Jump to content

NTR Housing Scheme


Recommended Posts

  • 2 weeks later...

అమరావతి జూన్ 28: 15 రోజుల్లో లబ్దిదారుల ఎంపిక వంద శాతం పూర్తి చేసి జూలై రెండో వారంలో గృహ నిర్మాణాలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ గృహ నిర్మాణ ప్రగతిపై బుధవారం సాయంత్రం సచివాలయంలో పురపాలక మంత్రి పి. నారాయణతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఎంపిక సమయంలో లబ్దిదారుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినట్టు తెలిసినా సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. 15 నెలల్లో లక్షా 20 వేల గృహాలు నిర్మించి తీరాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. 
మొత్తం 38 మున్సిపాలిటీలలో 1,20,826 ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంక్రాంతి నాటికి కనీసం 20 శాతం ఇళ్లయినా నిర్మించాలని వారికి నిర్దేశించారు. ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా 20% గృహాల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలిచ్చారు. ఇకపై ప్రతి బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరుపుతానని ప్రకటించారు. మొత్తం 300 చ.అ., 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణంలో జీ+3 మోడల్‌లో, షియర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరపాలని చెప్పారు. తగినంత స్థలం అందుబాటులో లేని చోట్ల జీ+5,జి+7 మోడల్‌లో నిర్మాణాలు చేయాలని, అందుకు అదనంగా అయ్యే ఖర్చుపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఆర్ధిక సాయం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
సమావేశంలో 5 నిర్మాణ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి గృహ నమూనాలను ప్రదర్శించారు. గృహాల నమూనాలను ప్రజలకు ప్రదర్శించి, అభిప్రాయ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. పేద ప్రజలకు అత్యంత నాణ్యమైన, సౌకర్యవంతమైన గృహాలు నిర్మించాలన్నదే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి వారితో అన్నారు. గృహాల సంఖ్యను బట్టి పాఠశాల, ఆస్పత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్, పార్క్, వైద్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వుండాలని తెలిపారు. అంతర్గత రహదారులు, నీటిసరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి పారుదల, ఎల్‌ఈడీ వీధి దీపాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సముదాయాల చుట్టూ ప్రహరి నిర్మించి గేటు ఏర్పాటు చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. గృహ సముదాయాల వెలుపలి ప్రాంతం నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మించబోయే కాలనీలు స్వయం సమృద్ది కాలనీలుగా తయారయ్యే విధంగా ప్రణాళికలు ఉండాలని అన్నారు. ప్రాంతాలవారీగా లబ్దిదారుల నైపుణ్యాలు గుర్తించి వాటికి తగిన ఆర్ధిక కార్యకలాపాలు గృహ సముదాయాల సమీపంలోనే జరిగేలా చూడాలని చెప్పారు. ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాలకు గృహసముదాయాల సమీపంలో స్థలం అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలని సూచించారు. మొత్తం 38 కాలనీల ఎలివేషన్ అత్యద్భుతంగా ఉండాలని మార్గదర్శనం చేశారు.

Link to comment
Share on other sites

సెప్టెంబరులోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

ఈనాడు అమరావతి: గత ఏడాది వివిధ పథకాల కింద రాష్ట్రంలో ప్రారంభించిన గ్రామీణ గృహ నిర్మాణాలను సెప్టెంబరులోగా పూర్తి చేయాలని గృహనిర్మాణశాఖ మేనేజింగ్‌ డైరక్టర్‌ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో 13 జిల్లాల పథక సంచాలకుల(పీడీ)తో ఆయన సమావేశాన్ని నిర్వహించి గృహ నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ లో పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 2016-17లో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. అర్హతగల పేదలందరికీ ఈ పథకం కింద ఇళ్ళు నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం. అయితే గతంలో అంటే ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకానికి ముందు ఇళ్ళు కేటాయించబడిన పేదలకు వారి పేరున ఇప్పటికే ఇల్లు ఉండటంతో ఈ పథకంలో ఇల్లు ఇవ్వడం కుదరదు. అలాగని వారికి ఇల్లు ఉందా అంటే సగం నిర్మాణం జరిగి ఆగిపోయింది. కారణం ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోకపోవడం. ఇప్పుడు అలా అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల గృహనిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ఇంటికి రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం అదనపు సాయం అందించనున్నది. ఈ సాయం అందించడంతో రాష్ట్రంలో 2,62,736 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది.

 

20229569_1753570344656549_59082646763096

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...