Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

సైబరాబాద్‌ తరహాలో సిలికాన్‌ సిటీ

నెల్లూరు-తిరుపతి-చెన్నై కారిడార్‌కు సిలికాన్‌ సిటీగా నామకరణం

టీసీఎల్‌ భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి

201219brk-34740-a.jpg

తిరుపతి: హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో సిలికాన్‌ సిటీని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు-తిరుపతి-చెన్నైలను కలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవా (ఇండస్ట్రియల్‌ కారిడార్‌)కు సిలికాన్‌ సిటీ అని పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుపతిలో టీసీఎల్‌ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 60 లక్షల టీవీలు తయారు చేసే ప్రణాళికతో ఈ ప్లాంటును నిర్మిస్తున్నారు. 8 వేల మందికి ఇందులో ఉపాధి కల్పించనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా మారబోతోంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 59 కన్నా ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాం. వీటి ద్వారా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 20 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు ఈ జిల్లాలోనే ఇస్తున్నాం. ప్రపంచంలోనే పారిశ్రామిక నగరంగా షెంజెన్‌ నగరానికి పేరుంది. ఇలాంటి పారిశ్రామిక వాతావరణాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో నెల్లూరు-తిరుపతి-చెన్నై మంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారబోతోంది. దీనికి సిలికాన్‌ సిటీగా నామకరణం చేస్తున్నాం. భవిష్యత్తులో షెంజెన్‌, సిలికాన్‌ సిటీ కలిసి పని చేస్తాయి. ఈ ప్రాంతంలో రూ.22వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం.’’

Link to comment
Share on other sites

TCL initiates construction of it's largest manufacturing base outside China in Tirupati

By
Writankar Mukherjee
, ET Bureau|
Dec 20, 2018, 10.39 AM IST

 

TCL initiates construction of it's largest manufacturing base outside China in Tirupati

By
Writankar Mukherjee
, ET Bureau|
Dec 20, 2018, 10.39 AM IST
Link to comment
Share on other sites

షెన్‌జెన్‌లా తిరుపతి
21-12-2018 02:52:54
 
636809575757373041.jpg
  • ఎలక్ ట్రానిక్‌ ఉత్పత్తులకు కేంద్రం చేస్తాం..
  • వెయ్యి ఎకరాల్లో సిలికాన్‌ సిటీ: సీఎం
  • .రాష్ట్రానికి 2618 ప్రాజెక్టులొస్తున్నాయి
  •  33 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
  • ఇప్పటికే ఎలకా్ట్రనిక్స్‌లో లక్ష కొలువులు
  •  8 నెలల్లోనే టీసీఎల్‌ నిర్మాణం పూర్తి
  • తిరుపతికి ప్రముఖ సంస్థల రాక: సీఎం
  • టీసీఎల్‌ కర్మాగారానికి శంకుస్థాపన
చిత్తూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక నగరం తిరుపతిని... ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల తయారీలో ‘షెన్‌జెన్‌’లా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘సైబరాబాద్‌’ తరహాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వెయ్యి ఎకరాల్లో ‘సిలికాన్‌ సిటీ’ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చెన్నై- తిరుపతి- నెల్లూరు ప్రాంతం సిలికాన్‌ కారిడార్‌గా ఉందని తెలిపారు. తిరుపతి సమీపంలోని వికృతమాల వద్ద చైనాకు చెందిన ప్రతిష్ఠాత్మక ‘టీసీఎల్‌ పారిశ్రామిక
పార్కుకు ఆ సంస్థ చైర్మన్‌ థామ్సన్‌ లీ, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నవ్యాంధ్ర పారిశ్రామికంగా, ముఖ్యంగా ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు.
 
‘‘రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడితో 2618 ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటిద్వారా 33 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటైన 59 ఎలక్ర్టానిక్‌ పరిశ్రమల ద్వారా లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. సింహభాగం పరిశ్రమలు చిత్తూరు జిల్లాలోనే ఏర్పాటవుతున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన సమయానికి నవ్యాంధ్రలో పెద్ద పరిశ్రమలే లేవని గుర్తు చేశారు. ఇప్పుడు అనేక భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ‘‘ఇటుక ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి సాధిస్తున్నాం. ఇప్పుడు తిరుపతికి టీసీఎల్‌ సంస్థ కూడా వచ్చింది. ఇది మొత్తం రాష్ట్రానికే చరిత్రాత్మక సందర్భం. రూ.2200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో... ఏడాదికి 80 లక్షల టీవీ స్ర్కీన్లు, 3 కోట్ల మొబైల్‌ స్ర్కీన్లు తయారవుతాయి’’ అని చంద్రబాబు తెలిపారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా... 9 నెలల్లోనే పూర్తి చేయాలని టీసీఎల్‌ చైర్మన్‌ థామ్సన్‌ లీని తాను కోరానన్నారు. మరింత వేగంగా... 8 నెలల్లోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఈ పరిశ్రమలో 6వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. టీసీఎల్‌తోపాటు రిలయన్స్‌, వోల్టాస్‌ వంటి భారీ పరిశ్రమలు తిరుపతికి వస్తున్నాయని చెప్పారు. తిరుపతికి 3 నెలల్లోనే టీసీఎల్‌ను తీసుకురావడం వెనుక ఐటీ మంత్రి లోకేశ్‌, ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ శ్రమ ఉందంటూ వారిని అభినందించారు.
 
30శాతం సెల్‌ఫోన్లు ఏపీలోనే: లోకేశ్‌
దేశవ్యాప్తంగా తయారవుతున్న సెల్‌ఫోన్లలో 30 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని లోకేశ్‌ తెలిపారు. మరెక్కడాలేని విధంగా కేవలం మన రాష్ట్రంలో 18వేల మందికిపైగా మహిళలు సెల్‌ఫోన్ల తయారీ రంగంలో పని చేస్తున్నారని తెలిపారు. ‘‘టీసీఎల్‌తో సెప్టెంబరు 28న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత కేవలం మూడు నెలల్లోనే కర్మాగారానికి శంకుస్థాపన చేయడం సాధారణ విషయం కాదు’’ అంటూ సంస్థ ప్రతినిధుల చొరవను ప్రశంసించారు. వచ్చే ఐదేళ్లలో రాయలసీమ తయారీకేంద్రంగా మారి, లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
 
 
టీసీఎల్‌ది మూడో స్థానం..
టీసీఎల్‌ అంతర్జాతీయంగా 160 మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీవీ ప్యానెళ్ల ఉత్పత్తి రంగంలో టీసీఎల్‌ ప్రపంచంలో మూడో స్థానంలో, అమెరికా మార్కెట్‌లో రెండో స్థానంలో ఉందని టీసీఎల్‌ చైర్మన్‌ థామ్సన్‌లీ తెలిపారు. ‘‘గ్లోబల్‌ టీవీ మార్కెట్‌లో జపాన్‌, కొరియా సంస్థలతో మేం పోటీ పడుతున్నాం. చైనాలో కాకుండా మొట్టమొదటి విదేశీ కేంద్రాన్ని భారత్‌లో... తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన సహకారమే కారణం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, టీసీఎల్‌ ప్రతినిధులు కెవిన్‌ వాంగ్‌, కిమ్‌ ఊ షిక్‌, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
9Tpt4.jpg111.jpgచైనాలోని ప్రముఖ పారిశ్రామిక పార్కు షెన్‌జెన్‌కు దీటుగా తిరుపతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. కియ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయినట్లు... ఎలక్ర్టానిక్‌ పరిశ్రమల రాకతో చిత్తూరు జిల్లా ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలుస్తుంది!
ఒక అన్నగా, ఇంటి పెద్దగా, రాష్ట్ర ముఖ్య మంత్రిగా మంజూరు చేసిన ఎన్టీఆర్‌ గృహాలలో లబ్ధిదారులు సంతోషంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రతి కుటుంబానికి రెండు మూడు రకాల సంక్షేమ పథకాలతో లబ్ధిని చేకూర్చాం. ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మీరంతా ఆశీర్వదించాలి.
- చంద్రబాబు
 
 
 
 
3333wss.jpg 
Link to comment
Share on other sites

తిరునగరి.. హార్డ్‌వేర్‌ సిరి 

 

తెలుగు సిలికాన్‌ నగరంగా తిరుపతి 
సీఎం నామకరణం 
టీసీఎల్‌ పరిశ్రమకు  భూమి పూజ 
చైనా వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి 
ఈనాడు - తిరుపతి

20ap-main1a_3.jpg

ఒప్పందం చేసుకున్న 3 నెలల్లోనే తిరుపతిలో టీసీఎల్‌ పరిశ్రమకు భూమి పూజ చేశాం. 9 నెలల్లో పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను ఆ సంస్థ ఛైర్మన్‌ను కోరగా.. ఆయన 8 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. అందుకు మా పూర్తి సహకారం ఉంటుంది. ఒకవేళ మేం సౌకర్యాల కల్పనలో విఫలమైతే జరిమానా కడతాం. నిర్మాణంలో ఆలస్యం అయితే సంజాయిషీ ఇవ్వాలని ఛైర్మన్‌ను అడుగుతున్నా. చైనా వాళ్ల వేగం నాకు తెలుసు. వారితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తా.
- టీసీఎల్‌ భూమిపూజలో ఆ సంస్థ ఛైర్మన్‌, సీఈవో టామ్సన్‌ డీఎస్‌ లీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్య

తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ కేంద్రాలన్నింటినీ (ఈఎంసీ) కలిపి సిలికాన్‌ నగరంగా (సిలికాన్‌ సిటీ) గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరు- తిరుపతి- చెన్నై కారిడార్‌ను సిలికాన్‌ కారిడార్‌గా పిలవాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అత్యుత్తమ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏర్పేడు మండలం వికృతమాల వద్ద 158 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టెలీ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) పరిశ్రమకు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘తిరుపతి హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీ కేంద్రంగా మారబోతోంది. ఇప్పటికే 59 ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. తిరుపతిని చైనాలోని షెన్‌జెన్‌ నగరం తరహాలో అభివృద్ధి చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 2,618 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం. వీటి ద్వారా రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 33 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే 1692 పరిశ్రమల ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా రూ.6.40 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. 10.15 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. గతంలో సాఫ్ట్‌వేర్‌పై దృష్టి సారించాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తున్నాం. కొత్తగా ఏర్పాటయ్యే సిలికాన్‌ నగరం షెన్‌జెన్‌తో కలిసి పనిచేస్తుంది. తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్‌ విస్తరణ   కేంద్రం 1800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 800 ఎకరాల్లో విమానాశ్రయం ఉండగా మిగిలిన ప్రాంతంలో టీసీఎల్‌, రిలయన్స్‌ వంటి సంస్థలకు భూములను కేటాయిస్తున్నాం. రూ.22వేల కోట్ల పెట్టుబడులొస్తాయి. సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. సమీపంలోనే అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు, మౌలిక వసతులు కల్పిస్తాం. ఏడాదిలోగా తిరుపతి నుంచి షెన్‌జెన్‌కు నేరుగా విమానాలు నడిచేలా చర్యలు చేపడతాం. ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. ఇక్కడికి దగ్గర్లోనే పోర్టులు, విమానాశ్రయాలున్నాయి. ఈ సిలికాన్‌ సిటీ ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ నగరంగా మారనుంది. చైనాలో వివిధ రంగాల్లో మార్పులు తీసుకొచ్చిన 100 మంది గొప్ప వ్యక్తుల్లో టీసీఎల్‌ ఛైర్మన్‌ టామ్సన్‌ లీ ఒకరు. ఆయన మన రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడం మనకు గర్వకారణం. ఈ పరిశ్రమ రావడానికి కృషి చేసిన ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌లకు నా అభినందనలు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
చైనా భాషలో స్వాగతం 
కార్యక్రమానికి హాజరైన అతిథులకు ముఖ్యమంత్రి చైనా భాషలో స్వాగతం పలికారు. టీసీఎల్‌ ఛైర్మన్‌, సీఈవో టామ్సన్‌ డీఎస్‌ లీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టీవీ తయారీ మార్కెట్‌లో జపాన్‌, కొరియాలతో తమ సంస్థ పోటీ పడుతోందని చెప్పారు. టీవీ ప్యానళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో, అమెరికా విపణిలో రెండో స్థానంలో టీసీఎల్‌ ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి నుంచి ప్రపంచ డిజిటల్‌ మార్కెట్‌లో నంబర్‌వన్‌ స్థానానికి ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రిలయన్స్‌ సెజ్‌కు 31న శంకుస్థాపన

 

ఈనాడు, అమరావతి: భారీ పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటయ్యే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)కి ఈ నెల 31న శంకుస్థాపన చేయనున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న సెజ్‌లో ఆర్‌ఐఎల్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, టెలివిజన్లు, ఇతర అనేక ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇక్కడ రోజూ 10 లక్షలకుపైగా తయారు చేయనున్నారు. సెజ్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. 2018 ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసిన రిలయన్స్‌ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ తిరుపతిలో ఆర్‌ఐఎల్‌ సెజ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రావడంతో ప్రభుత్వం తరఫున కేటాయించిన భూమిలో సెజ్‌ ఏర్పాటుకు 31న నిర్వహించే భూమి పూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌, ముఖేశ్‌ అంబానీ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

రీసిటీలో లిథియం బ్యాటరీ పరిశ్రమ 

 

ఏపీఈడీబీతో టెక్రాన్‌ బ్యాటరీస్‌ ఒప్పందం

14ap-state1a_4.jpg

ఈనాడు-అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.446 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే లిథియం ఫెర్రో ఫాస్పేట్‌ బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు  అమెరికాకు చెందిన టెక్రాన్‌ బ్యాటరీస్‌ ముందుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ సమక్షంలో సోమవారం టెక్రాన్‌ బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఉలాండే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఏపీఈడీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) జాస్తి కృష్ణకిశోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీ లిథియం బ్యాటరీలను  అమెరికా, ఫిలిప్పీన్స్‌, భారత్‌లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. ఏటా 7 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో శ్రీసిటీలో ఏర్పాటు చేసే పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 మందికి ఉపాధి లభించనుంది.

 

Link to comment
Share on other sites

ఎలక్ట్రానిక్స్‌ తయారీకి జోష్‌
14-01-2019 23:08:53
 
636831041342566460.jpg
  • రుణ హామీ, వడ్డీ రాయితీ!.. 2 కొత్త పథకాలు
  • జాతీయ విధానంలో ప్రకటించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రంగ తయారీదారులకు రూ.100 కోట్ల వరకు రుణాలపై పరపతి హామీ ఇవ్వడంతోపాటు రూ.1,000 కోట్ల వరకు రుణంపై వడ్డీ రాయితీ కూడా కల్పించాలని భావిస్తోంది. జాతీయ ఎలకా్ట్రనిక్స్‌ విధానంలో భాగంగా ‘క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌’ (సీజీఎ్‌ఫ)తోపాటు ‘ఇంట్రెస్ట్‌ సబ్వెన్షన్‌ స్కీం’ (ఐఎ స్‌ఎ్‌స)లను ప్రవేశపెట్టాలని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ ప్రతిపాదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తిదారులకు మంజూరైన రుణ మొత్తంలో 50 శాతం వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఇందుకోసం కేంద్రం తొలుత రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుందని అధికారికవర్గాలు వెల్లడించాయి ఈ ఫండ్‌కు బడ్జెట్‌ ద్వారా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇక ఐఎస్‌ఎస్‌ ద్వారా ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తిదారులకు అంతర్జాతీయ మార్కెట్ల వడ్డీ రేటుకే దేశీయంగానూ రుణం లభించే ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు వారు వెల్లడించారు.
 
ప్రస్తుతం భారత్‌లో పొందే టర్మ్‌ లోన్‌పై వార్షిక వడ్డీ రేటు 11-12 శాతం స్థాయిలో ఉండగా.. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో 5-7 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. తమ ఇండస్ట్రీకి 4-6 శాతం వడ్డీ రాయితీ కల్పించాలని గత కొన్నాళ్ల నుంచి ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఫాక్స్‌కాన్‌, ఫ్లెక్స్‌ వంటి అంతర్జాతీయ ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీలకు సైతం ఈ పథకాలను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ ఆశయ సాధనకు ఇది సువర్ణ అవకాశమని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు. దేశంలో మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లతోపాటు ఇతర ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తిదారుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు వడ్డీ సబ్సిడీ పథకం దోహదపడనుందన్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ
15-01-2019 03:21:58
 
636831193184791557.jpg
  • టెక్రాన్‌ బ్యాటరీస్‌తో ఏపీఈడీబీ ఒప్పందం
అమరావతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆటోమొబైల్‌ రంగం విస్తరిస్తున్న కొద్దీ అనుబంధ సంస్థల పెట్టుబడులూ పెరుగుతున్నాయి. లిథియం అయాన్‌ బ్యాటరీల్లో పేరెన్నికగన్న టెక్రాన్‌ బ్యాటరీస్‌ రాష్ట్రంలో తన ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పెట్టుబడుల ఆకర్షణ లో ప్రత్యేక చొరవ చూపుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఈ మేరకు టెక్రాన్‌ బ్యాటరీస్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో టెక్రాన్‌ బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఈపీఏ ఉలాండేతో ఏపీఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన టెక్రాన్‌ బ్యాటరీస్‌ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో తన ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఏటా 7లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసే ప్లాంటుకోసం రూ.446 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీనిద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఐటీ అభివృద్ధిలో కొత్త పుంతలు

 

5ap-story4a_2.jpg

అదానీ గ్రూపు 500 ఎకరాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ‘గిగా వాట్‌ డేటా పార్క్‌, సోలార్‌ పార్క్‌’తో మరింత మహర్దశ పట్టనుంది. ఐటీ రంగంలో రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథం పట్టింది.
విశాఖ వేదికగా ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌టెక్‌) ఏర్పాటు. దీని యాక్సలేటర్లుగా ముందుకొచ్చినవి ఐసీఐసీఐ, మహీంద్ర ఫైనాన్స్‌.
ఇప్పటికే కార్యకలాపాలు మొదలెట్టినవి - ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాన్డ్యూయెంట్‌, పేటీఎం, బెల్‌ఫ్రిక్స్‌, అంజూర్‌, ఫైకేర్‌, ఇన్వికాస్‌. అమరావతిలో హెచ్‌సీఎల్‌ పనులుమొదలయ్యాయి.
సన్నీ ఓపోటెక్‌ రూ.500 కోట్లు, హూలీటెక్‌ రూ.1,400 కోట్ల పెట్టుబడులతో తిరుపతిలో కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి.
తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించిన జోహూ. అనంతపురం జిల్లాలో ‘బెంగూళూరు ప్లస్‌’ పేరుతో 4 ఐటీ క్లస్టర్ల ఏర్పాటు. వీటిలో బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాకు చైన్‌, ఫింటెక్‌ సెంటర్లను తేనున్నారు.
రిలయన్స్‌ జియో తిరుపతిలో 150 ఎకరాల్లో రూ.15 వేల కోట్లతో 20 వేల మందికి ఉపాధి చూపే ఎలక్ట్రానిక్‌ పార్కు ఏర్పాటు చేస్తోంది. ఇది మొబైల్‌ తదితర ఉపకరణాల తయారీకి వేదిక కానుంది.
రేణిగుంట సమీపంలో రెండు ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్లర్లలో ఇప్పటికే పలు కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటిలో డిక్సన్‌ కంపెనీ ప్రధానమైనది.
రూ.2,200 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికి ఉపాధి కల్పించే టీసీఎల్‌కి భూమి పూజ జరిగింది. శ్రీసిటీలోని ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీలో 15,000 మంది మహిళలు పని చేస్తున్నారు.

 

Link to comment
Share on other sites

తిరుపతి శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్డులో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మేజెస్ (MAGES) సంసిద్ధం.
రెండు దశలలో మెడికల్ డివైసెస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు.
తొలిదశలో 100 ఎకరాలు, రెండవ దశలో 100 ఎకరాలు కలిపి మొత్తం 200 ఎకరాలు అందించేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రాధమికంగా నిర్ణయం.
8 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు

 
 
 
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

తిరుపతి శ్రీకాళహస్తి-నాయుడుపేట రోడ్డులో రూ.136.72 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మేజెస్ (MAGES) సంసిద్ధం.
రెండు దశలలో మెడికల్ డివైసెస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు.
తొలిదశలో 100 ఎకరాలు, రెండవ దశలో 100 ఎకరాలు కలిపి మొత్తం 200 ఎకరాలు అందించేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రాధమికంగా నిర్ణయం.
8 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు

 
 
 

Idedho AMTZ lo pettisthe poyedhi. AMTZ ki boost vachedhi.

Link to comment
Share on other sites

తిరుపతిలో మరో పది ఎలక్ట్రానిక్‌ కంపెనీలు

 

నేడు భూమి పూజ చేయనున్న లోకేశ్‌

9ap-main16a_1.jpg

ఈనాడు, అమరావతి: తిరుపతి రేణిగుంటలోగల ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌-1, 2లో ఆదివారం పది కంపెనీలకు ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయడంతో పాటు మరో కంపెనీని ప్రాంభించనున్నారు. మొత్తం రూ.1,462.80 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలతో 7,088 మందికి ఉపాధి లభించనుంది. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటైన వోల్టాస్‌ రాష్ట్రంలో మొదటి సారి రూ.653 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. డిక్సన్‌ తన రెండో ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. రూ.80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పించే మొబైల్‌ తయారీ కంపెనీ కార్బన్‌ను మంత్రి ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటయ్యే కంపెనీలు పెట్టుబడి, ఉపాధి వివరాలు

9ap-main16b_1.jpg

 

Link to comment
Share on other sites

31 minutes ago, sonykongara said:
తిరుపతిలో మరో పది ఎలక్ట్రానిక్‌ కంపెనీలు

 

నేడు భూమి పూజ చేయనున్న లోకేశ్‌

9ap-main16a_1.jpg

ఈనాడు, అమరావతి: తిరుపతి రేణిగుంటలోగల ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌-1, 2లో ఆదివారం పది కంపెనీలకు ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ భూమి పూజ చేయడంతో పాటు మరో కంపెనీని ప్రాంభించనున్నారు. మొత్తం రూ.1,462.80 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలతో 7,088 మందికి ఉపాధి లభించనుంది. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటైన వోల్టాస్‌ రాష్ట్రంలో మొదటి సారి రూ.653 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. డిక్సన్‌ తన రెండో ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. రూ.80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు కల్పించే మొబైల్‌ తయారీ కంపెనీ కార్బన్‌ను మంత్రి ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటయ్యే కంపెనీలు పెట్టుబడి, ఉపాధి వివరాలు

9ap-main16b_1.jpg

 

Super 

Link to comment
Share on other sites

రాష్ట్రం ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుంది: లోకేశ్‌

lokesh_1.jpg

తిరుపతి: నాలుగున్నరేళ్ల క్రితం మొబైల్‌ తయారీలో ఆంధ్రప్రదేశ్‌ వాటా సున్నా అని ప్రస్తుతం ఏ మొబైల్‌ చూసినా మేడ్‌ ఇన్‌ ఏపీ అని కనిపిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారుతోందన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ క్లస్టర్(ఏఎంసీ)-1 ఏర్పాటైన కార్బన్‌ మొబైల్స్‌ తయారీ కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని సిలికాన్‌ సిటీగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.15వేల కోట్లతో 8వేల మందికి ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. మంత్రి పల్లె అమర్‌నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు నైసర్గిక పరిస్థితులు పరిశ్రమ స్థాపనకు అనుకూలంగా ఉంటాయన్నారు. చంద్రబాబునాయుడు విజన్‌, లోకేశ్‌ తెచ్చిన పెట్టుబడుల ఒప్పందాల వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. రూ. 80 కోట్ల పెట్టుబడితో వచ్చిన కార్బన్‌ కంపెనీ 700 మందికి ఉద్యోగాలు కల్పించిందని గుర్తుచేశారు.

మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డితో కలిసి నారా లోకేష్ ఆదివారం మరో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వోల్టాస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

 
Link to comment
Share on other sites

On 1/11/2019 at 7:54 PM, sonykongara said:
రిలయన్స్‌ సెజ్‌కు 31న శంకుస్థాపన

 

ఈనాడు, అమరావతి: భారీ పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటయ్యే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)కి ఈ నెల 31న శంకుస్థాపన చేయనున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న సెజ్‌లో ఆర్‌ఐఎల్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, టెలివిజన్లు, ఇతర అనేక ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇక్కడ రోజూ 10 లక్షలకుపైగా తయారు చేయనున్నారు. సెజ్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. 2018 ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసిన రిలయన్స్‌ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ తిరుపతిలో ఆర్‌ఐఎల్‌ సెజ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రావడంతో ప్రభుత్వం తరఫున కేటాయించిన భూమిలో సెజ్‌ ఏర్పాటుకు 31న నిర్వహించే భూమి పూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌, ముఖేశ్‌ అంబానీ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

Bro..what happened to this..this one also modi stopped?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...