Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

హార్డ్‌వేర్‌ హారం!
 
 
636337822888754322.jpg
  • నెల్లూరు, తిరుపతి, చెన్నై నడుమ ప్రపంచంలోనే భారీ హార్డ్‌వేర్‌ తయారీ కేంద్రం
  • ఏర్పేడులో అతిపెద్ద పారిశ్రామిక వాడ
  • అభివృద్ధి చిరునామాగా నవ్యాంధ్ర
  • రాష్ట్రానికి పరిశ్రమ వస్తుందంటే..
  • ఎంత దూరమైనా వెళ్లి సాధించుకొస్తా
  • రాష్ట్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో అడుగులు
  • రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలు పెడతాం
  • ఇప్పటికి 1569 పరిశ్రమలకు ఒప్పందాలు
  • వాటి రాకతో 30 లక్షల మందికి ఉపాధి
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అతిథులు
  • ప్లకార్డులతో వారిని బెదరగొట్టడం సరికాదు
  • సెల్‌కాన్‌ గురును చూసి గర్విస్తున్నా: బాబు
  • సెల్‌కాన్‌ పరిశ్రమను ప్రారంభించిన సీఎం
  • పలు సిరామిక్‌ పరిశ్రమలకు భూమి పూజ
 
తిరుపతి/శ్రీకాళహస్తి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ రూపుదిద్దుకోనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్రను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. గురువారం సీఎం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ తయారీ పరిశ్రమను ప్రారంభించారు. తొట్టంబేడు మండలంలోని తాటిపర్తి వద్ద ఏర్పాటు చేయనున్న కజారియా సిరామిక్స్‌, ఫ్లోయిరా సిరామిక్స్‌, సుధా సోమాలిక్‌ సిరామిక్స్‌ పరిశ్రమలకు భూమిపూజ చేశారు. ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేసిన సభల్లో సీఎం మాట్లాడారు. నవ్యాంధ్ర అభివృద్ధికి చిరునామాగా మారే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర వృద్ధిరేటు 12 నుంచి 15 శాతానికి పెరుగుతుందని తెలిపారు. విశాఖ కారిడార్‌తోపాటు చిత్తూరు జిల్లా ఏర్పేడు కేంద్రంగా మరో పెద్ద పారిశ్రామికవాడ రాబోతోందని, ఇది దేశంలోనే అతి పెద్దఉత్పత్తి, ఉపాధి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌.. ప్రపంచానికి సెల్‌ఫోన్లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని సీఎం పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌ ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్లస్టర్‌లో సెల్‌కాన్‌తోపాటు మరో పదికిపైగా సెల్‌ కంపెనీలు, మొబైల్‌ అనుబంధ పరిశ్రమలు పనులు ప్రారంభించనున్నాయని తెలిపారు. తక్కువ కాలంలోనే ఇక్కడి నుంచి ప్రపంచానికి మొబైళ్లు ఎగుమతి అవుతాయనడంలో సందేహం లేదన్నారు. ఇక్కడ మొబైల్‌ పరిశ్రమలు స్థాపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ దేశంలోనే అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తయారు కాబోతోందన్నారు. తాను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దేశవిదేశాలు తిరిగి పెట్టుబడులు ఆహ్వానించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని సీఎం పేర్కొన్నారు. శ్రీసిటీలో ఒక మొబైల్‌ పరిశ్రమ స్థాపించమని కోరడం కోసం ఢిల్లీకి వెళ్లి ఫాక్సకాన్‌ ఎండీని కలిసి, ఆయనకు డిన్నర్‌ ఇచ్చి ఒప్పించానని తెలిపారు. ఈరోజు శ్రీసిటీలోని ఆ పరిశ్రమ ద్వారా 12వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తోందన్నారు. రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుందంటే, దాని వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపాధి లభిస్తుందంటే ఎంత దూరమైనా వెళతాన
 
ని, ఎంతమందినైనా కలుస్తానని, అనుకున్న పని సాధించి తీరుతానని సీఎం అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఓ ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నామన్నారు. మూడేళ్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఇప్పటివరకు పారిశ్రామికవేత్తలతో 1569 ఒప్పందాలు జరిగాయన్నారు. ఈ పనులు పూర్తయితే రూ.16,087 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని అన్నారు. 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాల్లో 813 ఎంవోయూలకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని ఇది తెలుగుదేశం ప్రభుత్వ గొప్పతనమన్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి 130 పరిశ్రమలు ఏర్పాటు చేసి... రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని వసతులు, వనరులు సమకూరుస్తామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ‘పరిశ్రమల స్థాపనకు భూమి ఇస్తాం. రోడ్లు వేస్తాం. నీరిస్తాం, కరెంటు ఇస్తాం. ఎలాంటి అనుమతులు కావాలన్నా 20 రోజుల్లోగా మంజూరు చేస్తాం. ఇలాంటి సహకారం మీకు ఎక్కడా లభించదు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు విద్యుత్తు చార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని, వీలైయితే ఇంకా తగ్గిస్తామని పారిశ్రామికవేత్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను అసంబద్ధమైన డిమాండ్లతో ప్లకార్డులు చూపుతూ బెదరగొట్టడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు సూచించారు. పారిశ్రామికవేత్తలను అతిథులుగా భావించి స్వాగతించినప్పుడే మన ప్రాంతంలోకి మరిన్ని పరిశ్రమలు వస్తాయని అన్నారు. ప్లకార్డుల ప్రదర్శనతో ప్రయోజనం లేదని, దాని వల్ల మీరు బాగుపడకపోగా, రాష్ట్రం కూడా బాగుపడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘సెల్‌కాన్‌ సీఎండీ గురుస్వామి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. జిల్లా మీద అభిమానంతో ఇక్కడే ఒక పరిశ్రమను స్థాపించి వేలాదిమందికి ఉపాధి అవకాశాలు చూపారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికే గర్వకారణం’ అంటూ సెల్‌కాన్‌ సీఎండి గురుస్వామి నాయుడును సీఎం అభినందించారు.
 
రెండేళ్లలో లక్ష మందికి ఉపాధి: మంత్రి లోకేశ్‌
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌లో రాబోయే రెండేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. సీఎంపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.
 
నెలకు 10 లక్షల మొబైల్స్‌ లక్ష్యం: సెల్‌కాన్‌ సీఎండీ
నెలకు పది లక్షల మొబైల్స్‌ తయారు చేయడం లక్ష్యంగా సెల్‌కాన్‌ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని సంస్థ సీఎండీ గురుస్వామి నాయుడు తెలిపారు. ప్రస్తుతం నెలకు 5 లక్షల మొబైల్స్‌ తయారు చేయగలిగే సామర్థ్యంతో పరిశ్రమ నడుస్తోందని త్వరలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామన్నారు. సెల్‌కాన్‌ డైరెక్టర్‌ మురళి రేతినేని మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్‌ చొరవతో శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ రూపు దిద్దుకుందని, ఇక్కడికి పరిశ్రమలు రావడం వెనుక లోకేశ్‌ కృషి ఎంతో ఉందని అన్నారు. కాగా, గురువారం ఉదయం నంద్యాల పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
 
9celkon.jpg
Link to comment
Share on other sites

మరో ‘షెన్‌జెన్‌’ను సృష్టిస్తాం

పారిశ్రామిక పరుగులు పెట్టిస్తా

మొబైల్‌ ఉత్పత్తి కేంద్రంగా తిరుపతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి

చిత్తూరు జిల్లాలో పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభం

22ap-main4a.jpg

కొన్ని దుష్టశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. పోలవరం, పట్టిసీమ, ఓర్వకల్లు విమానాశ్రయం, గాలేరు-నగరి, అమరావతి, అసెంబ్లీ నిర్మాణం. ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమానికీ అడ్డు తగులుతున్నారు. అలాంటి వారికి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. వారికి బుద్ధిచెప్పాలి.

చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు నాకు ఇప్పటికీ గుర్తున్నారు. గురువులను గౌరవించాలి, పూజించాలనే ఉద్దేశంతో వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాను. 47% ఫిట్‌మెంట్‌ ఇచ్చాను. కేంద్రంతో మాట్లాడి ఏకీకృత సర్వీసు తీసుకొచ్చాను. బదిలీల్లో పారదర్శకత కోసం కౌన్సెలింగ్‌ విధానం ప్రవేశపెట్టాను. అలాంటిది ఇప్పుడు బదిలీల్లో ఏవో చిన్నపాటి సమస్యలు వచ్చాయని రోడ్డెక్కారు. ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. నేరుగా వచ్చి నాతో చర్చించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరగనివ్వను.
- సీఎం చంద్రబాబు

ఈనాడు-తిరుపతి, చిత్తూరు

తిరుపతిని చరవాణి (మొబైల్‌ ఫోన్‌), హార్డ్‌వేర్‌ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, ప్రపంచంలోనే మేటి తయారీ సంస్థలు ఇక్కడికి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెల్‌కాన్‌ ఇంపెక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ చరవాణి ఉత్పత్తి పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సాయంత్రం తొట్టెంబేడు మండలం తాడిపత్రి గ్రామంలో రూ.284 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మించనున్న ‘కజారియా సిరామిక్‌ ఫ్లోర్‌ టైల్స్‌ పరిశ్రమ’కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి క్లస్టర్‌-1లో వివిధ పరిశ్రమలు వచ్చాయి. ఈఎంసీ-2కి 500 ఎకరాలను కేటాయించాం. అక్కడ మరిన్ని పరిశ్రమలు వస్తాయి. చైనాలోని కొన్ని నగరాలు హార్డ్‌వేర్‌, సెల్‌ఫోన్లతోనే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న సెల్‌ఫోన్లలో 82 శాతం చైనా నుంచే ఉత్పత్తి చేస్తున్నా. ఇకపై దీనికి కేరాఫ్‌ అడ్రస్‌గా తిరుపతి, కృష్ణపట్నం, చెన్నై ఉంటాయి. మరో షెన్‌జెన్‌ (చైనాలోని ఐదు సంపన్న నగరాల్లో ఒకటి)ను ఇక్కడ సృష్టించనున్నాం. తిరుపతిలో తొలి ప్రాజెక్టు పూర్తి చేసినందుకు గర్వంగా ఉంది. ప్రపంచంలో ఎవరూ వాడని విధంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)ని వాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఐటీ, స్టార్టప్‌, ఎలక్ట్రానిక్‌, సైబర్‌ భద్రత తదితర విధానాలను ఇప్పటికే తీసుకువచ్చాం. క్లౌడ్‌ హబ్‌ విధానాన్ని మరో రెండు రోజుల్లో తీసుకు రాబోతున్నాం. ప్రపంచంలో క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో మనమే కేంద్రంగా తయారవుతాం. రానున్న 15 ఏళ్లలో 12 శాతం నుంచి 15 శాతం సుస్థిరమైన అభివృద్ధి ఉంటుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల వల్ల పెట్టుబడులు భారీ ఎత్తున వస్తాయి. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుల ద్వారా 1569 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. వీటిద్వారా రూ.2.75 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచంలోనే టాప్‌-10లో ఉండేలా చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

22ap-main4b-.jpg

నెల్లూరు, తిరుపతి, చెన్నైలు పారిశ్రామిక త్రినగరిగా అభివృద్ధి చెందనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని, తిరుపతి ఈ మూడు నదులు కలిసే పవిత్ర సంగమంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉత్పత్తి తయారీదారుల సంఘం అధ్యక్షుడు పంకజ్‌, సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు, మంత్రులు నారా లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్‌, చిత్తూరు కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

వచ్చే రెండు నెలల్లో మరో 10-15వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తాను ప్రకటించానని, దాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఉద్యోగాల గురించి తాను వూరకే మాటలు చెప్పడం లేదని.. రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలు, అవి కల్పించిన ఉద్యోగాల వివరాలను కంపెనీలు అంగీకరిస్తే ఉద్యోగుల పేర్లు సహా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. సెప్టెంబరుకల్లా తిరుపతి వద్ద కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రారంభం కానుందని వివరించారు. సెటాప్‌ బాక్సుల తయారీలో డిక్సన్‌ సంస్థ కూడా అక్టోబరులో తిరుపతి కేంద్రంగా తయారీ ప్రారంభించనుందని తెలిపారు. విశాఖలో డ్రోన్ల తయారీ కేంద్రం రానుందని తెలిపారు. విపక్షాలకు ఐటీ గురించి తెలియదని, తెలిసిందల్లా పెళ్లి చెడగొట్టడమేనని లోకేష్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో కొలువులు సాధించిన 20 మందికి మంత్రి లోకేష్‌ నియామక పత్రాలు అందజేశారు. అమరావతిలో హెచ్‌సీఎల్‌ భవనం నవంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం సహకారం: డాక్టర్‌ జోయెల్‌ విగ్గిన్స్‌ 

ctr-gen1a.jpg

మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం విశేషమైన ప్రోత్సాహాన్ని అందిస్తోందని అమెరికాకు చెందిన క్రౌన్‌ కాలేజ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జోయెల్‌విగ్గిన్స్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8లో ‘రిస్క్‌ మిటిగేషన్‌ అండ్‌ వ్యాల్యుఏషన్‌ ఇన్‌ ఎ స్టార్టప్‌ వెంచర్‌’ అనే అంశంపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్‌ పర్సన్‌గా హాజరై ఆయన మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవడానికి, ఆర్థిక వనరులను సముపార్జించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. దేశవిదేశాల్లో ఉన్న పేరుమోసిన వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను వెతికి, గుర్తించి రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ వారి సేవలను పొందేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆస్ట్రియా దేశంలోని ఐసీ స్కైర్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌8ను స్థాపించి, దేశంలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, గొప్పగొప్ప ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా వందలాది మంది పారిశ్రామికవేత్తలు మేలు పొందడం అభినందనీయమన్నారు.త్వరలోనే రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రాంభించేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌8 ద్వారా ఎంపికైన 33 మంది ఔత్సాహికులకు సరైన దిశానిర్దేశం చేయడానికి తనను అమెరికా నుంచి ఇక్కడకు పిలిపించారన్నారు. వరల్డ్‌క్లాస్‌ పారిశ్రామికీకరణకు సీఎం ఎంతో నిబద్ధతతో చేపడుతున్న కార్యక్రమానికి తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఎక్కడైనా స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించేవారు ప్రధానంగా వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, విస్తృతమైన మార్కెటింగ్‌ ను ఏర్పాటు చేసుకోవడం, మ్యాన్‌పవర్‌ను కలిగి ఉండటం లాంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. ఆయా అంశాలపై స్వయం నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అంశాల్లో స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటదారులకు సహకారం అందిస్తోందన్నారు. ఆయా అలోచనలకు తుదిరూపం ఇవ్వాల్సింది మాత్రం స్టార్టప్‌ కంపెనీల స్థాపకులేనని అన్నారు. ఒకసారి పరిశ్రమల స్థాపనలో ముందుకు అడుగువేశాక వెనక్కు తగ్గరాదన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అనుభవంతో నెట్టుకు రావాలని అన్నారు. ముందుగా తమవద్ద ఉన్న వస్తువుకు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకునే వీలును కల్పించుకోవాలన్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో నిలదొక్కుకుంటారని సూచించారు. కార్యక్రమంలో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ తిరుపతి మేనేజర్‌ గీతాశ్రీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌8 మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్లెన్‌రాబిన్‌సన్‌, 33 మంది స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

వికృతమాలలో ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఏర్పాటుకు 111కోట్ల గ్రాంట్‌

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి వలయాన్ని(మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు దిల్లీలోని ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఈ మేరకు ఏపీ సమాచార కేంద్రం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదలైంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

 

వచ్చే రెండు నెలల్లో మరో 10-15వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తాను ప్రకటించానని, దాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఉద్యోగాల గురించి తాను వూరకే మాటలు చెప్పడం లేదని.. రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలు, అవి కల్పించిన ఉద్యోగాల వివరాలను కంపెనీలు అంగీకరిస్తే ఉద్యోగుల పేర్లు సహా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. సెప్టెంబరుకల్లా తిరుపతి వద్ద కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రారంభం కానుందని వివరించారు. సెటాప్‌ బాక్సుల తయారీలో డిక్సన్‌ సంస్థ కూడా అక్టోబరులో తిరుపతి కేంద్రంగా తయారీ ప్రారంభించనుందని తెలిపారు. విశాఖలో డ్రోన్ల తయారీ కేంద్రం రానుందని తెలిపారు. విపక్షాలకు ఐటీ గురించి తెలియదని, తెలిసిందల్లా పెళ్లి చెడగొట్టడమేనని లోకేష్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో కొలువులు సాధించిన 20 మందికి మంత్రి లోకేష్‌ నియామక పత్రాలు అందజేశారు. అమరావతిలో హెచ్‌సీఎల్‌ భవనం నవంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Link to comment
Share on other sites

వచ్చే రెండు నెలల్లో మరో 10-15వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తాను ప్రకటించానని, దాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఉద్యోగాల గురించి తాను వూరకే మాటలు చెప్పడం లేదని.. రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలు, అవి కల్పించిన ఉద్యోగాల వివరాలను కంపెనీలు అంగీకరిస్తే ఉద్యోగుల పేర్లు సహా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. సెప్టెంబరుకల్లా తిరుపతి వద్ద కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రారంభం కానుందని వివరించారు. సెటాప్‌ బాక్సుల తయారీలో డిక్సన్‌ సంస్థ కూడా అక్టోబరులో తిరుపతి కేంద్రంగా తయారీ ప్రారంభించనుందని తెలిపారు. విశాఖలో డ్రోన్ల తయారీ కేంద్రం రానుందని తెలిపారు. విపక్షాలకు ఐటీ గురించి తెలియదని, తెలిసిందల్లా పెళ్లి చెడగొట్టడమేనని లోకేష్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో కొలువులు సాధించిన 20 మందికి మంత్రి లోకేష్‌ నియామక పత్రాలు అందజేశారు. అమరావతిలో హెచ్‌సీఎల్‌ భవనం నవంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
జపాన్‌కు చెందిన జోహో కంపెనీ తిరుపతికి నవంబరులో వస్తుందని, దానివల్ల మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎలక్ర్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రంగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

 

త్వరలో అక్కడ సెల్‌ఫోన్‌ బ్యాటరీలు తయారుకాబోతున్నాయన్నారు. కార్బన్‌ కంపెనీ నవంబరులో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, డిసెంబరులో లావా కంపెనీకి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐటీ రంగంలో 22 వేల మందికి, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో 40 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని లోకేశ్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...