండు రాష్ట్రాల ఈఈలు సమీక్షించనున్నారు.

నివేదికలు సమర్పించిన కమిటీలు 
నాగార్జునసాగర్‌ ఎడమ కాలువలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లెక్కలకు సరిపోలని నేపథ్యంలో రెండు రాష్ట్రాల సంయుక్త అధికారులతో నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. అలాగే శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు సాగర్‌కు చేరే క్రమంలో నష్టాలతో పాటు... నీటి ఆవిరి నష్టాలు, తాగునీటి కేటాయింపులపై మరో కమిటీ ఏర్పాటయింది. అది కూడా నివేదిక సమర్పించింది. శుక్రవారం నాటి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నివేదికలపై ఎలాంటి చర్చా చేపట్టలేదు.

2ap-main11b.jpg

Share this post


Link to post
Share on other sites
కనీస మట్టం దిగువ నీరు వినియోగం 
తెలంగాణకు 24 టీఎంసీలు.. 
ఆంధ్రకు 9 టీఎంసీలు 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం రిజర్వాయర్‌లో మార్చి నెలలోనే కనీస నీటిమట్టం దిగువ నుంచి నీటిని తీసుకోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఉమ్మడి రిజర్వాయర్లైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టాలకు పైనున్న 33.770 టీఎంసీలలో తెలంగాణ 24.467 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ 9.303 టీఎంసీలు వినియోగించుకొనేలా బోర్డు నిర్ణయించింది. ఈనెల 2వతేదీన రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లు, బోర్డు సభ్యకార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి వినియోగంపై చర్చించి నిర్ణయాలు తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం బోర్డు జారీ చేసింది. దీనిప్రకారం.. తమకు ఆగస్టు వరకు 46 టీఎంసీలు అవసరమని తెలంగాణ కోరగా, మే వరకు 30.38 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. మార్చిలో 26.38 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, 19 టీఎంసీలు కావాలని తెలంగాణ పేర్కొంది. నాగార్జునసాగర్‌లో మార్చి 20వరకు 520 అడుగులు, మార్చి 31వరకు 515 అడుగులు నిర్వహించడానికి త్రిసభ్య కమిటీ అంగీకరించింది. సాగర్‌లో ఈమట్టం నిర్వహించడానికి ఆ నెలాఖరు లేదా అంతకంటే ముందే కనీస నీటిమట్టం దిగువన కూడా నీటిని తీసుకోవాలని నిర్ణయించింది.

శ్రీశైలం కుడి విద్యుత్తు కేంద్రం ద్వారా నీటి విడుదల 
రెండు రాష్ట్రాల అవసరాలకు, నాగార్జునసాగర్‌లో నిర్ణయించిన నీటిమట్టం నిర్వహించడానికి శ్రీశైలం కుడి విద్యుత్తు కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయాలని పేర్కొంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదల చేసినపుడు ఆవిరి నష్టాలు తక్కువగా ఉండేలా చూసేందుకు తెలంగాణ అవసరాలకు తగ్గట్లుగా జలాన్ని తీసుకోవాలని సూచించింది. నీటి వినియోగంలో ప్రాధాన్యం, అత్యవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని సంయుక్తంగా ధ్రువీకరించి పంపాలని బోర్డు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×